nagul meera
-
టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్‌మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు. దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్‌ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూటమి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించారన్నారు. జగన్‌తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు. -
నాగూల్ మీరా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మైనార్టీ వర్గాలుగా ఉన్న నూర్ బాషా, దూదేకులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్, టీడీపీ నేత నాగుల్ మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా నూర్ బాషాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్టీలో ముస్లింలకే అన్ని పదవులు ఇవ్వడం జరుగుతోందని విమర్శలు గుప్పించారు. ముస్లింలలో 20 లక్షల మేర నూర్ బాషాలు ఉన్నారని.. కాబట్టి తమ ప్రాధాన్యత గమనించి, వివిధ పదవుల్లో తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.(మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?) కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ టీడీపీలో టికెట్ల లొల్లి రాజుకుంటోంది. వైఎస్సార్ సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానాకు చంద్రబాబు.. విజయవాడ పశ్చిమ టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న నాగుల్ మీరా... పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇక జలీల్ ఖాన్‌తో పాటు ఆయన కూతురు షబానా కూడా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.(జలీల్ ఖాన్‌ను వెంటాడిన గతం..) -
కృష్ణాజిల్లా టీడీపీలో టికెట్ల లొల్లి
సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించవద్దని సొంతపార్టీ నేతలే డిమాండ్ చేయడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు భయటపడుతున్నాయి. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులపై వివాదాలు తారాస్థాయికి చేరాయి. విజయవాడ పశ్చిమ టికెట్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన ప్రకటన ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీటు తన కుమార్తెకే దక్కుతుందని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ నాగూల్ మీరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నాగూల్ మీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోతే టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నానితో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. మరోవైపు నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పామర్రులో కూడా టీడీపీ అసమ్మతి సెగలుగక్కుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యవహారంపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు ఏకమవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ వర్గం టీడీపీ నేతలు ఎన్నారైను రంగంలోకి తీసుకువచ్చారు. (మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?) అలాగే నందిగామలో టీడీపీలో కూడా అదే వరుస. సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యకు ఈసారి టిక్కెట్ కేటాయించవద్దని అసమ్మతి నేతల నిరసన స్వరం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను మార్చాలంటూ టీడీపీ నేతలు ఏకంగా నిరసన దీక్షలకు దిగారు. అలాగే పెడనలో కూడా కాగిత వెంకట్రావు, వేదవ్యాస్ గ్రూపుల మధ్య విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. నూజివీడులోనూ టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి. కాపా శ్రీనివాస్, ముద్రబోయిన వర్గాల మధ్య టికెట్ వివాదం తారాస్థాయికి చేరింది. (అమరావతికి టికెట్ల వేడి!) -
మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?
సాక్షి, విజయవాడ: టీడీపీలో టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. ఒకరికి తెలియకుండా ఒకరు పెదబాబు చంద్రన్న, చినబాబు లోకేష్ దగ్గర టికెట్ల కోసం మంతనాలు చేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా.. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న నాగుల్ మీరా చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్‌కు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా టికెట్ ఇస్తానని హామినిచ్చి మోసం చేశారంటూ ఆయన చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. (అమరావతికి టికెట్ల వేడి!) -
బెజవాడ పశ్చిమ టీడీపీలో కలకలం
విజయవాడ : బెజవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది. పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి నాగుల్ మీరాను తొలగించింది. ఆయన స్థానంలో జలీల్ ఖాన్‌కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో మీరాను తొలగించడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే మోసం చేస్తారా అంటూ మీరా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే జలీల్ ఖాన్ చేరిక పట్ల పార్టీ నేతల నుంచే తీవ్ర అభ్యంతరాలు ఎదురైన విషయం తెలిసిందే. పార్టీ తాజా నిర్ణయంతో నాగుల్ మీరా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.