భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ ఆ గొడవలు మితిమీరినా, మనస్పర్థలు ఎక్కువైనా వారు విడిపోవడానికి దారి తీస్తాయి. తమిళ హీరో జయం రవి విషయంలోనూ ఇదే జరిగింది. ఇంట్లో గొడవల కారణంగా కొంతకాలంగా వీరు విడిగానే ఉంటున్నారు. ఇంతలో జయం రవి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. అయితే తనకు ఒక్క మాట కూడా చెప్పకుండానే విడాకులు ప్రకటించాడని ఆర్తి మండిపడింది. గొడవలు పరిష్కరించుకుందామనుకున్నానని, ఇప్పటికీ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానంది.
ఆమెకు రాజీ పడాలన్న ఉద్దేశం లేదు
బ్రదర్ సినిమా ఆడియో లాంచ్ అనంతరం ఓమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయం రవికి ఇదే విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఆర్తికి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా? అన్నదానిపై హీరో స్పందిస్తూ.. నాకు విడాకులు కావాలి. ఒకవేళ ఆర్తి విడాకులు వద్దనుకుంటే, తను అన్నట్లుగా కలిసుందామనుకుంటే ఇంతవరకు నన్నెందుకు కలవలేదు. నేను పంపించిన రెండు లీగల్ నోటీసులకు ఎందుకు స్పందించలేదు? తనకు రాజీ పడాలన్న ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదే! అని బదులిచ్చాడు.
రెండింటికీ ఏం సంబంధం?
సింగర్, స్పిరిచ్యువల్ హీలర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందిస్తూ.. అసలు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయి? అనవసరంగా మూడో వ్యక్తిని ఇందులోకి లాగుతున్నారు. నేను కెనీషాతో కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం మంచి లొకేషన్ వెతుకుతున్నాం. నా విడాకులకు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ పుకార్ల వల్ల మా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి అని తెలిపాడు.
పోరాడుతూనే ఉంటా
పిల్లల గురించి మాట్లాడుతూ.. పిల్లల కస్టడీ నాకే కావాలి. పదేళ్లయినా, ఇరవయ్యేళ్లు పట్టినా సరే.. ఆరవ్, అయాన్‌లు నాకు దక్కేవరకు పోరాడతాను. వాళ్లే నా సంతోషం. ఆరవ్‌తో కలిసి ఆరేళ్ల క్రితం టిక్ టిక్ టిక్ మూవీ చేశాను. ఆ సినిమా సక్సెస్‌మీట్‌లో ఎంత సంతోషపడ్డానో! ఇప్పుడు నిర్మాతగా మారి తనతో సినిమా తీయాలనుకుంటున్నాను. విడాకులంటారా? ఈ విషయంలో నేను వెనక్కు తగ్గను అని కుండబద్ధలుట్టేశాడు.
చదవండి: నా అనుమతి లేకుండా ముఖ్యమైన సీన్స్ కాపీ చేశారు, బాధేసింది!
Comments
Please login to add a commentAdd a comment