గడ్డం పెంచుకునేందుకు అనుమతించకపోతే ఉద్యోగం వదిలేయడంటూ.. ఇస్లామిక్ విశ్వ విద్యాలయంలో మొబైల్ ఫోన్ల నిషేధం వంటి ఫత్వాలు జారీచేసిన దారుల్ ఉలూమ్ దియోబాంద్ తాజాగా మరో కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళలు జుట్టు కట్ చేసుకోవడంతో పాటుగా, ఐబ్రోస్ చేయించుకోవడంపై వ్యతిరేకంగా దారుల్ ఈ ఫత్వా జారీచేసింది. దారుల్-ఉలూమ్ దియోబాంద్ మౌలానా ఖాజ్మి ఈ విషయాన్ని తెలిపారు.
మహిళలు జుట్టు కట్ చేసుకోవడం, ఐబ్రోస్ చేయించుకోవడంపై ప్రస్తుత కాలంలో సాధారణంగా మారిపోయింది. అయితే వీటిపై దారూల్ ఉలూమ్ ఈ ఫత్వా జారీచేయడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ఫత్వా ప్రకారం ముస్లిం యువతలు, మహిళలు ఇంక జుట్టు కట్ చేసుకోవడానికి వీలుండదు.
Comments
Please login to add a commentAdd a comment