![TDP Leader Nagul Meera Disappoints On Chandrababu Naidu Decision - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/22/TDP-Flag1536214213.jpg.webp?itok=HYic6auo)
సాక్షి, విజయవాడ: టీడీపీలో టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. ఒకరికి తెలియకుండా ఒకరు పెదబాబు చంద్రన్న, చినబాబు లోకేష్ దగ్గర టికెట్ల కోసం మంతనాలు చేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా.. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న నాగుల్ మీరా చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్‌కు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా టికెట్ ఇస్తానని హామినిచ్చి మోసం చేశారంటూ ఆయన చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. (అమరావతికి టికెట్ల వేడి!)
Comments
Please login to add a commentAdd a comment