విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను గతం వెంటాడుతుంది. 2009 ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ అనుసరించిన వైఖరి.. ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌పై ఫత్వా జారీకి కారణమయింది. వివరాల్లోకి వెళితే.. అప్పటి ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ ఆ స్థానంలో మాజీ మేయర్ మల్లికా బేగంను బరిలోకి దించింది. దీంతో జలీల్ ఖాన్ ఆమెపై ఫత్వా జారీ చేసేలా మతపెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు.