vijayawada west constituency
-
విజయవాడ పశ్చిమలో టీడీపీ నాలుగు స్తంభాలాట
సాక్షి, కృష్ణా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అధినేత మరో నాయకుడికి రంగప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నాయకులతో మూడుముక్కలాట ఆడిస్తున్న చంద్రబాబు.. తాజాగా నాలుగు స్తంభాలాటకు తెరతీయిస్తున్నారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని)కు పశ్చిమ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి అక్కడి నాయకుల మధ్య పొగ ఆరనీయకుండా నిప్పు రాజేస్తూనే ఉన్న బాబు తాజాగా ఎం.ఎస్. బేగ్‌ను రంగంలోకి దించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా కేశినేని, బేగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను వెంటపెట్టుకెళ్లి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించారు. ఈ సందర్భంగా బేగ్‌కు బాబు బలమైన హామీ ఇచ్చారనే చర్చ నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో జరుగుతోంది. ఎంపీ కేశినేని నానికి పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు ఓ వర్గంగా వ్యవహరిస్తూ ఎంపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది బహిరంగ రహస్యమే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పతాకస్థాయికి చేరిన రగడ ఎప్పటికప్పుడు రగులుకుంటూనే ఉంది. ఇటీవలే కాల్‌మనీ సెక్స్ రాకెట్ నడిపే వారు, భూ కబ్జాదారులు, రౌడీలు నగరంలో నాయకులుగా చెలామణి అవుతామంటే ససేమిరా అంగీకరించేది లేదంటూ బుద్దా, మీరా, బొండా తదితర నేతలను ఉద్దేశించి ఎంపీ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కేశినేని వైపే మొగ్గుచూపుతుండేవారు. కొన్ని నెలల కిందట ఎంకే బేగ్ కార్యాలయాన్ని నాని ప్రారంభించినప్పటి నుంచి జలీల్‌ఖాన్ కూడా ఎంపీ పట్ల గుర్రుగా ఉంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో జలీల్ కుమార్తె షబానాఖాతూన్ టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పర్యాయం కూడా తమ కుటుంబానికే టికెట్టు దక్కుతుందనే ఆశలో ఉన్న జలీల్‌ఖాన్‌కు ఆదివారం నాటి పరిణామాలు మింగుడుపడనీయడం లేదని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. నాలుగు పర్యాయాలు పోటీ చేసినా.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, జనరల్ అభ్యర్థిగా ఎం.ఎస్.బేగ్ తండ్రి ఎం.కె. బేగ్ 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో పోటీచేసి మూడు పర్యాయాలు సీపీఐ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. 1989లో మాత్రమే బేగ్ విజయం సాధించారు. చంద్రబాబును కలిసిన బేగ్.. విదేశాల్లో ఉంటూ రాజకీయాల్లో తనవంతు ప్రయత్నాలు ఎన్నికల వేళ కొనసాగిస్తుంటారనే గుర్తింపు ఉంది. గత ఎన్నికలప్పుడు కూడా విభిన్న పార్టీల నుంచి టికెట్‌ను ఆశించినట్లు స్థానిక నాయకులు గుర్తు చేస్తున్నారు. -
ఏడు నియోజకవర్గాలు గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తా: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పలువురు నేతలు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. బీజేపీ యువమోర్చా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బోండా నిరీష్ కుమార్‌తో పాటు, పలు మండలాల కార్యకర్తలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 'పశ్చిమ నియోజకవర్గంలో వేట మొదలైంది. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలుంటాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఇతర పార్టీల అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. 2024కి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండేది వైఎస్సార్సీపీ మాత్రమే. చంద్రబాబు అమరావతిలో కూర్చుని విజయవాడ అభివృద్ధిని గాలికొదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే విజయవాడ అభివృద్ధి చెందింది. చదవండి: (జీతం లేకుండా పనిచేయాలని ఏపీఐఐసీ ఛైర్మన్ నిర్ణయం) టీడీపీ హయాంలో ఇక్కడి నేతలు రోడ్లు కూడా వేయించుకోలేకపోయారు. టీడీపీ నేతల ఇళ్లముందు కూడా మేమే రోడ్లు వేయించాం. ఎంపీ కేశినేని నాని ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జినని చెప్పుకుంటాడు. కేశినేనికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు. చంద్రబాబు వైశ్యులకు చేసిందేమీ లేదు. ఎన్నికల ఓటు బ్యాంకుగా వాడుకున్నాడే కానీ ఏనాడైనా వైశ్యులకు మేలు చేశారా. రోశయ్య బ్రతికున్నంత వరకూ వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు వైశ్యుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నాడు' అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. సీఎం జగన్‌కు కానుకగా ఇస్తా: వెల్లంపల్లి 'తొలి కేబినెట్లో నాకు దేవాదాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. మూడేళ్లు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చేశా. ఇప్పుడు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం నా వంతుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తా. వచ్చే ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తా' అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. -
గ్రామ సచివాలయాలతో సంక్షేమ ఫలాలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలంటూ దిక్కుమాలిన కమిటీలు వేశారని, ఇప్పుడు ఆ కమిటీలు లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్లో పర్యటించారు. (చదవండి: ‘ఎవరెన్ని డ్రామాలు చేసినా.. గెలుపు మాదే’) స్థానికులు నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పాటి సమస్యలను మంత్రి.. అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కోర్టులో కేసులు పరిష్కారం అయిన వెంటనే అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.(చదవండి: కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు) రామ మందిర నిర్మాణానికి రూ.5లక్షల విరాళం.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.5,01,116 విరాళం అందజేశారు. సంబంధింత చెక్‌ను ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ముఖ్యులు భరత్‌కు ఆయన ఆదివారం అందజేసినట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడం హాస్యాస్పదం
-
వాణిజ్య వర్గాల ఖిల్లా ..విజయవాడ పశ్చిమ
సాక్షి, విజయవాడ పశ్చిమ : విజయవాడ పశ్చిమ నియోజకరవర్గం వ్యాపార, వాణిజ్య రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో తొలినాటి నుంచి వ్యాపార రాజధానిగా పేరుగాంచిన విజయవాడ నగరంలో అత్యధిక వ్యాపారం ఈ నియోజక వర్గంలోనే జరుగుతుంది. అంతేకాదు రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నియోజకవర్గంలోనే కొలువై ఉంది. అలాగే కృష్ణానది నుంచి తూర్పుకృష్ణకు వెళ్లే సాగునీరు ఈ నియోజకవర్గం నుంచి కదులుతుంది. ప్రకాశం బ్యారేజీ కృష్ణాజిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. పర్యాటక విషయంలోనూ.. పర్యాటకానికి వస్తే కృష్ణానది మధ్యలో విస్తరించి ఉన్న భవానీ ద్వీపానికి ఈ నియోజకవర్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిన మహాత్మాగాంధీ స్మారకార్ధం ఏర్పాటు చేసిన గాంధీహిల్ ఈ నియోజకవర్గంలో దర్శనమిస్తుంది. దేశంలోనే పెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటిగా పిలిచే విజయవాడ రైల్వేస్టేషన్ కూడా ఈ నియోజకవర్గంలోనే కనిపిస్తుంది. మూడోవంతు డివిజన్లు... విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలోని మూడో వంతు డివిజన్లు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నగరపాలకసంస్థ పరిధిలోని 25 నుంచి 41వ డివిజన్ వరకూ, అలాగే 48 నుంచి 50వ డివిజన్ వరకూ మొత్తం 20 డివిజన్లు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. తూర్పు రైల్వేలైన్, సెంట్రల్ నియోజకవర్గం, దక్షిణం కృష్ణానది, పడమర, ఉత్తర దిక్కుల్లో మైలవరం నియోజకవర్గం హద్దులుగా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారులు ఇక్కడి నుంచే వెళ్తాయి. నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు 1953లో మొదటి సారిగి తమ్మిన పోతరాజు కాంగ్రెస్ అభ్యర్ధి మరుపిళ్ల చిట్టిపై గెలుపొందారు. 1958లో మరుపిళ్ల చిట్టి సీపీఐ అభ్యర్ధి తమ్మిన పోతరాజుపై గెలుపొందారు. 1962లో తమ్మిన పోతరాజు మరుపిళ్ల చిట్టిపై గెలిచారు. 1967లో మరుపిళ్ల చిట్టి తమ్మిన పోతరాజుపై గెలుపొందారు. 1972 కాంగ్రెస్ నేత ఆసిఫ్‌పాషా తమ్మిన పోతరాజుపై గెలిచారు. 1978లో పోతిన చిన్నా జెఎన్‌పీ అభ్యర్ధి ఇంతియాజుద్దీన్పై గెలిచారు. 1983 టీడీపీ అభ్యర్ధి బీఎస్ జయరాజు స్థానిక సీపీఐ అభ్యర్ధి ఉప్పలపాటి రామచంద్రరాజుపై గెలిపొందారు. 1985లో ఉప్పలపాటి రామచంద్రరాజు కాంగ్రెస్ అభ్యర్థ్ధి ఎంకేబేగ్పై గెలిచారు. 1989లో ఎంకేబేగ్ సీపీఐ అభ్యర్ధి కే.చంద్రశేఖరరావుపై గెలిచారు. 1994లో సీపీఐ అభ్యర్ధి కే.సుబ్బరాజు ఎంకే బేగ్‌పై గెలిచారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్ధి జలీల్‌ఖాన్ టీడీపీ అభ్యర్ధి నాగుల్‌మీరాపై గెలిచారు. 2004లో సీపీఐ అభ్యర్ధి షేక్ నాసర్‌వలీ టీడీపీ అభ్యర్ధి ఎంకేబేగ్పై గెలిచారు. 2009లో వెలంపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ అభ్యర్ధిని మల్లికాబేగంపై గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా జలీల్‌ఖాన్ బీజేపీ పక్షాన పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాసరావుపై గెలుపొందారు. ఆధ్యాత్మికంగానూ... ఈ నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఒకవైపు కొండపైన కొలువై ఉన్న కనకదుర్గమ్మతో పాటుగా కొండ దిగువన ధర్మరాజు ప్రతిష్టితమైన మల్లేశ్వరస్వామి (పాతశివాలయం), అర్జునుడు ప్రతిష్ట చేసిన విజయేశ్వరస్వామి దేవస్థానాలు ఉన్నాయి. అలాగే 1200 సంవత్సరాల క్రితం కొలువైన వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం కూడా పాతబస్తీలో కొలువై ఉంది. వాటితో పాటుగా స్వాతంత్య్రం రాక ముందే బ్రిటీష్ పాలకుల కాలంలో ఏర్పడిన ఆర్సీఎం, సీఎస్ఐ, తెలుగు బాప్టిస్ట్ సెంటినరీ చర్చిలు ఉన్నాయి. 500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మసీదులు,120 ఏళ్ల క్రితమే ఇక్కడ జైన ఆలయం కొలువై ఉన్నాయి. మినీ భారత్ పశ్చిమ నియోజకవర్గం మినీ భారతదేశంగా పలువురు పిలుస్తారు. ఈ నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం మనకు దర్శనమిస్తారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం అధిక సంఖ్యలో ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితమే నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలతో మమేకమై జీవిస్తున్నారు. అన్ని మతాలకు చెందిన ఆలయాలు ఈ ఒక్క నియోజకవర్గంలోనే మనకు దర్శనమిస్తాయి. టీడీపీ గెలిచింది ఒక్కసారే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ గెలిచింది ఒకసారి మాత్రమే. అది కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఆయన గాలిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్, సీపీఐల మధ్యనే ఎక్కువ పోటీ కొనసాగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు, సీపీఐ ఐదుసార్లు గెలిచింది. అదేవిధంగా వైఎస్సార్సీపీ టీడీపీ, పీఆర్పీ, ఒక్కొక్కసారి గెలిచారు. పశ్చిమ నియోజకవర్గం జనాభా : 4,25,002 మొత్తం ఓటర్లు : 2,16,711 పురుషులు : 1,07,563 మహిళలు : 1,09,129 ఇతరులు : 19 -
ఇక్కడ సిట్టింగ్‌లు మాజీలే..!
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ప్రతిసారి కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి మరుసతి ఎన్నికల్లో టికెట్ రాకపోవటమో, గెలవకపోవడమో జరుగుతుంది. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 1953 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన తదుపరి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓడిపోతూ వచ్చారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు మంత్రులుగా కూడా చేశారు. వారు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికై అదే హోదాలో ఎన్నికలకు వెళితే ఓటమి కావాల్సిందే. ఈ అంశాలను నియోజకవర్గ చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో 1953లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. అందులో తొలిసారిగా తమ్మిన పోతరాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1957లో పోతరాజుపై సీనియర్ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత మరుపిళ్ల చిట్టిపై 1962 ఎన్నికల్లో పోతరాజు ఎన్నికయ్యారు. ఆయనపై మళ్లీ 1967 ఎన్నికల్లో మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఇలా ఆసిఫ్‌పాషా (1972), పోతిన చిన్నా (1978), బీఎస్ జయరాజు (1983), ఉప్పలపాటి రామచంద్రరాజు (1985), ఎంకే బేగ్ (1989), కె.సుబ్బరాజు (1994), జలీల్‌ఖాన్ (1999), షేక్ నాసర్‌వలీ (2004), వెలంపల్లి శ్రీనివాసరావు (2009), జలీల్‌ఖాన్ (2014) ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వరుసగా గెలిచిన చరిత్రలో లేదు. రెండు సార్లు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా ఈ నియోజకవర్గం లో ఓటమి పాలైన చరిత్ర కొనసాగుతూనే ఉంది. ఒకే పార్టీ వరుసగా గెలిచినా.. అభ్యర్థులు వేరు పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా ఒకే పార్టీ మూడు సార్లు గెలిచిన చరిత్ర ఉంది. అయితే మూడు సార్లు ముగ్గురు వేరువేరు అభ్యర్థులు నిలబడటంతో అక్కడ ఆ విజయం సాధ్యమైందని సీనియర్ నాయకులు చెబుతుంటారు. 1967 కాంగ్రెస్ పార్టీ నుంచి మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1972 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఆసిఫ్‌పాషా ఎన్నికయ్యారు. మూడో సారి అదే పార్టీ నుంచి 1978 ఎన్నికల్లో పోతిన చిన్నా ఎన్నికయ్యారు. ఒకే పార్టీ మూడు సార్లు గెలిచినా చరిత్ర ఈ నియోజకవర్గంలో అదే ఆఖరు. ఆ తరువాత ఒకే అభ్యర్థే కాకుండా పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు. -
జలీల్ ఖాన్ కుమార్తెపై ఫత్వా
-
జలీల్ ఖాన్‌ను వెంటాడిన గతం..
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను గతం వెంటాడుతుంది. 2009 ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ అనుసరించిన వైఖరి.. ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌పై ఫత్వా జారీకి కారణమయింది. వివరాల్లోకి వెళితే.. అప్పటి ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ ఆ స్థానంలో మాజీ మేయర్ మల్లికా బేగంను బరిలోకి దించింది. దీంతో జలీల్ ఖాన్ ఆమెపై ఫత్వా జారీ చేసేలా మతపెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే కారణంతో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించారు. తనకు జరిగిన అన్యాయంపై మల్లికా బేగం తాజాగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫత్వా జారీ చేయడం వల్లే తాను అప్పటి ఎన్నికల్లో ఓడిపోయానని ఆరోపించారు. తనకులాగే షబానాపై కూడా ఫత్వా ఎందుకు జారీ చేయలేదని ముస్లిం మత పెద్దలను నిలదీశారు. ముస్లిం మహిళనని కూడా చూడకుండా జలీల్ ఖాన్ తనపై విషం కక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ముస్లిం ఓట్లు తనకు పడకుండా జలీల్ ఖాన్ మతంను అడ్డుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఫత్వా జారీ చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించిన జలీల్ ఖాన్.. తన కుమార్తెను ఎలా రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మత పెద్దలు షబానాపై పత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. ఈ మేరకు మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన జలీల్ ఖాన్.. తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. -
మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?
సాక్షి, విజయవాడ: టీడీపీలో టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. ఒకరికి తెలియకుండా ఒకరు పెదబాబు చంద్రన్న, చినబాబు లోకేష్ దగ్గర టికెట్ల కోసం మంతనాలు చేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా.. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న నాగుల్ మీరా చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్‌కు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా టికెట్ ఇస్తానని హామినిచ్చి మోసం చేశారంటూ ఆయన చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. (అమరావతికి టికెట్ల వేడి!) -
జలీల్‌ఖాన్ కూతురికి టీడీపీ టికెట్..!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు కేటాయించారని ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ప్రకటించారు. జలీల్‌ఖాన్ మంగళవారం తన కుమార్తె షాబానాతో కలిసి ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పశ్చిమ నియోజకవర్గానికి తన స్థానంలో తన కూతురుకు సీటివ్వాలని అధినేతను కోరారు. దీనిపై చంద్రబాబు.. నియోజకవర్గంలో తిరగాలని, బాగా పనిచేయాలంటూ షాబానాకు సూచించారు. అనంతరం జలీల్‌ఖాన్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని చెప్పారు. విజయవాడలోని తన ఇంటివద్ద తన కుమార్తెకు సీటు వచ్చిందంటూ టపాసులు కాల్చి హడావుడి చేశారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. తాను సీటు ఎక్కడ ఖరారు చేశానంటూ జలీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
'పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న దరిద్రం పోయింది'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. బుధవారం విజయవాడలో పశ్చిమ నియోజకర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావుతోపాటు పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, కె.పార్థసారథి, గౌతంరెడ్డి, నగర కార్పొరేటర్లు హాజరయ్యారు. కొడాలి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి... మళ్లీ ఎన్నికల్లో గెలివాలి అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై మండిపడ్డారు. జలీల్‌ఖాన్ పార్టీ మారడం వల్ల పశ్చిమ నియోజకర్గానికి ఉన్న దరిద్రం పోయిందని కొడాలి నాని ఎద్దేవా చేశారు.