fatwa
-
శివుడి పాట.. ఫర్మానీ నాజ్‌పై ముస్లిం పెద్దల నారజ్
Farmani Naaz Har Har Shambhu:: యూట్యూబ్ సెన్సేషన్, ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్‌పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్ హర్ శంభూ పాట వైరల్ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. హిందూ దైవం శివుడి మీద పాట పాడిన కారణంతో ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అంటూ ఫత్వా జారీ చేశాయి. ఆమె తన యూట్యూబ్‌లో ఛానెల్లో పాటను పోస్ట్ చేయగా.. వ్యూస్‌తో పాటు విమర్శలూ వెల్లువెత్తున్నాయి. ఈ చేష్టను ఇస్లాం వ్యతిరేక చర్యగా ఆరోపిస్తున్నాయి మతపెద్దలు.. ఇస్లాంలో, అందునా మహిళలు ఇలాంటి పనులు చేయడం మత విరుద్ధమేనని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ దియోబంద్ను చెందిన మతపెద్ద అసద్ ఖ్వాస్మీ దీన్నొక ‘పాపం’గా, ఘోరమైన నేరంగా అభివర్ణిస్తున్నారు. సంగీతానికి ఆమె దూరంగా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. స్టూడియోలో రికార్డింగ్ వెర్షన్‌ను ఆమె యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పాటను రిలీజ్ చేయగా.. హిందూ సంఘాలు, మరికొందరు అభినందిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫర్మానీ నాజ్ ఎవరంటే.. ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌కు చెందిన ఫర్మానీ నాజ్.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యూట్యూబ్‌కు 3.84 మిలియన్లకు పైగా సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 12లో పాల్గొనడం ద్వారా ఆమెకు ఒక స్టార్ డమ్ దక్కింది. ఆమె వివాహిత. 2017లో ఆమెకు వివాహం అయ్యింది. అయితే కొడుకు పుట్టడం, ఆ కొడుక్కి జబ్బు చేయడంతో భర్త కుటుంబం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించింది. దీంతో బిడ్డను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె గొంతు బాగుండడంతో స్థానికంగా ఉండే ఓ కుర్రాడు.. ఆమె పాటల్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. అలా యూట్యూబ్ సెన్సేషన్‌గా, ఇ-సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఆమె, ఆపై ఇండియన్ఐడల్లో పాల్గొన్నారు. అయితే కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియన్ ఐడల్ మధ్యలోనే ఆమె వెనక్కి వచ్చేశారు. అయినా కూడా ఆమె కెరీర్ ముందుకు సాగిపోతూ వచ్చింది. ఏనాడైనా సాయం చేశారా? విమర్శలపై స్పందించిన ఫర్మానీ.. తనది పేద కుటుంబం అని, ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తన మానాన తాను బతుకుతుంటే.. ఇప్పుడు అడ్డుకోవాలని చూడడం, విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఆమె. అన్నింటికి మించి కళాకారులకు మతంతో సంబంధం ఉండదని గుర్తించాలంటూ ఆమె చెబుతున్నారు. అలా అనుకుంటే.. సలీం మోహమ్మద్ రఫీ లాంటి వాళ్లు భజన, హిందూ భక్తి పాటలు ఆలపించేవాళ్లు కాదు కదా.. దయచేసి హిందూ మతానికి, సంగీతానికి ముడిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారామె. అంతేకాదు తనకున్న రెండు చానెల్స్‌లో ఒకటి భక్తి గీతాల చానెల్ అని, అందులో కచ్చితంగా అన్ని మతాలకు సంబంధించిన ఆల్బమ్స్ అప్లోడ్ చేసి తీరతానని, అల్లా ఆశీస్సులు తనపై ఉంటాయని అంటున్నారామె. హిందూ సంఘాల మద్దతు ఇక తాజాగా శివుడి మీద పాట వైరల్ కావడంతో.. ఆమె మీద పలువురి అభినందలు సైతం కురుస్తున్నాయి. బీజేపీ నేత సంజీవ్ బాల్యన్.. ఆమె కొడుకు ట్రీట్మెంట్కు అవసరమయ్యే సాయం అందిస్తానని మాటిచ్చారు. మరోవైపు ముస్లిం సంఘాలు ఫర్మానీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడంపై వీహెచ్‌పీ మండిపడింది. వాళ్లు(ముస్లిం సంఘాలు) పేదలు, నిస్సహాయులకు మాత్రమే ఫత్వా జారీ చేస్తారు. ఇంతకాలం ఆమె యూట్యూబ్ ద్వారా పాడిన సంగతి మరిచిపోయినట్లు ఉన్నారు అంటూ ముస్లిం మత పెద్దలపై విమర్శలు గుప్పిస్తోంది. -
ఫత్వా: టీవీ చూసినా, పాటలు విన్నా శిక్ష
కోల్‌కతా: ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు టెలివిజన్ చూడటం, క్యారమ్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ఈ కమిటీ సూచించిన శిక్షల జాబితా: టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా క్యారమ్ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా మద్యం సేవించడం: రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది. యువ తరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా ఆపడానికి వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది. చదవండి: కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు -
జలీల్ ఖాన్ కుమార్తెపై ఫత్వా
-
జలీల్ ఖాన్‌ను వెంటాడిన గతం..
సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను గతం వెంటాడుతుంది. 2009 ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ అనుసరించిన వైఖరి.. ఆయన కుమార్తె షబానా ఖాతూన్‌పై ఫత్వా జారీకి కారణమయింది. వివరాల్లోకి వెళితే.. అప్పటి ఎన్నికల సమయంలో జలీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ ఆ స్థానంలో మాజీ మేయర్ మల్లికా బేగంను బరిలోకి దించింది. దీంతో జలీల్ ఖాన్ ఆమెపై ఫత్వా జారీ చేసేలా మతపెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనే కారణంతో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించారు. తనకు జరిగిన అన్యాయంపై మల్లికా బేగం తాజాగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫత్వా జారీ చేయడం వల్లే తాను అప్పటి ఎన్నికల్లో ఓడిపోయానని ఆరోపించారు. తనకులాగే షబానాపై కూడా ఫత్వా ఎందుకు జారీ చేయలేదని ముస్లిం మత పెద్దలను నిలదీశారు. ముస్లిం మహిళనని కూడా చూడకుండా జలీల్ ఖాన్ తనపై విషం కక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ముస్లిం ఓట్లు తనకు పడకుండా జలీల్ ఖాన్ మతంను అడ్డుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఫత్వా జారీ చేసేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించిన జలీల్ ఖాన్.. తన కుమార్తెను ఎలా రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మత పెద్దలు షబానాపై పత్వా జారీ చేశారు. ఇస్లాం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని వారు తెలిపారు. ఈ మేరకు మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన జలీల్ ఖాన్.. తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. -
నకిలీ వార్తలు ఇలా పుడతాయా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లిం మహిళలు గోళ్ల పెయింట్ (నేల్ పాలిష్) వాడ కూడదు. అది ఇస్లాం మతానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం అంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఫత్వాను జారీ చేసిందీ’ అని నవంబర్ ఐదవ తేదీన ఏఎన్ఐ (ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్) చేసిన ట్వీట్ వైరల్ అవడంతో పలు న్యూస్ ఛానళ్లు, వార్తా పత్రికలు ఆ ఫత్వాను హైలెట్ చేస్తూ హల్చల్ చేశాయి. కొన్ని వార్తా ఛానళ్లు చర్చా గోష్టిలను కూడా నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలోని ఇస్లామిక్ స్కూల్ ‘దారుల్ ఉలూమ్ దియోబంద్’ ముఫ్తీ (మత గురువు) ఇష్రార్ గౌర ఈ ఫత్వాను జారీ చేసినట్లు ఓ ఫొటోతో ఏఎన్ఐ ట్వీట్ చేసింది. ఆ ఫత్వా నకిలీదని నకిలీ వార్తలను కనిపెట్టడంలో ఆరితేరిన ‘ఆల్ట్ న్యూస్’ దర్యాప్తులో తేల్చింది. ఆయన దారుల్ ఉలూమ్ దియోబంద్ మత గురువు కాకపోవడమే కాకుండా ఆ స్కూల్‌తోని ఎలాంటి సంబంధం లేదు. ఆయన సహ్రాన్‌పూర్‌లోని జమా మసీదు పాత ఇమామ్ కుమారుడు, ప్రస్తుత ఇమామ్ సోదరుడని తేలింది. ‘తమరు ఏ హోదాలో ఫత్వా జారి చేశారు ?’ అంటూ సదరు ఇష్రార్ గౌరకు ఆల్ట్ న్యూస్ ప్రతినిధి ఫోన్ చేయగా, తన పేరు ఇష్రార్ గౌర కాదని, ఇషాక్ గౌర అని, తాను 1990 దశకంలో జారీ అయినా ఓ ఇస్లాం ఫత్వా గురించి ప్రస్తావించానని, ముస్లింలు మహిళలు గోళ్లకు రంగులకు బదులుగా మెహిందీ వాడాలని ఫత్వా సూచించినట్లు చెప్పానని, తన మాటలకు తప్పుడు అర్థం ధ్వనించేలా ట్వీట్ పెట్టారని ఆయన వివరణ ఇచ్చారు. ఇదే ఏఎన్ఐ ప్రతినిధిని ప్రశ్నించగా ఎక్కడో పొరపాటు జరిగిందని, తప్పు తెలియగానే సరిదిద్దు కున్నామని చెప్పారు. 1990 దశకంలో కూడా అలాంటి ఫత్వా జారీ అయివుంటుందన్నది కూడా అనుమానమే. ఇస్లాం స్కూల్ వెబ్సైట్లో ఇంతవరకు జారీ చేసిన అన్ని ఫత్వాలు ఉన్నాయి. అందులో ఈ ఫత్వాలేదు. ఈ విషయమై దారుల్ ఉలూమ్ దియోబంద్ నిర్వాహకులను ప్రశ్నించగా వారు స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఏఎన్ఐ ట్వీట్ చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనెవరో కూడా తమకు తెలియదని చెప్పారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఏఎన్ఐకి దేశవ్యాప్తంగా 50 బ్యూరోలు ఉన్నాయి. అంతటి పెద్ద సంస్థ వాస్తవాలను తెలుసుకోకుండా నకిలీ వార్తను ప్రచురించడం, ఆ నకిలీ వార్తను నమ్మి వార్తా ఛానళ్లు దానికి విస్తృత ప్రచారం కల్పించడం శోచనీయం. -
‘గుండు కొట్టి దేశం నుంచి తరిమికొడితే..’
లక్నో: ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిదాఖాన్, ఫర్హాత్ నఖ్వీ లకు గుండు కొట్టి, దేశం దాటేలా తరిమి కొట్టే వారికి బరేలీ ముస్లిం ఎన్జీవో చీఫ్ మొయిన్ సిద్దిఖీ నూరీ నజరానా ప్రకటించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ ఇద్దరు మహిళలకు బుద్ధి చెప్పిన వారికి అక్షరాల 11, 786 రూపాయలు ముట్టజెప్పుతానని ఆలిండియా ఫైజాన్-ఎ-మదీన కౌన్సిల్ తరపున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, నిదా ఖాన్, ఫర్హాత్ నఖ్వీలను ఇస్లాం నుంచి బహిష్కరిస్తున్నట్టు నాలుగు రోజుల కిందట బరేలీ ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. అసలు విషయం.. నిఖా హలాల (మొదటి భర్తను మళ్లీ పొందాలంటే కొన్నాళ్లపాటు మరొకరితో కలిసి ఉండడం) కారణంగా చిత్రవధ అనుభవిస్తున్న సబీనాకు నిదాఖాన్ అండగా నిలిచారు. ఫర్హాత్ నఖ్వీతో కలిసి ట్రిపుల్ తలాక్, నిఖా హలాలకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేపట్టారు. దాంతో ఈ ఇద్దరిపై ముస్లిం పెద్దలు ఫత్వా జారీ చేశారు. తాజాగా, బరేలీలోని ముస్లిం ఎన్జీవో సైతం వారిని తరిమి కొట్టిన వారికి నగదు బహుమతి ప్రకటించడంతో దుమారం రేగుతోంది. మరోవైపు బరేలీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని ఎమెల్యే రాజేష్ కుమార్ మిశ్రా నేతృత్వంలో ఫర్హాత్, నిదాలు శనివారం కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఫర్హాత్ నఖ్వీ కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సోదరి కావడం గమనార్హం. -
ట్రిపుల్ తలాక్ బాధితురాలిపై కఠిన ఫత్వా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇస్లాం సంప్రదాయాలను సవాలుచేసిన ట్రిపుల్ తలాక్ బాధితురాలు నిదాఖాన్‌పై మత గురువు ఒకరు కఠిన ఆంక్షలు విధిస్తూ ఫత్వా జారీచేశారు. ఆమె జబ్బుపడినా మందులు ఇవ్వొద్దని, ఆమె మరణించిన తరువాత ప్రార్థనలు చేయొద్దని, పూడ్చడానికి స్థలం కేటాయించొద్దని అందులో పేర్కొన్నారు. ఆమెకు సాయం చేసేవారు, మద్దతుగా నిలిచే వారికి కూడా ఇదే శిక్ష అమలవుతుందని తెలిపారు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నిదాఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. పురుషహంకార సమాజానికి ఎదురుతిరిగినందుకే తనను బహిష్కరించారని, ట్రిపుల్ తలాక్ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం తీసుకురావాలని నిదాఖాన్ అన్నారు. నిఖా హలాలా బాధితురాలు సబీనాకు నిదా అండగా నిలిచింది. బరేలీలో నివసించే సబీనాకు తొలుత ఆమె భర్త తక్షణ తలాక్ విధానం ద్వారా విడాకులిచ్చాడు. అనంతరం మళ్లీ ఆయనను పెళ్లి చేసుకోవాలంటే.. నిఖా హలాలా ద్వారా మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఆమెకు నిఖా హలాలా విధానంలో భాగంగా సొంత మామ(భర్త తండ్రి)తోనే మళ్లీ పెళ్లి చేశారు. విడాకుల అనంతరం మళ్లీ మొదటి భర్తతో సబీనాకు వివాహం జరిపించారు. ఇక్కడితో ఆమె కష్టాలు తీరలేదు. మళ్లీ సబీనాకు ఆమె భర్త విడాకులిచ్చాడు. ఈసారి సొంత మరిదిని మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడం ప్రారంభించారు. ఇక భరించలేక ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న నిదాను సబీనా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నిదాపై ఫత్వా జారీ అయింది. -
‘అలా చూడటం ఇస్లాంకు విరుద్ధం’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై ఇస్లామిక్ సెమినరీ దారుల్ ఉలూమ్ దియోబంద్ మరో వివాదాస్పద ప్రకటన చేసింది. ఫుట్‌బాల్ క్రీడను ముస్లిం స్త్రీలు చూడరాదని పేర్కొంది. పురుషులు ఎలాంటి ఆచ్ఛాదన లేని మోకాళ్లను ప్రదర్శిస్తూ ఫుట్‌బాల్ ఆడటాన్ని స్త్రీలు వీక్షించడం ఇస్లాంకు విరుద్ధమని పేర్కొంది. ‘షార్ట్స్‌తో ఎలాంటి ఆచ్ఛాదన లేని మోకాళ్లను చూపుతూ పురుషులు ఫుట్‌బాల్ ఆడతారు...అలాంటి ఆటను స్త్రీలు చూడటం ఇస్లాంకు విరుద్ధ’మని ముఫ్తీ అతర్ కస్మీ స్పష్టం చేశారు. వివాదాస్పద ఆదేశాలు జారీ చేయడం ఇస్లామిక్ సెమినరీకి ఇదే తొలిసారి కాదు. బ్యాంకింగ్ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో ముస్లింలు వివాహాలు చేసుకోరాదాని ఇటీవల ఫత్వా జారీ చేసింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం రుణంపై వడ్డీ వసూలు చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇక ఫుట్‌బాల్ క్రీడను మహిళలు చూడరాదని ఆదేశించడం వివాదాస్పదమవుతోంది. -
రొయ్యలు తినొద్దు.. అది చెడ్డ ఆహారం
సాక్షి, హైదరాబాద్ : మాంసాహారంలో ప్రత్యేకంగా నిలిచే రొయ్యలను ఇకపై ముస్లింలెవరూ తినకూడదంటూ ప్రఖ్యాత ఇస్లామిక్ విద్యాసంస్థ జామియా నిజామియా ఫత్వా జారీచేసింది. ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన రొయ్యలు.. చేపజాతికి చెందినవి కావని, తేళ్లు, సాలెపురుగుల వంటి కీటకాలని ఫత్వాలో పేర్కొన్నారు. అవి అతిదుష్టమైనవి కాబట్టే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోరాదని ఆదేశించారు. జామియా నిజామియా ప్రధాన గురువు ముఫ్తీ మహమ్మద్ అజీముద్దీన్ ఈ మేరకు జనవరి 1న జారీచేసిన ఫత్వా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 142 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోన్న జామియా నిజామియా.. దేశంలో సుదీర్ఘకాలంగా నడుస్తోన్న ఇస్లామిక్ డీమ్డ్ యూనివర్సిటీల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. ముక్రూ తహరీమ్ అంటే.. : ఇస్లామిక్ ధర్మశాస్త్రం ప్రకారం ఆహారాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు. సమ్మతించిన(హలాల్), నిషేధించిన(హరామ్), హేయమైన(ముక్రూ) ఆహారం. మూడో విభాగమైన ముక్రూలో ఇంకోరెండు అంతర్విభాగాలుంటాయి. ముక్రూ(హేయమైనదే కానీ తినొచ్చు), ముక్రూ తహరీమ్(దుష్టమైనది, తినకూడదు). జామియా నిజామియా ఇచ్చిన ఫత్వాలో రొయ్యలను ముక్రూ తహరీమ్‌గా పేర్కొంది. కాగా, సంస్థ ఇచ్చిన ఆదేశాలపై ముస్లిం వర్గాల నుంచే వ్యతిరేకత వస్తుండటం గమనార్హం. రొయ్యలను నిషేధిత ఆహారంగా పేర్కొనడాన్ని పలువురు ముస్లిం విద్యావేత్తలు నిరసిస్తున్నారు. -
‘బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోకండి’
లక్నో : బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దంటూ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూమ్ ధియోబంద్ ఫత్వాను జారీ చేసింది. బ్యాంకుల్లో పని చేస్తున్న చాలా మంది అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నారని పేర్కొంది. అక్రమ ధనార్జన చేస్తూ ఉన్నత కుటుంబాలకు చెందిన(వరుడు లేదా వధువు) వారిని వివాహం చేసుకోవాలనుకోవడం కన్నా దారుణం మరొకటి లేదని చెప్పింది. వివాహ సంబంధాలు వెతుకుతున్న ఓ యువకుడికి ఓ మ్యాచ్ వచ్చిందని పేర్కొన్న దారుల్ సంస్థ.. యువతి తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారని చెప్పింది. ఉద్యోగం ద్వారా అక్రమంగా అర్జించిన మొత్తాన్ని వారు వరుడికి ఇస్తానని ఆఫర్ చేశారని వెల్లడించింది. అలాంటి కుటుంబంలోని అమ్మాయిని తాను చేసుకోవచ్చా? అని సదరు యువకుడు సంస్థను ఆశ్రయించినట్లు తెలిపింది. ఆ కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకోవద్దని యువకుడికి చెప్పినట్లు వెల్లడించింది. అక్రమ ధనార్జనతో ఎదిగిన వ్యక్తికి మంచి లక్షణాలు ఉండవని, మోరల్స్‌ను పాటించరని పేర్కొంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలని సూచింనట్లు వివరించింది. ఈ నిబంధనలు ఎక్కడివి? - ఇస్లామిక్ చట్టం ప్రకారం వడ్డీకి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. దీన్ని ఇస్లామిక్ చట్టంలో ‘రిబా’ అని పిలుస్తారు. - వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సంపాదించిన మొత్తాన్ని కూడా ఇస్లామిక్ చట్టం అక్రమ ధనం(హరామ్)గా భావిస్తుంది. ఈ రెండు సూత్రాలను ఖురాన్ నుంచి ఇస్లామిక్ చట్టంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీటిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇస్లామిక్ బ్యాంకులు సైతం ‘వడ్డీ లేని బ్యాంకింగ్’ సూత్రం మీద ఆధారపడి పని చేస్తాయి. రుణ దారుల నుంచి బ్యాంకులు తిరిగి తీసుకున్న మొత్తాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టి లాభాలు అర్జిస్తే దాన్ని సరైన ఆదాయం(షరియత్)గానే భావిస్తారు. ప్రపంచంలోని అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయి. చైనా, యూకే, అమెరికా, జర్మనీ దేశాల్లో కూడా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. -
ముస్లిం యోగా గురువుకు ఫత్వా
న్యూఢిల్లీ: యోగా శిక్షణ ఇస్తున్నందుకు ఇటీవల ఫత్వా అందుకున్న ముస్లిం యోగా గురువు రఫియా నాజ్ ఇంటిపై శుక్రవారం ఓ గుంపు రాళ్లదాడికి పాల్పడింది. జార్ఖండ్‌లోని దరోందాలో ఉంటున్న రఫియా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. లైవ్ ఇంటర్వ్యూలో రఫియా వ్యాఖ్యలు విన్న ఓ మతపెద్ద ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని రగిలిపోయాడు. వెంటనే ఓ గుంపుతో రఫియా ఇంటివద్దకు చేరుకుని హంగామా సృష్టించాడు. ఈ గుంపు ఆమె ఇంటిపై రాళ్లు విసురుతూ నినాదాలిచ్చింది. ఇటీవల ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి వేదిక పంచుకోవడంతో రఫియాకు కొందరు మతపెద్దలు గురువారం ఫత్వా జారీచేశారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం రఘుబర్‌దాస్ ఆమెకు భద్రత కల్పించాలని పోలీసుల్ని ఆదేశించారు. తాజాగా రఫియా ఇంటిపై దాడి ఘటనపై బాబా రాందేవ్ స్పందిస్తూ..‘ఇరాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా సహా పలు దేశాల్లోని ముస్లింలు యోగాను ఆచరిస్తారు. యోగా అన్నది మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించినది. ఇందులో మతం అన్న విషయాన్ని తీసుకురాకూడదు’ అని తెలిపారు. -
ముస్లింలకు కొత్త ఫత్వా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ కేంద్రంగా నడిచే ప్రముఖ ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ తాజాగా మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు, పురుషులు అల్లాను కాకుండా మరే దేవుడిని ప్రార్థించరాదని దారుల్ ఉలూమ్ దియోబంద్ శనివారం ఫత్వా విడుదల చేసింది. అల్లాను కాకుండా మరో దేవుడిని ఆరాధించిన వారిని భవిష్యత్‌లో ముస్లింలుగా గుర్తింలేమని ఆ సంస్థ పేర్కొంది. హిందువుల ముఖ్య పర్వదినాల్లో ఒకటైన దీపావళి సందర్భంగా వారణాసిలో పలువురు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించిన నేపథ్యంలో దారుల్ ఉలూమ్ సంస్థ ఈ ఫత్వా జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇరు వర్గాల మధ్య మత కలహాలు తగ్గించేందుకు ముస్లిం మహిళా ఫౌండేషన్, విశాల్ భారత్ సంస్థాన్ సంస్థలు.. సంయుక్తంగా దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంపై దారుల్ ఉలూమ్ మండిపడింది. ‘‘శ్రీరాముడు హిందువులకు మూలపురుషుడు.. రాముడిని పూజించే వారు.. తమ పేరును మతాన్ని మార్చుకోవడం సాధ్యమా?’’ ఇరు వర్గాల మధ్య కలహాలు తగ్గించాలంటే రాముడిని పూజించడం ఒక్కటే కాదు.. మనుషుల మధ్య ఔదార్యం, ప్రేమ కలగాలి.. అని దారుల్ సంస్థ సభ్యుడు నజీమ్ అన్సారీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ముస్లిం మహిళలు, పురుషులు తమ వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ సంస్థ గురువారం ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. If anyone worships any god except Allah they don't remain Muslim-Ulema,Darul Uloom on Muslim women who performed aarti on Diwali in Varanasi pic.twitter.com/IgaLNcenGo — ANI UP (@ANINewsUP) October 21, 2017 -
ముస్లింలకు దారుల్ ఉలూమ్ కొత్త ఫత్వా
దియోబంద్ (ఉత్తర్‌ప్రదేశ్) : భారతదేశంలోని ముస్లింలెవరూ సోషల్ మీడియాలో వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను పెట్టరాదంటూ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ గురువారం ఫత్వా జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని షరణ్‌పూర్ జిల్లాలో ఉన్న దారుల్ ఉలూమ్ సంస్థ.. దేశవ్యాప్తంగా ఇస్లామిక్ సెమినార్లు నిర్వహిస్తుంది. సోషల్ మీడియాలు ఫొటోను పోస్ట్ చేయడం అనేది ఇస్లామ్‌కు విరుద్ధమని ఆ సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయడం తప్పంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ చీఫ్ షహనవాజ్ ఖాద్రీ ట్విటర్లో ట్వీట్ చేశారు. దీనిపై దారుల్ ఉలూమ్ చేసిన ఫత్వాను ఆయన సమర్థించారు. Unnecessary uploading of pictures on social media is wrong. Fatwa of Darul Uloom Deoband is appropriate: Shahnawaz Qadri,Darul Uloom Deoband — ANI UP (@ANINewsUP) October 19, 2017 -
హెయిర్ కట్, ఐబ్రోస్ చేయించుకోవద్దు
గడ్డం పెంచుకునేందుకు అనుమతించకపోతే ఉద్యోగం వదిలేయడంటూ.. ఇస్లామిక్ విశ్వ విద్యాలయంలో మొబైల్ ఫోన్ల నిషేధం వంటి ఫత్వాలు జారీచేసిన దారుల్ ఉలూమ్ దియోబాంద్ తాజాగా మరో కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళలు జుట్టు కట్ చేసుకోవడంతో పాటుగా, ఐబ్రోస్ చేయించుకోవడంపై వ్యతిరేకంగా దారుల్ ఈ ఫత్వా జారీచేసింది. దారుల్-ఉలూమ్ దియోబాంద్ మౌలానా ఖాజ్మి ఈ విషయాన్ని తెలిపారు. మహిళలు జుట్టు కట్ చేసుకోవడం, ఐబ్రోస్ చేయించుకోవడంపై ప్రస్తుత కాలంలో సాధారణంగా మారిపోయింది. అయితే వీటిపై దారూల్ ఉలూమ్ ఈ ఫత్వా జారీచేయడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ఫత్వా ప్రకారం ముస్లిం యువతలు, మహిళలు ఇంక జుట్టు కట్ చేసుకోవడానికి వీలుండదు. -
'జై శ్రీరాం' అన్నందుకు మంత్రిపై ఫత్వా!
పట్నా: ఇటీవల ప్రమాణం చేసిన బిహార్ మంత్రి, జేడీయూ నేత ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ చిక్కుల్లో పడ్డారు. 'జై శ్రీరాం' అని నినాదాలు చేసినందుకు ఆయనపై ఓ ముస్లిం మతపెద్ద ఫత్వా జారీచేశారు. ఈ 'తప్పిదం' చేసినందుకు ఆయన పెళ్లిని రద్దు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం బిహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం నితీశ్‌కుమార్ విజయం సాధించిన అనంతరం సభ బయట బీజేపీ కార్యకర్తలు 'జై శ్రీరాం' అని నినాదాలు చేశారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని సిక్తా ఎమ్మెల్యే అయిన ఖుర్షీద్ సైతం వారితో కలిసి నినాదాలు చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌తో పొత్తును తెగదెంపులు చేసుకొని బీజేపీతో కలిసి నితీశ్ మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. బిహార్, జార్ఖండ్, ఒడిశాలలో క్రియాశీలంగా ఉన్న మతసంస్థ ఇమారత్ షరియాకు చెందిన ముఫ్తి సోహైల్ క్వాస్మి మంత్రి ఖుర్షీద్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేశారు. అయితే, ఈ ఫత్వాను మంత్రి ఖుర్షీద్ తోసిపుచ్చారు. 'అన్ని మతాలను గౌరవించాలని ఇస్లాం బోధిస్తుంది. జై శ్రీరాం అనడం ద్వారా నేను ముస్లింలకు మంచి చేసే వీలుంటే.. ఇలా గగ్గోలు పెట్టడం దేనికి' అని మైనారిటీ సంక్షేమం, చక్కెర పరిశ్రమల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖుర్షీద్ క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దన్న సీఎం సూచన మేరకు క్షమాపణలు చెప్తున్నట్టు తెలిపారు. -
‘అతడికి గుండు కొడితే 10 లక్షలిస్తా’
కోల్ కతా: ఆలయాలు, మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ పై ఫత్వా జారీ అయింది. ఆయనకు గుండు కొడితే 10 లక్షల రూపాయలు ఇస్తానని కోల్ కతాకు చెందిన ముస్లిం మత గురువు ప్రకటించారు. సోనూ నిగమ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. ‘సోనూ నిగమ్ తల గొరిగి.. అతడి మెడలో పాత చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా నేను 10 లక్షల రూపాయలు ఇస్తాన’ని పశ్చిమ బెంగాల్ మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సయిద్ షా అతిఫ్ అలీ ఆల్ ఖ్వాద్రి ప్రకటించారు. దీనిపై సోనూ నిగమ్ ట్విటర్ లో స్పందించారు. ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఉంటానని, ఎవరైనా వచ్చి తనకు గుండు చేయొచ్చనని ట్వీట్ చేశారు. మీడియాను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. తన ట్వీట్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్టు నిరూపిస్తే ఎక్కడికి రమ్మని చెబితే అక్కడకు వచ్చి క్షమాపణ చెబుతానన్నారు. మసీదుల గురించే కాకుండా ఆలయాలు, గురుద్వారాలు గురించి కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా మసీదులు, గుళ్లు, హరిద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థన పిలుపులను ‘గూండాగిరీ’గా అభివర్ణిస్తూ సోనూ నిగమ్ ట్వీట్లు చేయడంతో వివాదం రేగింది. -
యువ స్టార్ గాయనికి ఫత్వా షాక్!
-
'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
-
'నేను పాడటం ఆపడం చాలా కష్టం'
ముంబై :రియాల్టీ సింగర్ నహీద్ అఫ్రిన్ పై ముస్లిం మత గురువులు ఫత్వా జారీచేశారు. బహిరంగ వేదికలపై ముస్లిం బాలికలు పాటలు పాడటం ఇస్లాం విశ్వాసాలకు విరుద్దమంటూ 46 మంది మతగురువులు ఆమెకు వ్యతిరేకంగా ఈ ఆదేశాలు జారీచేశారు. అయితే దేశమంతా తన వెన్నంటే ఉందని, ముస్లిం మత బోధకుల ఫత్వాకు తాను భయపడేది లేదని అఫ్రిన్ స్పష్టంచేసింది. తనను పాడటం ఆపడం చాలా కష్టమని అఫ్రిన్ పేర్కొంది. అస్సాం ప్రభుత్వం సైతం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆమె రక్షణకు తాము గ్యారెంటీ ఇస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ఆర్గనైజేషన్లు ఎంతో ప్రతిభకలిగిన గాయని నహీద్ అఫ్రిన్ ప్రదర్శన ఇవ్వకుండా ఆంక్షలు విధించడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ట్విట్టర్ ద్వారా నహీద్ కు మద్దతుగా నిలిచారు. నహీద్ తో మాట్లాడతామని, ఆర్టిస్టులకు రక్షణ, భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సోనోవాల్ పునరుద్ఘాటించారు. ముస్లిం మతగురువులు తనపై ఫత్వా జారీచేశారని విన్న తర్వాత తాను చాలా షాక్ కు గురయ్యాయని, కానీ చాలామంది ముస్లిం గాయకులు తనకు మద్దతుగా నిలిచి పాడేందుకు ప్రోత్సహించారని నహీద్ చెప్పింది. ''పాడటం నాకు దేవుడిచ్చిన వరం, ఇది సరైన మార్గంలో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఎలాంటి హెచ్చరికలకు నేను భయపడను. తుది శ్వాస వరకు నేను పాడుతూనే ఉంటా'' అని నహీద్ తెలిపారు. మసీదు, శ్మశాన సమీపంలో, బహిరంగ వేదికల్లో పాటలు పాడటాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మతగురువులు ఆమెపై ఫత్వా జారీచేశారు. టెర్రరిజం, ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా నహీద్ ఎక్కువగా పాటలు పాడుతూ ఫేమస్ అయింది. ఆమె తర్వాత ఈవెంట్ మార్చి 25న జరుగబోతుంది. -
యువ స్టార్ గాయనికి ఫత్వా షాక్!
గువాహటి: యువ స్టార్ గాయని నహిద్ అఫ్రిన్‌కు వ్యతిరేకంగా 42 మంది ఇస్లామిక్ మతగురువులు ఫత్వా జారీ చేశారు. ఆమె బహిరంగంగా పాటలు పాడవద్దంటూ హుకుం జారీచేశారు. ప్రముఖ టీవీ మ్యూజిక్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్'లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన నహిద్ అఫ్రిన్ దేశం దృష్టిని ఆకర్షించింది. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన 'అకిరా' సినిమాలో ఓ పాటను పాడటం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. స్టార్ సింగర్‌గా పేరొందిన ఆమె ఈ నెల 25న గువాహటిలో ఓ బహిరంగ కచేరిలో పాడబోతున్నది. అయితే, బహిరంగ కచేరి వేదిక మసీదుకు, శ్మశానానికి దగ్గరగా ఉందని, కాబట్టి ఆమె సంగీత కచేరిని బహిష్కరించాలంటూ మతగురువులు ఫత్వా జారీచేశారు. ఆమె బహిరంగంగా పాటలు పాడకూడదంటూ ఫత్వాలో పేర్కొన్నారు. అయితే ఈ ఫత్వాతో బెదిరేది లేదని, సంగీతాన్ని వీడబోనని నహిద్ స్పష్టం చేసింది. 'ఈ ఫత్వా నన్ను షాక్ గురించింది. ఛిన్నాభిన్నం చేసింది. ముస్లిం గాయకుల స్ఫూర్తితో నేను పాడుతున్నారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తాను. సంగీతాన్ని ఎప్పుడూ వీడను' అని ఆమె స్పష్టం చేసింది. సంగీతం నాకు దేవుడు ఇచ్చిన కానుక. దానిని విస్మరించడమండే దేవుడిని విస్మరించడమేనని ఆమె పేర్కొంది. ఫత్వా ఎదుర్కొంటున్న ఆమెకు పూర్తిస్థాయిలో భద్రత కలిస్తామని, అండగా ఉంటామని అసోం సీఎం శరబానంద్ సోనోవాల్ హామీ ఇచ్చారు. -
మోదీకి నల్లరంగు పూస్తే.. 25 లక్షలు!
పెద్దనోట్ల రద్దు వల్ల దేశంలో చాలామంది అష్టకష్టాల పాలవుతున్నారని, దీనంతటికీ కారణమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖం మీద ఎవరైనా నల్లరంగు పూస్తే వారికి రూ. 25 లక్షలు ఇస్తానంటూ.. కోల్‌కతాలోని టిపు సుల్తాన్ మసీదు ఇమామ్ నూరుర్ రెహ్మాన్ బర్కతీ ఓ ఫత్వా జారీచేశారు. తరచు ఇలాంటి వివాదాస్పదమైన ఫత్వాలు ఇస్తూ, పత్రికల హెడ్లైన్లలో నిలిచే బర్కతీ ఈసారి ఏకంగా ప్రధానమంత్రినే టార్గెట్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ బర్కతీ మాత్రం దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన మానాన తాను ఫత్వాలు ఇచ్చుకుంటూనే పోతున్నారు. మోదీ మీద ఇచ్చిన ఫత్వాకు తాను కట్టుబడి ఉన్నానని.. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల ముందు మందు క్యూలలో నిలబడి ఇప్పటివరకు మరణించిన 127 మంది చావులకు కూడా ఆయనే కారణమని బర్కతీ అంటున్నారు. తాను ఈ ఫత్వా ఇచ్చినందుకు వేలాది మంది ఫోన్లు చేసి, మెసేజిలు పంపి అభినందిస్తున్నారని చెప్పారు. మోదీ కంటే ముందు ఆయన పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మీద కూడా ఓ ఫత్వా జారీచేశౄరు. మమతా బెనర్జీ మీద వ్యాఖ్యలు చేసినందుకు ఆ ఫత్వా ఇచ్చారు. ఘోష్‌ను గులకరాళ్లతో కొట్టి, బెంగాల్ నుంచి తరిమేయాలని అన్నారు. ఇంకా సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్, తారిక్ ఫతపే లాంటి రచయితల మీద కూడా ఇంతకుముందు బర్కతీ ఫత్వాలు ఇచ్చారు. భగవంతుడే తనను రక్షిస్తాడని ఆయన చెబుతున్నా.. కోల్‌కతా పోలీసులు 24 గంటలూ ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. -
ప్రధాని మోదీపై ఫత్వా జారీ
కోలకతా: పెద్దనోట్ల రద్దుతో పేదలన్ని కష్టల్లోకి నెట్టాశారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది. దేశంలో డీమానిటైజేషన్ ప్రభావాల్ని ఖండించిన కోలకతా లోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ ప్రధానికి వ్యతిరేకంగా ఆదివారం 'ఫత్వా' జారీ చేసింది. సమాజాన్ని, అమాయక ప్రజల్ని మోదీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రిగా కొనసాగాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. మహ్మద్ నురూర్ రెహమాన్ బార్కాతి అని పిలిచే షాహి ఇమామ్ సయ్యద్ పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రతీరోజు ప్రజలు వేధింపులకు గురయ్యారని, తీవ్ర బాధలు పడుతున్నారని ఆరోపించారు.ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-సుర , ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మోదీపై ఫత్వా జారీచేయడంపై బీజేపీ మండిపడింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్ధార్థ్ నాథ్ సింగ్ సయాద్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫత్వా జారీ చేసినప్పుడు తృణమూల్ ఎంపి ఇద్రిస్ ఆలీ సయాద్ పక్కన కూర్చుని ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మహిళల సైకిల్ ముందు ఫత్వా బలాదూర్
టెహరాన్: ఇరాన్లో మహిళలు సైకిలు తొక్కవద్దని, అలాచేస్తే వారి శీలం దెబ్బతింటోందని దేశమతాధిపతి అయతొల్లా అలీ ఖమేనీ ఫత్వా జారీ చేయడం పల్ల మహిళలు మండిపడుతున్నారు. సైకిల్ తొక్కడం తమకు జన్మతో వచ్చిన హక్కని వాదిస్తున్నారు. కాలుష్యం వదిలే కార్లను వదిలేసి సైకిళ్లను ఆశ్రయించే దిశగా ప్రపంచం పయనిస్తుంటే తమను సైకిళ్లను తొక్కవద్దంటూ ఫత్వా జారీ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఫత్వాకు నిరసనగా ఇరాన్ మహిళలు ఓ ఉద్యమంలా సైకిళ్లను తొక్కుతూ వాటి తాలూకు వీడియోలను ‘ఇరానియన్విమెన్ లవ్సైక్లింగ్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తోటి దేశ మహిళల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి మహిళలతోపాటు మగవాళ్ల నుంచి కూడా వారికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. మహిళలు సైకిల్ తొక్కడం వారికి నప్పదని, అది వారి శీలాన్ని దెబ్బతీయడమే కాకుండా సమాజాన్ని కూడా అవినీతి మయం చేస్తుందని హెచ్చరిస్తూ ఖమేని ఇటీవల ఫత్వా జారీ చేశారు. ‘మైస్టీల్తీ ఫ్రీడమ్’ పేరుతో సైకిల్ తొక్కుతున్న ఇరానీ మహిళలు ఫొటోలను, వీడియోలను, కామెంట్లను ఎప్పటికప్పుడు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లోని షిరియాజ్ వీధుల్లో సైకిల్ తొక్కుతూ దిగిన వీడియోను ఓ పాతికేళ్ల అమ్మాయి బుధవారం పోస్ట్ చేయగా ఈ రెండు రోజుల్లోనే 21వేల సార్లు వీక్షించారు. ‘ఖమేనీ ఫత్వా గురించి తెలియగానే నేను, మా అమ్మ రెండు సైకిళ్లను అద్దెకు తీసుకున్నాం. టెహరాన్ వీధుల్లో వాటిని తొక్కాం. ఇది మా హక్కు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం’ అని పాతికేళ్ల కూతురు మరో వీడియోను పోస్ట్ చేశారు. ఆమెతోపాటు ఆమె తల్లి కూడా ఆ వీడియోలో సైకిల్ తొక్కడం కనిపించింది. ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 1.10 లక్షల సార్లు వీక్షించారు. ఖమేని ఫత్వాను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకుంటారా? లేదా? చర్చ కూడా జరుగుతోంది. ఫత్వా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలనే చట్టం ఇరాన్లో లేదుగానీ, మర్యాదపూర్వక దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన కింద అప్పడప్పుడు ఫత్వా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మర్యాదపూర్వక దుస్తుల నిబంధనకు కూడా సరైన వివరణ లేదా భాష్యం లేనందున అరెస్ట్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అందే ఫిర్యాదులు, దర్యాప్తు చేసే అధికారులనుబట్టి నిర్ణయం ఉంటుంది. -
సౌదీ మత పెద్దల షాకింగ్ ఫత్వా
రియాద్: గ్లోబల్ క్రేజీ గేమ్ పోకిమాన్ గో ఆటపై సౌదీ మత పెద్దలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న 'పోకీమాన్ గో ' కు వ్యతిరేకంగా సౌదీ ముస్లి గురువులు ఫత్వా జారీ చేశారు. ఇస్లామిక్ కు వ్యతిరేకంగా వున్నందువల్లే ఈ ఆటపై నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు. కాగా జీపీఎస్ బేస్డ్ పొకేమాన్ గో గేమ్ సృష్టిస్తున్న ప్రకంపనలు వరసగా ఒక్కో దేశాన్ని తాకుతున్నాయి. కాల్పనిక ప్రపంచానికి రియల్ వరల్డ్ కు ముడిపెడుతూ రూపొందిన క్రేజీ గేమ్ పై ఇప్పటికే ఇండోనేషియా దేశం సైనిక, పోలీసులు ఉద్యోగుల వాడకంపై పాక్షిక నిషేధం విధించింది. విధినిర్వహణలో ఈఆట ఆడడానికి వీల్లేదని ఆదేశాలుజారీ చేసిన సంగతి తెలిసిందే. -
పాక్ లో ఆ పెళ్లిళ్లకు ఓకే!
ఇస్లామాబాద్: ట్రాన్స్ జండర్ల వివాహాలకు అనుమతినిస్తూ పాకిస్తాన్ లో 50 మంది మత పెద్దలు(క్లరిక్ లు) ఫత్వా జారీ చేశారు. దీంతో ట్రాన్స్ జండర్ ను వివాహాం చేసుకోవడం ఇక పాక్ లో చట్టబద్దం కానుంది. తన్ జీమ్-ఇత్తేహాద్-ఐ-ఉమ్తత్ కు చెందిన మత పెద్దలు మగ లేదా ఆడా ఏదో ఒక లక్షణం కలిగిన ట్రాన్స్ జండర్ ను వివాహం చేసుకోవచ్చని, ఆడ, మగ లక్షణాలను కలిగిన ట్రాన్స్ జండర్స్ వివాహం చేసుకోవడానికి కుదరని చెప్పారు. ట్రాన్స్ జండర్స్ ను దోచుకోవడం చట్ట విరుద్ధమని చెప్పారు. తల్లిదండ్రుల వదిలేసిన ట్రాన్స్ జండర్స్ ను దేవుని వద్దకు రావాలంటూ ఆహ్వానించారు. అలాంటి తల్లిదండ్రులను శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. ట్రాన్స్ జండర్స్ ను అవమానించే సాధారణ పౌరులను శిక్షించాలని, సాధారణ ముస్లిం పౌరులలానే వారికి అంత్యక్రియలు జరిగేలా ఆదేశించారు. -
ఇతరుల వైఫై వాడితే కఠిన చర్యలు..
రియాద్: ఇంటర్ నెట్ కోసం ఇతరుల వైఫై(వైర్ లెస్ ఫెడిలిటీ)ని వారి అనుమతి లేకుండా వాడితే చోరీగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియాలో ఫత్వా జారీ చేశారు. వైఫై వాడకాన్ని చోరీగా పరిగణించాలని ఫత్వాలో అధికారులు పేర్కొన్నారు. సౌదీ అరేబియా రాజుకు సలహాలిచ్చే అధికారి అలీ అల్ హకామీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైఫై వాడాలనుకుంటే ఆయా వ్యక్తుల పర్మిషన్ తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హై స్కాలర్స్ కమిషన్ సభ్యుడు వెల్లడించారు. పార్కులు, ప్రైవేట్ షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ కార్యాలయాలలో పాస్ వర్డ్ లేకుండా ఉన్న వైఫై సౌకర్యాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునని, అలాంటి సందర్భాలలో ఇది నేరం కింద పరిగణించమని స్పష్టం చేశారు. ఇతర దేశాలలో ప్రభుత్వ నియమాలు, చట్టాలు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం ఫత్వా అంటే చట్టంతో సమానం. గతంలో కూడా మహిళలు ఫుట్ బాల్ మ్యాచ్ లు చూడటం, వారు కుర్చీలలో కూర్చోవటం, కొన్ని రకాల పండ్లను తినరాదని, ఏ వ్యక్తి కూడా మార్స్ మీదకు వెల్లకూడదని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫత్వాలు జారీ అయిన విషయం తెలిసిందే. -
సల్మాన్ రష్దీని చంపితే ఇప్పుడు 28 కోట్లు
టెహరాన్: ప్రముఖ ఆంగ్ల రచయిత, బ్రిటీష్ ఇండియన్ సల్మాన్ రష్దీని హత్య చేసిన వారికి ఇప్పుడు 28. 30 కోట్ల రూపాయలు లభిస్తాయి. వివాదాస్పదమైన సెటానిక్ వర్సెస్ నవలను రాసినందుకు ఆయనపై 1989, ఫిబ్రవరి 14వ తేదీన ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషన్ నాయకుడు అయతొల్లా రుహొల్లా ఖొమేని ఫత్వా జారీ చేసిన విషయం తెల్సిందే. ఆయనను, ఆ పుస్తకం ప్రచురణకు కారకులైన వారందరిని హత్య చేయాల్సిందిగా ఆ ఫత్వాలో పేర్కొన్న విషయమూ తెల్సిందే. ఈ ఫత్వా ప్రకారం సల్మాన్ రష్దీని చంపేసిన వారికి 19 కోట్ల రూపాయలు ఇస్తామని ఇరాన్‌కు చెందిన ఓ మత సంస్థ 2012లో ప్రకటించింది. ఆ మొత్తం ఇప్పుడు కాస్త 24 కోట్ల రూపాయలకు చేరుకొంది. ఆ ఫత్వా జారీచేసి 27 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 40 ఇరాన్ మీడియా సంస్థలు రష్దీని చంపేందుకు 4.30 కోట్ల రూపాయల విరాళాలను ఇటీవల ప్రకటించాయి. ఈ మొత్తం కలిపి 28.30 కోట్ల రూపాయలయ్యాయి. ఫత్వా జారీ చేసిన ఖొమేని చనిపోయినప్పటికీ ఆయన జారీ చేసిన ఫత్వా ఎప్పటికీ చనిపోదని ఇరాన్ అతివాదులు వాదిస్తున్నారు. ఫత్వా అమలు కోసం ప్రకటించిన రివార్డుకు విరాళాలు ప్రకటించిన మీడియా సంస్థల వివరాలను ప్రకటించిన సెమీ అఫీషియల్ ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తన వంతుగా 21.40 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. మీడియా సంస్థలన్నీ కలసి 4.30 కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించాయని ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ టెక్నాలజీ ప్రదర్శనలో నిర్వాహకుడు మన్సోర్ అమిరి వెల్లడించారు. ఆయన సెరాజ్ సైబర్‌స్పేస్ ఆర్గనైజేషన్‌కు అధిపతిగా పనిచేస్తున్నారు. భారత్‌లోని ముంబయిలో పుట్టి బ్రిటన్‌లో స్థిరపడిన సల్మాన్ రష్దీకి ఫత్వా జారీ అయినప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వమే ఆయనకు రక్షణ కల్పిస్తోంది. ఈ కారణంగా ఇస్లామిక్ దేశాలతో బ్రిటన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్దీ రాసిన సెనాటిక్ వర్సెస్ పుస్తకాన్ని జపాన్ భాషలోకి అనువదించిన రచయిత హితోషి ఇగరాషిని ఇస్లాం తీవ్రవాదులు కత్తితో పొడిచి చంపేశారు. రష్దీ పుస్తకాన్ని ప్రచురించిన నార్వే పబ్లిషర్‌ను కాల్చి చంపారు. ఇటలీ పబ్లిషర్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ పుస్తకానికి వ్యతిరేకంగా టర్కీలో జరిగిన విధ్వంసకాండలో 37 మంది మరణించారు. -
సెక్స్ బానిసల వినియోగంపై ఐఎస్ఐఎస్ ఫత్వా!
మహిళా బానిసలతో వారి యాజమానులు ఎలా శృంగారం జరుపాలనే విషయమై పూర్తి వివరణతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జారీచేసిన ఫత్వా (ఉత్తర్వు) ఒకటి వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోని ఇరాక్, సిరియాలో మహిళలపై పెచ్చుమీరుతున్న లైంగిక హింస జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఫత్వా ప్రాధాన్యం సంతరించుకుంది. బందీలుగా చిక్కిన మహిళల విషయంలో తాము పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఐఎస్ఐఎస్ ఈ ఫత్వా జారీచేసినట్టు కనిపిస్తున్నది. తమ నియంత్రణలోని ఇరాక్, సిరియాలో మహిళల లైంగిక బానిసత్వాన్ని సమర్థించేందుకు వీలుగా శతాబ్దాల కిందటి బోధనలకు ఆ గ్రూప్ కొత్త భాష్యం చెప్తున్నదని, ఈ విషయంలో చట్టబద్ధ ఉత్తర్వుగా ఫత్వాను జారిచేసిందని ముస్లిం స్కాలర్ ఒకరు తెలిపారు. ఒక మహిళ బానిసతో తండ్రి, కొడుకు ఇద్దరూ శృంగారం జరుపడం, ఒక యాజమాని తన బానిసలైన తల్లి, కూతురు ఇద్దరితోనూ లైంగికంగా గడుపడం నిషేధిస్తున్నట్టు ఈ ఫత్వా పేర్కొంది. అయితే ఒక మహిళకు ఇద్దరు యాజమానులు ఉంటే ఆ ఇద్దరూ ఆమెతో గడుపవచ్చునని, ఆమెను వారి ఉమ్మడి భాగస్వామ్య ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని ఫత్వా వెల్లడించింది. 12 ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన బాలికలు, మహిళలను అపహరించి.. వారిపై లైంగిక అకృత్యాలకు పాల్పడటం ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థీకృత చర్యగా మార్చిందని, ముఖ్యంగా ఉత్తర ఇరాక్‌లోని మైనారిటీ తెగ అయిన యాజిది మహిళలను పెద్ద ఎత్తున అపహరిస్తూ ఆగడాలకు పాల్పడుతున్నదని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అపహరించిన మహిళలను తన ఫైటర్లకు బహుమతిగా ఇవ్వడమో, లేక వారిని లైంగిక బానిసలుగా అమ్మివేయడమో ఐఎస్ఐఎస్ చేస్తున్నది. ఈ దుర్మార్గమైన కార్యకలాపాలను ఐఎస్ఐఎస్ బాహాటంగానే నిర్వహిస్తున్నది. ఇందుకోసం ఆ గ్రూపు ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి లైంగిక బానిసల నిర్వహణ అంశాన్ని పర్యవేక్షిస్తున్నది. గత ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ కబంధ హస్తాల నుంచి తప్పించుకొన్న 20 మంది యువతులు తాము ఎంతటి లైంగిక హింసను ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు వివరించారు. ఇస్లామిక్ స్టేట్‌కి చెందిన పరిశోధన, ఫత్వా కమిటీ 2015 జనవరి 29న ఈ ఫత్వా (64) జారీచేసింది. గత మేలో సిరియాలోని ఐఎస్ ఉన్నతాధికారి ఇంట్లో అమెరికా ప్రత్యేక బలగాలు జరిపిన దాడిలో దొరికిన భారీ పత్రాల్లో ఈ ఫత్వా కూడా ఉంది. -
ఆఫ్రిదిపై కామెంట్స్.. చిక్కుల్లో ఆర్షి
కోల్ కతా: పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో తనకు శారీరక సంబంధం ఉందని సంచలన ప్రకటన చేసిన మోడల్, బాలీవుడ్ నటి ఆర్షి ఖాన్ చిక్కుల్లో పడింది. ఆమెకు వ్యతిరేకంగా పాకిస్థాన్ లో ఫత్వా జారీ అయింది. పాక్ కు చెందిన మత సంస్థకు ఆమె ఫత్వాకు జారీచేసింది. తనకు ఫత్వా జారీ చేయడంపై ఆర్షి ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 'నాకు ఫత్వా జారీ చేయడం నిరుత్సాహం కలిగించింది. నాకు మద్దతుగా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాకిస్థాన్ ఇక ఇటువంటి చర్యలు మానుకోవాలి' అని ఆమె ట్వీట్ చేసింది. షాహిద్ ఆఫ్రిదితో తనకు శారీరక సంబంధం ఉందని ఆర్షిఖాన్.. సెప్టెంబర్ లో తన ట్విటర్ పేజీలో పోస్టు చేసింది. 'ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపా. ఎవరితోనైనా ఏకాంతంగా గడపాలంటే ఇండియా మీడియా పర్మిషన్ కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం' అంటూ సంచలన ట్వీట్ చేసింది. కాగా, ఆర్షిఖాన్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడే హక్కు ఎవరికీ లేదంటూ సోషల్ మీడియాలో ఆమెకు పలువురు మద్దతు తెలిపారు. -
మహిళల పేరుతో రేషన్ కార్డా కుదరదు..
బరేలీ: మహిళల పేరుతో రేషన్ కార్డు ఉండడానికి వీల్లేదని ఉత్తర ప్రదేశ్‌లో సన్నీ బరేల్వీ మర్కాజ్ దర్గా అల్ హజరత్ తాజాగా ఫత్వా జారీ చేసింది. మహిళ పేరుతో రేషన్ కార్డా.. కుదరదు..ముమ్మాటికీ కుదరదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఫ్తీ మహమ్మద్ సలాం నూరీ.. ఈనేపథ్యంలోనే మహిళల పేరుతో రేషన్ కార్డుకు దరఖాస్తు చేయొద్దని తమ శ్రేణులను ఆదేశించామన్నారు. భారతీయ, ఇస్లాం సంస్కృతి ప్రకారం పురుషులు మాత్రమే కుటుంబ యజమానిగా ఉండాలని, ఇంటిని స్వర్గసీమగా మార్చే బాధ్యత స్త్రీలదని పేర్కొన్నారు. దీని కనుగుణంగా చట్టంలో మార్పులు చేయాల్సిందిగా కొంతమంది పెద్దలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కోరనున్నామని కూడా నూరీ తెలిపారు. కుటుంబం పెద్దగా ఉన్న మహిళ పేరుతో కొత్త రేషన్ కార్డులు జారీ చేయొచ్చని నిబంధనను ఫుడ్ సెక్యూరిటీ బిల్లులో ఆమోదించిన సంగతి తెలిసిందే.