బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో చేటే
ముస్లింలకు మేలు చేసింది సీఎం జగనే..
ఆయనతోనే ముస్లిం సమాజానికి భద్రత, భరోసా
ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా
టీడీపీ భుజంపై గన్ పెట్టి ముస్లిం సమాజంపైకి గురిపెట్టిన బీజేపీ
ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్‌మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు.
దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్‌ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు.
వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూటమి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించారన్నారు. జగన్‌తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment