
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మైనార్టీ వర్గాలుగా ఉన్న నూర్ బాషా, దూదేకులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్, టీడీపీ నేత నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా నూర్ బాషాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్టీలో ముస్లింలకే అన్ని పదవులు ఇవ్వడం జరుగుతోందని విమర్శలు గుప్పించారు. ముస్లింలలో 20 లక్షల మేర నూర్ బాషాలు ఉన్నారని.. కాబట్టి తమ ప్రాధాన్యత గమనించి, వివిధ పదవుల్లో తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.(మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?)
కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ టీడీపీలో టికెట్ల లొల్లి రాజుకుంటోంది. వైఎస్సార్ సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానాకు చంద్రబాబు.. విజయవాడ పశ్చిమ టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న నాగుల్ మీరా... పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇక జలీల్ ఖాన్‌తో పాటు ఆయన కూతురు షబానా కూడా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.(జలీల్ ఖాన్‌ను వెంటాడిన గతం..)
Comments
Please login to add a commentAdd a comment