Darul Uloom Deoband
-
‘బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోకండి’
లక్నో : బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దంటూ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూమ్ ధియోబంద్ ఫత్వాను జారీ చేసింది. బ్యాంకుల్లో పని చేస్తున్న చాలా మంది అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నారని పేర్కొంది. అక్రమ ధనార్జన చేస్తూ ఉన్నత కుటుంబాలకు చెందిన(వరుడు లేదా వధువు) వారిని వివాహం చేసుకోవాలనుకోవడం కన్నా దారుణం మరొకటి లేదని చెప్పింది. వివాహ సంబంధాలు వెతుకుతున్న ఓ యువకుడికి ఓ మ్యాచ్ వచ్చిందని పేర్కొన్న దారుల్ సంస్థ.. యువతి తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారని చెప్పింది. ఉద్యోగం ద్వారా అక్రమంగా అర్జించిన మొత్తాన్ని వారు వరుడికి ఇస్తానని ఆఫర్ చేశారని వెల్లడించింది. అలాంటి కుటుంబంలోని అమ్మాయిని తాను చేసుకోవచ్చా? అని సదరు యువకుడు సంస్థను ఆశ్రయించినట్లు తెలిపింది. ఆ కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకోవద్దని యువకుడికి చెప్పినట్లు వెల్లడించింది. అక్రమ ధనార్జనతో ఎదిగిన వ్యక్తికి మంచి లక్షణాలు ఉండవని, మోరల్స్‌ను పాటించరని పేర్కొంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలని సూచింనట్లు వివరించింది. ఈ నిబంధనలు ఎక్కడివి? - ఇస్లామిక్ చట్టం ప్రకారం వడ్డీకి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. దీన్ని ఇస్లామిక్ చట్టంలో ‘రిబా’ అని పిలుస్తారు. - వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సంపాదించిన మొత్తాన్ని కూడా ఇస్లామిక్ చట్టం అక్రమ ధనం(హరామ్)గా భావిస్తుంది. ఈ రెండు సూత్రాలను ఖురాన్ నుంచి ఇస్లామిక్ చట్టంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీటిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇస్లామిక్ బ్యాంకులు సైతం ‘వడ్డీ లేని బ్యాంకింగ్’ సూత్రం మీద ఆధారపడి పని చేస్తాయి. రుణ దారుల నుంచి బ్యాంకులు తిరిగి తీసుకున్న మొత్తాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టి లాభాలు అర్జిస్తే దాన్ని సరైన ఆదాయం(షరియత్)గానే భావిస్తారు. ప్రపంచంలోని అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయి. చైనా, యూకే, అమెరికా, జర్మనీ దేశాల్లో కూడా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. -
ముస్లింలకు కొత్త ఫత్వా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ కేంద్రంగా నడిచే ప్రముఖ ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ తాజాగా మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు, పురుషులు అల్లాను కాకుండా మరే దేవుడిని ప్రార్థించరాదని దారుల్ ఉలూమ్ దియోబంద్ శనివారం ఫత్వా విడుదల చేసింది. అల్లాను కాకుండా మరో దేవుడిని ఆరాధించిన వారిని భవిష్యత్‌లో ముస్లింలుగా గుర్తింలేమని ఆ సంస్థ పేర్కొంది. హిందువుల ముఖ్య పర్వదినాల్లో ఒకటైన దీపావళి సందర్భంగా వారణాసిలో పలువురు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించిన నేపథ్యంలో దారుల్ ఉలూమ్ సంస్థ ఈ ఫత్వా జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇరు వర్గాల మధ్య మత కలహాలు తగ్గించేందుకు ముస్లిం మహిళా ఫౌండేషన్, విశాల్ భారత్ సంస్థాన్ సంస్థలు.. సంయుక్తంగా దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంపై దారుల్ ఉలూమ్ మండిపడింది. ‘‘శ్రీరాముడు హిందువులకు మూలపురుషుడు.. రాముడిని పూజించే వారు.. తమ పేరును మతాన్ని మార్చుకోవడం సాధ్యమా?’’ ఇరు వర్గాల మధ్య కలహాలు తగ్గించాలంటే రాముడిని పూజించడం ఒక్కటే కాదు.. మనుషుల మధ్య ఔదార్యం, ప్రేమ కలగాలి.. అని దారుల్ సంస్థ సభ్యుడు నజీమ్ అన్సారీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ముస్లిం మహిళలు, పురుషులు తమ వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ సంస్థ గురువారం ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. If anyone worships any god except Allah they don't remain Muslim-Ulema,Darul Uloom on Muslim women who performed aarti on Diwali in Varanasi pic.twitter.com/IgaLNcenGo — ANI UP (@ANINewsUP) October 21, 2017 -
ముస్లింలకు దారుల్ ఉలూమ్ కొత్త ఫత్వా
దియోబంద్ (ఉత్తర్‌ప్రదేశ్) : భారతదేశంలోని ముస్లింలెవరూ సోషల్ మీడియాలో వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను పెట్టరాదంటూ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ గురువారం ఫత్వా జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని షరణ్‌పూర్ జిల్లాలో ఉన్న దారుల్ ఉలూమ్ సంస్థ.. దేశవ్యాప్తంగా ఇస్లామిక్ సెమినార్లు నిర్వహిస్తుంది. సోషల్ మీడియాలు ఫొటోను పోస్ట్ చేయడం అనేది ఇస్లామ్‌కు విరుద్ధమని ఆ సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయడం తప్పంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ చీఫ్ షహనవాజ్ ఖాద్రీ ట్విటర్లో ట్వీట్ చేశారు. దీనిపై దారుల్ ఉలూమ్ చేసిన ఫత్వాను ఆయన సమర్థించారు. Unnecessary uploading of pictures on social media is wrong. Fatwa of Darul Uloom Deoband is appropriate: Shahnawaz Qadri,Darul Uloom Deoband — ANI UP (@ANINewsUP) October 19, 2017 -
హెయిర్ కట్, ఐబ్రోస్ చేయించుకోవద్దు
గడ్డం పెంచుకునేందుకు అనుమతించకపోతే ఉద్యోగం వదిలేయడంటూ.. ఇస్లామిక్ విశ్వ విద్యాలయంలో మొబైల్ ఫోన్ల నిషేధం వంటి ఫత్వాలు జారీచేసిన దారుల్ ఉలూమ్ దియోబాంద్ తాజాగా మరో కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళలు జుట్టు కట్ చేసుకోవడంతో పాటుగా, ఐబ్రోస్ చేయించుకోవడంపై వ్యతిరేకంగా దారుల్ ఈ ఫత్వా జారీచేసింది. దారుల్-ఉలూమ్ దియోబాంద్ మౌలానా ఖాజ్మి ఈ విషయాన్ని తెలిపారు. మహిళలు జుట్టు కట్ చేసుకోవడం, ఐబ్రోస్ చేయించుకోవడంపై ప్రస్తుత కాలంలో సాధారణంగా మారిపోయింది. అయితే వీటిపై దారూల్ ఉలూమ్ ఈ ఫత్వా జారీచేయడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ఫత్వా ప్రకారం ముస్లిం యువతలు, మహిళలు ఇంక జుట్టు కట్ చేసుకోవడానికి వీలుండదు. -
'కన్న తల్లి కన్నా.. మాతృభూమి తక్కువేం కాదు'
రాజ్ కోట్: ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ స్లోగన్‌ను పలుకొద్దంటూ దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీ చేయడం పై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మాతృ భూమి కోసం 'భారత్ మాతా కీ జై' అని నినదించడం ప్రతి ఒక్కరి హక్కని తెలిపారు. ఇది ఎన్నో భావోద్వోగాలతో ముడిపడి ఉన్న అంశం అని పేర్కొన్నారు. కన్న తల్లిలాంటి దేశం కోసం నినదించడం ప్రతి మనిషి హక్కు అని తెలిపారు. కన్న తల్లి కన్నా మాతృభూమి ఏమీ తక్కువ కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదించడంపై దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఆ నినాదాన్ని ఉచ్చరించబోమని వర్సిటీ పీఆర్ఓ అష్రాం ఉస్మానీ పేర్కొన్నారు. తామంతా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నామని, ‘హిందుస్తాన్ జిందాబాద్’, ‘మద్రే వతన్’ అంటూ నినదిస్తామన్నారు. మనుషులు మాత్రమే మనుషులకు జన్మనివ్వగలరని, అలాంటప్పుడు దేశాన్ని తల్లిగా పేర్కొంటూ ఎలా నినాదాలిస్తారని ప్రశ్నించారు. భారత్ మాతా కీ జై ఉచ్చారణ మాతృభూమిపై ప్రేమావేశానికి నిదర్శనమని దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా నినదించాలని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.