నా అనుమతి లేకుండా కాపీ కొట్టారు: శంకర్‌ ఆవేదన | Director Shankar Serious about Copying Veerayuga Nayagan Velpari Novel Points | Sakshi
Sakshi News home page

Director Shankar: నా అనుమతి లేకుండా ముఖ్యమైన సీన్స్‌ కాపీ చేశారు, బాధేసింది!

Published Sun, Sep 22 2024 6:26 PM | Last Updated on Sun, Sep 22 2024 6:27 PM

Director Shankar Serious about Copying Veerayuga Nayagan Velpari Novel Points

తాను హక్కులు పొందిన ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడేశారని దర్శకుడు శంకర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కాపీ రైట్స్‌ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 'ముఖ్య గమనిక! వెంకటేశన్‌ రాసిన తమిళ నవల వీర యుగ నాయగన్‌ వేళ్‌ కాపీరైట్స్‌ నావే.. నా అనుమతి లేకుండా చాలా సినిమాల్లో ఈ నవలలోని కీలక సన్నివేశాలను ఇష్టానుసారం వాడేస్తున్నారు. 

ఇక చాలు, ఆపేయండి
ఇప్పుడు లేటెస్ట్‌ సినిమా ట్రైలర్‌లోనూ ఓ ముఖ్యమైన సీన్‌ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్‌ సిరీస్‌.. ఇలా ఏ ఇతర ప్లాట్‌ఫామ్‌లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీ రైట్స్‌ ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని రాసుకొచ్చాడు. 

సినిమా సంగతులు..
ఇది చూసిన నెటిజన్లు ఇంతకీ నవలను కాపీ కొట్టిన సినిమా ట్రైలర్‌ ఏదో చెప్పి ఉండాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శంకర్‌.. సూపర్‌ హిట్‌ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కించిన భారతీయుడు 2తో ఫ్లాప్‌ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్‌, కియారా అద్వాణీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కానుంది.

 

 

చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement