
‘భయం లేదు.. పవన్‌పై పది ఓట్ల తేడాతో గెలుస్తా’
ఎన్నికలంటే తనకు అస్సలు భయం లేదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని, తాను పోటీ చేస్తే.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మీద కూడా 10 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి: ఎన్నికలంటే తనకు అస్సలు భయం లేదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అన్నారు. తాను ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని, తాను పోటీ చేస్తే.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మీద కూడా 10 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వచ్చే ఐడియాలు మరెవరికీ రావని, అడవిలో కూడా అసెంబ్లీ కట్టారని కొనియాడారు.
చంద్రబాబు ముందు మోదీ కూడా సరిపోడంటూ ఆకాశానికెత్తేశాడు. బీజేపీతో ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా అవసరాలు కూడా లేవని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తుందో లేదో తనకు తెలియదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవికంటే ఎమ్మెల్యేగా ఉండటమే చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.