
సాక్షి, అల్లూరి జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. పవన్ బస చేసిన రైల్వే గెస్ట్ హౌస్ ముందు వాలంటీర్లు నిరసనకు దిగారు. డిప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించేందుకు వాలంటీర్లు ప్రయత్నించగా, ఆయనను కలిసేందుకు పోలీసులు అనుమతినివ్వలేదు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తమను వీధిలోకి తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.
‘‘ఏజెన్సీ ప్రాంతంలో 6,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పదివేల జీతం ఇవ్వాలి. రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలి. వాలంటీర్లు హామీ ఇచ్చి ఏడాది దాటినా పట్టించుకోలేదు’’ అని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
