
జలీల్ ఖాన్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు కాబోలు. బీకాంలో ఫిజిక్స్ చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పి వార్తల్లోకి ఎక్కారు. ఆ సమయంలో 'ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్ డిగ్రీ సాధించా'నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్ 'బీకామ్ ఫిజిక్స్' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకున్నారు.
బీకామ్ ఫిజిక్స్‌పై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వచ్చాయి. ఈ సంఘటన జరిగి ఇటీవలే ఏడాది పూర్తైన దాని జోరు ఏమాత్రం తగ్గలేదు. ఎల్లప్పడు సరికొత్తగా వాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఓ సినిమా పాటలోను బీకామ్ ఫిజిక్స్‌ను వాడేశారు. ఊహలు గుసగుసలాడే ఫేమ్, యువహీరో నాగ శౌర్య తాజా చిత్రం ఛలో సినిమాలోని ఓపాటలో విద్యార్ధులు బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలు పట్టుకొని ఉంటారు.
ఛలో సినిమా విషయానికొస్తే నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. రస్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఉషా మూల్పూరి నిర్మతగా వ్యహరిస్తున్నారు. స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. పాటలో నాగ శౌర్య, రస్మికను ఆటపట్టించే సన్నివేశంలో విద్యార్థులందరూ బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలను పట్టుకొని ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment