Aarti
-
మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని రవి తెలపగా.. తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆర్తి ఆవేదన వ్యక్తం చేసింది. విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని రవి పేర్కొంటుండగా ఇప్పటికీ తన భర్తతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఆర్తి అంటోంది. రవిని ముప్పుతిప్పలు పెట్టిన ఆర్తి?ఇంతలో వీరి విడాకులకు ఈవిడే కారణమంటూ ఓ సింగర్ పేరు తెరపైకి రావడం, ఆమె స్పందించి తనను మధ్యలోకి లాగొద్దని హెచ్చరించడమూ జరిగింది. ఇక జయం రవిని ఆర్తి ముప్పుతిప్పలు పెట్టిందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. అతడి సోషల్ మీడియా ఖాతాలన్నీ ఆర్తి ఆధీనంలో ఉన్నాయని, వాటిని అతడికి అప్పగించకుండా ఇబ్బందిపెడుతోందని సదరు వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో ఆర్తి తాజాగా సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేసింది.మౌనంగా ఉన్నానంటే..'నా వ్యక్తిగత జీవితం గురించి నానారకాలుగా ప్రచారం జరుగుతోంది. నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అయినా మౌనంగా ఉంటున్నానంటే నేను తప్పు చేశానని అర్థం కాదు. కేవలం హుందాగా వ్యవహరించాలనుకున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాం అని అతడు లేఖ రిలీజ్ చేసినప్పుడు నేను నిజంగానే షాకయ్యాను.అదే నాకు ముఖ్యంఅప్పుడు నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో తనతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఉందేమోనని ఎదురుచూస్తున్నాను. వివాహవ్యవస్థను నేను గౌరవిస్తాను. ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే బహిరంగ చర్చలను నేను ఎంకరేజ్ చేయను. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం అని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్తి పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) చదవండి: సినిమాల్లోకి రావాలనుకుని టీవీలో సెటిలయ్యా,.. అనుకున్నంత ఈజీ కాదు! -
సాక్ష్యాలన్నీ బయటపెడతా.. హీరో భార్యకు సింగర్ వార్నింగ్!
ప్రముఖ నటుడు జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ భార్త ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆరోపిస్తుంది. అంతేకాదు జయం రవి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమేనని జయం రవి కొట్టేశాడు. తాజాగా సింగర్ కెనిషా కూడా జయం రవి విడాకుల ఇష్యూపై స్పందిస్తూ అతని భార్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.సింగర్‌తో సహజీవనంజయం రవి గత కొన్నాళ్లుగా భార్య ఆర్తితో కలిసి ఉండడం లేదు. అతను ఒక్కడే వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో సింగర్ కెనిషాతో ప్రేమలో పడ్డాడని..ఆమె కారణంగానే ఆర్తికి దూరంగా ఉంటున్నాడని కోలీవుడ్‌లో రూమర్స్ వచ్చాయి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అటు జయం రవి కానీ, ఇటు కెనిషా కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. తాము వృత్తిపరంగానే కలిశామని చెబుతున్నారు. అనవసరంగా మా విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. నా విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.సాక్ష్యాలన్నీ బయటపెడతా: సింగర్జయం రవి విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని చెబుతోంది. ఒక థెరపిస్ట్‌గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడు. ట్రీట్మెంట్ కోసం జూన్‌లో నా దగ్గరకు వచ్చాడు. ఆయనతో నాకు వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉంది. ఆయన స్నేహితుడు, క్లయింట్ కూడా. అంతకు మించి ఏమి లేదు. నా కారణంగానే విడాకులు తీసుకుంటున్నరనేది పచ్చి అబద్దం. రవి తన భార్యకు విడాకులు నోటీసులు పంపిన విషయం కూడా నాకు తెలియదు. నేను ఇచ్చిన ట్రిట్మెంట్, థెరపీకి సంబంధించిన నోట్స్‌తో పాటు అన్ని సాక్ష్యాలు కోర్టుకు ఇవ్వగలను. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదంటూ పరోక్షంగా ఆర్తికి వార్నింగ్ ఇచ్చింది. కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్‌లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. ఈ నెల 9న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. -
20 ఏళ్లు పట్టినా సరే, వెనక్కు తెగ్గే ప్రసక్తే లేదు: జయం రవి
భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ ఆ గొడవలు మితిమీరినా, మనస్పర్థలు ఎక్కువైనా వారు విడిపోవడానికి దారి తీస్తాయి. తమిళ హీరో జయం రవి విషయంలోనూ ఇదే జరిగింది. ఇంట్లో గొడవల కారణంగా కొంతకాలంగా వీరు విడిగానే ఉంటున్నారు. ఇంతలో జయం రవి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. అయితే తనకు ఒక్క మాట కూడా చెప్పకుండానే విడాకులు ప్రకటించాడని ఆర్తి మండిపడింది. గొడవలు పరిష్కరించుకుందామనుకున్నానని, ఇప్పటికీ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానంది.ఆమెకు రాజీ పడాలన్న ఉద్దేశం లేదుబ్రదర్ సినిమా ఆడియో లాంచ్ అనంతరం ఓమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయం రవికి ఇదే విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఆర్తికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా? అన్నదానిపై హీరో స్పందిస్తూ.. నాకు విడాకులు కావాలి. ఒకవేళ ఆర్తి విడాకులు వద్దనుకుంటే, తను అన్నట్లుగా కలిసుందామనుకుంటే ఇంతవరకు నన్నెందుకు కలవలేదు. నేను పంపించిన రెండు లీగల్ నోటీసులకు ఎందుకు స్పందించలేదు? తనకు రాజీ పడాలన్న ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదే! అని బదులిచ్చాడు.రెండింటికీ ఏం సంబంధం?సింగర్, స్పిరిచ్యువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందిస్తూ.. అసలు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయి? అనవసరంగా మూడో వ్యక్తిని ఇందులోకి లాగుతున్నారు. నేను కెనీషాతో కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం మంచి లొకేషన్ వెతుకుతున్నాం. నా విడాకులకు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ పుకార్ల వల్ల మా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి అని తెలిపాడు.పోరాడుతూనే ఉంటాపిల్లల గురించి మాట్లాడుతూ.. పిల్లల కస్టడీ నాకే కావాలి. పదేళ్లయినా, ఇరవయ్యేళ్లు పట్టినా సరే.. ఆరవ్, అయాన్లు నాకు దక్కేవరకు పోరాడతాను. వాళ్లే నా సంతోషం. ఆరవ్తో కలిసి ఆరేళ్ల క్రితం టిక్ టిక్ టిక్ మూవీ చేశాను. ఆ సినిమా సక్సెస్‌మీట్‌లో ఎంత సంతోషపడ్డానో! ఇప్పుడు నిర్మాతగా మారి తనతో సినిమా తీయాలనుకుంటున్నాను. విడాకులంటారా? ఈ విషయంలో నేను వెనక్కు తగ్గను అని కుండబద్ధలుట్టేశాడు.చదవండి: నా అనుమతి లేకుండా ముఖ్యమైన సీన్స్ కాపీ చేశారు, బాధేసింది! -
సతీమణి ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి (ఫోటోలు)
-
రేస్ వాక్‌లో ఆర్తికి కాంస్యం
లిమా (పెరూ): ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్లో భారత అథ్లెట్ ఆర్తి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 17 ఏళ్ల ఆర్తి 10,000 మీటర్ల దూరాన్ని 44 నిమిషాల 39.39 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 47ని:21.04 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జుమా బైమా (చైనా; 43ని:26.60 సెకన్లు) స్వర్ణం, మీలింగ్ చెన్ (చైనా; 44ని:30.67 సెకన్లు) రజతం గెలిచారు. -
మహాకాళేశ్వరునికి రక్షాబంధనం... అలరిస్తున్న వీడియో
దేశవ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.నేటి(సోమవారం) తెల్లవారుజామున 2.30 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించడంతోపాటు అందంగా అలంకరించిన రాఖీని కట్టారు. 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించారు. ఈ లడ్డూలను ఈరోజు భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఆలయ పురోహితులు పండిట్ ఆశిష్ పూజారి, పండిట్ వికాస్ పూజారి భస్మ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. #WATCH उज्जैन (मध्य प्रदेश): सावन माह के 5वें सोमवार के अवसर पर श्री महाकालेश्वर मंदिर में भक्तों की भीड़ उमड़ी। pic.twitter.com/SSjHKAk6eR— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 -
భస్మహారతికి పోటెత్తిన భక్త జనం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల మహాకాళేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం(ఉత్తరాదిన)లోని రెండవ సోమవారం(నేడు) సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు.ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు ఉజ్జయినికి తరలివస్తుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం రాకకు ముందే ఆలయ ప్రాంగణం అంతటా రంగులు వేశారు. ఈ మాసంలో ఆలయంలో నిర్వహించే మహాశివుని ఊరేగింపు వైభవంగా జరుగుతుంటుంది. దీనిని చూసేందుకు భక్తజనం అమితమైన ఆసక్తి చూపిస్తారు. Ujjain, MP: "Thousands of devotees are at Baba Mahakal's court, eager to catch a glimpse of him. This will continue from morning until evening," says Ashish (Priest) pic.twitter.com/sFW0U2Tquo— IANS (@ians_india) July 29, 2024 -
మూడోసారి తండ్రి కాబోతున్న హీరో? వీడియో వైరల్
హీరో శివకార్తికేయన్ త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. శివకార్తికేయన్- ఆర్తి దంపతులకు ఇదివరకే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలాకాలం తర్వాత వీరు మూడో బిడ్డ కోసం ప్లాన్ చేశారన్నది లేటెస్ట్ గాసిప్. తాజాగా ఓ అభిమాని తనయుడి బర్త్‌డేకు శివకార్తికేయన్ భార్య ఆర్తి, కూతురు ఆరాధనతో సహా వెళ్లాడు. జూనియర్ శివకార్తికేయన్?అయితే ఈ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. దీంతో జనాలు అది బేబీ బంప్ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలో మరో జూనియర్ శివకార్తికేయన్ రాబోతున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా శివకార్తికేయన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే 2010లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్ దాస్ జన్మించారు.పెళ్లి తర్వాతే సినిమాల్లోకి..శివకార్తికేయన్ హీరో మాత్రమే కాకుండా సింగర్ అన్న విషయం తెలిసిందే! ఆ మధ్య ఆరాధాన సైతం కనా అనే కన్నడ మూవీలో వాయడి పేట పుల్ల అనే సాంగ్ ఆలపించి సెన్సేషన్ అయింది. ఇక శివకార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన అమరన్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో అతడు మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా కనిపించనున్నాడు. తర్వాత ఏఆర్ మురుగదాస్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. Recent video of our #Prince @Siva_Kartikeyan anna , #AarthiSK Anni & little angel #AaradhanaSK on a birthday function🤩🎉Extremely happy to see our lovely #AarthiSK Anni pregnant 🥳😇Very much excited to welcome 3rd little one👶🏻❤🧿#PrinceSK #GuganDossSK pic.twitter.com/FUf11Ki8EP— SK THANGACHI (@jannathulrahmat) May 30, 2024 చదవండి: పిచ్చి కూతలు కూసేముందు నీ కాపురమేమైందో చూసుకో: నటి -
అప్పుడు సెహ్వాగ్‌కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం! (ఫొటోలు)
-
అప్పుడు సెహ్వాగ్‌కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం!(ఫొటోలు)
-
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ భామ ఆర్తి చాబ్రియా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్తను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆర్తి చాబ్రియాకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ఆస్ట్రేలియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీని 2019లో వివాహం చేసుకుంది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
యమునా హారతికి పోటెత్తిన జనం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే గంగా హారతి మాదిరిగా ఢిల్లీలోని వాసుదేవ్ ఘాట్‌పై యుమునా హారతి ప్రారంభమయ్యింది. ఢిల్లీ ప్రజలకు యమునా నదిపై ఉన్న ఆరాధనా భావాన్ని ఇది మరింత పెంపొందించనుంది. మార్చి 20న సాయంత్రం వేళ వాసుదేవ్ ఘాట్‌పై తొలిసారిగా యమునా హారతి కార్యక్రమం జరిగింది. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రస్తుతానికి యమునా నది ఒడ్డున వారానికి రెండు రోజులు అంటే మంగళవారం, ఆదివారం సాయంత్రం వేళల్లో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. తరువాత క్రమంగా మిగిలిన రోజుల్లోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యమునా నది ఒడ్డున నిర్మించిన వాసుదేవ్ ఘాట్ ఇప్పుడు కాశీలోని ఘాట్లను తలపిస్తోంది. ప్రజలు కూడా ఈ ఘాట్‌ను వీక్షించేందుకు తరలివస్తున్నారు. యమునా నది ఒడ్డున సంప్రదాయబద్ధంగా నిర్వహించిన తొలి హారతి కారక్రమం విజయవంతంగా జరిగింది. మరోవైపు ఈ వాసుదేవ్ ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి యమునా హారతి వీక్షించేందుకు వచ్చే భక్తుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. -
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
మోడల్స్‌తో వ్యభిచారం.. నటి అరెస్ట్
ముంబైలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సినిమాలో అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు, మోడల్స్‌ను వేశ్య వృత్తిలోకి దింపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. పక్కా సమాచారంతో దాడులు జరిపగా ఈ తతంగమంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే ఆర్తీ మిట్టల్‌ను అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో ఇద్దరు మోడల్స్‌ను రక్షించి పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. నిందితురాలు ఆర్తి మిట్టల్ సినిమా అవకాశాలు, డబ్బు ఆశ చూపి వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ మనోజ్ సుతార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. Maharshtra | Mumbai Crime Branch Unit 11, Dindoshi police busted a sex racket running in Goregaon area. Two models were rescued from the spot and a 30-year-old casting director, Aarti Mittal was arrested in this case: Mumbai Crime Branch — ANI (@ANI) April 17, 2023 -
విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి..
ఈ మధ్యకాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరిని గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. అప్పటి వరకు బాగానే చలాకీగా ఉన్నవారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వారు అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు. సైలెంట్ హార్ట్ ఎటాక్‌లతో అక్కడికక్కడే అర్థాంతరంగా తనవు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జాన్‌పూర్‌లోని బెలాసిన్ గ్రామంలో సోమవారం రామ్‌లీలా నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ అనే కళాకారుడు శివుడి పాత్ర వేశారు. నాటకం మధ్యంలో పూజారి హరతి ఇస్తున్న సమయంలో శివుడి వేషధారణలో ఉన్న వ్యక్తి వేదికపైనే అమాంతం కుప్పుకూలిపోయాడు. గమనించిన పక్కనున్న వారు అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చదవండి: మైనర్ల వివాహం వైరల్.. విస్తుపోయే విషయాలు దీనికి సంబంధించిన వీడియోన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మరణించిన రామ్ ప్రసాద్ అలియాస్ చబ్బన్ పాండే ఆరేళ్లుగా ఈ శివుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇటీవల ప్రదర్శన ఇస్తూ హనుమంతుడు, రావణుడు పాత్రలు పోషిస్తున్న ఇద్దరు కళాకారులు మరణించిన విషయం తెలిసిందే. आरती के दौरान अचानक मंच पर गिर पड़ा शख्स | Unseen India pic.twitter.com/M8wdUhu1NF — UnSeen India (@USIndia_) October 11, 2022 -
పీయూష్ గోయల్ ఇంట్లో ప్రధాని మోదీ సందడి, గణపయ్యకు ‘హారతి’
సాక్షి, న్యూఢిల్లీ: వినాయక చవితి ఉత్సవాలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు గణపయ్య పూజలు అందుకోనున్నారు. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. అక్కడ తొలిరోజు గౌరీ తనయుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ చతుర్థి సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతంలోని ఓ శ్లోకాన్ని సైతం ఆయన షేర్ చేశారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాక్షించారు. జ్ఞానానికి ప్రతీక అయిన మంగళమూర్తి గణేషుడు అందరికీ మంచి చేయాలని కోరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘గణపతిబప్పా మోరియా’ అంటూ ట్వీట్ చేశారు. ఆగస్టు 31 మొదలైన లంబోదరుడి ఉత్సవాలు సెప్టెంబర్ 9న ముగియనున్నాయి. గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నడుమ కొనసాగిన గణనాథుడి వేడుకలు ఈసారి పునర్వైభవం సంతరించుకోనున్నాయి. (చదవండి: కిడ్నాప్ కేసులో ఆరోపణలు.. శాఖ మార్చిన కాసేపటికే బిహార్ మంత్రి రాజీనామా) -
వైట్‌హౌస్‌లో భారతీయ ఆరతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్‌ను నామినేట్ చేయడంతో ‘ఆ పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలు’ అనే ప్రశంసలతో పాటు, ‘ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది... దిల్లీలో జన్మించింది ఆరతి ప్రభాకర్. తన మూడవ యేట కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. టెక్సాస్‌లోని లబ్బక్ సిటీలో పెరిగింది. ఆరతికి అమ్మ ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన విషయాలు చెబుతుండేది. ‘నీకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకోవాలి’ అని ఆమె తరచుగా చెప్పే మాట ఆరతి మనసులో బలంగా నాటుకుపోయింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ఆరతి. 34 ఏళ్ల వయసులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్స్ అండ్ టెక్నాలజీ (నిస్ట్)కి నాయకత్వం వహించింది. ‘నిస్ట్’కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. ‘నిఫ్ట్’ తరువాత రెచెమ్ (ఏరోస్పేస్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ) కార్పోరేషన్‌కు సీనియర్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ(డర్ప)కి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఆమె కెరీర్లో మరో ఘనతగా చెప్పుకోవాలి. రక్షణకు సంబంధించి భవిష్యత్కాల సాంకేతిక జ్ఞానానికి సంబంధించిన అధ్యయనం, ఆవిష్కరణలకు సంబంధించి అమెరికాలో ఇది శక్తివంతమైన సంస్థ. దీనికి నాయకత్వం వహించడం చిన్న విషయమేమీ కాదు. పెంటగాన్ ‘బ్లూ స్కై రిసెర్చ్ ఏజెన్సీ’గా ప్రసిద్ధి పొందిన ఈ సంస్థకు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ఊతం ఇచ్చింది ఆరతి. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... తాను కౌమారంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ‘ఆ సమయంలో కూడా ఎప్పటిలాగే ఉండేది తప్ప, ఏవో విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడేది కాదు. ఆ విషాద ప్రభావాన్ని నానై చూపించేది కాదు. ఒకానొక దశలో ఆమెకు నేను, నాకు ఆమే ప్రపంచం అన్నట్లుగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే మా అమ్మ అసాధారణమైన అమ్మ. సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టం. ఆ సేవాదృక్పథం ఆమెను ఎప్పుడూ చురుకుగా ఉండేలా చేసేది’ అని తల్లిని గుర్తుచేసుకుంటుంది ఆరతి. ప్రస్తుత విషయానికి వస్తే... ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే బాధ్యతను స్వీకరించబోతుంది ఆరతి. ఆమె గురించి అమ్మ మాటల్లో చెప్పాలంటే ‘సాహసం మూర్తీభవించే అమ్మాయి’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల్లో చెప్పాలంటే... ‘ప్రతిభావంతురాలైన, గౌరవనీయ శాస్త్రవేత్త’ అరవై మూడు సంవత్సరాల ఆరతి ప్రభాకర్...సెనేట్ అమోదముద్ర వేస్తే వైట్‌హౌస్ ఓఎస్టీపీ (ఆఫీస్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పాలసీ) ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టబోయే తొలి భారత సంతతి మహిళగా రికార్డ్ సృష్టిస్తుంది. ఆమెకు అభినందనలు. -
అమర్నాథ్ పూజలు జియో టీవీలో..
జమ్మూ: అమర్నాథ్ క్షేత్రానికి సంబంధించిన పూజలు జియో టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. లైవ్ స్ట్రీమింగ్ అవసరమైన పరికరాలను ఇప్పటికే జియో కంపెనీ అక్కడికి తరలించింది. కశ్మీర్‌లోని భౌగోళిక పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పటికీ, వాటిని విజయవంతంగా అక్కడికి చేర్చగలిగింది. ఈ నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ క్షేత్ర బోర్డు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం పూజలను లైవ్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. పూజ, హవనం, ప్రసాదం వంటి వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. అక్కడ ఉండే పూజారులు బుక్ చేసుకున్న వారి పేరు మీద పూజ జరిపిస్తారని పేర్కొన్నారు. ప్రసాదం నేరుగా ఇంటికే వచ్చేలా డెలివరీ సదుపాయం తీసుకొచ్చినట్లు చెప్పారు. కోట్లాది మంది భక్తుల కోసం పూజాది కార్యక్రమాలన్నింటిని జియో టీవీకి చెందిన సర్వీసుల ద్వారా దైవానుభూతి కలిగించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను ఆ క్షేత్ర బోర్డు రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
స్వీట్ ఎక్స్పెరిమెంట్
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. ఒక్కో సమస్య కొత్తదారిలో నడిపిస్తుంది కూడా. అలా ఆర్తి తనకు తానుగా వేసుకున్న కొత్త దారి చక్కెర అంత తియ్యగా ఉంది. చక్కెర తినలేని వాళ్ల కోసం చక్కెర లేని తీపి రుచులను అందిస్తోంది ఆర్తి. చక్కెర తినలేని తన జీవితాన్ని తియ్యగా మలుచుకుంది. చెవులకు ఏమైంది! ఆర్తి రస్తోగి బెంగళూరమ్మాయి. డయాబెటిస్ ఆ ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంది. రకరకాల ఆహార నియమాలు పాటించక తప్పదు. ఇంటిల్లి పాదీ దేనినీ సంతోషంగా తినడానికి వీల్లేదు. ‘ఇది తింటే షుగర్ లెవెల్స్ పోతాయి, అది తింటే బరువు పెరిగి ఇతర సమస్యలకు కారణమవుతుంది...’ అంటూ నోరు కట్టుకుని రోజులు వెళ్లదీయడమే. ఇక చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు అయితే దగ్గరగా చూడడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. పిల్లల దృష్టి వాటి మీద పడిందంటే వాటిని మనం తినకూడదని నచ్చచెప్పాలి, పిల్లల మనసు గాయపడుతుంది. అందుకే ఇంట్లో అవేవీ కనిపించడానికి వీల్లేనంత నియమానుసారంగా పెంచుకొచ్చారు అమ్మానాన్నలు. అలా ఆర్తి గాజు బొమ్మలా పెరిగిందని చెప్పాలి. అందరిలాగానే స్కూలుకెళ్లి చదువుకుంది. తినగలిగిందేదో తింటూ కాలేజ్ చదువు పూర్తి చేసింది. కారణం ఏమిటో తెలియదు, ఇరవ మూడేళ్ల వయసులో ఆమెకు వినికిడి తగ్గడం మొదలైంది. ఏ డాక్టరూ కారణం ఇదని తేల్చలేకపోయారు. డయాబెటిస్ కారణంగా ఎదురైన అనుబంధ సమస్యలుగానే గుర్తించారు. వినికిడి ఎనభై శాతం తగ్గిందని మాత్రం నిర్ధారించగలిగారు. ఉన్న ఇరవై శాతం వినికిడితోనే ఉద్యోగం తెచ్చుకుంది. మాటలు కనిపించేవి ఆర్తి సంపాదించింది మామూలు ఉద్యోగం కాదు. పెద్ద కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం. ఆమె ఆరోగ్యంతో ఎదురీది జీవితంలో నిలబడడంలో ఆమె వంతు లోపమేమీ లేదు. కానీ ఆర్తి ఆ ఉద్యోగం లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. తోటి ఉద్యోగులు చూసే చూపులను తట్టుకోవడం కష్టమైంది. ‘ఎన్నిసార్లు చెప్పాలి’ అనే చిరాకు వినిపించేది కాదు, కానీ వాళ్ల ముఖాల్లో కనిపించేది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. బాధను అదిమిపెట్టడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఐస్‌క్రీమ్. నిజమే ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకోగలిగిన చిన్న మెషీన్‌ని కొనుక్కుంది. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఐస్‌క్రీమ్‌తో ప్రయోగాలు చేయడం. తాను చేసుకున్న షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ తింటూ సహోద్యోగుల నుంచి ఎదురైన వివక్షను మర్చిపోవడానికి ప్రయత్నించేది. ఆ ప్రాక్టీస్ ఆమెను మరింతగా ప్రయోగాల్లోనే మునిగిపోయేటట్లు చేసింది. ఐస్‌క్రీమ్ పుస్తకాలను చదివింది. అక్కడితో ఆగిపోకుండా ‘ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు’ అనుకుంటూ షుగర్ ఫ్రీతోపాటు గ్లూటెన్ ఫ్రీ, కీటో ఫ్రెండ్లీ కుకీలు, చాక్లెట్లు, బ్రౌనీ, కేక్‌ల మీద ప్రయోగం చేసింది. తన ప్రయోగాలను ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్మెంట్కు పరీక్షకు పంపించింది. సలహా బాగానే ఉంది ‘చాలా బాగా చేస్తున్నావ్, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇక సొంతంగా స్టార్టప్ పెట్టెయ్’ అని తిన్నవాళ్లు ఓ సలహా ఇచ్చేసే వాళ్లు. ‘స్టార్టప్ పెట్టాలంటే బ్యాంకు తనకు లోన్ ఇస్తుందా?’ సమాధానం లేని ప్రశ్న. అన్నీ బాగున్న వాళ్లకే బ్యాంకులు అంత త్వరగా లోన్ ఇవ్వవు. స్టార్టప్ పెట్టాలనే ఆలోచన మానుకుని ఏదో ఓ ఉద్యోగం లో చేరేటట్లు చేస్తుంటాయి. అలాంటిది ఉద్యోగం లో కొనసాగ లేని వైకల్యం ఉన్న తనకు లోన్ ఎలా వస్తుంది? అనుకుని స్నేహితుల సూచనను పక్కన పెట్టేసింది. అయితే... ఓ బలహీన క్షణంలో ఈ ఉద్యోగం ఇక వద్దు అని నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసింది. అప్పుడు కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. ఇంట్లో అందరూ చేయగలిగినంత సహాయం చేశారు. అలా 2019లో ఆమె తన స్టార్టప్‌ను ప్రారంభించింది. అప్పుడు ఆర్తికి నలభై ఏళ్లు. రెండేళ్లు గడిచాయి. ఫుడ్ బిజినెస్ లో భారీ నష్టాలైనా వస్తాయి లేదా త్వరగా బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఇప్పుడామె బెంగళూరులో పది బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. ఆన్లైన్లో పాతిక రాష్ట్రాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ‘‘ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోతోంది. డయాబెటిక్ వాళ్లు రుచిని చంపుకుని బతకాల్సిన అగత్యం లేకుండా అన్ని రుచులనూ తినగలిగేటట్లు చేయడం సంతోషంగా ఉంది. వ్యాపారం కోసం వచ్చిన ఆలోచన కాదు. నా కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన’’ అంటున్నారు ఆర్తి. తీవ్రంగా గాయపడి ఉండడం వల్లనో ఏమో ఆర్తి తన అవుట్లెట్లలో వికలాంగులు, ఎల్జీబీటీలను ఉద్యోగంలో చేర్చుకుంది. -
భర్తతో గొడవ.. బిడ్డతో సహా భవనంపై నుంచి దూకిన తల్లి
సాక్షి, హైదరాబాద్: భర్తతో ఘర్షణ పడిన ఓ యువతి 8 నెలల కూతురితో సహా రెండంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. బిహార్‌కు చెందిన బిమల్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ, భార్య ఆర్తి (22)తో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.30కి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్తి తన కూతురుతో సహా బయటకు వచ్చి ఇంటి గడియ వేసి భవనం రెండో అంతస్తుకు వెళ్లి కిందికి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి గడియ తీసి భర్తకు విషయం చెప్పారు. బాధితురాలితో పాటు చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆర్తి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్తి డ్రగ్స్ బోనస్ భళా- బెర్జర్ బోర్లా
ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21 తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ తాజాగా.. బోనస్ షేర్ల ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీంతో ఈ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో బెర్జర్ పెయింట్స్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్ ఫార్మా రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ తాజాగా వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. ఈ నెల 20న నిర్వహించనున్న సమావేశంలో బోనస్ షేర్ల అంశంపై కంపెనీ బోర్డు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆర్తి డ్రగ్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లింది. రూ. 2,399 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 2,227 వద్ద ట్రేడవుతోంది. క్యూ1లో ఆర్తి డ్రగ్స్ నికర లాభం 281 శాతం ఎగసి రూ. 85 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. బెర్జర్ పెయింట్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో బెర్జర్ పెయింట్స్ నికర లాభం 91 శాతం పడిపోయి రూ. 15 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 46 శాతం క్షీణించి రూ. 931 కోట్లకు చేరింది. అధిక ధరల్లో కొనుగోలు చేసిన చమురు నిల్వల కారణంగా ముడివ్యయాలు పెరిగి క్యూ1లో మార్జిన్లు 7.9 శాతంమేర మందగించినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో బెర్జర్ పెయింట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 536 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 527 వరకూ వెనకడుగు వేసింది. -
వహ్వా.. పెర్సిస్టెంట్ సిస్టమ్స్- ఆర్తి డ్రగ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆటుపోట్ల మార్కెట్లోనూ రెండు మిడ్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఓవైపు ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్, మరోపక్క ఫార్మా రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ కౌంటర్ జోరందుకున్నాయి. భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నికర లాభం 7.4 శాతం పెరిగి రూ. 90 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 6 శాతం బలపడి రూ. 1013 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నిర్వహణ లాభం 15 శాతం పుంజుకుని రూ. 115 కోట్లకు చేరగా.. మార్జిన్లు 14.7 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 857 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 919 వరకూ జంప్‌చేసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఆర్తి డ్రగ్స్ నికర లాభం 281 శాతం జంప్‌చేసి రూ. 85 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 35 శాతం పెరిగి రూ. 546 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే నికర లాభం 45 శాతం పుంజుకోగా.. ఆదాయం 21 శాతం బలపడింది. ఈ నేపథ్యంలో ఆర్తి డ్రగ్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 1766 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1805 వరకూ జంప్‌చేసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
ఆర్తి డ్రగ్స్- రుచీ సోయా.. కొత్త రికార్డ్స్
ఫార్మాస్యూటికల్ ప్రొడక్టుల సంస్థ ఆర్తి డ్రగ్స్ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. వారాంతాన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 1300ను తాకింది. ఇది సరికొత్త లైఫ్‌టైమ్ గరిష్టంకాగా.. చివరికి 8.3 శాతం జంప్‌చేసి రూ. 1282 వద్ద ముగిసింది. వెరసి గత మూడు నెలల కాలంలో ఈ షేరు ఏకంగా 166 శాతం పురోగమించింది. ఇదే కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 17 శాతమే బలపడటం గమనార్హం! ఫలితాలు భేష్ ఏపీఐ ఫార్ములేషన్ల తయారీ కంపెనీ ఆర్తి డ్రగ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం రెట్టింపునకు ఎగసి రూ. 59 కోట్లకు చేరింది. ఇందుకు రూ. 8.4 కోట్ల అనుకోని ఆదాయంతోపాటు రూ. 15 కోట్ల పన్ను ప్రయోజనం సహకరించింది. అయితే మొత్తం ఆదాయం నామమాత్రంగా 2 శాతం క్షీణించి రూ. 450 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం 32 శాతం పుంజుకుని రూ. 81 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 3.7 శాతం బలపడి 15.9 శాతాన్ని తాకాయి. కొత్త ప్రొడక్టుల విడుదల ద్వారా రానున్న త్రైమాసికాలలో ఆర్తి డ్రగ్స్ మార్జిన్లు మరింత మెరుగుపడే అవకాశమున్నట్లు సెంట్రమ్ బ్రోకింగ్ పేర్కొంది. మెట్ఫార్మిన్ తయారీ సామర్థ్యం పెంపు, యాంటీఇన్ఫ్లమేటరీ విభాగంలో విస్తరణ ఆదాయాలు, మార్జిన్లను బలపరిచే వీలున్నట్లు అభిప్రాయపడింది. చైనా సమస్యల నేపథ్యంలో ఏపీఐలకు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేసింది. రుచీ సోయా జోరు దివాళా చట్టానికి లోబడి గతేడాది పతంజలి గ్రూప్ సొంతం చేసుకున్న రుచీ సోయా కౌంటర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నిరవధిక ర్యాలీ చేస్తోంది.ఈ ఏడాది జనవరి 27న రూ. 16 వద్ద తిరిగి లిస్టయిన ఈ షేరు వారాంతాన ఎన్ఎస్ఈలో రూ. 1520 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో 9400 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో కొద్ది రోజుల డౌన్ సర్క్యూట్ల తదుపరి తిరిగి వరుసగా 22వ సెషన్లోనూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.46,000 కోట్లకు చేరింది. ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో విలువ కంటే అధికంకావడం గమనార్హం! పబ్లిక్ వాటా 0.8 శాతమే రుణ చెల్లింపుల్లో విఫలమై ఎన్‌ఎస్‌ఎల్‌టీకి చేరిన రుచీ సోయాను కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పతంజలి ఆయుర్వేద రూ. 4500 కోట్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. తదుపరి కంపెనీ ఈక్విటీలో చేపట్టిన మార్పుల ఫలితంగా పతంజలి గ్రూప్‌నకు 98.87 శాతం వాటా లభించింది. పబ్లిక్కు కేవలం 0.97 శాతం వాటా మిగిలింది. దీనిలోనూ రిటైల్ ఇన్వెస్టర్లకు 0.82 శాతమే వాటా లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ కౌంటర్లో ఫ్లోటింగ్ స్టాక్ అతితక్కువగా నమోదవుతున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ కౌంటర్‌పట్ల అప్రమత్తత అవసరమని సూచించారు. కంపెనీలో పబ్లిక్కు ఏడాదిన్నరలోగా 10 శాతం వాటాను, మూడేళ్లలోగా 25 శాతం వాటాను కల్పించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భంలో మాత్రమే కంపెనీ అసలు విలువ షేరు ధరలో ప్రతిబింబించగలదని అభిప్రాయపడ్డారు. -
ఆర్తి ఇండస్ట్రీస్ పతనం- జూబిలెంట్ జోరు
కరోనా వైరస్ రెండో దశ తలెత్తనున్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తలెత్తుతున్నాయి. దీంతో ముడిచమురు ధరలు పతనంకాగా.. యూఎస్ మార్కెట్ల ఫ్యూచర్స్ నష్టాలలోకి ప్రవేశించాయి. దేశీయంగానూ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 779 పాయింట్లు పడిపోయి 33,001కు చేరగా.. నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 9,762 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ రెమ్‌డెసివిర్ ఔషధ లైసెన్సింగ్తోపాటు.. తాజాగా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించడంతో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. అయితే మరోపక్క దీర్ఘకాలిక కాంట్రాక్టు రద్దయిన వార్తలతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఆర్తి ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం.. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కోవిడ్-19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న రెమ్‌డెసివిర్ ఔషధానికి సంబంధించి యూఎస్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ ఇంక్ నుంచి నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 637 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 646 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. కంపెనీ తాజాగా స్వల్పకాలిక రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 50 కోట్లను సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2307 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 260 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీలో ప్రమోటర్లకు 50.68% వాటా ఉంది. గతేడాది పెట్టుబడి వ్యయాలపై రూ. 516 కోట్లను వెచ్చించింది. అంతేకాకుండా రూ. 514 కోట్లమేర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ తెలియజేసింది. మధ్య, దీర్ఘకాలాలకు జూబిలెంట్ లైఫ్ సైన్సెస్పట్ల సానుకూల ధృక్పథంతో ఉన్నట్లు పేర్కొంది. కాగా.. జూబిలెంట్ లైఫ్ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం ఊపందుకుంది. తొలి గంటన్నర సమయంలోనే ఈ కౌంటర్లో 12.73 లక్షల షేర్లు చేతులు మారినట్లు బీఎస్ఈ డేటా వెల్లడించింది. ఆర్తి ఇండస్ట్రీస్ గ్లోబల్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ నుంచి గతంలో దక్కించుకున్న 10ఏళ్ల కాంట్రాక్టును గడువుకంటే ముందుగానే ఆ సంస్థ రద్దు చేసుకుంటున్నట్లు ఆర్తి ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. 2017 జూన్‌లో కుదుర్చుకున్న కాంట్రాక్టులో భాగంగా హెర్బిసైడ్స్‌లో వినియోగించగల ఆగ్రోకెమికల్ ఇంటర్మీడియరీ సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే కంపెనీ ప్రొడక్ట్ తయారీ వ్యూహాన్ని మార్చుకోవడం ద్వారా కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో 12-13 కోట్ల డాలర్లస్థాయిలో నష్టపరిహారం లభించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్తి ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం పతనమై రూ. 852 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ షేరు 29 శాతం తిరోగమించడం గమనార్హం! -
కన్నబిడ్డకు పాలిచ్చేందుకు వచ్చి..
ఖైరతాబాద్: కన్నబిడ్డకు పాలిచ్చేందుకు వచ్చిన తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలో నివాసం ఉంటున్న రాజేష్, ఆర్తి (24)లకు 2017లో వివాహం జరిగింది. ఇటీవల గర్భం దాల్చిన ఆర్తిని డెలివరీ కోసం చింతల బస్తీలోని విజయమేరి హాస్పిటల్లో గత నెల 27న అడ్మిట్ చేశారు బంధువులు. 28న వైద్యులు శస్త్ర చికిత్స చేసి డెలివరీ చేయగా పాపకు జన్మనిచ్చింది. పుట్టిన పాప గ్రోత్ సరిగా లేదని హాస్పిటల్ని ఎన్ఐసీయూలో ఉంచారు. 31న తల్లి ఆర్తిని డిశ్చార్జి చేస్తున్నామని చెప్పారని.. అయితే పాపకు పాలు ఇవ్వాల్సి ఉండగా హాస్పిటల్లోనే ఉంటోంది. ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రి వర్గాలకు బంధువులు తెలియజేశారు. డెలివరీ అయిన తర్వాత సాధారణంగా ఛాతీలో నొప్పి వస్తుందని, వాకింగ్ చేస్తే సరిపోతుందని చెప్పినట్లుగా బంధువులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆర్తి పాపకు పాలు ఇచ్చేందుకు వెళ్లింది. పాలు రాకపోవడంతో పాపకు పాలు పట్టేందుకు నర్సు వేడి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. నర్సు తిరిగి వచ్చే సరికి ఆర్తి బెడ్‌పై పడిపోయి ఉంది. నర్సు ఎంత లేపినా లేవలేదు. దీంతో డాక్టర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన డాక్టర్లు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ఆర్తి తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే చనిపోయిందని ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నుంచి తాము డిశ్చార్జి చేశామని, సాధారణంగా బాలింతల కాళ్లలో రక్త సరఫరా సరిగా లేకపోవడం (ఎంబోలిజం) అనే సమస్య వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సమస్య వచ్చే అవకాశాలుంటాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. మృతురాలి భర్త రాజేష్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్తి హిట్ టాక్
కాలం సాఫీగా సాగనప్పుడు కష్టానికి అలవాటుపడడం కాదు... దానికి ఎదురొడ్డి నిలిచే సామర్థ్యాన్ని అలవరచుకోవాలి. కొండంత అండ లేకున్నా, గోరంత ఆశ, ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉండి ఆర్తిగా పని చేస్తే చాలు... కాదు... కాదు... ఆర్తి లా పని చేయాలి. అప్పుడు కష్టాల యమునను కూడా గుండెబలంతో దాటవచ్చు. ఆర్తి ఉంటున్న ఊరు ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ. తన ఇద్దరు తోబుట్టువుల్లో ఒకరైన జ్యోతితో కలిసి ఓ ఫ్యాక్టరీలో పనిచేసేది నెలకు ఎనిమిదివేల రూపాయల జీతంతో. ఆమె ప్రతిభను గుర్తించిన యాజమాన్యం ఆ జీతాన్ని పదివేల రూపాయలకు పెంచారో లేదో లాక్డౌన్ మొదలైంది. దాంతో కొన్ని వారాలపాటు నిత్యావసర సరుకులు అందించిన ఫ్యాక్టరీ యాజమాన్యం, ఆ తర్వాత ‘మేమివ్వలేం’ అంటూ చేతులెత్తేసింది. చేసేదేమీ లేక పొదుపు చేసి దాచుకున్న డబ్బుతో జీవనం సాగిస్తూనే, ఖాళీగా కూర్చోకుండా కొత్త ఉపాధిని వెదుక్కుంది ఆర్తి. అది టిక్ టాక్ రూపంలో. హిందీ సినిమా డైలాగులు, పాటలతో ఆర్తి చేస్తున్న టిక్‌టాక్ వీడియోలకు బాగానే వ్యూయర్షిప్ వచ్చింది. చూస్తుండగానే టిక్‌టాక్‌లో పాపులర్ అయిపోయి ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ అనే టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఇది ఆమె వర్తమానం కాగా, విషాదమైన గతమూ ఉంది ఆమెకు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే.. తల్లితో కలిసి ఇళ్లల్లో పనిచేస్తూ అమ్మ బాధ్యతను పంచుకుంది. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టింది తల్లి. అయితే, బాబు పుట్టగానే ఆ మగానుభావుడు కాస్తా ఆమెని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. చంటిబిడ్డతో మళ్లీ పుట్టిల్లు చేరింది ఆమె. కొడుకు చుట్టూతా ప్రపంచాన్ని అల్లుకొని బతుకుతూండగా క్యాన్సర్‌తో చనిపోయాడు వాడు. ఈ కష్టంతో బిడ్డ కుంగిపోతుందేమోని భయపడింది ఆర్తి తల్లి. కాని తల్లికే ధైర్యం చెప్పి ఆమెకే పెద్దదిక్కు అయ్యింది ఆర్తి. అంతా సర్దుకొని ఒక గాడిన పడుతున్న సమయంలో తల్లి కన్నుమూసింది. అమ్మ పంచి ఇచ్చిన రక్తసంబంధం, దాంపత్య బంధం మిగిల్చిన విషాదం తప్ప మరేమీ లేదామెకు. అయినా బెదిరిపోలేదు. ఇద్దరు చెల్లెళ్లకు అండగా నిలబడింది. షామ్లీ వచ్చి ఓ చెంచాల ఫ్యాక్టరీలో ఉద్యోగం వెదుక్కుంది. తనతో పాటు పెద్ద చెల్లినీ పనికి తీసుకెళ్లసాగింది. ‘కాస్త కుదుట పడ్డాం’ అని అనుకుందో లేదో కరోనా తెచ్చిన లాక్డౌన్. ఈసారీ భయపడలేదు. చిరునవ్వుతో ఈ కష్టాన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడింది ఇలా. ‘లాక్డౌన్ అయిపోయే వరకు టిక్‌టాక్‌లు చేస్తా. ఫ్యాక్టరీ తెరిస్తే వెళ్తాం. లేదంటే ఇంకో పని వెదుక్కుంటాం. దొరికితే ఇక్కడే... దొరక్కపోతే దేశంలో ఇంకెక్కడైనా’ అంటుంది ఆర్తి ఆత్మవిశ్వాసంతో. యమునను ఈదింది లాక్‌డైన్ కంటే ముందు హర్యానా, పానిపట్‌లోని తన బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం ఉంటే ఇద్దరు చెల్లెళ్లతో కలిసి వెళ్లింది. అక్కడికి వెళ్లిన రెండో రోజే లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. తిరుగు ప్రయాణానికి బస్సులు, రైళ్లు ఏమీ లేవు. బం«ధువుల వ్యక్తి ఒకతను మోటర్ సైకిల్ మీద ఉత్తరప్రదేశ్ బార్డర్ దాకా తీసుకొచ్చాడు. అక్కడి నుంచీ ముందుకు కదలడానికి లేక మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అలా రెండు సార్లు జరిగింది. మూడోసారి ఎలాగైనా సరే షామ్లీకి వెళ్లడానికే మొండిపట్టుతో ఉంది ఆర్తి. తమ ఊరు చేరాలంటే ముందున్న యముననుlదాటాలి ముందు. వాడేసిన టైర్లు మూడు తీసుకొని యమునలోకి అడుగుపెట్టారు అక్కాచెల్లెళ్లు. ఉదయం అయిదు గంటలకు ఈ ఒడ్డున దిగితే అవతలి ఒడ్డుకు చేరేసరికి తొమ్మిదైంది. మళ్లీ అక్కడి నుంచి రెండు రోజులు నడిచి షామ్లీలోని తమ ఇల్లు చేరారు. ‘బతుకంటేనే సాహసం.. తప్పదు. లేకపోతే ఉన్నచోటే ఉండిపోతాం’ అంటుంది అదే ఆత్మవిశ్వాసంతో ఆర్తి. -
లాక్డౌన్ బేఖాతరు చేస్తున్నవారికి హారతి
-
లాక్డౌన్ బేఖాతరు చేస్తున్నవారికి హారతి
థానే: "మనం ఇంట్లో ఉండి కరోనాను తరిమికొడదాం" అని ప్రభుత్వమిస్తున్న నినాదాలు కొందరి చెవికెక్కట్లేదు. అవసరమున్నా లేకపోయినా, చీటికీమాటికీ రోడ్ల మీదకు వస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్ని రకాలుగా చెప్పినా లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఇలాంటి వారికి హారతిచ్చి మరీ ప్రస్తుత పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెప్తూనే బయటకు రావద్దంటూ పోలీసులు సూచనలిస్తున్నారు. ఈ కొత్త తరహా పనిష్మెంట్ మహారాష్ట్రలోని థానేలో విధించారు. (మరో కొన్నిగంటల్లో ఇంటికి చేరుతుందనగా..) వివరాల్లోకి వెళితే.. థానేలో మంగళవారం ఉదయం పూట కొంతమంది మార్నింగ్ వాక్ కోసం రోడ్ల మీదకు వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డగించగా కారణం తెలుసుకుని నివ్వెరపోయారు. ఇలాంటి ప్రమాద పరిస్థితుల్లో మార్నింగ్ వాక్ ఏంటని ప్రశ్నించారు. ఇంతలో ముఖానికి మాస్కు ధరించి ఉన్న ఓ మహిళా పోలీసు హారతి పళ్లెంతో వారి ముందుకు వచ్చింది. లాక్డౌన్ ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యువకులందరికీ హారతి పడుతూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పకనే చెప్పింది. ఈ హారతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇరుకు బతుకుల్లో ఊపిరాడేనా?) -
‘హారతి’ ఇస్తుందని టీవీ పగలగొట్టిన పాక్ క్రికెటర్
-
‘హారతి’ ఇస్తుందని టీవీ పగలగొట్టిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది చిక్కుల్లో పడ్డాడు. హిందూ సంప్రదాయాలపై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గతంలో ఆయన ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో మీడియా ప్రతినిధి అఫ్రిదిని ఎప్పుడైనా టీవీ పగలగొట్టారా అని ప్రశ్నించింది. దీనికి అఫ్రిది అవునని సమాధానమిచ్చాడు. కొన్ని షోలు నచ్చవని, కానీ అతని భార్యకు ఆ షోలపై ఆసక్తి ఉండటంతో పిల్లలతో కాకుండా ఒంటరిగా చూడటానికి అంగీకరించానని తెలిపాడు. అయితే ఓరోజు తన పిల్లలు టీవీ ముందు నిలబడి షోలో వస్తున్న ‘హారతి’ విధానాన్ని యథాతథంగా అనుకరించడం చూశానన్నాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన అఫ్రిది భార్యవైపు విసురుగా చూసి ఆవేశంతో టీవీ పగలగొట్టాడు. దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున విమర్శిస్తున్నారు. అఫ్రిదిది అత్యంత హేయమైన చర్యగా పలువురు అభివర్ణించారు. కాగా పాకిస్తాన్ టీంలో వివక్ష చూపిస్తారని వార్తలు ప్రచారమైన నేపథ్యంలో ఈ పాత వీడియో తిరిగి ప్రాచుర్యం సంతరించుకుంది. స్పిన్నర్ కనేరియా హిందూ కావడం వల్లే అతడిపై సహచర క్రికెటర్లు వివక్ష చూపేవారని ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అది వాస్తవమేనని కనేరియా సైతం అంగీకరించాడు. కాగా అఫ్రిది గతంలోనూ ఆర్టికల్ 370 రద్దు సమయంలో భారత్‌పై విషం కక్కాడు. దీనికి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: అఫ్రిది నీకసలు బుర్ర ఉందా? -
పోలీసులకు సెహ్వాగ్ భార్య ఫిర్యాదు!
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సతీమణి ఆర్తీ తన వ్యాపార భాగస్వాములపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.4.5 కోట్లు రుణం తీసుకున్నారని, తన భర్త పేరును ఉపయోగించుకొని ఈ రుణం పొందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని తిరిగి సక్రమంగా చెల్లించకపోవడంతో రుణం ఇచ్చిన సంస్థ కోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసిందని ప్రస్తావించింది. ఇక ఆర్తీ పలువురు భాగస్వాములతో కలిసి ఎస్‌ఎమ్‌జీకే ఆగ్రో ప్రైవేట్ లిమిటేడ్ అనే సంస్థను నడిపిస్తోంది. అయితే ఈ సంస్థ పేరుపై ఆమె భాగస్వాములు వీరేంద్ర సెహ్వాగ్ పేరు ఉపయోగించుకొని లోక్‌న్ పాల్ బిల్డర్స్ అనే సంస్థ దగ్గర రూ.4.5 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ విషయం ఆర్తీ తెలియకుండా ఫోర్జరీ సంతకంతో రుణాన్ని పొందారు. అయితే రుణాన్ని సక్రమంగా చెల్లించడంతో లోకన్‌పాల్ బిల్డర్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఎస్‌ఎమ్‌జీకే ఆగ్రో కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు చూసి ఖంగుతిన్న ఆర్తీ.. తన సంతకం ఫోర్జరీ జరిగినట్లు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక 2004లో వివాహ బంధంతో సెహ్వాగ్, ఆర్తీలు ఒక్కటవ్వగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ ఉన్నారు. Aarti, wife of Virender Sehwag has filed a complaint against her business partners alleging they took a Rs 4.5 crore loan by forging her signatures and later defaulting on payment. — ANI (@ANI) July 13, 2019 -
ఆకాశమంత ఆర్తి
అభంశుభం తెలియని, ఆదుకునే వారే లేని ఆ చిన్నారులను ‘ఆర్తి’ ఆశ్రమం తన ఒడిలోకి తీసుకుంటోంది. అన్నీ తానే అయి వారిని ఆదరిస్తోంది. ఇప్పటివరకు దాదాపు పదిహేను వందల మంది బాలికల భవిష్యత్తును వెలిగించింది. ఆ దీపాలన్నీ నేడు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులను పంచుతున్నాయి. ఆ వెలుగుల్లో ‘ఆర్తి’ ఆకాశమంత ఎత్తులో కనిపిస్తోంది. నగరం సద్దుమణుగుతోంది. రాత్రి 11 గంటలు. ఆ భవనం వద్ద జీరో బల్బు వెలుతురు. ఎవరో కంగారుగా వచ్చి అక్కడ ఏదో పడేసి అంతే కంగారుగా వెళ్లిపోయారు. అటుగా వచ్చిన వాచ్మెన్ అక్కడేదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరికి వచ్చి చూశాడు. పాత చీరెలో చుట్టి ఉన్న నెలల వసిగుడ్డు! చలికి వణుకుతోంది. జాగ్రత్తగా రెండు చేతుల్లోకి లోపలికి తీసుకెళ్లాడు. అతడు ‘ఆర్తి’ వాచ్మెన్.ఇంకో ఘటన. ఇంకా చీకట్లు విచ్చుకోలేదు. కొద్దిగా తెరిచి ఉన్న గేటులో నుంచి ఏడు నెలల పాప బరాబరా దోగాడుతూ వచ్చేసింది. లోపలి నుంచి వచ్చిన వారు ఆ చిన్నారిని ఎత్తుకున్నారు. గేటు బయటికి చూసి ఎవరూ లేకపోవడం గమనించారు. విషయం అర్థమైంది. ఆ పాపను అందరూ కాసేపు ఎత్తుకున్నారు. ‘ఆర్తి’ హృదయానికి హత్తుకున్నది.కడప నగరంలో మున్సిపల్ స్టేడియం వద్ద ఉం టుంది ‘ఆర్తి’. ఈ చిన్నారుల ఆశ్రమాన్ని పీవీ సంధ్య నిర్వహిస్తున్నారు. పాతికేళ్ల క్రితం ఆవిర్భవించింది మొదలు నేటి వరకు ఆర్తి ఆదర్శప్రాయమైన ప్రయాణంలోని విశేషాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. బంధువులమ్మాయి ‘ఆర్తి’ ‘‘నేను ఇంగ్లీషు లెక్చరర్. నా భర్త శ్రీనివాసులురెడ్డి నేత్ర వైద్యులు. మాకు ఇద్దరు అమ్మాయిలు. 1992లో వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు.. మా ఇంటికి సమీపంలో ఓ పసిపాపకు ఎవరూ లేకపోవడం గమనించాను. ఆ చంటిబిడ్డను తెచ్చుకున్నాను. నా పిల్లలతో పాటు పెంచుకున్నాను. దీన్ని గమనించిన మరికొందరు తమ పిల్లలను రాత్రులు మా ఇంటి వద్ద వదిలేసేవారు. ఇలాంటి చిన్నారుల సంఖ్య పెరగడంతో స్నేహితులతో చర్చించి వారి సహకారంతో ప్రత్యేకంగా చిన్న ఇల్లు తీసుకుని బాలల ఆశ్రమం ప్రారంభించాను. మా బంధువుల అమ్మాయి ఆర్తి విదేశాల్లో తన స్నేహితుల నుంచి కొద్ది సొమ్మును సేకరించి మాకు పంపేది. దురదృష్టవశాత్తు ఆమె భౌతికంగా దూరం కావడంతో మా ఆశ్రమానికి ఆర్తి హోమ్ అని ఆమె పేరు పెట్టుకున్నాం. సంస్థ నిర్వహణకు విజయ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్లకు ఎంతవరకు ఆశ్రయం, రక్షణ ఇవ్వగలనో, వారిని ఎంతవరకు చదివించగలనో, ఆ తర్వాత వారి జీవితం ఏమిటో.. ఏదీ ఆలోచించలేదు. హోమ్ నిర్వహిస్తున్నాం అంతే! ఇంటి బయట ఊయలతొట్టి ఓరోజు ఇంటి బయట ఎవరో నెలల పాపను ఉంచి వెళ్లారు. కొద్దిసేపటి ద్వారా కనుగొని చిన్నారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఎంత ప్రయత్నించినా చిన్నారిని నిలుపుకోలేక పోయాం. చాలా బాధ అనిపించింది. దాంతో ఇంటి బయట ఊయల తొట్టి ఏర్పాటు చేశాను. వాచ్‌మెన్‌ను నియమించాను. ఇక్కడ వదిలి వెళ్లే పిల్లల గురించి ఎవరూ ఏమి అడిగేది ఉండదని అక్కడ రాసి ఉంచాము. అలా హోమ్ పెరిగింది. 1993లో కలెక్టర్ సుబ్రమణ్యం హోమ్‌కు మున్సిపల్ స్టేడియం వద్ద కొద్దిగా స్థలాన్ని ఇచ్చారు. మెల్లిగా ఆ స్థలంలో ఇంటిని నిర్మించాం. 36 మంది చిన్నారులతో సొంత భవనంలో ఆశ్రమం పూర్తి స్థాయిలో మొదలైంది. ఇప్పటికి పదిహేను వందల మందికి పైగా ఆశ్రమం విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. పలు దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వీరిలో చాలామందికి మేమే వివాహాలు జరిపించాము. సీమంతాలు, పురుళ్లు చేస్తున్నాం. ఏ ఉద్యోగంలో, ఎంత దూరంలో ఉన్నా పుట్టినరోజులు, పండుగల సందర్భంగా వాళ్లు హోమ్ కు వస్తుంటారు. ప్రస్తుతం హోమ్‌లో 120 మంది ఉన్నారు. కుటుంబ జీవన గ్రామం పిల్లలందరినీ ఒకేచోట పెంచుతున్న విషయంగా నాలో ఆలోచన మొదలైంది. వారందరికీ బాధ్యతలు తెలిసేలా పెంచడంతో పాటు కుటుంబ జీవనంలోని మాధుర్యాన్ని చవి చూపాలని భావించాను. అందుకోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసి అందులో వీరినే కుటుంబాలుగా ఏర్పాటు చేయాలని భావించాను. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని సహకరించాలని కోరాను. రిమ్స్ వద్ద స్థలం ఇచ్చారు. అక్కడ తొమ్మిది కుటీరాలు ఏర్పాటు చేశాం. ఒక్కొ దానిలో పదీపదిహేను మంది ఓ కుటుంబంగా ఉంటున్నారు. ఒకరి కుటుంబాలకు ఒకరు సహకరించుకుంటున్నారు. దీంతో అది ఒక గ్రామంగా, వీరంతా గ్రామస్థులుగా ఆత్మీయత అనుబంధాలతో జీవిస్తున్నారు. భ్రూణహత్యలపై ప్రాజెక్టు వర్క్ దక్షిణ ఏషియా స్థాయిలో కేవలం ఆర్తి హోమ్‌కు మాత్రమే భ్రూణహత్యల నిర్మూలనపై ప్రాజెక్టు వర్క్ లభించింది. 2015లో కేంద్ర పథకం బేటీ బచావో.. బేటీ పఢావోలో భాగంగా ‘మన బిడ్డ’ కార్యక్రమాన్ని జిల్లాలోని 51 మండలాల్లో ప్రతిభావంతంగా నిర్వహించాం. ఆర్తి విద్యార్థులే అన్ని విభాగాలకు వలంటీర్లుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి పథకాన్ని వంద శాతం అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం భ్రూణ హత్యల సంఖ్య గణనీయంగా తగ్గడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని ముగించారు సంధ్య. – పంతుల పవన్‌కుమార్, సాక్షి, కడప ఆడబిడ్డ విలువను గుర్తించాలి భ్రూణహత్యలు అమానుషం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రధాన గ్రామీణ ప్రాంతాల కుటుంబాలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అంకురం దశలోనే ఆడబిడ్డను అంతం చేస్తుండటం సృష్టికి విరుద్ధం. స్త్రీలేని లోకాన్ని ఊహించనే లేము. ఆడబిడ్డను ఇంటికి వెలుగు అని అనుకోవాలి తప్ప గుండెపై కుంపటి అనే భావం రానీయకూడదు. మెరుగైన సమాజం కావాలనుకున్నప్పుడు ఆడపిల్లకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. స్త్రీ విలువను గమనించేందుకు సమాజంలో నైతిక విలువలు పెరగాల్సి ఉంది. ఈ సమస్యకు మూలాలు వెతికి సరిదిద్దాల్సి ఉంది. – పీవీ సంధ్య, నిర్వాహకులు, ఆర్తి హోం -
‘నమాజ్ చేస్తే తప్పులేదు.. కానీ పూజలు చేయకూడదా’
ఆగ్రా : బజరంగ్ దళ్‌కు చెందిన మహిళా కార్యకర్తలు కొందరు తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తాజ్ మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా ఇతర రోజుల్లో నమాజ్ చేయకూడదంటూ సుప్రీం కోర్టుతో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కూడా ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎస్ఐ ఉత్తర్వులను పట్టింకుకోండా కొందరు ముస్లింలు తాజ్ వద్ద ఉన్న మసీదులో గత బుధవారం నమాజ్ చేశారు. విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ మహిళా కార్యకర్తలు కొందరు ఏఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా తాజ్ వద్ద హరతి కార్యక్రమం నిర్వహించి.. గంగా జలాన్ని చల్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఇక్కడ నమాజ్ చేసి తాజ్ పరిసరాలను అపవిత్రం చేశారు. అందుకనే మేం గంగా జలంతో దాన్ని శుద్ది చేశాం. ఇతరులు(ముస్లింలు) వచ్చి ఇక్కడ నమాజ్ చేస్తున్నప్పుడు.. మేం తాజ్ మహల్లోకి పూజాద్రవ్యాలు తీసుకెళ్లడం తప్పా అంటూ వారు ప్రశ్నించారు. వారికి(ముస్లింలకు) శుక్రవారం మాత్రమే తాజ్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతించారు. కానీ మిగతా రోజుల్లో ఎందుకు ఇక్కడ నమాజ్ చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మేం చేసింది తప్పని భావిస్తే ఎలాంటి చర్యలనై తీసుకోండి.. వాటిని ఎదుర్కొడానికి మేం సిద్దంగా ఉన్నామని తెలిపారు. నమాజ్ కోసం వెళ్లిన వారిన ఆపలేదు.. కానీ మమ్మల్ని మాత్రం ఎలా అడ్డగిస్తారంటూ ప్రశ్నించారు. -
పరమాత్మ దర్శనానికి సోపానం
ఆధ్యాత్మిక ప్రదేశం ఎలా ఉంటుంది? అంటే... మన మనోఫలకం మీద ఒక అందమైన సంప్రదాయబద్ధమైన చిత్రం రూపుదిద్దుకుంటుంది. అందులో ఎటుచూసినా దేవుని విగ్రహాలు, పుష్పాలంకరణలు, అగరువత్తి ధూపం, నిత్య నైవేద్యకైంకర్యాలు కనిపిస్తాయి. కర్పూర హారతి పరిమళం, ఘంటారావాలు మార్మోగుతూ భక్తుల్ని అలౌకిక ఆనందంలో ముంచెత్తుతుంటాయనే అనుకుంటాం.కానీ... ఈ ఆధ్యాత్మిక వారధి అలా ఉండదు. శ్వేతకపోతంలా ఉంటుంది. విశాలమైన హాలు, తెల్లటి పరదాలు, నేల మీద తెల్లటి చిన్న మెత్తలు. ఎదురుగా ఎర్రటి వెలుగు. ఆ మెత్త మీద పద్మాసనంలో కూర్చుని వెలుగుతున్న దీపాన్ని చూస్తూ కళ్లు మూసుకుని భృకుటి మీద దృష్టి కేంద్రీకరించడమే ఇక్కడి నిత్యపూజ. తనలోకి తాను ప్రయాణించడమే తీర్థయాత్ర. పరమాత్మ దర్శనమే అత్యున్నత శిఖరం. ఆ శిఖరాన్ని చేరే సోపానమే ధ్యానసాధన. రాజయోగ ధ్యానసాధన. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనుసరిస్తున్న మోక్షమార్గం. అలౌకికమైన ఆనందసాధనకు రాజమార్గం. శాంతివనంలో విహరించే తెల్లటి పావురాల్లాగ బ్రహ్మకుమారిలు శ్వేతాంబరులై సంచరిస్తుంటారు. చిరునవ్వే వారి సుభూషణం. ప్రపంచంలోని ప్రసన్నత అంతా అక్కడే రాశిపోసినట్లు ఉంటుంది వాతావరణం. దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రతి భౌతికరూపంలోనూ పరమాత్ముని దర్శించడం, గౌరవించడం మన సనాతన ధర్మం. అయితే, దేవుడు విశ్వమంతటా వ్యాపించిన శక్తి స్వరూపం అంటుంది రాజయోగం. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడమే ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రధాన లక్ష్యం. విలువలతో కూడిన జీవితాన్ని సాగించడం, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా శాంతి నిండిన ప్రపంచం రూపొందుతుందని నమ్మే దైవమార్గమిది. పరమాత్మ దర్శనం కోసం మహోన్నతులు అవలంబించిన మార్గాలను విశ్లేషిస్తుంది. తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణుడు పుణ్యాత్ముడు. జాతి హితం కోసం సత్యాగ్రహంతో ఉద్యమించిన గాంధీజీ మహాత్ముడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని, పౌరుల మనోభిప్రాయాన్ని గౌరవించడం కోసం భార్యను వదులుకుని రాముడు «ధర్మాత్ముడయ్యాడు. పరమాత్మదర్శనంలో భాగంగా వాళ్లనుసరించిన మార్గాలవి. సత్యాన్వేషణలో జీవితాన్ని మమైకం చేసుకున్న పరమోత్కృష్టులు గురునానక్, మహమ్మద్ ప్రవక్త, గౌతమబుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఏసుక్రీస్తు. సామాన్యులమైన మనం పరమాత్మ దర్శనం కోసం వాళ్లనుసరించిన మార్గాలను అనుసరించడంలో తప్పులేదు, వారు సూచించిన విలువలను పాటించడం మంచిదే. కానీ వారిలోనే పరమాత్మను చూడాలనుకుంటే... అది సాధ్యమయ్యే పని కాదు. వ్యక్తిని, విగ్రహాన్ని పూజించడమే పరమాత్మను చేరే పథం అనే మిథ్య నుంచి బయటకు రావాలంటోంది రాజయోగ. తాము విశ్వసించిన జ్ఞానామృతాన్ని సమాజానికి పంచుతుంటారు బ్రహ్మకుమారి సోదరీమణులు. శాంతి సేవలు! ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలు ఐదు ఖండాల్లో, 140 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం వరకే తమ పరిధిని పరిమితం చేసుకోవడం లేదు. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు సోదర సోదరీమణులు, సేవాకార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రాథమిక విద్యకు కూడా నోచుకోని గ్రామాలలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలను ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు చదువు చెప్తున్నారు. మనిషి – ప్రకృతి! మనిషి – ప్రకృతి పరస్పర ఆధారితాలు. మనం ఉద్రేకపూరితంగా ఉంటే ఆ ప్రకంపనలు ప్రకృతిలో ప్రతిబింబిస్తాయి. అకాల వర్షాలు, వరదలు, కరువు, సునామీ, భూకంపాల రూపంలో బహిర్గతమవుతాయి. అవే ప్రకంపనలు మనిషిలో రక్తపోటు, గుండెపోటు, మేధోపరమైన అలజడులకు దారితీస్తాయి. వాటిని నివారించడానికి మన జీవనశైలిని మార్చుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుని స్వీయ నియంత్రణ పాటించినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్తుంది రాజయోగ. మారిన చిత్తరువు! ఓం శాంతి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ధ్యాన కేంద్రాల నిర్వహణ బాధ్యత మొత్తం స్త్రీలదే. ఇందుకు బీజం వేసింది విష్ణుమూర్తి రూపం, సమాజం ఆడపిల్ల పట్ల చూపించిన వివక్ష. ఆశ్చర్యంగా ఉందా? ఒకసారి విష్ణుమూర్తి రూపాన్ని గుర్తు తెచ్చుకోండి! పాల సముద్రంలో శేషపాన్పుపై పడుకుని ఉంటాడు, లక్ష్మీదేవి అతడి కాళ్లు పడుతూ ఉంటుంది. ఇదే చిత్రం ప్రజాపిత బ్రహ్మను ఆలోచింపచేసింది. దేవతలనే ఇలా చూపిస్తున్న సమాజంలో స్త్రీకి సముచిత స్థానం ఎలా లభిస్తుంది? ఇదీ ఆయనలో మొదలైన సందేహం. దేవుడంటే ఇలా ఉండడు. ఉండకూడదు కూడా. అయితే దేవుడు ఎలా ఉంటాడో కనుక్కోవాలి? సాటి మనిషి అయిన స్త్రీని సమానంగా చూడలేనప్పుడు విష్ణుమూర్తి అయినా సరే అతడికి దైవత్వం ఎలా వస్తుంది... అనుకున్నాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి ఆయనకు సమాన హోదాలో దీటుగా నిలబడిన రూపాన్ని గీయించారు, పటం కట్టించారు. లక్ష్మీనారాయణులు ఇలా ఉంటారని భారతీయ సమాజానికి చూపించారు ప్రజాపిత బ్రహ్మ. – వాకా మంజులారెడ్డి -
ముస్లింలకు కొత్త ఫత్వా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ కేంద్రంగా నడిచే ప్రముఖ ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ తాజాగా మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు, పురుషులు అల్లాను కాకుండా మరే దేవుడిని ప్రార్థించరాదని దారుల్ ఉలూమ్ దియోబంద్ శనివారం ఫత్వా విడుదల చేసింది. అల్లాను కాకుండా మరో దేవుడిని ఆరాధించిన వారిని భవిష్యత్‌లో ముస్లింలుగా గుర్తింలేమని ఆ సంస్థ పేర్కొంది. హిందువుల ముఖ్య పర్వదినాల్లో ఒకటైన దీపావళి సందర్భంగా వారణాసిలో పలువురు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించిన నేపథ్యంలో దారుల్ ఉలూమ్ సంస్థ ఈ ఫత్వా జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇరు వర్గాల మధ్య మత కలహాలు తగ్గించేందుకు ముస్లిం మహిళా ఫౌండేషన్, విశాల్ భారత్ సంస్థాన్ సంస్థలు.. సంయుక్తంగా దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంపై దారుల్ ఉలూమ్ మండిపడింది. ‘‘శ్రీరాముడు హిందువులకు మూలపురుషుడు.. రాముడిని పూజించే వారు.. తమ పేరును మతాన్ని మార్చుకోవడం సాధ్యమా?’’ ఇరు వర్గాల మధ్య కలహాలు తగ్గించాలంటే రాముడిని పూజించడం ఒక్కటే కాదు.. మనుషుల మధ్య ఔదార్యం, ప్రేమ కలగాలి.. అని దారుల్ సంస్థ సభ్యుడు నజీమ్ అన్సారీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ముస్లిం మహిళలు, పురుషులు తమ వ్యక్తిగత, కుటుంబ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదంటూ దారుల్ ఉలూమ్ దియోబంద్ సంస్థ గురువారం ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే. If anyone worships any god except Allah they don't remain Muslim-Ulema,Darul Uloom on Muslim women who performed aarti on Diwali in Varanasi pic.twitter.com/IgaLNcenGo — ANI UP (@ANINewsUP) October 21, 2017 -
ప్రేమ లేని ప్రేమ కథ
రోషన్, ఆర్తి జంటగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్లస్ వన్’. అళహరి దర్శకత్వంలో సచేతా డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్.హెచ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమలేని ప్రేమ కథ ఒక వైపు.. ప్రేమ ఉన్న ప్రేమ మరోవైపు. ఈ అంశాలను, స్వీట్ 16 వయసును దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశాం. తెలియని పొరపాటు వల్ల జరిగిన తప్పుని ఒప్పుగా చేసుకునేందుకు ఓ జంట ఏం చేశారన్నదే కథ’’ అన్నారు. ‘‘నల్గొండలో షూట్ మొత్తం పూర్తి చేశాం’’ అని నిర్మాత చెప్పారు. తేజారెడ్డి, పూర్ణిమ, సరయు, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు నటించారు. -
దొంగ... పోలీస్ అయితే!
తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు విడిచిన పోలీస్ సిద్ధయ్య జీవిత కథ నేపథ్యంలో తెర కెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ కె’. కౌశిక్ బాబు, ఆర్తి జంటగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేశ్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యథార్థ సంఘటనల నేపథ్యంలో క్రైం కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ‘‘పోలీస్ డ్రస్ వేసుకుని తిరిగే దొంగ కథ ఇది. తర్వాత ఆ దొంగే పోలీస్ ఎలా అయ్యాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో పోలీసు సిద్ధయ్య పాత్రను పోసాని కృష్ణమురళి పోషిస్తున్నారు’’ అని కౌశిక్ బాబు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శారదా విజయబాబు, మాటలు: మోహన్ దీక్షిత్.