సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ కేంద్రంగా నడిచే ప్రముఖ ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ తాజాగా మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు, పురుషులు అల్లాను కాకుండా మరే దేవుడిని ప్రార్థించరాదని దారుల్ ఉలూమ్ దియోబంద్ శనివారం ఫత్వా విడుదల చేసింది. అల్లాను కాకుండా మరో దేవుడిని ఆరాధించిన వారిని భవిష్యత్‌లో ముస్లింలుగా గుర్తింలేమని ఆ సంస్థ పేర్కొంది.
హిందువుల ముఖ్య పర్వదినాల్లో ఒకటైన దీపావళి సందర్భంగా వారణాసిలో పలువురు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించిన నేపథ్యంలో దారుల్ ఉలూమ్ సంస్థ ఈ ఫత్వా జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇరు వర్గాల మధ్య మత కలహాలు తగ్గించేందుకు ముస్లిం మహిళా ఫౌండేషన్, విశాల్ భారత్ సంస్థాన్ సంస్థలు.. సంయుక్తంగా దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంపై దారుల్ ఉలూమ్ మండిపడింది.
‘‘శ్రీరాముడు హిందువులకు మూలపురుషుడు.. రాముడిని పూజించే వారు.. తమ పేరును మతాన్ని మార్చుకోవడం సాధ్యమా?’’ ఇరు వర్గాల మధ్య కలహాలు తగ్గించాలంటే రాముడిని పూజించడం ఒక్కటే కాదు.. మనుషుల మధ్య ఔదార్యం, ప్రేమ కలగాలి.. అని దారుల్ సంస్థ సభ్యుడు నజీమ్ అన్సారీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ముస్లిం మహిళలు, పురుషులు తమ వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ సంస్థ గురువారం ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే.
If anyone worships any god except Allah they don't remain Muslim-Ulema,Darul Uloom on Muslim women who performed aarti on Diwali in Varanasi pic.twitter.com/IgaLNcenGo
— ANI UP (@ANINewsUP) October 21, 2017
Comments
Please login to add a commentAdd a comment