Director Shankar
-
డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే భయపడుతున్న హీరోలు
-
భారతీయుడు -3 మాత్రమే లాస్ట్ ఛాన్స్?
-
రజనీకాంత్ బయోపిక్.. శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!
‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పక్కనోడి పనిలో తలదూర్చి, అతన్ని ఇబ్బంది పెట్టి, ఆయన పనిని ఆయన చేయనివ్వకుండా, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయి’.. కొరటాల చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. కట్ చేస్తే.. దర్శకుడు శంకర్ కూడా ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.శంకర్ షణ్ముగం.. టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న దర్శకుల్లో ఒకడు. అందులో ఎలాంటి డౌటు అక్కర్లేదు. కానీ, రైటర్ సుజాత(ఎస్.రంగరాజన్) మరణంతో ఆయనకు కుడి భుజం పోయినంత పనైంది. అప్పటిదాకా సెన్సేషన్ బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ఘోరంగా తడబడుతూ వరుస ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. అలాంటి బ్యాడ్ ఫేజ్‌లో విజయ్‌తో సినిమా తప్పింది. ఆపై వెంటనే రాం చరణ్‌తో సినిమా అనౌన్స్ అయ్యింది. గుడ్. శంకర్ సినిమా అంటే కేవలం పాటలకే కోట్లు ఖర్చవుతుంది. మరి అంత భరించే నిర్మాత ఎవరు?. వెంటనే తెరపైకి వెంకట రమణారెడ్డి(దిల్ రాజు) పేరొచ్చింది. వెరీ గుడ్. ఈ మధ్య శంకర్ సినిమాల్లో సుజాత టచ్ లేకపోవడంతో కథలతో పాటు డైలాగుల్లోనూ డెప్త్ లేకుండా పోయింది. అందుకోసం చిరు, బాలయ్య, పీకేలాంటి స్టార్లకు డైలాగులు రాసే సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారు.. వెరీ వెరీ గుడ్. శంకరే స్వయంగా అడిగాడో లేకుంటే శంకర్ మీద నమ్మకం లేకపోవడం వల్లనో మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథతో సినిమా తీసేశారు. ప్చ్.. ఇక్కడ కట్ చేస్తే..సాధారణంగా తాను ఎంత గ్రాండ్‌గా సినిమా తీసినా రెండు, మూడేళ్లకు మించి టైం తీసుకోడు శంకర్(Director Shankar). అలాంటిది గేమ్ ఛేంజర్ కోసం నాలుగేళ్ల టైం తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ టైంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలైతే.. 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ గ్యాప్‌లో ఇండియన్-2, ఇండియన్-3లపై కూడా ఆయన పని చేయడం.. అంతకు ముందు 2.0 తర్వాత ఆరేళ్ల గ్యాప్ రావడంతో లెక్క సరిపోయిందనుకుందాం. మరి 2024 సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్.. ఎందుకు పోస్ట్‌పోన్ అయినట్లు?. ఎంత పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా, ఇతరత్ర కారణాలైనా.. మరీ ఏడాదిపాటు టైం పడుతుందా?. గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడంటూ ఆ మధ్య రేగిన పుకార్లు కొంపదీసి నిజం కాదు కదా?. .. టీఎఫ్ఐ(TFI)లో జరిగే పరిణామాలపై సోషల్‌మీడియాలోనూ, సగటు సినీ అభిమానుల్లోనూ ఓ చర్చ నడుస్తుంటుంది. కథ దగ్గరి నుంచి హీరోయిన్ల ఎంపిక, ఆఖరికి దర్శకత్వంలోనూ కొందరు హీరోలు, పెద్దలు వేలు పెడుతుంటారని!. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అయితే గేమ్ ఛేంజర్‌కు అదనంగా ‘రాజకీయ జోక్యం’ తోడైందన్న అనుమానాలు చిత్ర ట్రైలర్ చూశాక కలగకమానదు.గేమ్ ఛేంజర్(Game Changer) ఓ పొలిటికల్ థ్రిల్లర్ అనే విషయం ట్రైలర్ చూస్తే ఎవరి అర్థమైపోతుంది. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా.. అంతే అతిగా అనిపించాయి కూడా. శంకర్ ఎప్పుడో నాలుగేళ్ల కింద రాసుకున్న కథలో సీన్లు.. ఏపీ రాజకీయాల్లో రియల్‌గా జరిగాయట!. వాటినే తెర మీద ఆడియొన్స్ చూడబోతున్నారట. రాజకీయ పార్టీ స్థాపన, ఈవీఎంల అంశం, పొలిటికల్ నేతల పేర్లు, ఎన్నికల్లో గెలుపు, రేషన్ బియ్యం, అవినీతి మీద పోరాటమంటూ డైలాగులు.. ఇవన్నీ పరిణామాలు ఈ మధ్య ఏడాదికాలంలో చూసినవే కదా!. వీటిల్లో పవన్ రిఫరెన్స్‌లు, పైగా ఏపీ కూటమికి సరిపోయేవే ఉన్నాయి కదా. అలాంటప్పుడు తనది కాని కథలో శంకర్ ఇవన్నీ నాలుగేళ్ల కిందటే ఎలా జొప్పించి ఉంటాడంటారు?. ఇవి ఎవరినో ప్రత్యేకంగా మెప్పించడానికి జొప్పించినట్లు లేదు!.పోనీ.. దిల్ రాజ్(Dil Raju) అతిశయోక్తికి పోయి ఆ కామెంట్ చేసి ఉంటాడు అనుకున్నా.. రేపు థియేటర్లలో సినిమా చూసే ఆడియొన్స్‌కు అర్థం కాదని అంటారా?. ఏది ఏమైనా తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్‌గా ఉన్న దిల్‌రాజు.. రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ కోరడం, అదే సమయంలో ఏపీకి వెళ్లి మరీ పవన్‌ను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇక ఎలాగూ ఏపీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ హాజరుకానున్నారు. ఆ ఈవెంట్లో పొలిటికల్‌గా జాకీలు పెట్టి లేపే ప్రోగ్రాం ఉండక పోదు!. ఇదంతా చూస్తుంటే.. ‘‘జనానికి ఇప్పుడు నీ అవసరం ఉంది. పగిలేకొద్దీ గ్లాసు పదునెక్కుద్ది’’ తరహా సంభాషణల్లాగే.. గేమ్ ఛేంజర్‌లో ‘సీజ్ ద షిప్’ లాంటి రిఫరెన్స్‌లు, డైలాగులు వగైరాలాంటివి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇవన్నీ ఎందుకు అసలు సినిమానే ఆయనతో తీసి ఉంటే సరిపోయేది కదా!. -
నా కల నెరవేరింది: తమన్
‘‘బాయ్స్’ (2003) సినిమా సమయంలో శంకర్‌గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్ చేంజర్’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.ఈ సందర్భంగా శుక్రవారం తమన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి.తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్‌లో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’లో ఆరు పాటలుంటాయి. ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్‌ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్–డైరెక్టర్ త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్ స్కూల్ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు. -
రెండు దశాబ్దాల తర్వాత...
రెండు దశాబ్దాల తర్వాత హీరోలు విక్రమ్, సూర్య కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది. తమిళ రచయిత ఎస్యు వెంకటేశన్ రాసిన ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవల హక్కులు ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఉన్నాయి. ఈ నవల ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారట శంకర్. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీయనున్నారని, ఇందులో విక్రమ్–సూర్య హీరోలుగా నటించనున్నారని కోలీవుడ్ టాక్.2003లో వచ్చిన ‘పితాగమన్’ (తెలుగులో ‘శివపుత్రుడు’) చిత్రం తర్వాత సూర్య, విక్రమ్ కలిసి నటించలేదు. మరి... 21ఏళ్ల తర్వాత శంకర్ సినిమా కోసం వీరిద్దరూ కలిసి మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాతనే ‘వీరయుగ నాయగన్ వేళ్‌పారీ’ నవలను సినిమాగా తీసే పనులపై శంకర్ పూర్తి స్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్నారని కోలీవుడ్ భోగట్టా. -
నా అనుమతి లేకుండా కాపీ కొట్టారు: శంకర్ ఆవేదన
తాను హక్కులు పొందిన ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా వాడేశారని దర్శకుడు శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాపీ రైట్స్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టాడు. 'ముఖ్య గమనిక! వెంకటేశన్ రాసిన తమిళ నవల వీర యుగ నాయగన్ వేళ్ కాపీరైట్స్ నావే.. నా అనుమతి లేకుండా చాలా సినిమాల్లో ఈ నవలలోని కీలక సన్నివేశాలను ఇష్టానుసారం వాడేస్తున్నారు. ఇక చాలు, ఆపేయండిఇప్పుడు లేటెస్ట్ సినిమా ట్రైలర్లోనూ ఓ ముఖ్యమైన సీన్ వాడేశారు. అది చూసి చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్.. ఇలా ఏ ఇతర ప్లాట్‌ఫామ్‌లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీ రైట్స్ ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని రాసుకొచ్చాడు. సినిమా సంగతులు..ఇది చూసిన నెటిజన్లు ఇంతకీ నవలను కాపీ కొట్టిన సినిమా ట్రైలర్ ఏదో చెప్పి ఉండాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శంకర్.. సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కించిన భారతీయుడు 2తో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్, కియారా అద్వాణీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్లో విడుదల కానుంది. Attention to all ! As the copyright holder of Su. Venkatesan’s iconic Tamil novel "Veera Yuga Nayagan Vel Paari", I'm disturbed to see key scenes being ripped off & used without permission in many movies. Really upset to see important key scene from the novel in a recent movie…— Shankar Shanmugham (@shankarshanmugh) September 22, 2024 చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటు -
భారతీయుడు 3 రిలీజ్ అవుతుందా.. లేదా..!
-
ఓటీటీలో భారతీయుడు-2 రిలీజ్.. శంకర్ ను తిట్టిపోస్తున్న నెటిజెన్స్..
-
ఫ్యాన్స్ ఎదురుచూపులను నీరుగార్చిన శంకర్
-
భారతీయుడు 2 తీయడానికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే..
-
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్‌కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్‌తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
పది రోజులతో ఆట పూర్తి
‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ మూవీ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ మరోసారి ‘గేమ్ చేంజర్’లో జోడీగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు శంకర్ ఓ అప్డేట్ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ క్లైమాక్స్‌కు చేరుకుంది.కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ (కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 12న రిలీజ్ కానుంది) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. ఆ సినిమా విడుదలయిన తర్వాత ‘గేమ్ చేంజర్’ షూటింగ్ పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఫుటేజ్ చూసి పో స్ట్ప్రోడక్షన్ పనులు మొదలుపెడతాం. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్‌జె సూర్య, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ రాజకీయ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. -
ట్రైలర్ రెడీ
హీరో కమల్ హాసన్ , దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్‌హాసన్ అండ్ శంకర్. లైకాప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్ 2’ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ ట్రైలర్ విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.సిద్ధార్థ్, ఎస్జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. కాగా ‘ఇండియన్ 3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
శంకర్ రూట్ ను ఎంచుకున్న సుకుమార్
-
ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...
-
ఇండియన్ 2 కోసం కష్టపడ్డానన్న కాజల్.. సినిమాలో ఆమె పాత్ర లేదన్న డైరెక్టర్
తల్లయ్యాక హీరోయిన్గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అంతకుముందున్న క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కత్తిమీద సామే అవుతుంది. కానీ బాలీవుడ్లో మాత్రం అలియా భట్, కరీనా కపూర్, కాజోల్.. ఇలా పలువురూ తల్లయ్యాక కూడా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు. సౌత్‌లో నయనతారను మినహాయిస్తే మరెవరికీ తల్లిగా ప్రమోషన్ పొందాక గొప్ప క్యారెక్టర్లు రావడం లేదు. బహుశా అందుకేనేమో చాలామంది బ్యూటీలు పెళ్లంటేనే వెనకడుగు వేస్తున్నారు.మా కోసం కథలు రాసుకుంటేనే..తాజాగా ఈ ధోరణిపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. దక్షిణాదిన ఇంకా కొన్ని పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అది త్వరలోనే మారుతుందని ఆశిస్తున్నాను. పెళ్లయి పిల్లలున్నప్పటికీ మేము ఏ పాత్రనైనా పోషించగలం. మమ్మల్ని శక్తివంతంగా చూపించే పాత్రలు మేకర్స్ డిజైన్ చేయాలి. వీళ్లు అలాంటి కథలు రాసుకుంటేనే కదా ప్రేక్షకులు చూసేది. కొంతవరకు పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఉదాహరణకు నయనతారనే తీసుకుంటే తను సెలక్ట్ చేసుకునే సినిమాలు చాలా బాగుంటాయి. యాక్షన్ రోల్స్, రొమాంటిక్ రోల్స్ ఇలా తనకు నచ్చినవి చేస్తోంది.డెలివరీ అవగానే సినిమాలో..నా విషయానికి వస్తే.. నేను కరోనాకు ముందే కొన్ని సినిమాలకు సంతకం చేశాను. వాటిని దాదాపు పూర్తి చేశాక ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ అవగానే ఇండియన్ 2 సినిమాలో పని చేయాల్సి వచ్చింది. ఇందులో నా జీవితంలోనే కష్టమైన పాత్రను పోషించాను. డైరెక్టర్ శంకర్ సర్ నాకోసం ఎదురుచూసి లాస్ట్ షెడ్యూల్‌కు రమ్మన్నాడు. ఎంతో కష్టంగా ఉన్న నా పాత్రను పూర్తి చేసేశాను అని చెప్పుకొచ్చింది.ఇండియన్ 2లో కాజల్ లేదుశనివారం (జూన్ 1న) జరిగిన ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో డైరెక్టర్ శంకర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కార్యక్రమం వేదికగా భారతీయుడు 2లో కాజల్ లేదని వెల్లడించాడు. తను మూడో భాగంలో ఉంటుందని తెలిపాడు. అసలు తనను తీసేసిన విషయం కాజల్కైనా తెలుసా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ 2లో ఆమె లేదని తేల్చేయడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం జూలై 12న గ్రాండ్‌గా విడుదల కానుంది.చదవండి: వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు! -
భూతల్లి పై ఒట్టేయ్...
‘శౌర..’ అంటూ చైతన్య గీతం పాడారు సేనాపతి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో విడుదలైన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ (‘భారతీయుడు 2, 3’)’ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ్ర΄÷డక్షన్స్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక జూన్ 1న చెన్నైలో జరగనుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘భూతల్లి పై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్...’ అంటూ సాగే తెలుగు పాట ‘శౌర..’కు సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించగా, రితేష్ జి. రావ్, శ్రుతికా సముద్రాల పాడారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ చిత్రం విడుదల కానుంది. -
శంకర్ ఇండియన్ 2 సినిమా పై భారీ ప్లాన్
-
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
మళ్లీ డిజప్పాయింట్ చేసిన శంకర్..
-
గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 తో బాక్స్ ఆఫీస్ బద్దలు.
-
శంకర్ ను టార్గెట్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్
-
వేసవిలో వస్తున్నాడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. వీరి కాంబినేషన్లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల చెన్నైలో మొదలైన ‘ఇండియన్ 2’ భారీ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసిందని, ఈ షూటింగ్ షెడ్యూల్‌తో టాకీ పార్టు పూర్తయిందని సమాచారం. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను కూడా చిత్రీకరిస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. -
శంకర్ కు షాక్..బుచ్చిబాబు సినిమాపై చరణ్ ఫుల్ ఫోకస్..
-
విజయవాడకు భారతీయుడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో కమల్, శంకర్ కాంబినేషన్లోనే రూపొంది, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ విజయవాడలో ్రపారంభం కానున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ దర్శకుడు శంకర్ కొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణను ΄్లాన్ చేశారు. అలాగే విజయవాడ షెడ్యూల్ తర్వాత వైజాగ్‌లో కూడా కొంత షూటింగ్ జరుగుతుందని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘ఇండియన్ 2’కు కొనసాగింపుగా ΄్లాన్ చేసిన ‘ఇండియన్ 3’ షూటింగ్‌ను కూడా ఆల్రెడీ శంకర్ ఆరంభించారని, ఇందుకు కమల్ అదనంగా 40 రోజుల కాల్షీట్స్ను కేటాయించవలసి వచ్చిందని భోగట్టా. ‘ఇండియన్ 2’ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో, ‘ఇండియన్ 3’ని దీపావళికి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. -
తమిళ స్టార్ డైరెక్టర్స్‌తో రామ్‌చరణ్.. ఎందుకు కలిశాడు?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. అలానే తన తర్వాతి చిత్రం కోసం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి పనిచేయబోతున్నాడు. దీని తర్వాత చేయబోయే మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ లాంటి దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?) ఇలా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో తమిళ టాప్ డైరెక్టర్స్‌తో కలిసి రామ్ చరణ్ కనిపించాడు. దీనికి కారణం దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడం. 'గేమ్ ఛేంజర్' సెట్లో ఆల్రెడీ బర్త్ డే జరుపుకొన్న శంకర్.. చెన్నై స్పెషల్‌గా పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, వెట్రిమారన్, వెంకట్ ప్రభు, ఎస్జే సూర్య లాంటి దర్శకులు కనిపించారు. అయితే ఇది కేవలం పార్టీగా అయితే ఉండిపోదు. బహుశా ఈ దర్శకుల్లో చరణ్ తో సినిమా చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు. కాబట్టి త్వరలో చరణ్-మరో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) -
7 పాత్రలా...రామ్ చరణ్ ని ముంచుతారా ? తేలుస్తారా ?
-
కూతురికి కండీషన్ పెట్టిన డైరెక్టర్ శంకర్.. పెళ్లి కోసమే!
హీరోయిన్ అదితి శంకర్.. స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా సినీ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఇప్పటికి కథానాయికగా చేసింది రెండు చిత్రాలే అయినా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన అదితి శంకర్ తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాశ్ మురళి హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నటిస్తోంది. సేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఇందులో విష్ణు విశాల్‌తో జత కట్టనుంది. కాగా ఎంబీబీఎస్ చదివిన అదితి శంకర్‌కు డాక్టర్ కావాలన్నది ఆమె తల్లిదండ్రుల ఆకాంక్ష అని తెలుస్తోంది. చాలా చలాకీగా ఉండే అదితి శంకర్‌కు సినిమాలపై ఆసక్తి ఏర్పడడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిందని సమాచారం. అయితే అదితి శంకర్ నటించడానికి అంగీకరించిన ఆమె తండ్రి శంకర్ ఓ కండిషన్ పెట్టారట. రెండేళ్ల వరకూ నువ్వు ఎన్ని చిత్రాల్లో అయినా నటించు.. ఆ తరువాత కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని తేల్చిచెప్పారట. అందుకనే ఈ తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేయాలని అదితి తహతహలాడుతోందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే డైరెక్టర్ శంకర్ ఇలాంటి కండీషన్ పెట్టాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు. బహుశా ఇది వుట్టి పుకారు మాత్రమే అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. లేదంటే తన ప్రతిభను చూశాకైనా శంకర్ ఈ కండీషన్ ఉపసంహరించుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. చదవండి: కోర్టు గొడవల్లో భోళా శంకర్ -
చేసింది రెండే సినిమాలు.. క్యూ కడుతోన్న ఆఫర్లు!
కోలీవుడ్ భామ అదితి శంకర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కూతురిగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర సక్సెస్ అదితి శంకర్‌కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో జతకట్టిన మావీరన్ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది. (ఇది చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) తాజాగా ఈ భామ అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సెల్వరాగం దర్శకత్వంలో తెరకెక్కనున్న 7జి రెయిన్బో కాలనీ–2లో ఈ చిన్నదే నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా అదితి శంకర్‌కు మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా అప్డేట్. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ కుమార్ తాజాగా నటుడు విష్ణు విశాల్ హీరోగా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలోనూ అదితి శంకర్ నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆయన తెలుపుతూ నటి అదితి శంకర్ తమ చిత్ర కథను విన్నారని ఆమె ఇందులో కథానాయకగా నటించనున్నారని తెలిపారు. కాగా ఇంతకుముందు విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన ముండాసు పట్టి, రాక్షసన్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతోందన్నమాట. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్! ) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
సినిమా ఇండస్ట్రీకే గేమ్ ఛేంజర్.. 30 ఏళ్లుగా టాప్ దర్శకుడిగా..
చిత్ర పరిశ్రమలో అందరూ సినిమాను ప్రేమించే వారే. అయితే సినిమానే శ్వాసగా భావించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు శంకర్ ఒకరు. తొలి చిత్రంతోనే స్టార్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన తొలి చిత్రం జెంటిల్మెన్. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై ఆదివారం (జూలై 30) నాటికి 30 వసంతాలు పూర్తి చేసుకుంది. తొలి ప్రయత్నంలోనే శంకర్ ఒక బలమైన సామాజిక అంశాన్ని తీసుకొని కమర్షియల్ అంశాలు చొప్పించి ప్రయోజనాత్మక, జనరంజక కథా చిత్రంగా జెంటిల్మెన్ను మలిచారు. ఆ తర్వాత కూడా శంకర్ తన చిత్రాల్లో సామాజిక అంచాలను తెరపై ఆవిష్కరించడాన్ని విస్మరించలేదు. ఇక ఒక దర్శకుడిగా 30 ఏళ్ల క్రితం ఉదయించిన శంకర్ ఇప్పటికి 13 చిత్రాలు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఈయన తమిళంలో ఇండియన్– 2, తెలుగులో గేమ్ ఛేంజర్ చిత్రాలను చేస్తున్నారు. అలా తక్కువ చిత్రాలు చేసినా నేడు టాప్ 10 దర్శకుల్లో ఒకరిగా రాణించటం శంకర్‌కే చెల్లింది. ఇప్పటి వరకు ముదల్ వన్, బాయ్స్, ఇండియన్, ఎందిరన్, శివాజీ, రోబో –2, నన్బన్ తదితర చిత్రాలు బ్రహ్మాండానికి నిదర్శనంగా నిలిచాయి. అందుకే శంకర్‌ను బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు అని పేర్కొంటారు. కాగా జెంటిల్మెన్ చిత్రం 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శిష్య బృందం (జెంటిల్మెన్ , ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాలకు పనిచేసిన సిబ్బంది) ఆదివా రం చైన్నెలోని శంకర్ కార్యాలయంలో ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ వేడుకలో శంకర్ పాల్గొని కేకను కట్ చేశారు. A true #GameChanger in Indian Film Industry ❤️🔥 Congratulations @shankarshanmugh sir for completing 30 splendid years. Here's to more exemplary work and accolades that await you.😊 pic.twitter.com/KSWSHa91j6 — Ram Charan (@AlwaysRamCharan) July 30, 2023 చదవండి: ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బాలీవుడ్ జంట -
ఇండియన్ 3.. ఆన్ ది వే!
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాగా శంకర్ మూడో భాగాన్ని కూడా ప్లాన్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘ఇండియన్ 2’ షూటింగ్ పూర్తయిందని, ‘ఇండియన్ 3’ షూటింగ్ కూడా 70 శాతం పూర్తయిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ‘ఇండియన్ 2’ విడుదలైన ఏడాది తర్వాత ‘ఇండియన్ 3’ రిలీజ్ అవుతుందని భోగట్టా. -
భారతీయుడు 3 ఫిక్స్... హీరో ఎవరంటే?
-
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్‌కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్‌హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్‌హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్‌తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్‌తో మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్‌లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్‌ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్‌గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్‌లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!
-
ప్రభుదేవాతో ఆ పాట చేయడానికి కారణం ఎవరంటే..
-
1200 మంది ఫైటర్స్‌తో గేమ్ చేంజర్...
-
రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన శంకర్
ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ శంకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. చదవండి: 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిపోయిందని, ఇప్పుడు తన ఫోకస్ ఇండియన్-2 సినిమాకు షిఫ్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఆయన రామ్‌చరణ్‌తో గేమ్ ఛేంజర్, కమల్‌హాసన్‌తో ఇండియన్-2 సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్-2 విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఇండియన్-2పై ఫోకస్ పెట్టనున్నారు శంకర్. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్ Wrapped up #GameChanger ‘s electrifying climax today! Focus shift to #Indian2 ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet — Shankar Shanmugham (@shankarshanmugh) May 9, 2023 -
అఫీషియల్: శంకర్ డైరెక్షన్లో ఛాన్స్ కొట్టేసిన హీరో సిద్దార్థ్..
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ఇండియన్-2 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. నేడు(సోమవారం)సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్‌ను అందిస్తూ సిద్దార్థ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, బాబి సింహ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Team #INDIAN2 🇮🇳 wishes Mr. Charming & multi talented #Siddharth 🤩 a Happy B'day 🥳 & a fabulous year ahead ✨ 🌟 @ikamalhaasan 🎬 @shankarshanmugh 🪙 @LycaProductions @RedGiantMovies_ 🎶 @anirudhofficial 🌟 #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha 📽️… pic.twitter.com/VkBQ5SJ3nr — Lyca Productions (@LycaProductions) April 17, 2023 -
గేమ్ చేంజర్ అదిరిపోయే అప్డేట్.. మెగా ఫ్యాన్స్‌కి డబుల్ బొనాంజా
-
‘ఇండియన్ 2’.. తైవాన్ టు సౌతాఫ్రికా
తైవాన్‌కు బై బై చెప్పాడు భారతీయుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, బెనెడిక్ట్ గారెట్, గుల్షన్ గ్రోవర్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల తైవాన్‌లో మొదలైన ‘ఇండియన్ 2’ షెడ్యూల్ ముగిసింది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కమల్‌హాసన్ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలతో పాటు విదేశీ ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. తైవాన్ షెడ్యూల్ తర్వాత యూనిట్ సౌతాఫ్రికా వెళ్తుందని, అక్కడి లొకేషన్స్‌లో మరో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసిందనికి వినికిడి. ఈ చిత్రాన్ని సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నిర్మిస్తున్నారు. -
ఇండియన్ 2 మూవీ టార్గెట్ ఫిక్స్
భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్‌లో జరుగుతోంది. కమల్ హాసన్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రామ్‌చరణ్-శంకర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. టైటిల్ రివీల్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ(సోమవారం)రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్ చేసేశారు. ప్రస్తుతం RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గేమ్ ఛేంజర్ అంటూ ఈ పాన్ ఇండియా చిత్రానికి పేరు పెట్టిన మేకర్స్ మరో అప్డేట్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. చరణ్ బర్త్‌డే సందర్భంగా డబుల్ ధమాకాగా ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇవాళ మధ్యాహ్నం 3.06 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానులను మరింత ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. #GAMECHANGER it is…💥💥https://t.co/avGa74S8vH Mega Powerstar @alwaysramcharan @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/2htttRsvPx — Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023 -
రామ్ చరణ్‌కు ఆర్సీ15 టీం సర్ప్రైజ్.. సెట్లో ఘనంగా బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
-
RC15 సెట్స్‌లో అదిరిపోయిన రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెస్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. ఇక రేపు(సోమవారం)రామ్‌చరణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పటికే వేడుకలు మొదలయ్యాయి.RC15 సెట్స్‌లో యూనిట్ సభ్యుల మధ్య రామ్‌చరణ్ తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. చరణ్ ఎంట్రీ కాగానే అతనిపై గులాబీల వర్షం కురిపించారు. అనంతరం కేక్‌కట్ చేయించారు. ఈ వేడకలో శంకర్, దిల్‌రాజు, కియారాలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by ram charan. RC (@rc_15_love_) Global star @AlwaysRamCharan birthday celebrations begins #RC15 #GlobalStarRamCharan #Ramcharan pic.twitter.com/CqnpfZeBuJ — SivaCherry (@sivacherry9) March 25, 2023 -
శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్? రూ. 900కోట్ల బడ్జెట్!
భారీ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు శంకర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. కమలహాసన్, రజనీకాంత్‌తో భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ అయిన దర్శకుడు ఈయన. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా తొలిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటుడు రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శంకర్ తరువాతి చిత్రం ఏమిటి అన్న ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆయన రూ.900 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి శస్త్ర అ్రస్తాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి క్రేజీ కాంబినేషన్‌ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఆ క్రేజీ కాంబినేషన్ దళపతి విజయ్, బాద్షా షారుక్ ఖాన్. ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను తీసుకునే దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి అండర్ వాటర్‌లో జరిగే విజ్ఞానాన్ని కథగా తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కోలీవుడ్‌కు సుపరిచితుడే. ఈయన చాలా కాలం క్రితమే కమలహాసన్ కథానాయకుడిగా నటించిన హేరామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈయన నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక దళపతి విజయ్ ఇంతకుముందే శంకర్ దర్శకత్వంలో నన్బన్ చిత్రంలో నటించారు. విజయ్ తాజాగా నటించిన వారిసు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ విడుదలైంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే షారుక్ ఖాన్‌కు విజయ్‌కు మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న హిందీ చిత్రం జవాన్‌లో విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో షారుక్ ఖాన్, విజయ్ కాంబినేషన్లో చిత్రం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
తిరుపతిలో భారతీయుడు
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ని రూపొందిస్తున్నారు. కమల్–శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ఇటీవల చెన్నైలో జరిగింది. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కాజల్ న్యూలుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు
సాధారణంగా హీరోయిన్లు స్లిమ్‌గా, నాజూగ్గా తయారు అవడానికే ఇష్టపడుతుంటారు. అందుకు తగిన కసరత్తు కూడా చేస్తుంటారు. బరువు పెంచడం అన్నది అతి తక్కువ మంది నటీమణులే చేస్తుంటారు. కాజల్ అగర్వాల్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ నటనకు స్వస్తి చెప్తారని అందరూ భావించారు. ఆమె ఇంతకుముందు నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్– 2 చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు, ఆ పాత్రలో మరో నటిని ఎంపిక చేయడానికి దర్శకుడు శంకర్ సిద్ధమైనట్టు ప్రచారం కూడా జరిగింది. అందరి ఊహలను తలకిందులు చేస్తూ కాజల్ అగర్వాల్ తల్లి అయిన మూడు నాలుగు నెలలకే నటించడానికి సిద్ధమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె మరింత అందంగా తయారవ్వడం విశేషం. ఈమె కమలహాసన్ జంటగా ఇండియన్ – 2 చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. అందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందింది. తాజాగా కాజల్ అగర్వాల్ కాస్త బరువెక్కింది. ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పొందుపరిచింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇండియన్– 2 చిత్రంలో కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు నటి కాజల్ బరువు పెరగడానికి ఈ చిత్ర కథకు సంబంధం ఉందనే ప్రచారం సాగుతోంది. -
ఆ లుక్ కోసం ఆహారం మానేసిన కమల్! కేవల పండ్ల రసాలతోనే..
‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ తాజాగా ‘ఇండియన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ‘ఇండియన్’ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘ఇండియన్’లో సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో నటించారు కమల్‌హాసన్. అయితే ‘ఇండియన్ 2’ కథను మాత్రం సేనాపతి, అతని తండ్రి పాత్రల నేపథ్యంలో (1920 సమయంలో...) సాగుతూనే, మరోవైపు ఇప్పటి కాలం కూడా టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. అలాగే ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ పాత్రలో తొంభైసంవత్సరాల వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కమల్ ఆహారం తీసుకోవడంలేదట. ప్రొస్థటిక్ మేకప్ వాడడంతో నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితుల్లో షూటింగ్ అప్పుడు కేవలం పండ్ల రసాలతో సరిపెట్టుకుంటున్నారట. -
RC15 : న్యూజిలాండ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసిన రామ్‌చరణ్, కియారా
న్యూజిలాండ్‌కి బై బై చెప్పారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్, కియారాలపై బాస్కో వర్టిస్ కొరియోగ్రఫీలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశారు. ‘న్యూజిలాండ్‌లో సాంగ్ షూటింగ్ పూర్తయింది. అద్భుతమైన విజువల్స్ వచ్చాయి’’ అని బుధవారం ట్వీట్ చేశారు రామ్‌చరణ్. కాగా ఈ పాట చిత్రీకరణకు దాదాపు రూ.15కోట్లు ఖర్చుచేశారట చిత్రయూనిట్. సో.. ఈ సాంగ్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉండనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
శంకర్- రామ్‌చరణ్ సినిమా; పది కోట్ల పాట?
దర్శకుడు శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా చాలా గ్రాండియర్‌గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ మరో గ్రాండియర్ సాంగ్‌ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్ పది కోట్ల బడ్జెట్‌తో పాట ప్లాన్ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్‌చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై గ్రాండ్‌గా డ్యూయట్ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్‌ను కేటాయించారట. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రామ్‌చరణ్‌కు భార్యగా అంజలి.. లీకైన ఫోటోలు
ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లో ఉన్నారట రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, జయరామ్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్, అంజలిపై కీలక సన్నివేశాలను తీస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరో వారం పాటు అక్కడి లొకేషన్స్‌లోనే సాగుతుందట. అయితే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వస్తాయని, 1930 కాలం నేపథ్యంలో ఈ సీన్స్‌లో రామ్‌చరణ్, అంజలి భార్యభర్తలుగా కనిపిస్తారనే ప్రచారం వినిపోస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట లీక్ అయ్యాయి. అంతేకాదు. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. -
సూర్య హీరోగా రూ. 1000కోట్ల బడ్జెట్‌తో శంకర్ సినిమా
తమిళసినిమా: ఈ ఆధునిక యుగంలో ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగా దర్శక నిర్మాతలు కథలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. అయితే దర్శకుడు శంకర్ తన చిత్రాల కథల విషయంలో మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జెంటిల్మెన్ నుంచి 2.ఓ చిత్రం వరకు ఈయన చిత్రాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో రా మ్చరణ్ కథానాయకుడిగా చేస్తున్న చిత్రంతో పాటు తమిళంలో కమలహాసన్ హీరోగా ఇండియన్–2 చిత్రాన్ని చేస్తున్నారు. వీటి తరువాత పొన్నియన్ చిత్ర హిందీ రీమేక్‌కు సిద్ధం అవుతారని సమాచారం. ఆ తరువాత రూ. 1000 కోట్ల బడ్జెట్లో ఒక చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. లోక్‌సభ సభుయడు ఎస్.వెంకటేశ్ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి నవలను చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీని స్క్రీన్‌ప్లేను వెంకటేశ్, శంకర్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దీనిని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రంలో సూర్య కథానాయకుడుగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రం, శివ దర్శకత్వంలో తాను 42వ చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చేయాల్సి ఉంది. ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో నటించే అవకా శం ఉందని టాక్. ఇలాంటి చారిత్రక కథా చిత్రాలు కోలీవుడ్‌లో వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు రూపొంది సంచలన విజయం సాధించాయి. వాటి ఇన్సిఫిరేషన్తోనే శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే ఇంకా చాలా టైమ్ ఉంది. -
వచ్చే నెలలో వైజాగ్‌లో...
హీరో రామ్‌చరణ్– డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ని సెప్టెంబరులో ఆరంభించనున్నట్లు అప్డేట్ ఇచ్చారు శంకర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్లో ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు బంద్ కావడంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. సెప్టెంబర్ 1నుంచి తిరిగి షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్–శంకర్ సినిమా కూడా రీ స్టార్ట్ కానుంది. ‘‘ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2, రామ్ చరణ్‌తో ‘ఆర్సి 15’ సినిమాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం. ‘ఆర్సి 15’ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్‌లో జరగనుంది. సెప్టెంబర్ తొలి వారంలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
'ఆ హీరోతో నటించొద్దు'.. కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్
పెళ్లై అత్తవారింటికి వెళ్లే వరకు కూతుళ్లకు తమ రక్షణ అవసరమని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఇలానే భావించారన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్ విద్యను అభ్యసించారు. అందులో పెద్ద కూతురు అదితి శంకర్. ఈమెకు సినిమా హీరోయిన్ కావాలన్నది చిరకాల వాంఛ. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది ఆమె తండ్రి దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని అదితి శంకర్‌నే విరుమాన్ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా పేర్కొన్నారు. అయితే హీరోయిన్గా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడుతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్ అంగీకరించాట. అయితే ఆయనకు అసలు టెన్షన్ ఆ తరువాతే మొదలైందట. తొలి చిత్రాన్ని పూర్తి చేసిన అదితి శంకర్ తర్వాత శింబు కథానాయకుడుగా నటించే కరోనా కుమార్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట. ఇది దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ చిత్రంలో నటించరాదని కూతురికి చెప్పినట్లు సమాచారం. అందుకు కారణం నటుడు శింబుపై ప్రేమ వివాదాలతో సంచలన నటుడిగా ముద్ర పడడమే అట. ఈ నేపథ్యంలో కరోనా కుమార్ చిత్రం అనేక సమస్యల కారణంగా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో దర్శకుడు శంకర్ టెన్షన్ పోయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - డైరెక్టర్ ఎస్. శంకర్
-
ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె
Sivakarthikeyan Aditi Shankar Maaveeran Goes On Floors In Chennai: వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'మావీరన్'. తెలుగులో 'మహవీరుడు'గా రాబోతుంది. తమిళ చిత్రం 'మండేలా' చిత్రానికి దర్శకత్వం వహించిన మడోనా అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అదితి ఇదివరకే కార్తీ హీరోగా నటించిన 'విరుమన్' చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం (ఆగస్టు 5) చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగిబాబు, సరిత, దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘ప్రిన్స్’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. -
కాజల్ మళ్లీ సినిమాల్లో నటిస్తుందా? క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఆస్వాదిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో కాజల్ మళ్లీ సినీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే తాజాగా నేహా ధూపియాతో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించిన కాజల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాతో త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్లో ప్రమాదం జరగడంతో సినిమాను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోవిడ్, ఇతరాత్ర కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ప్రసవం తర్వాత కాజల్ నటిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. -
RC15: రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్ట్‌కు నో చెప్పిన అగ్ర నటుడు
డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇటివల సెట్స్‌పైకి వచ్చిన ఈ మూవీ 30 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఈ మూవీని RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభించారు. ఇందులో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదిలా ఉంటే RC15 సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి రోజుకో అప్డేట్ బయటకు వస్తోంది. చదవండి: వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్ తాజాగా మరో షాకింగ్ అప్డేట్ నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం RC15లో కీ రోల్ కోసం ఓ స్టార్ నటుడిని సంప్రదించగా ఆయన ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ నటుడు ఎవరో కాదు మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్. ఈ మూవీలో ప్రతికథానాయకుడి పాత్ర కోసం శంకర్ అండ్ టీం రీసెంట్గా ఆయనను సంప్రదించారట. ఈ పాత్ర కథ విన్న ఆయన శంకర్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: బన్నీకి మెగాస్టార్ క్రేజీ విషెస్, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్ ఇందులో అవినీతికి పాల్పడే ఓ బడా రాజకీయ నాయకుడిగా విలన్ పాత్ర ఉండనుందని సమాచారం. ఈ రోల్ కోసమే ఆయనను అడగ్గా మోహన్ లాల్ ఈ పాత్రకు ఆసక్తి చూపలేదని ఫిలిం దూనియా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మూవీ టీం స్పందించే వరకు వేచి చూడాలి. కాగా ఇటీవల మోహన్ లాల్ నటించి బ్రో డాడీ చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా RC15లో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారిక కనిపించనున్న సంగతి తెలిసిందే. -
RC15: ఒక్క ఫైట్ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్!
Director Shankar Spend Rs 10 Crore For Only Fight Scene: డైరెక్టర్ శంకర్ సినిమాలు అంటే ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాలను హాలీవుడ్ రేంజ్లో నిలబెట్టిన ఘనత ఆయనది. ఆయన సినిమాలో వావ్ అనిపించే ఎన్నో వింతలు కనిపిస్తాయి. అత్యాధునిక విజువల్ వండర్స్‌తో సినిమాలను తెరకెక్కించే ఇండియన్ ఏకైక డైరెక్టర్ ఆయన. అందుకే శంకర్ సినిమా అనగానే ఆయన ఏలాంటి వండర్ క్రియేట్ చేయబోతున్నారా? అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతలా గుర్తింపు పొందిన ఆయన.. సినిమాలను తెరకెక్కించే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్! RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా కొంతభాగం షూటింగ్‌ను జరుపుకోగా అందులో ఓ భారీ ఫైట్ సీన్, ఓ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒక్క ఫైట్ సీన్ కోసం శంకర్ రూ. 10 కోట్లు ఖర్చు చేయించారట. అంతేకాదు పాటకు కూడా రూ. 10కోట్లు ఖర్చు చేశారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఓ పాట, ఫైట్ సీన్‌కే శంకర్ రూ.20 కోట్లు ఖర్చు చేస్తే ఇక సినిమా అయిపోయేసరికి ఎంత ఖర్చు పెట్టిస్తారో అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు కూడా శంకర్ భారీగా ఖర్చు పెట్టించినట్లు అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్ హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వాని, మిగతా నటీనటులుచ, నిర్మాత దిల్ రాజు, శంకర్లు సూటు ధరించి ఆఫీసర్స్ లుక్‌లో ఉన్న ఆ పోస్టర్‌కు దాదాపు కోటీన్నరకు పైగా ఖర్చయినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇదే జోషల్ ఆచార్య మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చరణ్ పాల్గొననున్నాడట. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను కొరటాల శివ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత చరణ్ తిరిగి RC15 షూటింగ్లో పాల్గొన్ననున్నాడని సమాచారం. కాగా ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
‘ఆర్ఆర్ఆర్’ మూవీపై డైరెక్టర్ శంకర్ ట్వీట్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు
Director Shankar Comments On RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మార్చి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిని సినీ దిగ్గజాలలు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూ ప్రకటిస్తు డైరెక్టర్ రాజమౌళి, చిత్రం బృందాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంతో తాజాగా సెన్సెషన్ డైరెక్టర్ శంకర్ సైతం ఆర్ఆర్ఆర్పై తన రివ్యూను ప్రకటించారు. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘రావిషింగ్, రివెటింగ్, రోబస్ట్. రోర్ అన్ని సమయాలలో ప్రతిధ్వనిస్తుంది. అసమానమైన అనుభవాన్ని అందించినందుకు మొత్తం టీంకు ధన్యవాదాలు. రామ్ చరణ్ ర్యాగింగ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్… తారక్ రేడియంట్ భీమ్ మీ హృదయాన్ని ఆకర్షించారు. మీ ఊహ అజేయంగా ఉంటుంది.. హ్యాట్సాఫ్ ‘మహారాజ’మౌళి’ అంటూ ఆయన ఆర్ఆర్ఆర్ టీం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ RC15 అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: 'మీటూ' అంటే తెలియదు.. కానీ 10 మంది మహిళలతో పడక పంచుకున్నా: నటుడు ఇక దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే ఆర్ఆర్ఆర్.. బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ థియేటర్ ముందు చూసిన అభిమానులు సందడి చూస్తుంటే పండగ వాతావారణాన్ని తలపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కోమురం భీంగా... రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా నటించిన సంగతి తెలిసిందే. Ravishing,Riveting,Robust.A Roar that’ll echo throughout times.Thanks to the whole team for an unparalleled experience.@AlwaysRamCharan-Raging Performance & Screen presence.@tarak9999 ‘s Radiant Bheem captivates your heart.Ur imagination stays undefeated,hats off “MahaRaja”mouli. — Shankar Shanmugham (@shankarshanmugh) March 25, 2022 -
దయచేసి అలా చేయకండి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. చదవండి: మెగా ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'! ‘‘కథ రీత్యా ఎక్కువమంది జనం ఉండే ఓపెన్ ఏరియాల్లో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో మా సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి, చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మేం తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి సహకరించండి’’ అని శంకర్ అండ్ కో ఓ నోట్‌ను విడుదల చేసింది. -
శంకర్ - చరణ్ చిత్రం
-
వరుణ్ తేజ్ సినిమా కోసం సింగర్‌గా మారిన డైరెక్టర్ శంకర్ కూతురు
Shankar Daughter Turns As Singer : ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి సరసన ఆమె నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌మీదుంది. అయితే అదితి హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గానూ పరిచయం అవుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్‌ను అదితి పాడింది. ఈ పాటను రేపు(మంగళవారం)రిలీజ్ చేయనున్నారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఆవిష్కరించనున్నారు. MY SINGING DEBUT✨🎙🎼 Waited so long to share this with you all. Another dream come true. @MusicThaman sir Thank you so much for trusting me and giving me this opportunity. Hope you guys like it♥️🧿🤞#ghani #romeojuliet #singingdebut pic.twitter.com/JOboB9VaMM — Aditi Shankar (@AditiShankarofl) February 6, 2022 -
డైరెక్టర్ శంకర్‌కు క్షమాపణలు చెప్పిన మహేశ్, అసలేం జరిగిందంటే..
Mahesh Babu Sorry To Director Shankar: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో శుక్రవారంతో ముగిసింది. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టించి ఈ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సందడి చేశాడు. ఆయనతో పాటు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బాలయ్య, మహేశ్ బాబుకు సంబంధించిన సీక్రెట్స్‌ను బయటపెట్టించాడు. ఇలా ఎంతో వినోదాత్మకంగా సాగిన ఈ ఎపిసోడ్లో మహేశ్ బాబు తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి కాగా ఈ షో మధ్యలో బాలయ్య డైరెక్టర్ మెహర్ రమేష్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మెహర్ రమేశ్ ముంబైలో చోటు చేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేస్తూ.. ఓ సారి ముంబై మారిటన్ హోటల్లో మేము టిఫిన్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్పీ అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మహేశ్ చెప్తాడు అని ఫోన్ పెట్టాశాడు. ఇక దీనికి మహేశ్ బాబు సమాధానం ఇస్తూ.. ‘ముంబైలో మారిటన్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. ఫ్యామిలీ అంతా ఉంది. ఓ ఇద్దర అమ్మాయిలు వచ్చారు. సెల్ఫీ అని అడిగారు. ఇప్పుడు కాదు.. ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పాను. చదవండి: సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే.. దీంతో ఆ అమ్మాయిలు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయాక రమేశ్ నాతో.. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? డైరెక్టర్ శంకర్ గారి కూతుళ్లు అని చెప్పాడు. దీంతో వెంటనే పరిగెత్తుకుని కిందకు వెళ్లాను. సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా అని డైరెక్టర్ శంకర్ అన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్ ఫ్యామిలీ, మెహర్ రమేశ్ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే విషయం తెలిసిందే. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కొడుకు..
Director Shankar Son Arjith To Debut As Hero: ప్రముఖ డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తీర్చిదిద్ది విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇక కమల్, రజనీ, విక్రమ్ సహా ఎంతోమందికి తమ కెరీర్లో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. ఇప్పుడు శంకర్ తన కొడుకు తనయుడు అర్జిత్‌ను హీరోగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే అర్జిత్ యాక్టింగ్, డైరెక్షన్లో శిక్షణ ఇప్పించినట్లు తెలుస్తుంది. 2004లో శంకర్ నిర్మించిన కాదల్ చిత్రం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ప్రేమిస్తే పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఇక్కడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్‌తో అర్జిత్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాను సైతం శంకర్ స్వయంగా నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే శంకర్ చిన్న కూతురు అదితి కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. -
రామ్ చరణ్ సినిమాకు రూ.200 కోట్ల భారీ ఆఫర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం వస్తోన్న విషయం తెలిసిందే. ఇక దానికి తోడు ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ఏంటంటే ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ఓ ప్రముఖ సంస్థ దాదాపు రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. -
నా జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: స్టార్ డైరెక్టర్ కూతురు
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో తనకుంటూ ఫేమ్‌తో పాటు నేమ్‌ని సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్. ఇండియన్ 2 సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒకలా ఈ దర్శకుడు ప్రొఫెషనల్ పరంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శంకర్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఎలా అంటారా..? శంకర్‌కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతురు ఐశ్వర్య.. ఇటీవల ఓ క్రికెటర్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక రెండో కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే అదితి మాత్రం తన కెరీర్‌ని సిని రంగానికే పరిమితం కాకుండా మరోపక్క చదువును కొనసాగించింది. శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అదితి డాక్టర్ డిగ్రీని పొందిన తరువాత భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఈ రోజు కోసం నా జీవితంలో ఎన్నో కాపీ కప్పులు, నిద్ర లేని రాత్రులు గడిపానంటూ ట్వీట్ చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు చదువు కొనసాగించడంతో అదితిని మల్టీ టాలెంటెడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదితి శంకర్ సినిమాల విషయాలకొస్తే.. త్వరలోనే హీరోయిన్గా వెండితెరపై ప్రేక్షకులకు పరిచయం కానుంది. ముత్తయ్య దర్శకత్వంలో 'వీరుమన్' అనే చిత్రంతో కోలీవుడ్‌లో తమిళ తంబీలను పలకరించనుంది. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. Here’s to all the fun memories, late nights and mugs of coffee that got me here ✨ Officially Dr.Aditi Shankar #graduationday #endsandbeginnings pic.twitter.com/bws6Wlcy1O— Aditi Shankar (@AditiShankarofl) December 11, 2021 -
ఇండియన్ 2 నుంచి తప్పుకున్న కాజల్.. కారణం అదేనా?
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్ంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. చాలా కాలంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా భారీ హిట్ సాధించిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా రాబోతుంది. పలు అనివార్య కారణాలతో గత కొన్ని నెలలుగా సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ఆటంకం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకుందని టాక్. అందుకు కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే అని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాజల్ స్థానంలో వర్షం బ్యూటీ త్రిషను తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. అన్ని వివాదాలు సద్దుమణిగి తిరిగి డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందనంగా ఈ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, సిద్ధార్థ్, వివేక్ తదితరులు నటిస్తున్నారు. భారతీయుడు సినిమా పలు రికార్డులను సొంత చేసుకోవడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చదవండి: భర్త కోసం అలాంటి కండీషన్లు పెడుతున్న కాజల్ -
డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్‌పై లైంగిక వేధింపుల కేసు!
ప్రముఖ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. రోహిత్‌తో పాటు మరో అయిదుగురిని పుదుచ్చెరి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. 16 ఏళ్ల మైనర్ బాలికను లైంగిక వేధించారనే ఆరోపణలతో రోహిత్, మిగలిన అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్, అతడి తండ్రి దామోదరన్, కోచ్ థమరాయ్ కన్నన్‌తో పాటు మరో ఇద్దరిపై పుదుచ్చెరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనని లైంగికంగా వేధించారని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత దీంతో రోహిత్‌తో పాటు అతడి తండ్రి, కోచ్ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని తనని బెదిరించిట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన మరో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. అయితే వారిని అరెస్టు చేశారా? లేదా?, ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జూన్‌లో డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యతో రోహిత్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం చదవండి: నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు -
వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ
Happy Birthday Day Vadivelu: ఆయనో కమెడియన్. అలాగని ఆషామాషీ నవ్వులు పంచడండోయ్. మూస ధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పాడాయన. ‘అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా?’ అనే రీతిలో ఉంటుంది ఆయన స్టయిల్. అందుకే స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్డమ్ను సంపాదించుకున్నారాయన. ఒకానోక టైంలో ఏడాదికి పాతికదాకా సినిమాల్లో నటించిన వడివేలు.. అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాకులతోనే కడుపుబ్బా నవ్వించే వారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే.. అందుకే కోలీవుడ్ ఆడియొన్స్ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్(వాగై ప్రవాహం) అని పిలుస్తుంటారు. వడివేలు 61వ పుట్టినరోజు ఇవాళ.. వాగై నది మధురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్ 12, 1960న పుట్టారు వడివేలు(కుమారవడివేలు నటరాజన్). అసలు చదువే అబ్బని వడివేలు.. చిన్నప్పటి నుంచి తండ్రి గ్లాస్ కట్టింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఖాళీ సమయాల్లో వీధి నాటకాలు.. అందులోనూ నవ్వులు పంచే పాత్రలతో అలరించడం చేసేవాడు. అలా దర్శకుడు టీ రాజేందర్ కంటపడడంతో .. ‘ఎన్ తంగి కళ్యాణి’లో ఓ చిన్న వేషం వేషాడు. రాజ్‌కిరణ్‌తో పరిచయం వడివేలు సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. అవకాశాల కోసం ఆయన కనీసం ఏమాత్రం ప్రయాణం చేయలేదు. కానీ, నటుడు రాజ్‌కిరణ్.. వడివేలు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి కారణం అయ్యాడు. వడివేలు తన పెళ్లి కోసం రైళ్లో వెళ్తున్న టైంలో.. నటుడు రాజ్‌కిరణ్‌తో పరిచయం అయ్యింది. ఆ సంభాషణ మధ్యలోనే వడివేలులోని నటుడిని గుర్తించి యాక్టింగ్ ఆఫర్ ఇచ్చాడు రాజ్ కిరణ్. అలా రాజ్ కిరణ్ హీరోగా నటించిన ‘ఎన్ రసవన్ మనసిలే’(1991)తో నటుడిగా మారిపోయాడు వడివేలు. ఆ తర్వాత నటుడు విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’లో వడివేలుకు అవకాశం ఇచ్చి.. తన తర్వాతి సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు ఇచ్చి వడివేలును ప్రొత్సహించాడు. త్రయం నవ్వులు గౌండమణి-సెంథిల్-చార్లీలాంటి టాప్ కమెడియన్ల హవా కోలీవుడ్‌లో కొనసాగుతున్న టైంలో.. వడివేలు ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన సింగరవేలన్(మన్మథుడే నా మొగుడు)లో విచిత్రమైన గెటప్, బట్లర్ ఇంగ్లీష్ క్యారెక్టరైజేషన్ వడివేలుకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై వరుసగా కామెడీ రోల్స్‌తో కోలీవుడ్‌లో కింగ్ ఆఫ్ కామెడీ ముద్రను దక్కించుకున్నాడు. గౌండమణి-సెంథిల్ కాంబోతో పాటు వడివేలు పంచిన కామెడీ కోలీవుడ్ ఆడియొన్స్‌కు నోస్టాల్జియా అనుభూతుల్ని మిగిల్చింది. తెలుగు వాళ్లకు.. తొంబై, 2000 దశకాల్లో కోలీవుడ్‌లో వడివేలు హవా నడిచింది. రజినీకాంత్, విజయ్‌కాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, అజిత్, ఇలా.. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆయన ప్రస్థానం నడిచింది. అలాగే ఇతర కామెడీ యాక్టర్లతోనూ ఆయన స్నేహం కొనసాగించేవాళ్లు. క్షత్రియ పుత్రుడు(తేవర్మగన్) లాంటి సీరియస్ సినిమాలతో పాటు ‘నవ్వండి లవ్వండి, ప్రేమికుడు, మిస్టర్ రోమియో, ప్రేమ దేశం, రక్షకుడు, ఒకే ఒక్కడు, చంద్రముఖి, సింగమలై, ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియొన్స్‌ను సైతం కితకితలు పెట్టించాడాయన. తెలుగులో స్ట్రయిట్ సినిమా ‘ఆరో ప్రాణం’తో పలకరించాడు. వివాదాలు.. రాజకీయాల ఎంట్రీతో వడివేలు కెరీర్ మసకబారడం మొదలైంది. తన కుటుంబంపై జరిగిన దాడికి బాధ్యుడ్ని చేస్తూ.. కెరీర్ తొలినాళ్లలో తనకు అవకాశాలిచ్చిన విజయ్‌కాంత్ మీదే అటెంప్ట్ టు మర్డర్ కేసుపెట్టి వివాదాలకు తెరలేపాడు వడివేలు. ఆపై విజయ్‌కాంత్‌పై ఎన్నికల్లోనూ పోటీ ప్రకటన చేశాడు. విజయ్‌కాంత్‌తో వైరం కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గించడమే కాదు.. రాజకీయంగానూ ఎలాంటి ఎదుగుదలను లేకుండా చేసింది. ఇక ఇమ్సయి అరసన్ 23ఎం పులకేసి(హింసించే 23వ రాజు పులకేశి) సినిమాతో హీరోగానూ వడివేలు సక్సెస్ అందుకున్నాడు. 2018లో ఈ సినిమా సీక్వెల్ విషయంలో దర్శకుడు శంకర్(మొదటి పార్ట్‌కు నిర్మాత), దర్శకుడు చింబు దేవన్‌తో చెలరేగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. వడివేలు వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని శంకర్, ఆపై మరికొందరు సినీ నిర్మాతల ఫిర్యాదులపై నడిగర్ సంఘం వడివేలుపై కన్నెర్ర జేసి నిషేధం విధించింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి ఈ ఏడాదిలో(2021) ఆయన కొత్త సినిమాలను అంగీకరించినట్లు, ఇది తన సినీ పునర్జన్మగా అభివర్ణించుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్‌లోనే ఆయన ఐదు సినిమాలు సైన్ చేయడం. ప్రే ఫర్ నేసమణి ఆరులో ‘రక్తం’, పొగరులో ‘కూల్‌డ్రింక్-ఒంటేలు’, సింగమలైలో ‘కానిస్టేబుల్’ కామెడీ పోర్షన్లు తెలుగు ఆడియొన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సినిమాలతోనే కాదు.. మన బ్రహ్మీలాగా మీమ్స్‌తోనూ వడివేలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక 2001లో వచ్చిన ఫ్రెండ్స్(తెలుగులో స్నేహమంటే ఇదేరాగా రీమేక్) మూవీ. త్్్ విజయ్, సూర్య హీరోలు. ఇందులో వడివేలు నేసమణి అనే క్యారెక్టర్ పోషించాడు. ఓ సీన్లో ఆయన నెత్తి మీద సుత్తి పడుతుంది. రెండేళ్ల క్రితం ఈ సీన్ పాక్‌లోని ఓ ట్విటర్ అకౌంట్ ద్వారా ట్రెండ్ కాగా.. నేసమణి పరిస్థితి ఎలా ఉందంటూ ఎంతో మంది ఆరాతీశారు. ఆయన కోలుకోవాలంటూ ‘ప్రే ఫర్ నేసమణి’ ట్రెండ్‌ను కొనసాగించారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఆ సీన్ వైరల్ అయ్యి.. వడివేలుకు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
RC15: పట్టలేనంత సంతోషంలో తమన్
తమన్ పట్టలేనంత సంతోషంలో ఉన్నారు. మరి.. ఏ దర్శకుడి సినిమాలో నటుడిగా కనిపించారో అదే దర్శకుడి సినిమాకి పాటలిచ్చే అవకాశం వస్తే ఆ మాత్రం ఆనందం ఉంటుంది కదా. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ (2003)లో ఐదుగురు యువకుల్లో ఓ యువకుడిగా తమన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు శంకర్ డైరెక్షన్లో యాక్టర్‌గా కనిపించిన తమన్ ఇప్పుడు ఆయన సినిమాకి ట్యూన్స్ ఇవ్వనుండటం విశేషం. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించనున్న ప్యాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. ‘‘2000 సంవత్సరం నుంచి శంకర్ సార్‌ని చూస్తున్నాను. సైన్స్‌ని, సినిమాకి మించిన విషయాలను ఆయన ఊహించే విధానం అద్భుతం. ఆయనలో అదే ఉత్సాహం ఉంది. ‘నాయక్’, ‘బ్రూస్లీ’ తర్వాత రామ్ చరణ్ సినిమాకి పని చేయనున్నాను. నా బెస్ట్ ఇవ్వ డానికి ప్రయత్నం చేస్తాను’’ అన్నారు తమన్. -
RAPO19 యూనిట్‌కు శంకర్ సడన్ సర్ప్రైజ్!
రామ్, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. రామ్, కృతీ శెట్టి, కీలక పాత్రధారి నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ దర్శకులు శంకర్ ఈ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లి, చిత్ర బృందాన్ని సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఓ ప్రేమ పాటను శంకర్‌కు వినిపించగా, ఆయన బాగుందని ప్రశంసించారని చిత్రబృందం తెలిపింది. -
ఆయనతో ఫొటో దిగాలనుకున్నా, ఇప్పుడు ఏకంగా: RRR డైలాగ్ రైటర్
ఎలాంటి కథకైనా లోతైన, పదునైన మాటల్ని రాయడంలో దిట్టగా పేరు సాధించాడు డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయన దగ్గరకు చేరుతున్నాయి. తాజాగా ఆయన మరో పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నాడు. రామ్‌చరణ్ - శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రానికి సాయిమాధవ్‌ను డైలాగ్ రైటర్‌గా ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు సాయిమాధవ్. ‘'జెంటిల్ మేన్' సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు, రామ్‌చరణ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు‘ అంటూ ట్వీట్ చేశాడు. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను .. Thanks to Sankar sir.. Thanks to Dil Rajugaru.. and Thanks to our Mega Power Star Charanbabu🙏🙏🙏 pic.twitter.com/iswy0DabmG — Saimadhav Burra (@saimadhav_burra) July 13, 2021 ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలతో పాటు ‘మహానటి’, ‘ఎన్టీఆర్’ బయోపిక్, ‘సైరా’ తదితర చిత్రాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిమాధవ్ బుర్రా. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుకు కూడా డైలాగ్స్ అందిస్తున్నాడు. -
రణ్వీర్ సింగ్.. వీడు నిజంగానే తేడా సింగ్
యాక్టింగ్‌తో పాటు యాటిట్యూడ్.. యాక్టర్స్ నుంచి ఇప్పటి జనరేషన్ కోరుకునేది ఇదే. ఆ లక్షణాలతో వందకు వంద శాతం పూర్తిగా న్యాయం చేస్తున్న ఏకైక బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. తన విచిత్రమైన మేనరిజంతో.. నటనలో వేరియేషన్స్‌తో అతని ఫ్యాన్స్‌లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాడు రణ్వీర్. ఇవాళ రణ్వీర్ 36వ పుట్టినరోజు... బాంద్రాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జగ్జీత్ సింగ్ భవ్నాని కొడుకే ఈ రణ్వీర్ సింగ్. స్కూల్ రోజుల్లోనే అల్లరిని అవపోసన పట్టిన రణ్వీర్.. పేరు పొడుగ్గా ఉందనే ఉద్దేశంలో భవ్నానిని లేపేసుకున్నాడు. కాపీరైటర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆపై మోడలింగ్ అటు నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాడు రణ్వీర్ సింగ్. ఎక్స్ రేటెడ్(అడల్ట్) మ్యాగజైన్స్‌ను తెగ ఇష్టపడే రణ్వీర్.. అవకాశాల కోసం తొలినాళ్లలో బాగానే కష్టపడ్డాడు. అయితే ఆరంభంలోనే మూడు పెద్ద సినిమాల అవకాశాలు వచ్చాయి. కానీ, బ్యాండ్ బాజా బరాత్ కోసం ఇచ్చిన కమిట్మెంట్కు కట్టుబడి వాటిని వదిలేసుకున్నాడు. ఫ్యాన్స్ ఫేవరెట్ కోస్టార్స్‌కి మాత్రమే కాదు.. అభిమానులకూ రణ్వీర్ సింగ్ అంటే ఒక ఎనర్జీ. ఈవెంట ఏదైనాసరే ఎప్పుడూ రెడ్‌బుల్ తాగినోడిలా ఎనర్జిటిక్‌గా ఉంటూ సందడి చేస్తుంటాడు. ఫ్యాన్స్‌కు అతనొక ఫ్రెండ్లీ స్టార్. ఎవరైనా ‘సర్ మీ అభిమాని’ని అని చెబితే చాలు.. ఆప్యాయంగా వాళ్లను వాటేసుకుని ఫొటోలు దిగుతుంటాడు రణ్వీర్. అంతేకాదు ఎందరికో ఆర్థిక సాయం అందించాడు. చెప్పాపెట్టకుండా అభిమాల పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరై ఆశ్చర్యపరుస్తుంటాడు. అభిమానుల మానసిక ఆనందమే తనకు ముఖ్యమని చాలాసార్లు ప్రకటించాడు ఈ యంగ్ హీరో. ఖిల్జీగా క్రూరత్వం కెరీర్ మొదట్లో రణ్‌వీర్‌ది చిచ్చొర యాక్టింగ్ అనే ముద్రపడిపోయింది. కానీ, తనలోని వేరియెన్స్ను క్రమంగా బయటపెడుతూ అలరిస్తూ వచ్చాడు. దిల్ దడక్నే దో(2015) రణ్వీర్ నటనకు తొలిగా ప్రశంసలు దక్కేలా చేసింది. గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలాలోని అతని నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ నటనను మెచ్చి బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్.. రణ్వీర్ను పొడుగుతూ స్వదస్తూరితో రాసిన లేఖను పంపాడు. ఇక బాజీరావ్ మస్తానీలో నటనకు బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అందుకున్న రణ్వీర్.. పద్మావత్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్‌తో క్రూరత్వాన్ని పండించి అందరినీ మెప్పించాడు. సింబా, గల్లీబాయ్ సక్సెస్‌ల తర్వాత ‘83’ లాంటి బయోగ్రాఫికల్ స్పోర్స్ డ్రామా ద్వారా, అపరిచితుడు రీమేక్‌తో తన కెపాసిటీని చూపించేందుకు రెడీ అయ్యాడు. లవ్ యూ దీప్‌వీర్ కెరీర్లో, బయట క్రేజీగా కనబడే రణ్వీర్.. ఫ్యామిలీ విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటాడు. పేరెంట్స్, అక్క మధ్య అల్లరిగా పెరిగిన రణ్వీర్.. ఎఫైర్ల విషయంలోనూ ఓపెన్‌గానే ఉంటాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల వెంటపడి చిల్లరగా వ్యవహరించానని ఓపెన్‌గానే ఇంటర్వ్యూలలో ఒప్పుకున్నాడు రణ్వీర్. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టాక హేమా మాలిని చిన్న కూతురు అహానాతో మొదట డేటింగ్ చేశాడు. ఆ తర్వాత దీపికా పదుకొనేతో ప్రేమాయాణం.. అభిమానుల అనుమానాల మధ్యే వాళ్ల వాళ్లిద్దరూ ఒక్కటైపోవడం.. ఆప్యాయంగా సాగుతున్న దీప్‌వీర్ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీడు హీరోనా?:కరణ్ రణ్వీర్ తొలి మూవీ ‘బ్యాండ్ బాజా బారాత్’(2010). రణ్వీర్ను యశ్‌రాజ్ స్టూడియో దగ్గర తొలిసారి చూసిన బాలీవుడ్ సీనియర్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ ‘వీడేం హీరో’ అనుకున్నాడట. ఇక ఈ సినిమా పోస్టర్ చూసి ‘వీడు హీరో అయితే ఈ సినిమా ఎవడు చూస్తాడు’ అనుకున్నాడంట. అంతేకాదు నిర్మాత ఆదిత్యా చోప్రాతో ఈ విషయంపై చర్చించాడట కూడా. ఇక బలవంతంగా ఆ సినిమా చూశాక.. తన అభిప్రాయం మార్చుకున్నాడనని, రణ్వీర్ విషయంలో మూర్ఖంగా ఆలోచించాననే విషయం అప్పుడు అర్థమైందని కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు కరణ్. ఇప్పుడు అదే కరణ్ డైరెక్షన్లో కొత్తగా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అలియాభట్‌తో పాటు జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర ఇందులో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మీమ్ కంటెంట్ రణ్వీర్.. సోషల్ మీడియాలో ఒక మీమ్ స్టఫ్. యాక్టింగ్ కంటే రణ్వీర్ జనాలకు ఎక్కువగా దగ్గరైంది ఈ యాటిట్యూడ్‌తో. విచిత్రమైన అతని అటిరే(డ్రెస్సింగ్ విధానం), వేషధారణలు మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ చర్చగా మారుతుంటాయి. ఫ్యాషన్ విషయంలో అతనొక ట్రెండ్ సెట్టర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, ఆ ట్రెండ్‌ను ఫాలో కావాలంటే కొంచెం గట్స్ కూడా ఉండాలి. అంతెందుకు కండోమ్ యాడ్‌లో యాక్ట్ దమ్మున్న హీరో రణ్వీర్ మాత్రమేనేమో!. సెటైర్, వరెస్ట్.. ఇలా ఎన్ని కామెంట్లు వినిపించినా.. విమర్శలు చుట్టుముట్టినా రణ్వీర్ మాత్రం మారడు. పైగా ఈ కోణాలన్ని ఉన్నందునే ఈ యంగ్ ఫైనెస్ట్ యాక్టర్‌ను ‘తేడా సింగ్’గా చూస్తూ.. ఆదరిస్తూ వస్తున్నారు అశేష అభిమానులు. -
విశ్రాంత న్యాయమూర్తి చేతికి ఇండియన్–2 పంచాయితీ
కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇండియన్–2. ఈ చిత్ర నిర్మాణం ఆది నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. షూటింగ్ స్పాట్లో ట్రైన్ కుప్పకూలిపోవడంతో ముగ్గురు యూనిట్ సభ్యులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ చిత్ర షూటింగ్ ఇప్పటి వరకు మళ్లీ మొదలవలేదు. మధ్యలో కరోనా కష్టాలు కూడా ఇండియన్–2 చిత్ర నిర్మాణం జాప్యానికి ఒక కారణం. ఇలాంటి పలు కారణాలతో దర్శకుడు శంకర్ వేరే చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఇండియన్–2 చిత్ర నిర్మాణ సంస్థ లైకా తమ చిత్రాన్ని పూర్తి చేయకుండా శంకర్ వేరే చిత్రం చేయడానికి అనుమతించరాదని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో దర్శకుడు శంకర్ కూడా చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఇండియన్–2 చిత్ర షూటింగ్ జాప్యానికి తాను కారణం కాదని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నటుడు కమలహాసన్ మధ్యవర్తిత్వం వహించినా ఫలితం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్ర సమస్యను పరిష్కరించడానికి చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆర్.భానుమతి నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత న్యాయమూర్తి ఆర్.భానుమతి ఇండియన్–2 చిత్ర వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి వివరాలను కోర్టుకు సమర్పించిన తరువాత ఈ కేసులో తుది తీర్పును వెల్లడించను న్నట్లు చెన్నై హైకోర్టు పేర్కొంది. చదవండి: Krithi Shetty: ఇక బిజీబిజీగా మారిపోనున్న కృతీ క్రికెటర్‌తో ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం -
ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఏడడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా ఆమె రోహిత్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఆదివారం జరిగిన వీరి వివాహ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరుడు రోహిత్ విషయానికి వస్తే అతడు ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో బడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్‌కు యజమానిగానూ వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇదిలా వుంటే శంకర్ ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్ కూడా చేయనున్నట్లు భోగట్టా. చదవండి: క్రికెటర్‌తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి -
క్రికెటర్‌తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి
ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కరోనా కారణంగా వీరి వివాహ వేడుకను నిరాడంబరం నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక మహాబలిపురంలో జరగునుంది. పెళ్లి డేట్‌పై స్పష్టత లేదు. వృతిరీత్యా శంకర్ కూతురు ఐశ్యర్య డాక్టర్ కాగా రోహిత్ టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో క్రికెటర్ కావడం విశేషం. ఇక రోహిత్ తండ్రి రామోదరన్ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్ టీంకు స్పాన్సర్ కూడా. అయితే గత మేలో శంకర్ తల్లి ముత్తు లక్ష్మీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా శంకర్‌కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: శవం ముందు నటి డ్యాన్స్, అవాక్కైన నెటిజన్లు Monal Gajjar: హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ హీరోయిన్! -
ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ముత్తు లక్ష్మి (88) మంగళవారం సాయంత్రం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మే 18న తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. శంకర్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన తల్లి ముత్తు లక్ష్మి అని పలు ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పేవారు. తన చిన్న వయసులో ఎన్నో కష్టాలుపడి పెంచి తనను ఈ స్థాయి తీసుకొచ్చారంటూ ఆయన తరచూ తల్లిని గుర్తు చేసుకునేవారు. కాగా ఇప్పటికే కరోనా కారణంగా తమిళ సినీ పరిశ్రమ నటీనటులు, దర్శక నిర్మాతలను కోల్పోయింది. ఈ తరుణంలో తాజాగా శంకర్ తల్లి మృతి వార్త మరింత విషాదాన్ని నింపింది. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే పనిలో పడ్డారు. Director #Shankar's mother S Muthulakshmi age 88 passed away today pic.twitter.com/8lTNJfSLIk — Priya - PRO (@PRO_Priya) May 18, 2021 -
సీఎం స్టాలిన్‌ను కలిసిన తారలు: విరాళాల వెల్లువ
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అనేకమంది ప్రాణాలను బలిగొంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడానికి రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటోంది. అయితే ప్రజలకు ఆర్థికసాయం చేయడానికి, కరోనా బాధితుల కోసం ఆక్సిజన్, వ్యాక్సిన్ వంటి వైద్య సదుపాయాలను సమకూర్చడానికి ఆర్థిక పరమైన అవసరాలు ఏర్పడడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దాతలు కరోనా నివారణ నిధికి ఆర్థికసాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి చెక్కు అందిస్తున్న ఎడిటర్ మోహన్ కుటుంబం దీంతో సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే శివకుమార్ కుటుంబం, అజిత్, సౌందర్య రజనీకాంత్ కుటుంబం తదితరులు విరాళాలు అందించారు. తాజాగా మరికొందరు సినీ దర్శక నటులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. నటుడు శివకార్తికేయన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. అదేవిధంగా నిర్మాత, ఎడిటర్ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు మోహన్‌రాజ, నటుడు జయం రవి ముఖ్యమంత్రిని కలిసి రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు. దర్శకుడు వెట్రిమారన్ దర్శకుడు శంకర్ కరోనా నివారణకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆయన ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు పంపించారు. అదేవిధంగా దర్శకుడు వెట్రిమారన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి రూ.10 లక్షల విరాళాన్ని చెక్కు ద్వారా అందించారు. రజనీకాంత్, విజయ్, ధనుష్, శింబు తదితర ప్రముఖులు ఇంకా తమ విరాళాలను ప్రకటించలేదు. అజిత్ విరాళాన్ని ప్రకటించడంతో ఆయనకు పోటీదారులుగా భావించే విజయ్ ఇంకా విరాళాన్ని ప్రకటించలేదు. కాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు నటుడు అజిత్ స్పందించి రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి వెల్లడించారు. నటుడు శివకార్తికేయన్ చదవండి: పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం కష్టకాలంలో ఉన్నాం.. విరాళాలివ్వండి: ముఖ్యమంత్రి పిలుపు -
ఇండియన్–2 షూటింగ్ ఆలస్యానికి కారణం లైకా సంస్థే: శంకర్
ఇండియన్–2 చిత్ర షూటింగ్ ఆలస్యానికి తాను బాధ్యున్ని కానని.. అందుకు కారణం ఆ చిత్ర నిర్మాణ సంస్థే అని దర్శకుడు శంకర్ కోర్టులో వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇండియన్–2. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. కాగా దర్శకుడు శంకర్ వేరే చిత్రాలు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో లైకా సంస్థ చెన్నై హైకోర్టు ను ఆశ్రయించింది. దీంతో శంకర్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. శంకర్ తన వివరణ ఇస్తూ.. ఇండియన్–2 చిత్రాన్ని తొలుత దిల్‌రాజు నిర్మించడా నికి సిద్ధమయ్యారని.. అయితే తామే నిర్మిస్తామని అడి గి మరీ లైకా సంస్థ తీసుకుందన్నారు. దీంతో 2018 మేలో మొదలెట్టినట్లు తెలిపారు. చిత్రానికి రూ.270 కోట్లు బడ్జెట్ అవుతుందని, చివరికి రూ.250 కోట్లకు కుదించినా షూటింగ్‌ను ప్రారంభించడానికి జాప్యం చేశారన్నారు. ఆ తరువాత నటుడు కమలహాసన్‌కు మేకప్ అలర్జీ, చిత్రీకరణ సమయంలో క్రేన్ విపత్తు, లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆలస్యం అయ్యిందన్నారు. సాంకేతిక నిపుణులకు నగదు చెల్లించకపోవడంతో వారు ఇతర చిత్రాలలో నటించడానికి వెళ్లిపోయారన్నారు. చదవండి: అమ్మానాన్నలని డబ్బులు అడగలేను: శృతిహాసన్ గజిని చిత్ర నిర్మాత కన్నుమూత -
Indian 2: కమల్ హాసన్ మధ్యవర్తిత్వం?
‘ఇండియన్ 2’ చిత్రీకరణ విషయంలో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఈ చిత్ర దర్శకుడు శంకర్లకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్ 2’ని పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకూడదని లైకా ప్రతినిధులు అంటుంటే, షూటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించకుండా, నా తర్వాతి ప్రాజెక్ట్స్‌ను నియంత్రించే హక్కు లైకా వారికి లేదని శంకర్ అంటున్నారు. ఈ వివాదంపై కోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. అయితే లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు, దర్శకుడు శంకర్ కూర్చుని చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోర్టు ఇటీవల ఓ సందర్భంలో సూచించింది కూడా. ఇప్పుడు ఈ బాధ్యతను ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్ తీసుకుని వారధిలా ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసే ఆలోచనలో ఉన్నారట. లైకా ప్రొడక్షన్స్, శంకర్‌తో ముందు విడిగా మాట్లాడి, ఆ తర్వాత ఇరు పక్షాల మధ్య ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కమల్‌హాసన్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. కమల్ జోక్యంతోనైనా శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వివాదం కొలిక్కి వస్తుందా? సమస్య పరిష్కారం అయి, షూటింగ్ మొదలవుతుందా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. 1996లో దర్శకుడు శంకర్, హీరో కమల్‌హాసన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. చదవండి: ఆ రిస్క్ చేయను: హీరోయిన్ ప్రణీత -
వివాదం.. డైరెక్టర్ శంకర్ స్పందన కోసం చూస్తున్నాం
దర్శకుడు శంకర్‌ను చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఇండియన్ 2’ నిర్మాణం, ‘అన్నియన్’ రీమేక్ చిత్రాల విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడదని మద్రాస్ హైకోర్టులో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కేసు వేసిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు శంకర్ ప్రకటించిన తర్వాత కోర్టుని ఆశ్రయించింది లైకా. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కోర్టు జోక్యంతో సానుకూలత ఏర్పడదని, రెండు పక్షాలవారు ఆలోచించుకుని ఓ సానుకూల నిర్ణయానికి రావాలని కేసుని విచారించిన కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ నటుడు వివేక్ హఠాన్మరణం కూడా ‘ఇండియన్ 2’ని ఇరుకుల్లో పడేసింది. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. సినిమా పూర్తి చేయాలంటే వివేక్ ఉన్న సీన్స్‌ను మళ్లీ మరో నటుడితో చిత్రీకరించాలని శంకర్ పేర్కొన్నారు. కాగా.. కమల్‌హాసన్‌తో ఓ సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నది వివేక్ కల. ఆ కల పూర్తి స్థాయిలో నిజం కాకుండానే వివేక్ మరణించడం బాధాకరమని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. మరి.. ‘ఇండియన్ 2’, ‘అన్నియన్’ చిత్రాల వివాదాలకు ఎలా తెరపడనుందో చూడాలి. శంకర్ స్పందన కోసం చూస్తున్నాం! – సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా రీమేక్ రైట్స్ గురించి ఈ చిత్రదర్శకుడు శంకర్, చిత్రనిర్మాత రవిచంద్రన్‌ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతగా ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ తనవే అని ఆస్కార్ రవిచంద్రన్, దర్శకుడిగా రీమేక్ హక్కులు తనవేనని శంకర్ ఎవరికివారు బహిరంగ లేఖలను విడుదల చేశారు. తాజాగా శంకర్‌పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు నిర్మాత రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్ మా సంస్థ సభ్యుడు. ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో ఆయన శంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మేం శంకర్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే రీమేక్ రైట్స్ నిర్మాతలకే ఉంటాయి. ఒక నిర్మాత నిర్మించిన సినిమాను వేరే నిర్మాతతో రీమేక్ చేయాలన్నప్పుడు ఆ దర్శకుడు సదరు నిర్మాతకు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసులు గతంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘అన్నియన్’ సినిమా విడుదలై చాలా రోజులయింది కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం నేనేం కామెంట్ చేయలేను’’ అని సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కి చెందిన రవి కొట్టాక్కర పేర్కొన్నారు. -
అతను ఐఏఎస్.. ఆమె జర్నలిస్ట్!
ఐఏఎస్ ఆఫీసర్ల విధివిధానాలు, బాధ్యతలు వంటి అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారట హీరో రామ్‌చరణ్. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమా కోసమే ఈ ఫోకస్. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ప్రారంభం అవుతుందని ఇటీవల ఓ సందర్భంలో చిత్రనిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. ఇందులో రామ్‌చరణ్ ఏ పాత్ర చేయనున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ముందు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చరణ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికా మందన్నాను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఆమెది జర్నలిస్టు పాత్ర అని సమాచారం. ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నారట. చదవండి: ఐపీఎల్ సీజన్. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది. -
కథ నాది, మీకు హక్కు లేదు, అర్థం అవుతుందనుకుంటా: శంకర్
వరుస వివాదాలతో దర్శకుడు శంకర్ అల్లాడిపోతున్నారు. హీరో రామ్‌చరణ్‌తో శంకర్ సినిమాను అనౌన్స్ చేయగానే ‘కమలహాసన్‌తో తాము నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయనిదే ఎక్కడికీ కదలడానికి లేదు’ అని లైకా ప్రొడక్షన్స్ కేసు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా, తమిళ చిత్రం ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) హిందీ రీమేక్‌ను హీరో రణ్‌వీర్‌సింగ్‌తో చేయనున్నట్టు బుధవారం నాడు శంకర్ ప్రకటించడం మరో సంచలనమైంది. ఇప్పుడు ఆ ప్రకటన కూడా వివాదాస్పదమైంది. శంకర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే అప్పట్లో ‘అన్నియన్’ చిత్రాన్ని నిర్మించిన ‘ఆస్కార్’ రవిచంద్రన్ ఆ కథ హక్కులు తనవి అంటూ ఘాటుగా లేఖ పంపారు. ఆ వెంటనే శంకర్ దానికి తన స్పందనగా మరో ఘాటైన ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ వివాదం సినీసీమలో గురువారం పెద్ద చర్చనీయాంశమైంది. నన్నడగకుండా ఎలా తీస్తారు? – ‘అన్నియన్’ నిర్మాత రవిచంద్రన్ ‘నా ఊహలకు తగ్గట్టు పవర్ఫుల్ హీరో దొరికాడు. హిందీలో నా ‘అన్నియన్ ’ అతనే’ అని దర్శకుడు శంకర్ ఇలా ప్రకటించారో, లేదో అలా వివాదం మొదలైంది. ‘‘నన్ను సంప్రదించకుండానే రీమేక్‌ని ప్రకటిస్తారా?’ అంటూ ‘అన్నియన్ ’ చిత్ర నిర్మాత ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్ మండిపడ్డారు. దర్శకుడు శంకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే... ‘‘మీరు (శంకర్) ‘అన్నియన్ ’ ఆధారంగా హిందీలో ఓ సినిమాను అనౌన్స్ చేయడం తెలిసి, షాక్ అయ్యాను. ‘అన్నియన్ ’కు నేను నిర్మాతని అని మీకు గుర్తుండే ఉంటుంది. ఈ స్టోరీ లైన్ పై పూర్తి స్థాయి హక్కులను రచయిత సుజాత (దివంగత రచయిత సుజాతా రంగరాజన్ )కు డబ్బు చెల్లించి నేను సొంతం చేసుకున్నాను. ఇందుకు ఆధారాలు కూడా నా వద్ద భద్రంగా ఉన్నాయి. ‘అన్నియన్ ’ స్టోరీలైన్ కు సంబంధించిన పూర్తి హక్కులు నావే. నా అనుమతి లేకుండా ఈ స్టోరీలైన్ తో రీమేక్ సినిమా చేయాలనుకోవడం చట్టరీత్యా నేరం. మీ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సక్సెస్ కాకపోవడంతో ఆందోళనలో ఉన్న మీకు ‘అన్నియన్ ’కు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నేనే. ఈ సినిమా సక్సెస్ఫుల్ దర్శకుడిగా మీ స్టార్‌డమ్‌ను పెంచింది. ఇందులో ‘అన్నియన్ ’ నిర్మాతగా నా సపోర్ట్ ఉంది. కానీ ఇదంతా మరచిపోయి నన్ను సంప్రదించకుండానే మీరు హిందీ రీమేక్‌ను అనౌన్స్ చేశారు. ఎప్పుడూ నైతిక విలువలను పాటించే మీరు, మీ స్థాయిని తగ్గించుకునేలా ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నియన్ ’ హక్కులు నా దగ్గర ఉన్నాయి గనుక, హిందీ రీమేక్ ఆలోచనను విరమించుకోవాలని సలహా ఇస్తున్నా’’ అని పేర్కొన్నారు రవిచంద్రన్ . కథ... స్క్రీన్ ప్లే...డెరెక్షన్ నావి! – దర్శకుడు శంకర్ ‘అన్నియన్ ’ హక్కులు తనవేనంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన నిర్మాత రవిచంద్రన్ కు దర్శకుడు శంకర్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ‘‘ఆ ‘అన్నియన్ ’ కథ హక్కులు మీవి (రవిచంద్రన్) అంటూ... పంపిన మెయిల్ చూసి షాక్ అయ్యాను. కథ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శంకర్ అనే టైటిల్‌తోనే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను నేను ఎవరికి అప్పగించ లేదు. ఆ స్క్రిప్ట్ నిజానికి రచయిత సుజాత గారిదని మీరు అనడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఆ సినిమాకు డైలాగ్స్ మాత్రమే రాశారు. అందుకే, ఆయనకు సినిమాలో డైలాగ్ రైటర్‌గా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. డైలాగ్స్ మినహా... ‘అన్నియన్ ’ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్ ఇలా దేనిలోనూ సుజాత గారి ప్రమేయం లేదు. ‘అన్నియన్ ’కు దర్శకుడిగా నాకే కాదు. నిర్మాతగా మీకూ పేరు వచ్చింది. నిర్మాతగా సినిమా స్క్రిప్ట్‌పై మీకు హక్కు లేదు. నిరాధారమైన ఆరోపణలను ఇకనైనా మానుకోండి. మీరు చెబుతున్న అవాస్తవాలు నా భవిష్యత్ ప్రాజెక్ట్స్‌ను ప్రభావితం చేయవు. నా వివరణ మీకు పాజిటివ్‌గానే అర్థం అవుతుందని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు శంకర్. కమల్ వస్తే... శంకర్ రెడీనే! ‘అన్నియన్’ వివాదం ఇలా ఉండగా... ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా, శంకర్ మరో సినిమాను డైరెక్షన్ చేయకూడదని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం విచారణ జరిగింది. శంకర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, ‘‘లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఆరోపించినట్లు ‘ఇండియన్ 2’ను శంకర్ మధ్యలో వదిలేయలేదు. ఆ సినిమా షూటింగ్‌కు విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా ఫారిన్ టెక్నీషియన్స్‌తో షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టడం అంత ఈజీ కాదు. ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న పెద్ద డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌ను రెండేళ్ళుగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు. జూన్‌లో కూతురి పెళ్ళి పెట్టుకున్నప్పటికీ, కమల్‌హాసన్ గనక షూటింగ్‌కు వస్తే ‘ఇండియన్ 2’ను పూర్తి చేయడానికి శంకర్ సిద్ధంగానే ఉన్నారు’’ అని కోర్టుకు విన్నవించుకున్నట్లు కోడంబాకమ్ సమాచారం. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్ ’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను అనౌన్స్ చేశారు శంకర్. తొలిపార్టులో హీరోగా నటించిన కమల్‌హాసనే మలిపార్టులో కూడా హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
ఇండియన్ 2: దర్శకుడు శంకర్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించడంపై స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఆరంభం నుంచి పలు అవరోధాలను ఎదుర్కొంటోంది. కరోనాకు ముందే ఇండియన్ 2 చిత్రం నిలిచిపోయింది. దీంతో శంకర్ ఇతర చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైకా సంస్థ శంకర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తమ సంస్థ ఇండియన్ 2 చిత్రం నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అయితే ఇప్పటికే రూ.236 కోట్లు అయ్యిందని తెలిపారు. ఇప్పటికీ 80 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. శంకర్‌కు రూ. 40 కోట్లు పారితోషకం చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందులో రూ. 14 కోట్లు అడ్వాన్‌గా చెల్లించామన్నారు. అయితే తమ చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్ ఇతర చిత్రాలకు పని చేయకుండా ఆయనపై నిషేధించాలని కోరారు. ఈ కేసు గురువారం న్యాయమూర్తి పీటీ.ఆషా సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించరాదంటూ శంకర్‌పై నిషేధం వధించలేమని పేర్కొన్నారు. శంకర్‌ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: డైరెక్టర్ శంకర్‌పై నిర్మాతల కేసు! -
డైరెక్టర్ శంకర్‌పై నిర్మాతల కేసు!
‘ఇండియన్ 2’ షూటింగ్‌ను దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ సినిమా శంకర్ కెరీర్‌ను ఇబ్బందిపెడుతూనే ఉంది. గత ఏడాది ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగి, నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సినిమా మళ్ళీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈలోపు ‘ఇండియన్ 2’లో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్ రాజకీయంగా బిజీ అయిపోయారు. ఇటు శంకర్ కూడా రామ్‌చరణ్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్‌కు షాక్ ఇచ్చింది. ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ,మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ‘‘ఇండియన్ 2’ బడ్జెట్ రూ. 236 కోట్లనుకున్నాం. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌కు రూ. 180 కోట్లు ఖర్చు అయ్యాయి. లాగే శంకర్‌కు మేం ఇస్తామన్న 40 కోట్ల పారితోషికంలో ఆల్రెడీ 14 కోట్లు చెల్లించాం. మిగిలిన 26 కోట్ల రూపాయలను కూడా కోర్టు సమక్షంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని లైకా ప్రొడక్షన్స్ తమ పిటిషన్ లో పేర్కొందని కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. అయితే దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య తలెత్తిన ఈ వివాదం ఎలాంటి పరిష్కారంతో ముగుస్తుందనే చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 1996లో కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. -
పంచ్ డైలాగ్స్.. పవర్ఫుల్ సీన్స్
ఒకవైపు ‘ఆచార్య’, మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. ‘ఆచార్య’ షూటింగ్ త్వరలో పూర్తవుతుంది. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కూడా ముగింపు దశకు చేరుకునేసరికి శంకర్ కాంబినేషన్లో రామ్‌చరణ్ చేయనున్న సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుందని తెలిసింది. ప్రస్తుతం శంకర్ స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నారు. జూన్‌లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారట. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పవర్ఫుల్ ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమాను శంకర్ తెరకెక్కించనున్నారని తెలిసింది. ఎమోషనల్ డ్రామా, పవర్ఫుల్ సీన్స్, పంచ్ డైలాగ్స్‌తో ఈ ప్యాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. శంకర్ గత చిత్రాలకు సంగీతదర్శకుడిగా చేసిన ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి కూడా స్వరకర్తగా చేయనున్నారని టాక్. ఇది రామ్‌చరణ్‌కి 15వ సినిమా అయితే చిత్రనిర్మాత ‘దిల్’రాజుకి 50వ సినిమా. -
ట్యూన్ అవుతున్నారా?
హీరో రామ్‌చరణ్–దర్శకుడు శంకర్‌తో ఏఆర్ రెహమాన్ ట్యూన్ అవుతున్నారని టాక్. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ‘దిల్’ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ నుంచి ఆయనతో రెహమాన్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’ వంటి పలు చిత్రాలకు ఏఆర్ రెహమానే సంగీతదర్శకుడు. ఇప్పుడు చరణ్–శంకర్ కాంబినేషన్ చిత్రానికి రెహమాన్ ట్యూన్ అవుతున్నారట. ‘మీ నుంచి తెలుగు ఆల్బమ్‌ని ఎప్పుడు ఆశించవచ్చు?’ అని ఓ నెటిజన్ అడిగితే, ‘వెరీ సూన్’ అన్నారు రెహమాన్. చరణ్ చిత్రాన్ని ఉద్దేశించే ఆయన అలా అన్నారన్నది చాలామంది ఊహ. కాగా శంకర్‌తో ఇప్పటికే పలు చిత్రాలకు ట్యూన్ అయిన రెహమాన్ ఇప్పటివరకూ చరణ్ చిత్రాలకు సంగీతం అందించలేదు. ఒకవేళ ట్యూన్ అయితే ఇదే తొలి కాంబినేషన్ అవుతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ఆరంభమవుతుంది. -
శంకర్ దర్శకత్వంలో చరణ్?
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలందరి చేతిలో మినిమమ్ రెండు మూడు సినిమాలు ఉన్నాయి. చేస్తున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాల లైనప్ రెడీగా ఉంది. కానీ రామ్‌చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. చిరంజీవి ‘ఆచార్య సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరి రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్న నెక్ట్స్ సినిమా ఏంటీ అంటే... రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా కమిటయ్యారట. ఇది మల్టీస్టారర్ చిత్రమని టాక్. రామ్‌చరణ్, యశ్, విజయ్ సేతుపతి ఇందులో హీరోలుగా కనిపిస్తారని సమాచారం. మరొకటి... ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చరణ్. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నాయని తెలిసింది. -
వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాక్‌కు గురయ్యానని దర్శకుడు శంకర్ పేర్కొన్నాడు. అయితే తన లాయర్ సాయి కుమరన్ కోర్టును సంప్రదించగా తనపై ఎలాంటి వారెంట్ లేదని తెలిందని ఆయన తెలిపాడు. ఆన్ లైన్ కోర్ట్ రిపోర్టింగ్‌లో లోపం కారణంగా ఇలా జరిగిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నానన్నాడు. ఆన్లైన్లో జరిగిన పొరపాటును ఇప్పుడు సరి చేశారని శంకర్ తెలిపాడు. అయితే ఈ విషయంపై ఎలాంటి అవాస్తవలను ప్రసారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశాడు. కాగా, ప్రముఖ రచయిత అరుర్ తమిళ్‌నందన్ రచించిన ‘జిగుబా’ కథను కాపీ కొట్టి ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించాడని శంకర్‌పై చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైంది. ఇదే కేసుకు సంబంధించి శంకర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఆయన ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసి స్పష్టతనిచ్చారు. -
అదే జరిగితే మెగా అభిమానులకు పండగే
ప్రస్తుతం టాలీవుడ్లో భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలు, మల్టీ సార్టర్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రేక్షకులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు మరింత కిక్కెచ్చే న్యూస్ ఒకటి ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ ఇప్పటికే మెగస్టార్ చిత్రాల్లో మెరిశారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఆచార్య చిత్రంలో సిద్ధ పేరుతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలిసిన షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌లు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారట. మరో సర్ప్రైజ్ ఏంటంటే ఈ చ్రితానికి భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది. (చదవండి: పవన్‌కు త్రివిక్రమ్ మాట సాయం) ప్రస్తుతం శంకర్ డైరెక్ట్‌గా తెలుగు సినిమా చేయాలని భావిస్తున్నారట. ఇందుకు గాను లాక్‌డౌన్‌లోనే కథలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే పవన్‌కి, చరణ్‌కి స్టోరీ నరేట్ చేశారని.. వారిద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దాంతో బాబాయి- అబ్బాయి ఇద్దరు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ లీడ్ రోల్ పోషిస్తారని.. పవన్ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇక దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. మెగా అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మాళయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని దర్శకుడు సాగర్ కే చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘అక్కినేని’కి రూ.5 వేలకు ఎకరా చొప్పున ఇచ్చారు
సాక్షి, హైదరాబాద్: సినీ స్టూడియోలకు నామమాత్రపు ధరకే ప్రభుత్వాలు గతంలో కూడా భూమిని కేటాయించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మంత్రిమండలి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే దర్శకుడు శంకర్‌కు భూ కేటాయింపుపై ఆమోదం తెలిపిందని పేర్కొంది. సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు రూ.5 లక్షల చొప్పున మోకిల్లలో 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఇటీవల ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు. దర్శకుడు శంకర్ వెనుకబడిన నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన బడుగు వర్గాలకు చెందిన వ్యక్తని, సినీ పరిశ్రమలో ఆయనకు 36 ఏళ్ల అనుభవం ఉందని తెలిపారు. రూ.50 కోట్లతో ప్రపంచ స్థాయి స్టూడియో నిర్మిస్తానని, తనకు రాయితీ పద్ధతిలో భూమి కేటాయించాలని శంకర్ ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకున్నారని వివరిం చారు. స్థానిక ప్రతిభావంతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో శంకర్‌కు భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఫార్సు చేసిందన్నారు. ‘‘అక్కినేని నాగేశ్వర్రావుకు అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం 1975లో రూ.5 వేల చొప్పున 22 ఎకరాలను కేటాయించింది. పద్మాలయ స్టూడియో కోసం 1983లో రూ.8,500 చొప్పున 9.5 ఎకరాలను కేటాయించింది’’అని అరవింద్‌కుమార్ తెలిపారు. 1984లో సురేశ్ ప్రొడక్షన్‌కు నామమాత్రపు ధరకే అప్పటి ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. 1984లో దర్శకుడు రాఘవేందర్రావు, చక్రవర్తి, కృష్ణమోహన్‌కు రూ.8,500 ప్రకారం అర ఎకరం చొప్పున కేటాయించారు. శంకర్‌కు నార్సింగి, శంకర్పల్లి రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి అభివృద్ధి చేయని భూమి కేటాయించాం. అక్కడ మార్కెట్ విలువ ఎకరా రూ.20 లక్షలుగా ఉంది. సినీపరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగ కల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను కేటాయించింది. ఇందులో కోసం శంకర్ రూ.4.4 కోట్లు డిపాజిట్ చేశారు. స్టూడియో నిర్మాణంతో 100 మంది శాశ్వత, 200 మంది తాత్కాలిక కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు, మరో వెయ్యి మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు’’అని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. -
యశ్‌తో భారీ మల్టీస్టారర్‌కు శంకర్ ప్లాన్
అప్పటివరకు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండస్ట్రీని ఏలాయి. ఇంతలో దక్షిణ భారతంలో ఓ చిన్న సినీ పరిశ్రమ అందరి చూపు తనవైపు తిప్పుకుంది. అదే శాండల్‌వుడ్. అప్పటివరకు కన్నడ సినిమాల గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆ ఒక్క సినిమా శాండల్‌వుడ్ స్థాయినే మార్చేసింది. అదే కేజీఎఫ్.. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేవు, ఫేమస్ హీరో కాదు, బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ కాదు. కానీ మూవీతో ఏదో మ్యాజిక్ చేశాడు. అంతే మూవీ లవర్స్ అందరూ శాండల్‌వుడ్‌లో కంటెంట్ ఉంది అనుకోవడం మొదలుపెట్టారు. అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంత క్రేజ్ దక్కించుకున్నాడు కాబట్టే హీరో యశ్ తమిళంలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శంకర్ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్-2 సినిమా సెట్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ పడింది. అందుకే దాన్ని పక్కన పెట్టి అప్పటిలోపు ఒక మల్టీస్టారర్ సినిమా తీద్దామన్న ఆలోచనలో ఉన్నాడట శంకర్. అందులో ఒక హీరోగా యశ్‌ను అనుకున్నాడని, దీనికి యశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కమల్ హాసన్ కూడా దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో తన తర్వాత సినిమా ఉండబోతుందని ప్రకటించాడు కాబట్టి ఇండియన్-2 షూటింగ్ సంగతి కనుమరుగయినట్టే అని తెలుస్తోంది. అందుకే ఇండియన్-2 గురించి క్లారిటీ వచ్చేలోపు మల్టీస్టారర్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్‌కి క్రేజ్ రావాలని పలు ఇండస్ట్రీల నుంచి భారీ తారాగణాన్ని దింపాలని శంకర్ ప్లాన్. (13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు) అందుకే కేజీఎఫ్‌తో శాండల్వుడ్లోనే కాక దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యశ్ని ఎంచుకున్నాడు. దీనికి యశ్ కూడా అంగీకరించాడు. ఇంకో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారు. ఈ మల్టీస్టారర్‌ని ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. కేజీఎఫ్ 2 షూటింగ్లో ఉన్న యశ్ డిసెంబర్ వరకు ఇందులోనే బిజీగా గడపనున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శంకర్, యశ్ కాంబినేషన్లో సినిమా 2021 జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. (శ్యామ్ సింగరాయ్‌లో విలన్‌గా నారా రోహిత్) ఫిబ్రవరిలో ఇండియన్-2 సినిమా సెట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఆ షూటింగ్ ఆగిపోయింది. భారీ లైట్‌తో ఉన్న క్రేన్ కూలిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. దీని నుంచి కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ తృటిలో తప్పించుకున్నారు. ఇందులో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి అందజేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుంది. వారికి ఇచ్చిన మాట ప్రకారం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి గురువారం వారి కుటుంబాలకు చెక్‌లను అందజేశారు. వారితో పాటు ప్రమాదంలో గాయపడిన టెక్నిషియన్ రామరాజన్‌కి కూడా 90లక్షలు పరిహారాన్ని ఇచ్చింది మూవీ టీమ్. -
జనవరికి డెడ్‌లైన్
కమల్‌హాసన్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతానని ఆ మధ్య ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చేస్తున్నారు కమల్‌హాసన్. కరోనా వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. అయితే సినిమాలో తన భాగాన్ని జనవరి నెలలోగా పూర్తి చేయాలని శంకర్‌ను కోరారట కమల్. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో జరగనున్నాయి. అందుకు సిద్ధమవ్వడం కోసమే ఈ నిర్ణయం అని ఊహించవచ్చు. -
ఒకే ఒక్కడు విజయ్
ఒక్కరోజు ముఖ్యమంత్రి అనే సరికొత్త కథాంశంతో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘ముదల్వన్’. తెలుగులో ‘ఒకే ఒక్కడు’గా విడుదలైంది. 1999లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌పై ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సంగతి ఏంటంటే.. విజయ్ హీరోగా ఈ సినిమా సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారట శంకర్. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’(భారతీయుడు 2) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్. కరోనా లాక్డౌన్ కాలంలో ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌కి కథ తయారు చేశారట ఆయన. ఇందులో విజయ్ హీరోగా నటించనున్నారని సమాచారం. -
20 రోజులుగా అడుగు బయటపెట్టలేదు: స్టార్ హీరో
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందని టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. తెలంగాణలో లాక్డౌన్ సక్రమంగా అమలవుతోందని ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రశంసించారు. శనివారం డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఫేస్ మాస్కులు, సేఫ్టీ గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌తో పాటు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో లాక్డౌన్ స్ట్రాంగ్‌గా అమలవుతోంది. నేను బయటి ప్రపంచాన్ని చూసి 20 రోజులు అవుతోంది. లాక్డౌన్ వల్లే ఈ రోజు పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషయంలో పోలీసుల పాత్ర గొప్పది. ఇంట్లో లాక్డౌన్ పాటిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. లాక్డౌన్ పాటించని వారు దయచేసి పాటించాలి’అని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కార్యాలయానికి చేరుకున్న విజయ్ కాసేపు ఆయనతో ముచ్చటించారు. కరోనాపై పోరాటంలో పోలీసులు చేస్తున్న విశేష కృషి, సేవకి విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: కష్టమే..అయినా తప్పదు - ఇటలీ ప్రధాని మాటపై నిలబడ్డా.. ఇక మీ వంతు -
కన్నీటి పర్యంతమైన దర్శకుడు శంకర్
పెరంబూరు: ఇండియన్-2 చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యూనిట్ సభ్యుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. కోటి అందించనున్నట్లు దర్శకుడు శంకర్ ప్రకటించారు. ఇప్పటికే నటుడు కమలహాసన్ కోటి రూపాయలు, చిత్ర నిర్మాత సుభాష్కరన్ రూ. 2 కోట్లను అందించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం దర్శకుడు శంకర్ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఆయన ఇండియన్-2 చిత్రం షూటింగ్లో జరిగిన ప్రమాదం షాక్, మనోవేదన నుంచి తాను ఇంకా కోలుకోలేదన్నారు. ఒక నెల రోజుల ముందే తన వద్ద సహాయకుడిగా చేరిన కృష్ణ మృతి ఆయన్ను బాధిస్తూనే ఉందన్నారు. ఇంత భారీ బడ్జెట్ చిత్ర యూనిట్లో చేరిన కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకుని చాలా చక్కగా పని చేసిన వ్యక్తి కృష్ణ అని, అతన్ని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. కృష్ణ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు అతని తల్లి పడిన ఆవేదన ఇంకా తన కళ్లలో మెదులుతూనే ఉందని వాపోయారు. ప్రొడక్షన్ బాయ్ మధును మార్చురీలో చూసి తన గుండె ముక్కలైందని, ఆర్ట్ డిపార్ట్మెంట్ చంద్రన్ మరణం తనను తీవ్రంగా బాధిస్తోందని, దుఖం ఆగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినా అనూహ్యంగా జరిగిన ప్రమాద ఘటనతో షాక్ నుంచి బయట పడలేక వేదన పడుతున్నానని శంకర్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదం వ్వవహారంపై కేసు దర్యాప్తు చేస్తున్న క్రైంబ్రాంచ్ పోలీసు అధికారుల విచారణకు శంకర్ హాజరైన విషయం తెలిసిందే. కాగా కమలహాసన్ కూడా త్వరలో విచారణకు హాజరు కానున్నట్లు తెలిసింది. -
ఇంకా షాక్‌లోనే ఉన్నా
వారంరోజుల క్రితం ‘ఇండియన్ 2’ సెట్లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్ షూటింగ్ చేస్తున్న యూనిట్‌పై పడటంతో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇది జరిగి వారం అయింది. ‘‘ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను షాక్‌లోనే ఉన్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్, టీమ్‌లో ఇద్దరు చనిపోవడం నన్ను నిద్రలేని రాత్రులకు గురి చేస్తోంది. నేను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నప్పటికీ, ఆ క్రేన్ ఏదో నా మీద పడుంటే బావుండు అనిపిస్తోంది. చనిపోయినవారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను’’ అని బుధవారం ట్వీట్ చేశారు శంకర్. -
షాక్ అయ్యాం
బుధవారం రాత్రి చెన్నైలో ‘ఇండియన్ 2’ సెట్లో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ క్రేన్ కూలిన చుట్టుపక్కలే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తదితర తారాగణం ఉన్నారట. మరోవైపు దర్శకుడు శంకర్ తన టీమ్‌తో మానిటర్లో షాట్ చెక్ చేసుకుంటున్నారట. శంకర్ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కమల్ స్పందిస్తూ– ‘‘నేను చాలా ప్రమాదాలను చూశాను కానీ ఇది చాలా తీవ్రమైనది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధను వర్ణించలేం’’ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయిల విరాళం ప్రకటించారాయన. ‘‘ఈ ఘటనకు చాలా షాక్ అయ్యాను. ఇంకా తేరుకోలేకపోతున్నా. అంతా క్షణికంలో జరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఏమీ జరగకుండా సురక్షితంగా ఉండి, ఈ ట్వీట్ చేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞురాలిని. ఈ ఘటనతో జీవితం విలువ, సమయం విలువ అర్థం అయింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు కాజల్. -
భారతీయుడు-2: కమల్ కొత్త స్టిల్!!
చెన్నై: లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు శంకర్ గురువారం భారతీయుడు-2 మూవీ స్టిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సుమారు 23 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు-2లో కమల్ లుక్ ఎలా ఉంటుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులను.. సర్ప్రైజ్ చేశాడు. విలక్షణ నటుడు కమల్ - ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాలో ఆయన మరోసారి సేనాపతిగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా కమల్ తన పుట్టిన రోజు వేడుకల కోసం భారతీయుడు-2 సినిమా షూటింగ్‌కు 3 రోజుల పాటు బ్రేక్ చెప్పి.. తన స్వగ్రామం పరమక్కుడిలో 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా తండ్రి శ్రీనివాసన్ విగ్రహన్ని ఆవిష్కరించారు. Happy birthday sir @ikamalhaasan pic.twitter.com/Gpx6LRc2DO — Shankar Shanmugham (@shankarshanmugh) November 7, 2019 ఇక కమల్ హాసన్ ఇండియన్(1996) సినిమాలో అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను హడలెత్తించే సేనాపతి పాత్రలో.. విశ్వరూపం చూపి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. కాగా భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. -
అప్పుడు 70 ఇప్పుడు 90
శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లో 1996లో వచ్చిన సినిమా ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు). ఆ సినిమాలో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో 70 ఏళ్ల వృద్ధుడిలా నటించారు కమల్. అప్పుడు 41 ఏళ్ల వయసులో ఉన్న కమల్ హాలీవుడ్ స్థాయి మేకప్, తన నటనతో ప్రేక్షకులను తాను నిజంగానే 70 ఏళ్ళ వృద్ధుడు అన్నట్లు నమ్మించారు. 23 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ వయసు 64. రెండో భాగంలో ఆయన 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారట. యాక్షన్ సీన్స్‌ను కూడా అందుకు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారట ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
శంకర్ దర్శకత్వంలో షారూఖ్ !
ప్రముఖ దర్శకుడు శంకర్ తదుపరి చిత్రం గురించి ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శంకర్ సముద్రం నేపథ్యంలో ఆక్టోపస్ ప్రధాన పాత్రగా 3డి చిత్రం తీయనున్నారనీ, ఫుల్ యాక్షన్ అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్‌తో రూపొందబోయే ఈ చిత్రానికి స్క్రిప్టు కూడా లాక్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలో సూపర్ పవర్స్ కలిగిన భారీ సైజు ఆక్టోపస్ది కీలక పాత్రట. అందుకోసం మొదట బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను సంప్రదించగా, ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో షారూఖ్‌ను లైన్లో పెట్టినట్టు సమాచారం. గత చిత్రం రోబో 2.0లో అక్షయ్‌కుమార్‌ను పక్షిరాజుగా చూపెట్టిన శంకర్ అక్టోపస్ క్యారెక్టర్‌ను దాన్ని మించి ఉండేలా డిజైన్ చేశారంట. ఈ సినిమాలో మరికొన్ని పాత్రల కోసం జాకీచాన్, తమిళ నటుడు విజయ్, చైనీస్ నటి లీ బింగ్ బింగ్లను కూడా సంప్రదించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రోబో 2ను మించిన బడ్జెట్ అవసరమవడంతో ఈ చిత్రం నిర్మాణం కోసం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థల్ని సంప్రదిస్తున్నాడంట శంకర్. అయితే ఇవన్నీ ఊహాగానాలే. శంకర్ నుంచి గానీ, షారూక్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. అసలు విషయం ఏంటన్నది తెలుసుకోవాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. -
రాజమౌళిని ఫాలో అవుతున్న శంకర్..!
తమిళ సినిమాను హాలీవుడ్ సినీ పరిశ్రమ తిరిగి చూసేలా చేసిన దర్శకుడు శంకర్ అయితే తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి అని చెప్పక తప్పదు. ఇది అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరు బ్రహ్మాండాలకు మారు పేరు. గ్రాఫిక్స్‌ను వాడుకోవడంలో సిద్ధహస్తులు. శంకర్ పనితనానికి రాజమౌళి అబ్బురపడతారు. రాజమౌళి దర్శక ప్రతిభకు శంకర్ ఫిదా అవుతారు. ఇది 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఆహూతులకు కనువిందు చేసిన సంఘటన. కాగా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో మల్టీస్టార్ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా దర్శకుడు శంకర్ కూడా రాజమౌళి బాణీలో ఒక బ్రహ్మాండ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజాగా టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈయన ఇంతకు ముందు విజయ్, శ్రీకాంత్, జీవాలతో ‘నన్భన్’ అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే అది హిందీ చిత్రం త్రీ ఇడియట్స్‌కు రీమేక్. కాగా తాజాగా శంకర్ తన సొంత కథతో మల్టీస్టారర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 2.ఓ చిత్రం తరువాత శంకర్ నటుడు కమలహాసన్‌తో ఇండియన్–2 చిత్రం చేయడానికి సన్నాహాలు చేసిన విషయం, కమలహాసన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ చిత్రం నిర్మాణం నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్–2 చిత్రానికి ముందు ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇక ఇంతకీ ఆ మల్టీస్టారర్ ఎవరంటే ఇళయదళపతి విజయ్, సిమాన్ విక్రమ్ అని సమాచారం. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇంతకు ముందు శంకర్‌తో పని చేసిన వారే. విజయ్‌తో నన్భన్, విక్రమ్‌తో అన్నియన్, ఐ చిత్రాలను శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే శంకర్ మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారంలో నిజమెంత అన్నది అధికారకపూర్వమైన ప్రకటన వెలువడే వరకూ వేచి ఉండాల్సిందే. ఇలాంటి చిత్రం శంకర్ నుంచి రావాలని ఆయన అభిమానులు ఆశించడంలోనూ తప్పులేదు. -
మల్టీస్టారర్ వైపు మళ్లారా?
భారీ సినిమాలకు శంకర్ పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో కథ ఎంత భారీగా ఉంటుందో, ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని రూపొందించే బిజీలో ఉన్నారు శంకర్. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే కోలీవుడ్‌లో లేటెస్ట్గా వినిపిస్తున్న వార్తేంటంటే ‘భారతీయుడు 2’ షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం వాయిదా పడేలా ఉందని, లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా బడ్జెట్ విషయంలో సుముఖంగా లేదని టాక్. దాంతో శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను కొద్ది రోజులు పక్కన పెట్టి ఓ కొత్త ప్రాజెక్ట్ రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నారట. విజయ్ – విక్రమ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని చెన్నై సమాచారం. భారతీయుడా? మల్టీస్టారర్ మూవీయా? చెన్నైలో ఉండే ఆ శంకరుడే క్లారిటీ ఇవ్వాలి. -
యస్ 25
ఇండియన్ స్క్రీన్‌పై టెక్నాల జీని, భారీ హంగును చూపించిన దర్శకుడు శంకర్. భారీ ఖర్చుతో భారీ చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరు. ఆయన ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మిస్కిన్ సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కోలీవుడ్ దర్శకులు మణిరత్నం, కరుణాకరన్, గౌతమ్ మీనన్, లింగుస్వామి, బాలాజీ శక్తివేల్, పాండీరాజ్, అట్లీ, వసంత్ బాలన్, పా. రంజిత్ పాల్గొన్నారు. అందరూ ‘యస్ 25’ అనే లోగో ముద్రించి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్స్‌ను ధరించారు. స్పెషల్‌గా డిజైన్ చేయించిన కేక్‌ను శంకర్ కట్ చేశారు. ∙మణిరత్నం, మిస్కిన్, శంకర్ -
క్రేజీ కాంబినేషన్ కుదిరేనా?
150వ చిత్రం (ఖైదీ నంబర్ 150) తర్వాత ప్రస్తుతం భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రం ‘సైరా’లో నటిస్తున్నారు చిరంజీవి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సోషల్ డ్రామా సబ్జెక్ట్ చేయనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్గా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ నిర్మిస్తారట. ‘శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుంది’ అని ఇప్పటికే పలు సందర్భాల్లో చిరంజీవి పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్స్‌తో కూడిన సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలను ఎక్కువగా రూపొందిస్తారు శంకర్. మరి చిరంజీవి, శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా ఎలాంటి జానర్లో ఉంటుందో వేచి చూడాలి. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు శంకర్. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమాపై దృష్టి పెడతారట శంకర్. మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి. -
నేటి భారతీయుడు
ఆయుధాలు లేకుండా కేవలం రెండు వేళ్లతో ప్రత్యర్థులను ఎదుర్కోగలడు సేనాపతి. అవినీతిని ఆశ్రయించినవాళ్లకు సమాధానం చెబుతూ 1995లో శంకర్ సృష్టించిన పాత్ర ఇది. సేనాపతి పాత్రలో కమల్‌హాసన్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు శంకర్. మొదటి భాగంలో కమల్ వృద్ధ గెటప్‌లో ఎలా కనిపించారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేటి భారతీయుడిని చూడండి. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ కానుంది. సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమాలో కమల్ లుక్‌ను కొద్దిగా శాంపిల్ చూపించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. కమల్‌హాసన్ మనవడిగా సిద్దార్థ్ నటించనున్నారని టాక్. అనిరు«ద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
డిఫరెంట్ ఉన్మాది
‘‘ఉన్మాది’ లాంటి సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎన్.ఆర్. రెడ్డిగారు ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. హీరోయిజమ్, విలనిజమ్ చూపించదగిన పాత్రలో ఎన్.ఆర్. రెడ్డిగారు నటించారు. తమిళ్లో రాజ్‌కుమార్‌గారు కూడా ఇదే వయసులో హీరోగా పరిచయం అయ్యారు’’ అని డైరెక్టర్ ఎన్.శంకర్ అన్నారు. ఎన్.ఆర్. రెడ్డి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉన్మాది’. ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో ఎన్. రామారావు నిర్మించారు. డేవిడ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత రాజ్‌కందూరి విడుదల చేయగా, ట్రైలర్‌ను ఎన్.శంకర్ ఆవిష్కరించారు. ‘‘స్వర్గీయ హరికృష్ణగారికి నేను ఫ్యాన్. ఆయనే నాకు స్ఫూర్తి. ‘ఉన్మాది’ సినిమాలో ఒక్కసారైనా ఆయనలా కనిపించాలని ప్రయత్నించాను. రాఘవ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు ఎన్.ఆర్.రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: దంటు వెంకట్, నిర్వహణ: ఎన్.వరలక్ష్మి. -
2 కోట్ల సెట్... 2 నిమిషాలే!
‘2.0’ రిలీజ్ టైమ్‌కే దర్శకుడు శంకర్ తన నెక్ట్స్ చిత్రం ‘ఇండియన్ 2’ సినిమా పనులతో బిజీ అయిపోయారు. గతేడాది డిసెంబర్ 14న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ కూడా చేశారు. కానీ ‘భారతీయుడు’ రెగ్యులర్ షూటింగ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభం కానుందట. కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996 వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సీక్వెల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 18న మొదలు కానుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ కేరళ మార్షల్ ఆర్ట్ కలరి పయ్యట్టు నేర్చుకోనున్నారు. కమల్ కనిపించనున్న పాత్రల్లో తాత పాత్ర ఒకటి. దీని కోసం కమల్‌హాసన్ బరువు తగ్గారు కూడా. ఈ సినిమా బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదని దర్శకుడు శంకర్ ఫిక్స్ అయినట్టున్నారు. ఈ సినిమాలో ఓ సెట్ కోసం సుమారు 2 కోట్లు వరకూ వెచ్చించారట. గోల్డ్ సెట్ అని పిలిచే దీని తయారీకు కావాల్సిన వస్తువులను ప్రత్యేకంగా చైనా నుంచి తెప్పించారు. 2 కోట్లతో వేయించిన ఈ సెట్ సినిమాలో 2 నిమిషాలు కూడా కనిపించదట. సెట్స్ వర్క్‌తో పాటు నేచురల్ లొకేషన్స్‌లోనూ పలు సీన్స్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా కీలక సన్నివేశాలను ఉక్రెయిన్ దేశంలో షూట్ చేయనున్నారట. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శింబు కూడా కీలక పాత్రలు పోషించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. 2020లో రిలీజ్ కానుంది. హృతిక్‌తో శంకర్? ‘భారతీయుడు 2’ తర్వాత దర్శకుడు శంకర్ చేయబోయే ప్రాజెక్ట్‌లో హీరోగా హృతిక్ రోషన్ కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. సైన్స్ ఫిక్షన్ జానర్లో ఈ చిత్రకథ ఉండబోతోందట. ఆల్రెడీ శంకర్ వినిపించిన ఐడియా హృతిక్‌కు నచ్చిందని, ‘భారతీయుడు 2’ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని భోగట్టా. -
రెండో సీఎంకి నా ఛాయిస్ ఆయనే!
సాక్షి, తమిళసినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సూపర్‌హిట్ సినిమాలకు వరుసగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఇప్పటికే రోబో సీక్వెల్ 2.ఓ వచ్చింది. త్వరలో భారతీయుడు సీక్వెల్ కూడా రాబోతోంది. మరి ‘ఒకే ఒక్కడు’ సినిమాకు కూడా సీక్వెల్ వస్తే.. అందులో ముఖ్యమంత్రి పాత్ర ఎవరు పోషిస్తారంటే.. ‘నా ఫస్ట్ ఛాయిస్ విజయ్‌నే’ అంటున్నారు శంకర్. ఆయన తాజా చిత్రం ‘2.ఓ’ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఈ విషయాన్ని ఈ సినిమా కథానాయకుడు రజనీకాంత్ ఆదివారం రాత్రి తన తాజా చిత్రం పేట ఆడియో ఆవిష్కరణ సందర్భగా స్వయంగా చెప్పారు. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్‌హాసన్ కథానాయకుడిగా ఇండియన్- 2 చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 14న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా, ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన శంకర్.. మీ తదుపరి చిత్రం ఏంటన్న ప్రశ్నకు ముదల్వర్ (ఒకే ఒక్కడు) చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉందని తెలిపారు. ముదల్వర్ చిత్రాన్ని శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ముదల్వర్- 2లో హీరోగా ఎవరిని ఎంపిక చేయనున్నారన్న ప్రశ్నకు రజనీ, కమల్‌లలో ఒకరు నటించడానికి సిద్ధమంటే వారితోనే చేస్తానన్నారు. అయితే, స్క్రిప్ట్ యువ హీరోను డిమాండ్ చేస్తే తన ఫస్ట్ ఛాయిస్ ఇళయదళపతి విజయ్నేనని చెప్పారు. ఇండియన్- 2 చిత్రం పూర్తయిన తరువాతనే ముదల్వర్- 2 గురించి చర్చిస్తానని తెలిపారు. కాగా ఇంతకుముందు శంకర్, విజయ్‌ల కాంబినేషన్లో నన్భన్ (స్నేహితుడు) చిత్రం రూపొందింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. -
బాహుబలి అందుకే అంత సక్సెస్ అయింది : రజనీ
‘‘శంకర్‌గారు తెలుగు మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ‘రోబో’ సినిమా ఆడియో ఫంక్షన్లో ‘నాకు తెలుగు తెలీదు’ అని చెప్పి ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడొచ్చి ఇంత బాగా తెలుగు మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచివాళ్లు. మమ్మల్ని చాలా అభిమానిస్తారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్ ఆనందమైంది’’ అని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్వీప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 29న ఈ చిత్రం విడు దలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘రోబో’ సినిమా చేసినప్పుడు ఒక రీల్ త్రీడీలోకి మార్చి, ఆ తర్వాత మొత్తం సినిమా త్రీడీలోకి మార్చాలనుకున్నాం. ఒక రీల్ త్రీడీలోకి కన్వర్ట్ చేశాక శంకర్‌గారు డిసైడ్ చేశారు. త్రీడీలో కచ్చితంగా చేద్దాం. కానీ, త్రీడీ చేయాలని సినిమా చేస్తే బాగుండదు.. దానికి సరైన కథ కుదరాలి. అప్పుడు ఆలోచిస్తా అన్నారు. నాలుగేళ్ల ముందు నన్ను కలిసి త్రీడీ సినిమా చేద్దామన్నారు. మంచి కథ కుదిరిందని నాకు అర్థం అయింది. ఆయనతో నేను సినిమా చేశాను కాబట్టి ఇది సాధ్యమా? అనే అనుమానం నాకు రాలేదు. ఆయనొక మెజీషియన్. ‘బాహుబలి’ సినిమా అంత పెద్ద సక్సెస్‌కి కారణం ఫస్ట్ కథ. దానికి తగ్గుట్టు గ్రాండ్ లుక్. ఆ రెండు బాగా కుదిరాయి కాబట్టి అంతపెద్ద సక్సెస్ అయింది. ‘2.ఓ’ కూడా అంతే. త్రీడీ టెక్నాలజీ.. దానికి తగ్గ కథ. ఈ రెండు చక్కగా కుదిరినందు వల్ల ఈ సినిమా వందశాతం పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. శంకర్‌కి కావాల్సినవన్నీ ఇచ్చిన సుభాస్కరన్‌గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమాకి ప్రమోషన్ అక్కర్లేదు.. ప్రసాద్‌గారు ఊరికే డబ్బు దుబారా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. టికెట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పా. 1975లో నా తొలి సినిమా ‘అపూర్వ రాగంగల్’ చూడాలని ఎంత ఆత్రుతగా ఉన్నానో.. 43ఏళ్ల తర్వాత ఈ ‘2.ఓ’ చూడాలని అంతే ఆత్రుతగా ఉన్నా. ట్రైలర్లో మీరు చూసింది జస్ట్ శాం్యపిల్సే. ఆశ్చర్యపోయే అంశాలన్నీ సినిమాలో ఉన్నాయి. మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ‘2.ఓ’ పెద్ద వెలుగు. దానికి శంకర్, ఆయన యూనిట్, నిర్మాత, అక్షయ్‌గారి ఎఫర్ట్.. అన్నీ కలిపి కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. శంకర్‌గారు చెప్పినట్టు ఈ సినిమాని త్రీడీలో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మీలాగా నేను కూడా 29వ తేదీ కోసం వేచి చూస్తున్నా’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2.ఓ’ ని ప్రసాద్‌గారు, మేము, యూవీ క్రియేషన్స్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. రెండు రోజులకు ముందు విడుదలైన పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ఆన్లైన్లోనే తెలిసిపోతోంది. ‘2.ఓ’ వన్ ఆఫ్ ది ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ కాబోతోంది’’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు గ్రేట్ ఆర్టిస్ట్. అక్షయ్ కుమార్‌కూడా ఈ మధ్య వరుస హిట్లు అందుకున్నారు. ఇటీవల ఆయన సినిమాలు పబ్లిక్‌లో మంచి అవేర్నెస్ తీసుకొచ్చాయి. ఇండియాగర్వించదగ్గ గ్రేట్ డైరెక్టర్ శంకర్‌గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన నాలుగేళ్లు రాత్రి, పగలు కష్టపడి ‘2.ఓ’ సినిమాని సృష్టించారు. సుభాస్కరన్‌గారు అంత గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ ఇండియన్ సినిమాని ప్రపంచస్థాయి సినిమాగా మార్చేందుకు వీరు నలుగురూ కృషి చేశారు. ఈ నెల 29నుంచి దీపావళి పండుగ ప్రారంభం అవుతుంది. సంక్రాంతి తర్వాత కూడా ఈ దీపావళి కొనసాగుతుంది. తొలిసారి రియల్ త్రీడీలో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. యూనిట్ కష్టానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చి, ఇదొక ప్రపంచస్థాయి సినిమా అవ్వాలని ఆశిస్తున్నా. ఈ సినిమాని మేం గర్వంగా తెలుగులోకి తీసుకొస్తున్నాం. మీరు(శంకర్), రాజమౌళిగారు, రాజు హిర్వాణీగార్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తు పెట్టుకునేటట్లు ఇటువంటి ఎన్నో మంచి చిత్రాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇలా నడిస్తే ఎలా ఉంటది? అన్న నా ఊహే ‘2.ఓ’. ఇదొక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్, థ్రిల్లర్. మంచి భావోద్వేగంతో పాటు, సామాజిక కథ ఉంది. ఇదొక పెద్ద టీమ్ వర్క్. నటీనటులు, వేలమంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఢిల్లీలో 47డిగ్రీల ఉష్ణోగ్రతలో చిత్రీకరించిన క్లైమాక్స్ కోసం రజనీగారు చాలా కష్టపడ్డారు. రెహమాన్‌గారు ఆరు నెలల కిందే నేపథ్య సంగీతం స్టార్ట్ చేశారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తే ‘బ్లాక్ పాంథర్, స్పైడర్ మేన్’ చూసినట్టు ఉంటుంది. ఈ క్రెడిట్ మెయిన్‌గా నిర్మాత సుభాస్కరన్‌గారికి ఇవ్వాలి. ఇక ఇండియన్ ఫిల్మ్‌కి ఇంతపెద్దగా ఎవరూ ఖర్చు పెట్టరు. కానీ, సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఇంత గ్రాండ్‌గా తీసినందుకు థ్యాంక్స్. మా టీమ్‌కి ఎంత ఎగై్జట్‌మెంట్ ఉందో అదే ఎగై్జట్‌మెంట్ ప్రేక్షకులకూ ఉంటుంది. ఇలాంటి సినిమాని మీడియా కూడా సపోర్ట్ చేస్తే మన దేశంలో కూడా ‘2.ఓ’ లాంటి సినిమా చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పవచ్చు’’ అన్నారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘2.ఓ’ నాకు ఒక సినిమా కాదు. శంకర్ ప్రిన్సిపల్‌గా ఉన్న స్కూల్‌కి వెళ్లినట్లు ఉంది. ఇండస్ట్రీలో 28 ఏళ్లుగా ఉంటూ నేర్చుకున్నదానికంటే ‘2.ఓ’ చిత్రంతో నేర్చుకున్నదే ఎక్కువ. బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ రజనీకాంత్సార్కి విలన్‌గా నటించడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. రజనీకాంత్‌గారు సింపుల్లైన్లో కూడా మ్యాజిక్ చేయగలరు. ఎలానో నాకు తెలీదు. ఆయనతో నటించే అవకాశంతో పాటు ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఇచ్చిన శంకర్‌కి థ్యాంక్స్. నిర్మాత సుభాస్కరన్ బాగా ఖర్చు పెట్టారు. నేను కూడా ఇంకా సినిమా చూడలేదు. రిలీజ్ కోసం ప్రేక్షకుల్లా నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. హైదరాబాద్‌లో ‘2.ఓ’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న శంకర్ ఇంటర్వ్యూ విశేషాలు... ► నాలుగేళ్ల ‘2.ఓ’ ప్రయాణం ముగిసింది. సినిమా రిలీజవుతోంది. ఈ ఫీలింగ్ ఇప్పుడు ఎలా ఉంది? సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? ఎంత ఎంజాయ్ చేస్తారో అని ఎదురుచూస్తున్నా. ► ఈ సినిమా టెక్నాలజీ, బడ్జెట్ పెరగడం గురించి..? స్క్రిప్ట్ డిమాండ్ మేరకే త్రీడీ టెక్నాలజీ వాడాం. కొత్తగా డిజైన్ చేయాలనుకున్నాం. అందుకు కొంత ఖర్చు పెట్టక తప్పదు. ట్రైలర్లో కనిపించిన సెల్మెన్, బర్డ్.. అన్నీ సెటప్‌నే. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైమ్ పట్టింది. బడ్జెట్ కూడా పెరిగింది. క్రియేట్ చేసిన క్యారెక్టర్స్‌లో ఎమోషన్స్‌ని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ► ‘2.ఓ’ కథాంశం పెద్దగా బయటకు రాలేదు? ఫస్ట్ నన్ను నేను ఒక ఆడియన్‌గా భావించి థియేటర్‌కి వెళతాను. ఓ ప్రేక్షకునిగా సినిమాను నేను ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటానో అలాంటి అనుభవాన్నే నా సినిమా చూస్తున్నవారికి ఇవ్వాలన్నది నా ఆలోచన. అందుకే సినిమాలో కోర్ సబ్జెక్ట్‌ను రివీల్ చేయలేదు. చేస్తే ఆడియన్స్ సర్ప్రైజ్ మిస్ అవు తారు. అందుకే ట్రైలర్లో ఎక్కువ కథ చెప్పలేదు. ► మేకింగ్ వీడియోలో అక్షయ్ కష్టం కనిపించింది. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అక్షయ్ కుమార్ కమిట్మెంట్, డెడికేషన్, డిసిప్లేన్ సూపర్. ప్రతిరోజూ 3–4 గంటలు వర్క్ చేయాల్సిందే. కేవలం మేకప్ తీయడానికే గంటన్నర పట్టేది. ప్రోస్థటిక్ మేకప్, టీత్, పెద్ద బరువు ఉన్న డ్రెస్‌లు వేసుకున్నారు. మండు వేసవిలోనూ షూటింగ్లో పాల్గొన్నారు. అందుకే ఆయన్ని విలన్‌గా అనుకోలేదు. ఆయన క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ► రజనీగారితో ‘రోబో’ కి పని చేసారు? ఇప్పుడు ‘2.ఓ’కి.. ఎమైనా డిఫరెంట్‌గా అనిపించిందా? ప్రతి సినిమాకు రజనీగారు కష్టపడతారు. ఆయన ఏం చేసినా ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. ఒక స్టైల్, ఫన్, పెర్ఫార్మెన్స్..అన్నీ ఉంటాయి. ► ‘రోబో’ కి సీక్వెల్ ఆలోచన ఎప్పుడొచ్చింది? ‘రోబో’ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుటుందని ఆడియన్స్ అనుకున్నారు. కరెక్ట్ స్టోరీ కుదరాలని నేను అనుకున్నాను. సెకండ్ పార్ట్‌పై అంచనాలతో వచ్చిన ఆడియన్స్ నిరుత్సాహపడకూడదు. 5 సంవత్సరాల క్రితం ఓ స్ట్రీట్‌లో చాలా సెల్‌ఫోన్స్ కనిపించాయి నాకు. అప్పుడే ‘2.ఓ’ ఐడియా వచ్చింది. ► ‘2.ఓ’ లో ఐశ్వర్యారాయ్‌ని ఎందుకు తీసుకోలేదు? ‘రోబో’ లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఉంది. కానీ ‘2.ఓ’ డిఫరెంట్ స్టోరీ. సైంటిస్ట్, చిట్టి, రోబో 2.0 క్యారెక్టర్లు ఉన్నాయి. స్టోరీ డిమాండ్ చేయలేదు. కానీ, ఐశ్వర్యారాయ్ క్యారెక్టర్ రిఫరెన్స్ సినిమాలో కనిపిస్తుంది. ► తర్వాతి ప్రాజెక్టులు ఏంటి? కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేయబోతున్నాను. ఇందులో బాలీవుడ్, సౌత్ స్టార్స్ ఉంటారు. డిసెంబరులో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. -
అవును... నాకు కోపమొస్తుంది
సామాజిక సమస్యలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గ్రాండ్ విజువల్స్‌తో తెర మీద చూపిస్తారు దర్శకుడు శంకర్. ‘జెంటిల్‌మేన్’ నుంచి ‘ఐ’ వరకూ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన దర్శకుడిగా మనకు తెలుసు. కానీ శంకర్ సెట్లో ఎలా ఉంటారు? శంకర్‌కు కోపం వస్తుందా? కోపంతో మూడో కన్ను విప్పి ఉగ్ర శంకరుడౌతారా? మనకు తెలియదు. ఇదే ప్రశ్న శంకర్‌నే అడగ్గా – ‘‘అవును నాకు కోపం వస్తుంది అని సమాధానం ఇచ్చారు. కోపం రావడం వల్ల కొన్ని పనులు సక్రమంగా జరుగుతాయి’’ అని అంటున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘సెట్లో ఏదైనా పని సరిగ్గా జరగకపోతే కోపం వస్తుంది. చేసే పనిలో శ్రద్ధ లేకపోయినా, సక్రమంగా జరగకపోయినా కోపం వస్తుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా కోపం వచ్చేది. విచిత్రంగా కోపం కొన్ని సార్లు పనులన్నీ సక్రమంగా జరిగేలానూ చేస్తుంది. మనం కోపంగా, చిరాకుగా ఉన్నాం అని మన చుట్టూ ఉన్నవాళ్లు చూస్తే ఆ పని చాలా ముఖ్యమైందని, త్వరగా పూర్తి చేయాలని పనులను త్వరగా పూర్తి చేస్తారు. మెల్లగా మెల్లగా కోప్పడటం వల్ల ఉపయోగం లేదని అర్థం అయిపోయింది. కోపం తెచ్చుకోవడం కంటే ఏర్పడ్డ సమస్యకు పరిష్కారం వెతకడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం మొదలెట్టాను’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘2.0’ ఈ నెల 29న రిలీజ్ కానుంది. -
ఫుల్ జోష్
విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సౌత్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది ‘కర్వాన్’ సినిమాతో బాలీవుడ్ గడప తొక్కిన దుల్కర్ ప్రస్తుతం ‘జోయా ఫ్యాక్టర్’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. నార్త్, సౌత్ సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న ఆయనకు తాజాగా ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించే చాన్స్ వచ్చిందని కోలీవుడ్ టాక్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ‘ఇండియన్ 2’ సీక్వెల్. శంకర్ –కమల్‌హాసన్ కాంబినేషన్లోనే తెరకెక్కనున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా ఎంపికయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. -
లేట్ అయినా కరెక్ట్‌గా రావాలి.. వస్తే కొట్టాలి
సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ఎంతో స్టైల్‌గా, కాన్ఫిడెంట్‌గా అన్న మాటలివి. కొట్టాలంటే.. హిట్‌ని ఉద్దేశించి అంటున్నా అని ఆయన సరదాగా అన్నారు. కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఉద్వేగానికి గురయ్యారు కూడా. ఉదాహరణకు ‘2.0’ చేస్తున్నప్పుడు నాకు ఆరోగ్యం బాగా లేక ‘ఇక నా వల్ల కాదు శంకర్’ అనే మాటలను. ‘నా తల్లీతండ్రి, దైవం అయినా మా అన్నయ్య, అప్పుడప్పుడు నా తప్పులను మన్నించిన మా అన్నయ్య ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది’ అని మాటలను వేదిక సాక్షిగా అన్నప్పుడు రజనీకాంత్ కళ్లు చెమర్చడం విశేషం. సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. పూర్తిగా త్రిడీ ఫార్మాట్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్లో సౌండ్ డిజైన్ చేయడం మరో విశేషం. ఈ నెల 29న ‘2.0’ని విడుదల చేస్తున్న సందర్భంగా చెన్నైలో 4డి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆత్మవిశ్వాసం పోయింది ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘సుభాస్కరన్కి, శంకర్‌కి అడ్వా¯Œ్స కంగ్రాట్స్. శంకర్‌ని నమ్మి నిర్మాత 600 కోట్లు పెట్టారు. అంతేగానీ నన్నో, అక్షయ్కుమార్నో నమ్మి కాదు. ఆడియ¯Œ్స ఎక్స్పెక్టేషన్, నిర్మాతల ఎక్స్పెక్టేషన్ని ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉన్నారు శంకర్. కొన్నిసార్లు తప్పి ఉండవచ్చు. అయినా అతను మెజీషియన్. ఏదో రూ.600కోట్లు పెట్టినంత మాత్రాన ఈ సినిమా హిట్ అని నేను చెప్పడం లేదు. అందరూ కష్టపడతారు. అయినా అన్నిసార్లు వర్కవుట్లు కావు. కొన్నిసార్లు ఏవో మేజిక్‌లు వర్కవుట్లు అవుతాయి. ఈ సినిమాలో అలాంటి మేజిక్‌లున్నాయి. ఈ సినిమాకు ప్రమోషన్ తక్కువగా ఉందని కొందరు అంటున్నారు. కానీ ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ అవసరంలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తారు. మంచికి తోడుగా ఉండే మీడియా తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. పర్యావరణాన్ని, సొసైటీని మోడ్రన్ టెక్నాలజీ ఎలా స్పాయిల్ చేస్తుందో ఇందులో చాలా బాగా చెప్పారు. శంకర్‌గారు ఏమనుకున్నారో దాన్ని తీయగల సత్తా ఆయనకుంది. అందుకే ఆయన కథ చెప్పినప్పుడు ‘ఇదెలా వర్కవుట్ అవుతుంది?’ అని అడగలేదు. ఎవరు నిర్మిస్తున్నారు? అని మాత్రం అడిగాను. ‘శివాజీ’ చేసేటపుడు ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా రెట్టింపయింది. కానీ ఆ సినిమాకు అంత కన్నా ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయి. ‘రోబో’ తీయాలనుకున్నప్పుడు ‘శివాజీ’ ఎంత కలెక్ట్ చేసిందో అంత బడ్జెట్‌తో చేస్తాం..పెట్టింది వస్తే చాలన్నారు సన్ పిక్చర్స్ వాళ్లు.. దానికన్నా 20–30 పర్సెంట్ బడ్జెట్ ఎక్కువయింది. అయినా రెండింతలు వసూలు చేసింది. ‘రోబో’ కలెక్ట్ చేసినంత ఈ సినిమాకు వస్తే చాలు అని ‘2.0’ మొదలుపెట్టాం. అందుకే ముందు రూ. 300కోట్లు అనుకున్నాం. ఇప్పుడు డబుల్ అయింది. తప్పకుండా అంతకు డబుల్ కలెక్ట్ చేస్తుంది. ‘కబాలి’ ఒక షెడ్యూల్ చేసిన తర్వాత నాకు ఆరోగ్యం బాగా లేకుండాపోయింది. ‘2.0’ కోసం 5 రోజులు షూట్ చేశా. 7, 8 రోజులైంది. అప్పటికే నాకు ఆత్మవిశ్వాసం పోయింది. ‘నేను జస్టిఫై చేయలేను. ఖర్చుపెట్టిందంతా ఇచ్చేస్తాను. నేను చేయలేను’ అని శంకర్‌ని పిలిచి చెప్పా. ‘మీరు జస్ట్ అలా రండి. మీరు కన్ను చూపించండి.. మిగిలింది మొత్తం మనం చేద్దాం’ అన్నారు. 12 నుంచి 14 కేజీల బరువు ఉన్న బాడీ సూట్ వేసుకోవాలి. అది వద్దన్నారు. కానీ నేనే.. ఆ బాడీ సూట్ వేసుకుంటా అని అన్నాను. ‘కబాలి’ కోసం మలేసియాకి వెళ్లినప్పుడు ఆరోగ్యం ఇంకా చాలా పాడయింది. అప్పుడు డాక్టర్ నాలుగైదు నెలలు రెస్ట్ కావాలన్నారు. ఆ విషయం నిర్మాత సుభాస్కరణ్‌కు తెలిసి మా ఇంటికి వచ్చి ‘నాలుగు నెలలు కాదు, నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తా. నాకు డబ్బులు కాదు. మీతో సినిమా ముఖ్యం’ అని అన్నారు. అలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం అంటే.. ఓ కోహినూర్ డైమండ్ దొరికినట్టే. ఈ సినిమా చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని చాలా మంది అడిగారు. కానీ కాస్త లేట్ అయినా, కరెక్ట్‌గా రావాలి. వస్తే, ష్యూర్‌గా కొట్టాలి. మేం హిట్ కొడుతున్నాం. శంకర్, రాజమౌళి, రాజ్‌కుమార్ హిరానీ లాంటివారు జెమ్స్ ఆఫ్ ఇండస్ట్రీ’’ అన్నారు. టన్నుల కొద్దీ కష్టపడ్డాం శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది’ అనే ఊహే ఈ కథ. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ, 4డీ అనే కొత్త అనుభవం ఉంటుంది. సుభాస్కరన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాకు గొప్ప బలం రజనీకాంత్‌గారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రజనీసార్‌కి కాస్త అనారోగ్యంగా ఉంది. ఢిల్లీలో యాక్షన్ డైరెక్టర్లు, వీఎఫ్ ఎక్స్ డైరెక్టర్లు, అక్షయ్ కుమార్, చాలా మంది కార్పెంటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు ఆరు నెలల ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ అది. దాదాపు 500–1000 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రజనీకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండ, 12 కిలోల బరువు సూట్ వేసుకుని క్లైమాక్స్ చేశారు. ఒక రోజైతే ఆయనకు దెబ్బ తగిలింది కూడా నాకు తెలియదు. ఎవరో వచ్చి చెప్పారు. ఆయన్ని కూర్చోపెట్టి.. ప్యాంట్ కాస్త పైకి తీసి చూస్తే రెండు ఇంచ్‌లు తెగిన విషయం తెలిసింది. ఇలాంటి డెడికేషన్ వల్లనే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు. అక్షయ్‌గారు ఈ సినిమాకు పడ్డంత కష్టం ఏ సినిమాకీ పడి ఉండరు. రెహమా¯Œ మళ్లీ మళ్లీ మ్యూజిక్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా పాటల్లాగానే ఉన్నాయి. వేలమంది టన్నుల కొద్దీ కష్టపడి చేసిన చిత్రమిది. మీడియా సపోర్ట్ చేస్తే, మన ఊరిలోనూ ఇలాంటి సినిమాలను చేయగలం అని ప్రపంచానికి చెప్పగలం. ఈ సినిమా కథను రాసేటప్పుడు ఇది త్రీడీలో తీస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు’’ అని అన్నారు. ‘‘2డీలో సినిమా తీసి త్రీడీకి మారిస్తే అంత నాణ్యత కనిపించదు. అలాగని త్రీడీలో తీయడం కూడా సులభం కాదు. చాలా కష్టతరమైన అంశం’’ అన్నారు కెమెరామేన్ నీరవ్ షా . అక్షయ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘రజనీసార్, శంకర్‌సార్, రెహమాన్‌గారితో కలిసి ‘2.0’లో నా పేరు కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం నన్ను అప్రోచ్ అయిన టీమ్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా వల్ల నేను చాలా నేర్చుకున్నా. శంకర్ నా దృష్టిలో సైంటిస్ట్. మూడున్నర గంటలు కూర్చుని మేకప్ చేసుకోవడం, గంటన్నర దాన్ని తీయడానికి కేటాయించడం మరచిపోలేను’’ అని అన్నారు. ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో ముందు మేం పాటలు లేవనుకున్నాం. కేవలం బ్యాగ్రౌండ్ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాటలున్నాయి. ఇందిరలోకం.. అనే పాటకోసం దాదాపు 12, 13 ట్యూన్ల తర్వాత శంకర్‌గారు ఈ ట్యూన్ సెలక్ట్ చేశారు. ముందు రీ–రికార్డింగ్‌ని కీబోర్డ్, కంప్యూటర్స్‌లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండన్‌లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంతమందితో చేశాం. నాకు రజనీకాంత్‌గారు చాలా రకాలుగా స్ఫూర్తినిచ్చారు. చిన్నతనం నుంచి సంగీత రంగంలో ఉండటం వల్ల నేను 40 ఏళ్లప్పుడు రిటైర్ కావాలని అనుకున్నా. అప్పుడే ‘రోబో’ సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి రజనీకాంత్‌గారిని చూశాక, ఆఫ్ సెట్, ఆన్ సెట్ ఆయన్ని చూశాక నా మనసు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండటమే గొప్ప కటాక్షంగా భావిస్తున్నా. ‘2.0’కి పనిచేసిన అను భవం 8 సినిమాలు చేసినట్టు అనిపిస్తోంది’’ అని అన్నారు. రసూల్ పూకుట్టి మాట్లాడుతూ – ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్ సాయం మర్చిపోలేం. ధ్వని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక విషయానికి ఈ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష సాక్షులు. ఇంత గొప్ప అచీవ్మెంట్లో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కన్నడ నటులు ఉపేంద్ర, శివరాజ్కుమార్లతో పాటు పలువురు ప్రముఖులు అడిగిన ప్రశ్నలను స్క్రీన్‌పై డిస్ప్లే చేయగా, చిత్రబృందం సమాధానాలిచ్చింది. అలాగే నటుడు కమల్‌హాసన్ వీడియో ద్వారా తన అభినందనలు తెలిపారు. -
మరో సైన్స్ ఫిక్షన్
దర్శకుడు శంకర్ సినిమాల్లో గ్రాఫిక్స్ వర్క్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. త్వరలో విడుదల కానున్న సైన్స్ ఫిక్షన్ ‘2.0’లో అంతా గ్రాఫిక్సే. ఆ మాటకొస్తే ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కూడా గ్రాఫిక్స్ బేస్డ్‌గానే ఉంటుంది. నవంబర్ 29న ఈ చిత్రం విడుదల కానుంది. ‘2.0’ తర్వాత శంకర్ ‘భారతీయుడు 2’ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా దాదాపు 22ఏళ్ల క్రితం రూపొందిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో మొదలవుతుంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు. అజయ్ దేవగణ్ విలన్‌గా నటిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం తర్వాత శంకర్ మరో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నారు. -
మరో సీక్వెల్!
ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్’ షోతో బిజీగా ఉన్నారు కమల్‌హాసన్. ఈ షో పూర్తయిన వెంటనే ఆయన ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికిది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ తెరకెక్కనుంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా కోసం ఇటీవల దర్శకుడు శంకర్ కడపలో లొకేషన్స్ చూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కమల్‌హాసన్ మరో సీక్వెల్ గురించి కూడా ఆలోచిస్తున్నారనే ఊహాగానాలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. దాదాపు 22 ఏళ్ల క్రితం కమల్ హీరోగా భరతన్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర్ మగన్’ (తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’)కి సీక్వెల్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి.. ఈ సీక్వెల్ గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నట్లు.. ‘సన్న జాజి పడక..’ పాట ‘క్షత్రియపుత్రుడు’లోనిదే అనే విషయం గుర్తు చేయక్కర్లేదు. -
కడపలో తమిళనాడు!
ఏంటి బాస్.. కడపలో తమిళనాడు ఏంటి? ఏదో రాయాలనుకుని ఏదో రాసేసినట్లున్నారే? అని కన్ఫ్యూజ్ అవ్వొద్దు. సినిమా అంటే సృష్టించడమే కదా. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కడపలో తమిళనాడుని తలపించే సెట్ వేయాలనుకుంటున్నారట. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘2.0’ నవంబర్ 28న విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. దాంతో ‘ఇండియన్’కి సీక్వెల్‌గా తీయాలనుకుంటున్న ‘ఇండియన్2’ సినిమాపై శంకర్ దృష్టి పెట్టారు. ఛాయాగ్రాహకుడు రవి వర్మన్‌తో కలసి హెలికాప్టర్లో కడపలో వాలిపోయారు. సినిమాకి అనువైన లొకేషన్స్ వెతుకుతున్నారు. తమిళనాడుని తలపించే సెట్ కూడా కడపలో వెయ్యాలనుకుంటున్నారట. ఇదే సినిమా కోసం థాయ్‌ల్యాండ్‌లో లొకేషన్స్ వెతికారు ఈ ఇద్దరూ. ఇప్పుడు కడప. నెక్ట్స్ ఎక్కడో? ఫస్ట్ పార్ట్‌లో నటించిన కమల్‌హాసన్ సెకండ్ పార్ట్‌లోనూ హీరోగా నటించనున్నారు. -
జెంటిల్‌మేన్ వల్ల రెస్పెక్ట్ వచ్చింది
‘జెంటిల్మెన్’ సినిమా గురించి అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి ముందు నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో ఆ సినిమాను ‘రౌడీ పోలీస్’ పేరుతో రిలీజ్ చేశాం. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా నేనే చేసుకున్నాను. ఆ సినిమా విజయంతో మళ్లీ నేను మంచి పొజిషన్‌కు వచ్చాను. అంతకుముందు నేను చేసిన సినిమాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాను. అప్పుడు నేను చేసిన అప్పుల వల్ల నా దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఆ బాధలో ఉండి, ఇండస్ట్రీలోని ఎవ్వరినీ కలవటానికి ఇష్టపడలేదు. అప్పుడు శంకర్ నా దగ్గరికి ఓ కథ తీసుకుని వచ్చారు. ఆయన పదిసార్లు నా దగ్గరికి వచ్చినా నేను వినటానికి ఇష్టపడలేదు. ఫైనల్‌గా ఓ రోజు శంకర్ మా ఇంటికి వచ్చి ‘సార్ మీరు సినిమా చెయ్యొద్దు. కానీ ఓ సారి నా సినిమా కథ వినండి’ అన్నారు. అప్పుడు ‘జెంటిల్‌మేన్’ కథ విన్నాను. కథ విన్న వెంటనే ఇండస్ట్రీ మీద ఉన్న కోపం అంతా పోయింది. కథ చెప్పేటప్పుడే చిన్న చిన్న డిటెయిల్స్ కూడా చెప్పారు. అయితే కొత్త దర్శకుడు సినిమా ఎలా తీస్తాడో అనే అనుమానం ఉండేది. కానీ శంకర్ ఒక విషయంలో చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైమ్‌లో నా మార్కెట్‌కంటే మరో రెండు రెట్లు అదనంగా ఖర్చు చేసి సినిమాను నిర్మించారు చిత్రనిర్మాత కుంజుమోన్. ఆ సినిమా చేస్తున్నప్పుడు కుంజుమోన్ ‘నువ్వు స్టేట్ అవార్డ్ దక్కించుకుంటావు’ అనేవారు. అది నిజమైంది. నాకైతే ‘జెంటిల్‌మేన్’ వచ్చి 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ నటిస్తున్నానంటే కారణం హార్డ్‌వర్క్. అలాగే మన బిహేవియర్లో భయం, బాధ్యత ఉండాలి. ఇక్కడ భయం అంటే నా ఉద్దేశం.. ప్రొడ్యూసర్ మనపై డబ్బు పెట్టాలి అంటే, జనం మనకోసం టిక్కెట్ కొనుక్కుని వస్తున్నారంటే మనం చాలా భయంగా ఉండాల్సిందే. ఆ భయమే మనకు శ్రీరామరక్ష. ‘జెంటిల్‌మేన్’ సినిమా వల్ల డబ్బు కాదు.. రెస్పెక్ట్ వచ్చింది’’ అన్నారు. -
సిల్వర్ శంకర్
25 ఏళ్లు... 12 సినిమాలు. శంకర్ కెరీర్ గ్రాఫ్ ఇది. సినిమాల లెక్క తక్కువగా ఉన్నా బాక్సాఫీస్‌పై శంకర్ గురిపెట్టిన లెక్క తప్ప లేదు. సిల్వర్ జూబ్లి ఇయర్లోకి ఎంటరైన ‘సిల్వర్ శంకర్’ గురించి కొన్ని విశేషాలు. ‘‘రెండున్నర గంటలు కథ వినాలా? అంత టైమ్ లేదు. ఓ గంటా గంటన్నరలో చెప్పేట్లు కథని కుదించి తీసుకొస్తే వింటా’... ఈ మాట అన్నది పెద్ద హీరో. ఆ హీరో ఎదుట ఉన్నది 30 ఏళ్ల కుర్రాడు. కళ్లల్లో ఎన్నో ఆశలు, మనసులో ఎన్నో ఆలోచనలు. ‘అవకాశం ఇస్తే చాలు.. నేనేంటో నిరూపించుకుంటా’.. కుర్రాడి కళ్లల్లో ధీమా. ఆ హీరోగారిని ఒప్పించాలనే తపన. వెనుదిరిగాడు. గంటా గంటన్నరలో కథ చెప్పడానికి రెడీ చేసుకున్నాడు. హీరోగారి అపాయింట్మెంట్ దొరికింది. ‘అబ్బే.. గంటన్నర కుదరదు. అరగంట.. అంతే’ అన్నారు. మళ్లీ శంకర్ ఆ హీరో గడప తొక్కలేదు. ఇంకో స్టార్ హీరో.. ‘‘కథ బాగుంది కానీ ఆ హీరో అయితే బాగుంటుంది’’ అని ఓ ఉచిత సలహా. బాగున్నప్పుడు ఇతనే చేయొచ్చు కదా. అది వేరే విషయం. ఇంకా కొన్ని తిరస్కారాలు. కానీ ఆ కథను కుర్రాడు పక్కన పడేయలేదు. కథని నమ్మాడు. ‘‘ఇక్కడ చాన్స్ దొరుకుతుందేమో’’ అని నమ్మకం కుదిరిన ప్రతి ఆఫీసు గడప తొక్కాడు.. కుర్రాడు పట్టువదలని విక్రమార్కుడు. కాదు.. కాదు.. ‘షణ్ముగ శంకర్’. పాతికేళ్ల క్రితం ‘నేను షణ్ముగ శంకర్’ అని పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు పరిచయ వాక్యాలు అవసరం లేని ‘స్టార్ డైరెక్టర్’. ఇంతకీ ఏ సినిమా కథ తీసుకుని శంకర్ బోలెడన్ని గడపలు ఎక్కారో తెలుసా? ‘సూపర్ డూపర్ హిట్ మూవీ జెంటిల్‌మేన్’. దర్శకుడిగా శంకర్‌కి ఇది ఫస్ట్ మూవీ. మొన్న జులై 30తో ఈ సినిమా విడుదలై పాతికేళ్లు. శంకర్ ఇవాళ 55వ పడిలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగా ఆయన వయసు 25. శంకర్ ఓవర్ నైట్ పైకి ఎదగలేదు. దాని వెనకాల చాలా కష్టం ఉంది. అసలు ఆయన లక్ష్యం డైరెక్షన్ కాదు.. యాక్షన్. సినిమా నటుడవ్వాలి. స్టార్ అవ్వాలి. కానీ చీటీలో వేరే రాసి పెట్టి ఉంది. యాక్షన్ నుంచి ‘డైరెక్షన్’ మారింది. అసలు శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? అంటే... పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. చాలా చురుకైనవాడు. క్రియేటివిటీ అంటే చిన్నప్పుడే ఇష్టం. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలసి చేసిన కొన్ని నాటకాలు సినిమాల వరకూ తీసుకువచ్చేశాయి. ఇప్పుడు తమిళ ‘ఇళయ దళపతి’ విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌కి 1970లలో మంచి దర్శకుడిగా పేరుంది. శంకర్ వేసిన ఓ నాటకం చూసి, తన దగ్గర స్క్రీన్‌ప్లే రైటర్‌గా చేర్చుకున్నారాయన. ఆయన దగ్గరే శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు. ఆ తర్వాత మరో ప్రముఖ దర్శకుడు పవిత్రన్ దగ్గర సహాయ దర్శకుడిగా చేశారు. మనసు నటన మీద ఉండటంతో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. రాజేష్ ఖన్నా హీరోగా ఎస్.ఎ. చంద్రశేఖర్ తీసిన హిందీ సినిమా ‘జై శివ్ శంకర్’ శంకర్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫస్ట్ బాలీవుడ్ మూవీ. 1990లో అది విడుదలైంది. 1993లో శంకర్ ‘జెంటిల్మెన్’ ద్వారా దర్శకుడయ్యారు. ఇక నో యాక్షన్.. ఓన్లీ డైరెక్షన్ అని ఫిక్సయ్యారు. విశేషం ఏంటంటే.. ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా చిన్న బడ్జెట్ కథ రాసుకుంటారు. శంకర్ మాత్రం భారీ బడ్జెట్ స్టోరీ రాసుకున్నారు. ఆ కథను నమ్మారు ప్రముఖ మలయాళ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేటీ కుంజుమోన్. పవిత్రన్తో అంతకు ముందు ఆయన ఓ సినిమా నిర్మించారు. ‘జెంటిల్మెన్’ కథ విని శంకర్‌కి కుంజుమోన్ 5000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. హీరో అర్జున్ కూడా నమ్మారు. కొత్త దర్శకుడ్ని నమ్మి కోటి రూపాయల బడ్జెట్‌తో ‘జెంటిల్‌మేన్’ తీస్తే దాదాపు మూడు కోట్లు వసూలు చేసింది. శంకర్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్. 1993 నుంచి ఇప్పటిదాకా.. అంటే.. ఈ 25 ఏళ్లల్లో రిలీజ్‌కి రెడీ అయిన ‘2.0’తో కలిసి శంకర్ తీసినవి 12 సినిమాలు. శంకర్‌కి సామాజిక స్పృహ ఎక్కువ. ఆయన సినిమా కథలన్నీ సమాజంలో ఉన్న చెడు మీదే. పెద్దోళ్ల నుంచి దోచేసి, పేదవాళ్లకు ఇస్తాడు ‘జెంటిల్‌మేన్’. తర్వాత ‘భారతీయుడు’ లంచం తీసుకునే కొడుకుని చంపేస్తాడు. ‘జీన్స్’ అన్నారు. ఏడు వింతలను చూపించారు. కామన్ మేన్‌కి ఒకే ఒక్క రోజు సీఎం అయ్యే అవకాశం వస్తే.. సమాజ హితం కోసం ఏం చేస్తాడు? అన్నదే ‘ఒకే ఒక్కడు’. శంకర్ ప్రేమకథలు కూడా తీయగలరని రెండో సినిమా ‘ప్రేమికుడు’తోనే నిరూపించుకున్నారు. ‘బాయ్స్’ కూడా లవ్‌స్టోరీయే కదా. శంకర్ తీసిన సినిమాల్లో ‘అపరిచితుడు’ది స్పెషల్ ప్లేస్. ఆ సినిమాలో అన్యాయాన్ని సహించలేని వ్యక్తిలోంచి అపరిచితుడు బయటికొస్తాడు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలనుకుంటాడు ‘శివాజీ’. ఆ తర్వాత చిట్టి రోబోను స్క్రీన్‌పైకి తెచ్చారు. హాలీవుడ్ మూవీలా ఉందని ‘రోబో’ని చూసి మన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆ తర్వాత ముల్లుని ముల్లుతోనే తీయాలంటూ పగ తీర్చుకునే ‘ఐ’ని స్క్రీన్‌పైకి వదిలారు శంకర్. మధ్యలో శంకర్ ‘3 ఇడియట్స్’కి రీమేక్‌గా ‘నన్బన్’ తీశారు. ఇప్పుడు శంకర్ ‘2.0’ని రెడీ చేశారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తీశారు. శంకర్ అంతే.. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటారు. పెద్ద సినిమాలే తీస్తారు. వసూళ్లు కూడా భారీగానే ఉంటాయి. తీసిన డజను సినిమాలూ ప్రేక్షకులకు డబుల్ కిక్ ఇచ్చాయి. సిల్వర్ జూబ్లి ఇయర్లోకి ఎంటరైన శంకర్ నుంచి వెండితెర పైకి ఇంకా ఎలాంటి బ్రహ్మాండాలు వస్తాయంటే.. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఆన్ సెట్స్‌కి వెళ్లనుంది. యాక్షన్ టు డైరెక్షన్.. శంకర్ కెరీర్ డైరెక్షన్ భలేగా ఉంది కదూ. -
భారతీయుడికి గెస్ట్
కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు శంకర్. రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వడంతో ఇదే తన లాస్ట్ సినిమా అవ్వనుందని ఆ మధ్య కమల్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్‌కు మించి ఈ సీక్వెల్ ఉండాలని స్క్రిప్ట్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట శంకర్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. మరి అజయ్ విలన్‌గా కనిపిస్తారా? గెస్ట్ పాత్రలో కనిపిస్తారో వేచి చూడాలి. ఆల్రెడీ శంకర్ ‘2.0’లో హిందీ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘ఇండియన్ 2’లో అజయ్ దేవగన్. ఇలా బాలీవుడ్ నటులను కూడా తీసుకుంటే సినిమాకి హిందీ మార్కెట్ కూడా బాగుంటుందని శంకర్ ఉద్దేశం అయ్యుండొచ్చు. -
ఎట్టకేలకు రెడీ.. 2.0 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు!
ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న 2.0 సినిమా వచ్చే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్, చిత్ర దర్శకుడు శంకర్ ఈ మేరకు ట్విటర్లో తెలిపారు. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ వంటి భారీ తారాగణంతో ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉంది. గతంలో పలు విడుదల తేదీలు ప్రచారంలో ఉన్నా.. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా అనుకున్న తేదీ విడుదల కాలేదు. భారీ గ్రాఫిక్ వర్క్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడటంతో చిత్రం పూర్తికావడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు వీఎఫ్ఎక్స్ కంపెనీ వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిందని, కాబట్టి నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని శంకర్ ట్విటర్లో తెలిపారు. -
ఐపీఎల్ ఫైనల్లో 2.ఓ సినిమా టీజర్?
సాక్షి, సినిమా: ఐపీఎల్ క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) సెమీ ఫైనల్‌కి చేరింది. ఇంతకీ ఈ ఐపీఎల్‌కు 2.ఓ చిత్రానికి సంబంధం ఏమిటీ అనేగా మీ ఆలోచన. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కాలా చిత్రం వచ్చే నెల 7న భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న మరో చిత్రం 2.ఓ. ఈ భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కాలా చిత్రం కంటే ముందుగా తెరపైకి రావాల్సి ఉండగా గ్రాఫిక్స్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల అలస్యమైంది. అదే విధంగా చిత్ర టీజర్‌ను విడుదలకు చిత వర్గాలు ప్లాన్ చేస్తున్న సమయంలోనే అది కాస్తా లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిత్ర యూనిట్‌కు షాక్‌కు గురైంది. దీంతో శంకర్ మరో టీజర్‌ను తయారు చేశారు. ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి అలా సింపుల్‌గా 2.ఓ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తారా? అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఈ చిత్ర ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి లైకా సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2.ఓ చిత్ర టీజర్‌ను ఐపీఎల్ పైనల్ పోటీ వేదికగా జరిగే అవకాశం ఉందా? లేదా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. కెనడా బ్యూటీ ఎమీజాక్సన్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు శంకర్ అద్భుతంగా చెక్కుతున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా! అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా 2.ఓ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మరింత ఆలస్యం కానున్న‘2.o’
సూపర్‌స్టార్ రజనీకాంత్, ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో రాబోతున్న 2.o సినిమా మరింత ఆలస్యం కానుందని సమాచారం. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్, హై క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైయింది. కానీ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు మాత్రం ఆలస్యంగా జరుగుతున్నాయి. హై టెక్నీషియన్స్‌తో అమెరికాలో జరుగుతున్న ఈ గ్రాఫిక్స్ పనుల వల్లే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మొదలు పెట్టలేదని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో కనీసం చిత్ర యూనిట్‌కు కూడా తెలియడం లేదు. లైకా ప్రొడక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 2.o ను తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా... వీఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా, అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. రజనీ ‘కాలా’ విడుదలకు రెడీ అవ్వగా, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. -
2.ఓ.. ఉత్త సినిమానేనా?
సాక్షి, సినిమా : సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను ఏ మాత్రం నిరాశపరచకుండా చాలా జాగ్రత్తగా స్టార్ డైరెక్టర్ శంకర్ 2.ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీ బిజినెస్ చేస్తోంది. రిలీజ్ డేట్లో స్పష్టత లేకపోయినా.. భారీ అంచనాలను కొనసాగించేలా మేకింగ్ వీడియోలు వదులుతూ శంకర్ మతి పొగొడుతున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ సమాచారం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. 2.ఓ 3డీ వర్షన్ విడుదల ఉండబోదనేది దాని సారాంశం. నిజానికి విజువల్ ఎఫెక్ట్స్ మూలంగా చిత్ర విడుదల ఆలస్యమౌతోందన్నది తెలిసిందే. సీజీ వర్క్‌పై శంకర్ అసంతృప్తితో ఉండటమే అందుకు కారణం. పైగా 3డీ ప్రొడక్షన్ పనులను అమెరికాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించగా.. వారితో శంకర్‌కు బేధాభిప్రాయాలు తలెత్తినట్లు ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి. ఈ పరిస్థితులతో 3డీ వర్షన్ విడుదల ఆలోచనను నిర్మాతలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే గనుక 2.ఓ లాంటి భారీ బడ్జెట్ మూవీని మనం మాములు చిత్రంగానే తెరపై చూస్తామన్న మాట. -
వైభవంగా ‘2.0’ టీజర్ లాంచ్
‘నాన్ ఎప్పో వరువేన్, ఎప్పిడి వరువేన్ను యారుక్కుమ్ తెరియాదు. ఆనా వరవేండియ నేరత్తుల వరువేన్’. ‘నాన్ లేట్టా వందాలుమ్ లేటెస్టా వరువేన్’... రజనీకాంత్ చెప్పిన పాపులర్ డైలాగ్స్‌లో ఈ రెండూ కూడా ఉన్నాయి. మొదటిది ‘ముత్తు’ సినిమాలోది. రెండోది ‘బాబా’లో చెప్పిన డైలాగ్. ఈ రెండు డైలాగ్స్‌ని రజనీకాంత్ తాజా చిత్రం ‘2.0’కి కనెక్ట్ చేయొచ్చు. ‘నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో ఎవరికీ తెలియదు. కానీ రావాల్సినప్పుడు వస్తా’ అన్నది ఫస్ట్ డైలాగ్ అర్థం. ‘నేను లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తా’ అన్నది రెండో డైలాగ్ అర్థం. ఇప్పటికి రెండు మూడు సార్లు వాయిదా పడిన ‘2.0’ లేటెస్ట్గా రావడం ఖాయమని, రావాల్సిన టైమ్ (సమ్మర్ హాలిడేస్)కే వస్తుందని అభిమానులు అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ‘2.0’ గ్రాఫిక్స్ వర్క్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను దుబాయ్‌లో విడుదల చేశారు. టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘టీజర్ రిలీజ్ ఫంక్షన్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల సమక్షంలో ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం. అందుకు తగ్గ వేదిక కోసం చూస్తున్నాం’’ అని ‘2.0’ టీమ్ ప్రతినిధి పేర్కొన్నారు. సెక్యూరిటీ, వేదిక అన్నీ కరెక్ట్‌గా కుదిరితే అభిమానుల మధ్యలో ఫంక్షన్ చేయడం పక్కా. ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఈ వేడుక ఉంటుంది. హైదరాబాద్‌లో టీజర్ రిలీజ్ చేసిన 30 రోజులకు చెన్నైలో ట్రైలర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఆ నెలలోనే రావడానికి ముమ్మరంగా పనులు చేయిస్తున్నారు. -
భారతీయుడి బెలూన్ ఎగిరింది
లంచం కోసం పీడించేవాడు సొంత కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే అనే కాన్పెప్ట్‌తో ఆల్మోస్ట్ 22ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశారు దర్శకుడు శంకర్. ఫస్ట్ పార్ట్‌లో హీరోగా నటించిన కమల్‌హాసన్‌నే ఈ సీక్వెల్లోనూ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్ను రిపబ్లిక్ డే సందర్భంగా దర్శకుడు శంకర్ తెలియజేశారు. ‘ఇండియన్ 2’ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు ‘హీలియమ్ బెలూన్’ను ఆయన తైవాన్‌లో ఎగురవేశారు. ఆ బెలూన్‌పై ‘ఇందియన్ 2’ అని తమిళంలో ‘ఇండియన్ 2’ అని ఇంగ్లిష్‌లో రాసి ఉంది. ఇలా రెండో భారతీయుడు తైవాన్‌లో స్టార్ట్ అయ్యాడన్నమాట. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘2.0’కి ఓ రచయితగా వ్యవహరించిన జయమోహన్ ‘భారతీయుడు 2’కి కూడా రైటర్‌గా చేయనున్నారట. వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. -
రజనీ 2.o నిడివి ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్. ఆయన తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 2.o... 'రోబో'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2.o సినిమా మొత్తం నిడివి వంద నిమిషాలు మాత్రమేనట. అంటే గంట 40 నిమిషాలు మాత్రమే. ఒకప్పుడు సినిమా నిడివి మూడు గంటలు ఉంటే.. ఇప్పుడు రెండున్నర గంటలకు తగ్గిన సంగతి తెలిసిందే. మామూలుగా కమర్షియల్ సినిమాలు రెండు గంటలకుపైగా ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్రెండ్‌కు భిన్నంగా గంట 40 నిమిషాల్లో ఈ అత్యంత భారీ సినిమాను శంకర్ ముగించినట్టు చెప్తున్నారు. ఏమాత్రం సాగదీసే సీన్స్ లేకుండా.. చూస్తున్నంతసేపు ఉత్కంఠగా ఉండేలా సినిమాను కుదించబోతున్నారని చెప్తున్నారు. ఇది సినిమాకు ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, అరబిక్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్14న విడుదల చేయబోతున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
‘2.0’తో ఆ థియేటర్లు స్టార్ట్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్–శంకర్ కాంబినేషన్లో ‘రోబో’కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘2.0’. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. బడ్జెట్.. విజువల్ ఎఫెక్ట్స్.. ఎక్కువ భాషల్లో రిలీజ్ కానున్న సినిమాగా ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన ‘2.ౖ’ మరో అరుదైన ఘనతనూ సొంతం చేసుకోనుంది. అది కూడా అరబ్ దేశమైన సౌదీ అరేబియాలో కావడం విశేషం. సినిమాలు మత సిద్ధాంతాలకు విరుద్ధం అంటూ 1980లలో సౌదీలో సినిమా హాళ్లను మూసేసిన విషయం తెలిసిందే. థియేటర్ల ఏర్పాటు, సినిమాల ప్రదర్శనకు సౌదీ ప్రభుత్వం ఇటీవల మళ్లీ అనుమతిఇచ్చింది. 35 ఏళ్ల తర్వాత సౌదీలో థియేటర్లు ఏర్పాటు చేశాక విడుదలయ్యే తొలి భారతీయ సినిమా, అది కూడా ఓ సౌత్ సినిమా ‘2.ౖ’ కావడం గర్వించదగ్గ విషయమే. ఈ సినిమా పాటల విడుదల వేడుకను దుబాయ్‌లో ఎంత గ్రాండ్‌గా చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది మార్చి చివరికల్లా సౌదీలో థియేటర్లు ప్రారంభించే అవకాశం ఉందట. ఏప్రిల్‌లో రిలీజ్ కానున్న ‘2.ౖ’ సినిమాని అక్కడ ప్రదర్శించేందుకు చిత్రబృందం సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరపగా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. -
‘2.0’ ముందుకు వస్తుందా?
రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే అభిమానులకు పండగ రోజు. అలాంటిది పండగ రోజు ఆయన సినిమా విడుదలైతే డబుల్ ఫెస్టివల్. వచ్చే సంవత్సరాది (ఏప్రిల్ 14) రజనీకాంత్ అభిమానులకు టూ ఫెస్టివల్స్. ఒకటి తమిళ న్యూ ఇయర్. ఇంకోటి ‘2.0’ రిలీజ్. అదేంటీ.. ఏప్రిల్ 27న కదా ‘2.0’ రిలీజ్ అనుకుంటున్నారా? లేదట. ‘ఏప్రిల్ 14న రిలీజ్ అనుకుంటున్నాం’ అని శనివారం ‘ఫ్యాన్స్ మీట్’లో రజనీకాంత్ పేర్కొన్నట్లుగా వార్త షికారు చేసింది. ‘‘2.0 చాలా గ్రాఫిక్స్‌తో కూడుకున్న సినిమా. అందుకే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అందుకే జనవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా పడింది. ఎన్నిసార్లు వాయిదా పడినా సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బడ్జెట్ విషయంలోనే కాదు కంటెంట్ పరంగా కూడా చాలా గొప్ప సినిమా ఇది. తమిళంలో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాలాగా చాలా కాలం గుర్తుపెట్టుకునే సినిమాగా నిలిచిపోతోంది. దర్శకుడు శంకర్ చాలా యునిక్ పాయింట్‌ను ఈ సినిమాలో చెప్పబోతున్నాడు. ‘కాలా’ సినిమాలో కొత్త డైమెన్షన్లో కనిపిస్తాను. ఒక కొత్త రజనీకాంత్‌ను దర్శకుడు పా.రంజిత్ మీ అందరికి చూపించబోతున్నాడు’’ అని రజనీకాంత్ ‘2.0, కాలా’ గురించి ఫ్యాన్స్‌తో పలు విశేషాలు పంచుకున్నారు. ఇంత చెప్పారు కదా సార్.. మరి రాజకీయల గురించి ? అని అడిగితే ‘‘ఇంకొక్క రోజు ఆగండి’’ అన్నారు. ఆ ఇంకొక్క రోజు ఈరోజే (ఆదివారం). సో.. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? సాయంత్రానికల్లా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటివరకూ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వని రజనీ ఈసారి మాత్రం స్పష్టంగా తన నిర్ణయాన్ని చెప్పేయాలనుకుంటున్నారట. ఫ్యాన్స్ మీట్లో రజనీ తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి రావడానికి కారణమైన దర్శకుడు కె.బాలచందర్ గురించి మాట్లాడారు. ‘‘బాలచందర్‌గారిని నేను మొట్టమొదటిసారి కలసినప్పుడు తమిళ్ నేర్చుకోమన్నారు. మూడు సినిమాలకు నన్ను బుక్ చేసుకున్నారు. బాలచందర్‌గారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుని, నేను స్టార్ అయ్యాక దర్శకుడు ఎస్. పి. ముత్తురామన్గారు, మణిరత్నంగారు, సురేష్కృష్ణగారు.. నన్ను సూపర్ స్టార్‌ని చేశారు. ‘రోబో’ సినిమాతో శంకర్ నన్ను జాతీయ స్థాయి నటుణ్ణి చేశారు’’ అని రజనీ అన్నారు. వాస్తవానికి ‘రోబో’కన్నా ముందే రజనీ జాతీయ స్థాయి నటుడే. అయితే శంకర్ పేరుని సూచించడం ఆయన సింప్లిసిటీని తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే... ఒకవేళ ‘2.0’ నిజంగానే ఏప్రిల్ 14న విడుదలైతే ఇక్కడ మన రెండు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు (‘భరత్ అనే నేను) హీరోగా రూపొందుతోన్న సినిమా. ఇంకొకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వాస్తవానికి ముందు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 27) ప్రకటించింది ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రబృందమే. ఆ తర్వాత అదే తేదీని మహేశ్‌బాబు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీన విడుదల కావడం శ్రేయస్కరం కాదు కాబట్టి, రెండు చిత్రాల నిర్మాతలిద్దరూ కలసి సామరస్యంగా మాట్లాడుకుని, ఓ నిర్ణయానికి రావాలనుకుంటున్నారు. -
2.O మరో బిగ్ న్యూస్
సాక్షి, సినిమా : సస్పెన్స్‌కు తెర దించుతు ఏప్రిల్ నెలలోనే 2.O చిత్ర విడుదల అంటూ మేకర్లు ఈ మధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్న జనవరి 26వ తేదీన మాత్రం అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్లు సిద్ధమైపోతున్నారు. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇక చిత్ర ట్రైలర్ ను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ మూలంగానే వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక నిపుణుడు శ్రీనివాస్ మోహన్ పర్యవేక్షణలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ కోసం అహర్నిశలు పని చేస్తున్నాయి. ఇక ఇండియాలో ఇప్పటిదాకా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 2.O రికార్డు సృష్టించబోతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాజోన్, సుధాన్షు పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
చిట్టి... స్టిల్ ఎలైవ్!
యస్... చిట్టి ఇంకా బతికున్నాడు. ‘రోబో’లో రచ్చ రంబోలా చేశాడు. గుర్తుందా? ఆ చిట్టీనే! ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ! అసలు చావడానికి చిట్టి మనిషయితేగా... రోబో! మరి, రోబో చావడం ఏంటి? అనొచ్చు. ఎంత రోబో అయినా... మనిషికున్న ఫీలింగ్స్ చిట్టీకి ఉన్నాయి కదా! ‘రోబో’ ఎండింగ్లో తనకు తానుగా బాడీలో పార్టులను విప్పేసుకుంటుంది చిట్టి. ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న ‘2.0’లో చిట్టీని మళ్లీ ఎలా తీసుకొస్తున్నారో? ప్రస్తుతానికి న్యూ లుక్‌ని మాత్రం చూపించారు దర్శకుడు శంకర్. యస్... ‘2.0’లో చిట్టి న్యూ లుక్కునే మీరు చూస్తున్నారిప్పుడు! ఫేస్ పెద్దగా మారలేదు గానీ... కాస్ట్యూమ్స్ సూపరున్నాయి. ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిందీ లుక్. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సుమారు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే... పాటలు విడుదలైన తర్వాత సినిమా విడుదల ఏప్రిల్ 13కు వాయిదా వేశారనే వార్తలొచ్చాయి. వీటిపై రజనీ గానీ, చిత్రబృందం గానీ స్పందించలేదు. మరి, సినిమా ఎప్పుడు విడుదలవుతుందో? హిందీ హీరో అక్షయ్‌కుమార్ యాంటీ హీరోగా, బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
20 దేశాలు... 200 కోట్లు!
భారతీయుడు భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడిప్పుడు! ఏమాత్రం తగ్గడం లేదు. ఖర్చులో... ఖర్చుకి రెండింతలు రాబట్టే విషయంలోనూ... ఆల్రెడీ స్కెచ్ రెడీ చేసేశాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ‘ఇండియన్–2’ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాను 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ ఇష్యూస్‌పై పొలిటికల్ ఎంట్రీకి ముందు కమల్ నటించే సిన్మా కావడం... సోషల్ ఇష్యూస్‌తో సిన్మాలు తీయడంతో స్పెషలిస్ట్ అయిన శంకర్, ‘2.0’ తర్వాత తీయబోయే సిన్మా కావడంతో ఆల్రెడీ ‘ఇండియన్–2’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పట్నుంచి సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే సినిమాను భారీ లెవల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ‘ఇండియన్–2’ను పలు భాషల్లో అనువదించి, దాదాపు 20 దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారట!! -
శంకర్ తదుపరి హీరో ఎవరు?
తమిళసినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం ఏమిటీ? ఏ హీరోతో చేయబోతున్నారన్నది దక్షిణ సినీ పరిశ్రమలో ఆసక్తిగా మారింది. శంకర్ చిత్రాల్లో సామాజిక అంశాలు ఉంటాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఇలా ప్రేక్షకులను విస్మయపరిచే, ఆలోచింపజేసే, ఆహ్లాదపరచే అంశాలు ఉంటాయి కాబట్టే చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే చిత్రాల దర్శకుడిగా ఎదిగారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో సిల్వర్ సెల్యులాయిడ్‌పై ఆవిష్కరిస్తున్నారు. ఎమీజాక్సన్ కథానాయకిగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని (ఒక్క పాట మినహా) నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరిలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో శంకర్ తదుపరి చిత్రం ఏమిటన్న అంశంపై చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. అజిత్‌తో ముదల్వన్–2: శంకర్ విశ్యనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయ్, విక్రమ్, అర్జున్, ప్రశాంత్, ఇలా చాలా మంది ప్రముఖ నటులతో చిత్రాలు చేశారు. అయితే అజిత్ హీరోగా ఇప్పటికీ చిత్రం చేయలేదు. వీరి కాంబినేషన్లో చిత్రం ఉంటుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అది వాస్తవరూపం దాల్చలేదు. కాగా తాజాగా అజిత్ నటించిన వివేగం ఈ మధ్యనే విడుదలైంది. ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో శంకర్, అజిత్ కలయికలో భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం తాజాగా జోరందుకుంది. శంకర్ దర్శకత్వంలో ముదల్వన్–2 చిత్రం రూపొందే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కమలహాసన్ హీరోగా ఇండియన్–2 శంకర్ తదుపరి కమలహాసన్ హీరోగా ఇండియన్–2 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారన్నది. నిజానికి ఈ విషయమై శంకర్ కమలహాసన్‌ను కలిసి మాట్లాడారట. ఆయనతో చిత్రం ఖరారు చేసుకుందాం అనుకుంటున్న సమయంలో కమల్ తాజాగా రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడానికి రెడీ అవుతుండటంతో శంకర్ తన ఇండియన్–2 చిత్ర ప్రయతాలకు బ్రేక్ వేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. విక్రమ్‌తో అన్నియన్–2 ఇక మరో వెర్షన్ ఏమిటంటే విక్రమ్ హీరోగా అన్నియన్–2 చిత్రానికి శంకర్ సిద్ధం అవుతున్నారన్నది. అన్నియన్ చిత్రానికి సీక్వెల్ చిత్రం వస్తుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. కాగా విక్రమ్ ప్రస్తుతం స్కెచ్, ధ్రువనక్షత్రం చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా సామి–2కు రెడీ అవుతున్నారు. తదుపరి శంకర్ దర్శకత్వంలో అన్నియన్–2 చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి ఇవన్నీ ఊహాగానాలే. పైన చెప్పిన వాళ్లలో ఏ ఒక్కరూ ఈ వార్తలపై స్పందించలేదు. ఖండించనూ లేదు. ఇంతకీ శంకర్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పటికి..? -
రాయదుర్గంలో విదేశీ భవన్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజధాని నగరంలో ‘విదేశీ భవన్’కొలువు దీరనుంది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో మూడెకరాల స్థలాన్ని కేటాయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ఈ కార్యాలయాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు నిధులు విడుదల చేసిన ఆ శాఖ.. స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర సర్కారును అభ్యర్థించింది. దీనికి అనుగుణంగా రాయదుర్గంలో స్థలాన్ని సూచిస్తూ రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. డైరెక్టర్ శంకర్ స్టూడియోకు.. హైదరాబాద్‌లో మరో సినీ స్టూడియో అందు బాటులోకి రానుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్య మంలో తనదైన శైలిలో పోరాటం సాగించిన ప్రముఖ దర్శకుడు శంకర్.. స్టూడియో నిర్మాణ రంగంలో అడుగు పెడుతున్నారు. జై బోలో తెలంగాణ తదితర చిత్రాలను తెరకెక్కించిన శంకర్ అంటే ప్రత్యేక అభిమానం కనబరిచే సీఎం కేసీఆర్.. స్టూడియోకు అవసరమైన స్థలాలను ప్రతిపాదించమని టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌గూడ సర్వే నం.149లో ఎనిమిది ఎకరాలను కేటాయించేం దుకు టీఎస్ఐఐసీ సూత్రప్రాయంగా అంగీకరిం చింది. అలాగే, ఖానామెట్‌లోని సర్వే నం.41/14 లో నుంచి పదెకరాలను ప్రతిపాదిస్తూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. ఇప్పటివరకు జంట నగరాల్లోని సినీ స్టూడియోలన్నీ ఇతర ప్రాంతాల వారివే ఉన్న దృష్ట్యా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన వెన్నంటి నిలిచిన శంకర్‌ను ఈ రకంగా గౌరవిం చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
మేకింగ్ మార్వ్‌లెస్
తమిళసినిమా: తమిళసినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ తరం దర్శకుల్లో శంకర్ ప్రథమ స్థానంలో ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన తొలిచిత్రం జెంటిల్మెన్ నుంచి సిల్వర్‌స్క్రీన్‌పై గ్రాండియర్‌ను ఆవిష్కరిస్తూ, వండర్‌ను క్రియేట్ చేస్తూ వస్తున్నారు. శంకర్ చిత్రం అంటేనే బ్రహ్మాండం అనిపించుకుంటున్నారు. వెలుగొందుతున్న శంకర్, ఇక ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ డైరెక్టర్ శంకర్, స్టైల్‌కింగ్, సూపర్‌స్టార్ కాంబినేషన్లో చిత్రం అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ఇప్పటికే శివాజీ, ఎందిరన్(రోబో) చిత్రాలు చూశాం. ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో ముచ్చటగా హాట్రిక్కి సిద్ధం అవుతున్న చిత్రం 2.ఓ. రజనీకాంత్‌కు జంటగా ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా విజృంభిస్తున్నారు. సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ తన సంగీత బాణీలతో మెస్మరైజ్ చేయనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. సాధారణంగానే శంకర్ తను పెట్టించే ప్రతి పైసాకు ఫలితాన్ని చిత్రంలోని ప్రతి ఫేమ్‌లోనూ చూపిస్తారు. వావ్ 2.ఓ మేకింగ్ సహజంగానే 2.ఓ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొంటాయి. కాగా దర్శకుడు శంకర్ ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు తప ట్విట్టర్లో ప్రకటించి రజనీకాంత్ అభిమానుల్లో సరికొత్త ఫీవర్‌ను కలిగించారు. ఆ సన్నివేశాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం దర్శకుడు శంకర్ శుక్రవారం సాయంత్రం సరిగ్గా 6 గంటలకు 2.ఓ చిత్ర మేకింగ్ వీడియోను ఇంటర్నెట్లో విడుదల చేశారు . అది చూసిన అభిమానులే కాదు, చిత్ర పరిశ్రమ వర్గాలు వావ్ బ్రహ్మాండం అంటూ ముక్త కంఠంతో అంటున్నారు. 1.47 నిడివి కలిగిన ఆ మేకింగ్ వీడియోలో చిత్రం కోసం వేసిన భారీ సెట్స్, గ్రాఫిక్స్ కార్యక్రమాలు బ్లూమెట్ స్టూడియోలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, ఎమీజాక్సన్ల సన్నివేశాల చిత్రీకరణ దృశ్యాలు, భారీ చేజింగులు, అనేక రోబోల దృశ్యాలు, కార్లు, ఫిరంగుల ఫైరింగ్ దృశ్యాలు అబ్బుర పరిచాయి. ఈ రెండు నిమిషాల్లోపు 2.ఓ చిత్ర మేకింగ్ దృశాలను చూసే హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ఆశ్యర్యానికి గురౌతున్న ప్రేక్షకుల్లో చిత్రంపై ఆసక్తి, అంచనాలు మరింత పేంచేశాయనే చెప్పాలి.2.ఓ చిత్ర మేకింగ్ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే 2.5 మిలియన్ల మంది వీక్షించారు. అదే విధంగా లక్ష మంది అభిమానులు లైక్ చేశారు.ఇది సంచలన రికార్డేనంటున్నారు సినీ వర్గాలు. కాగా ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న 2.ఓ చిత్రంలోని ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. అయితే చిత్ర నిర్మాణాంతర కార్యక్రమల్లో శంకర్ సైన్యం ముమ్మరంగా ఉంది.చిత్రాన్ని 2017 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది. -
మేకింగ్ వీడియోతో మళ్లీ మ్యాజిక్
-
మేకింగ్ వీడియోతో మళ్లీ మ్యాజిక్
చెన్నై: భారీ చిత్రాల దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబోలో మూడో చిత్రంగా 2.0 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను శంకర్ కాసేపటి క్రితం రిలీజ్ చేశాడు. రోబోగా రజనీ మళ్లీ కనిపించటం, విలన్ అక్షయ్ కుమార్ తో తలబడటం, అమీ జాక్సన్‌తో స్టంట్లు, కాస్టింగ్ మేకోవర్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు... టోటల్‌గా హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో చిత్రం రూపొందించినట్లు అర్థమైపోతుంది. శంకర్ మేకింగ్ వీడియో చివర్లో విక్టరీ సింబల్ చూపించిన స్టైలిష్ సూపర్ స్టార్‌ను చూడొచ్చు. 2018 రిపబ్లిక్ డే సందర్భంగా 2.0 రిలీజ్ కానుంది. -
స్టార్ డైరెక్టర్‌ను టెన్షన్ పెడుతోన్న హీరోయిన్
చెన్నై: సాధారణంగా దర్శకులు హీరోయిన్లను టెన్షన్ పెడుతుంటారు. అలాంటిది నటి అమీ జాక్సన్ మాత్రం టాప్ డైరెక్టర్‌ను కలవర పెడుతోంది. మదరాసు పట్టణం మూవీతో ఇంగ్లీష్ భామ అమీ జాక్సన్ కోలీవుడ్‌లో ప్రవేశించింది. ఆపై ఈ అమ్మడు 'ఐ' చిత్రంతో ఏకంగా స్టార్ డైరెక్టర్ శంకర్‌నే ఆకట్టుకుంది. అందుకే ఆ చిత్రం నిరాశపరచినా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 2.0. వంటి భారీ చిత్రంలో నటించే ఛాన్సిచ్చారు. అది తప్ప ఎమీకిక్కడ అవకాశాలు రాకపోవడంతో ఆమె పలు ఫీట్లు చేస్తోంది. ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటోంది. ప్రచారానికి అమీ ఎంచుకున్న బ్రహ్మాస్త్రం గ్లామర్. ఈమె తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అవకాశాలను వెతుక్కుంటోంది. తాజాగా ఓ టవల్‌ను ఒంటికి చుట్టుకుని దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇవి చూసిన దర్శకుడు శంకర్ టెన్షన్ పడుతున్నారని కోలీవుడ్ టాక్. ఇప్పటికే తన 2.0. మూవీ నిర్మాణంలో జాప్యం జరగడం, మరో వైపు రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కాలా గురించిన ప్రచారం జోరుగా జరుగుతుండటంతో ఒత్తిడిలో ఉన్న శంకర్.. అమీ అర్థనగ్న దృశాలు ఆయనను మరింత టెన్షన్‌కు గురి చేస్తున్నాయని తెలుస్తోంది. 2.0 మూవీపై ఆమెకు నమ్మకం లేనందువల్లే ఇలా చేస్తుందా అన్న ఆలోచన శంకర్ మదిలో మెదులుతోందని టాక్ వినిపిస్తోంది. -
క్షమాపణ చెప్పిన డైరెక్టర్ శంకర్
చెన్నై: జర్నలిస్టులపై జరిగిన దాడికిగానూ స్టార్ డైరెక్టర్ శంకర్ క్షమాపణ చెప్పారు. ఈ ఘటన తనకు తెలియకుండా జరిగిందని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చూస్తానని శంకర్ అన్నారు. చెన్నైలోని ప్రెస్ క్లబ్లో శంకర్ మాట్లాడారు. 2.0 మూవీ యూనిట్ జర్నలిస్టులపై దాడికి పాల్పడిందని, అందుకుగానూ వారి తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ మూవీ ప్రొడక్షన్ మేనేజర్, ఓ బౌన్సర్, శంకర్ సన్నిహితుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 2.0 మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ స్పాట్ రోడ్డును రాత్రి మొత్తం బ్లాక్ చేశారు. ఇద్దరు జర్నలిస్టులు మూవీ యూనిట్‌తో ఈ విషయంపై గొడవకు దిగారు. దీంతో చెర్రెత్తుకొచ్చిన మూవీ యూనిట్ కొందరు ఇద్దరు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. రంగనాథన్, భరత్ అనే జర్నలిస్టులపై బౌన్సర్, మూవీ యూనిట్ దాడి చేయడంతో పాటు వారి కెమెరాలు లాగేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు ఈ విషయాన్ని శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే డైరెక్టర్ శంకర్ చెన్నై ప్రెస్ క్లబ్లో బహిరంగంగా జర్నలిస్టులకు క్షమాపణ చెబుతూ.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామన్నారు. చెన్నై నగరంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు షూటింగ్ కు అనుమతి ఉందని, అయితే జర్నలిస్టులు వేసిన ప్రశ్నలతో విసిగిపోయిన మూవీ యూనిట్ వారిపై దాడి చేసింది. -
సూపర్‌స్టార్ రజనీకి గాయాలు
-
షాకింగ్ న్యూస్.. సూపర్‌స్టార్ రజనీకి గాయాలు
డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ 2.0. ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కాలికి గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని రజనీకాంత్ అక్కడి నుంచి నేరుగా ఇంటికెళ్లిపోయారని సమాచారం. రజనీకి గాయమైందన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆయన గత చిత్రం కబాలి విడుదలకు ముందు కూడా ఆయన ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే. 2.0 షూటింగ్ సెట్లో ఓ కీలక సన్నివేశం చిత్రిస్తుండగా రజనీకాంత్ కుడికాలికి గాయమైందని మూవీ యూనిట్ తెలిపింది. వర్షం కారణంగా మెట్లపై నడుస్తుండగా ఒక్కసారిగా జారి పడిపోయారు. చెన్నై, కెలంబాక్కం సమీపంలోని ఓ ఐటీ కంపెనీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని మూవీ యూనిట్ తెలిపింది. గాయమైన వెంటనే సూపర్‌స్టార్‌ను హాస్పత్రికి తరలించి చికిత్స అందించారని, ఆస్పత్రి నుంచి రజనీ నేరుగా ఇంటికెళ్లి పోయారని చెప్పారు. చికిత్స అందించిన డాక్టర్లు, మూవీ యూనిట్ మాట్లాడుతూ.. రజనీ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ రోల్ పోషించగా, రజనీకి జోడిగా అమీ జాక్సన్ నటిస్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్ 400 కోట్లకు చేరడంతో ఆసియాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాగానూ 2.0 రికార్డుగా నిలవనుంది. -
కొత్త భారతీయుడు అతడేనా?
-
సొంత గూటికి ఎమీ
నటి ఎమీజాక్సన్ సొంత గూటికి చేరారు. ఈ బ్యూటీ ఇంగ్లాండ్‌కు చెందిన మోడల్ అన్న విషయం తెలిసిందే. మదరాసు పట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారన్న విషయం విదితమే. ఆ తరువాత తెలుగు, హిందీ అంటూ తన స్థాయిని పెంచుకుంటూ పోయిన ఎమీ అనతి కాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే లక్కీచాన్స్‌ను దక్కించుకున్నారు. అంతే కాదు స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వరుసగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకున్న అరుదైన నటిగా గుర్తింపు పొందారు. విక్రమ్‌తో ఐ చిత్రంలో అందాలు ఆరబోసిన ఎమీ తాజా శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ ఇంగ్లిష్ భామ ఇప్పుడు రెండు ఆంగ్ల చిత్రాల్లో నటిస్తున్నారట. ఇంట గెలిచి బయట గెలవాలన్న సామెతను రివర్స్ చేసిన నటి ఎమీ. ఏదేమైనా ఇన్నాళ్లకు సొంత గూటికి చేరారన్న మాట.దీని గురించి ఈ క్రేజీ బ్యూటీ తెలుపుతూ 2.ఓ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతిగా పేర్కొన్నారు. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. అందుకు దర్శకుడు శంకర్‌కి థ్యాక్స్ చెప్పుకుంటున్నానన్నారు. ఇక హిందీలో సొహైల్ ఖాన్ దర్శకత్వంలో నటించిన చిత్రం సెప్టెంబర్‌లో తెరపైకి రానుందని తెలిపారు. ప్రస్తుతం రెండు బ్రిటీష్ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. అదే విధంగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా తరువాత శారీరక అందంపై అధిక దృష్టి చూపిస్తానన్నారు. తన శరీరాన్ని చాలా ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సమయం దొరికినప్పుడు కిక్ బాక్సింగ్, యోగా, గుర్రపు స్వారీ, డాన్స్ వంటివి చేయడానికి ఇష్టపడతానన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితురాళ్లతో గడుపుతానని చెప్పారు. నెలలో సగం రోజులు చెన్నై లేదా ముంబయిలో మరో సగం రోజులు లండన్, అమెరికా, ఐరోపా దేశాల్లో గడుపుతానని ఎమీజాక్సన్ అంటున్నారు. -
ఆ ఇద్దరితో శంకర్ మరో చిత్రం?
సెల్యులాయిడ్‌పై అద్భుతాల సృష్టికర్తలలో ఒకరు దర్శకుడు శంకర్. తమిళ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ఒకరని గంటాపథంగా చెప్పవచ్చు. అందుకే ఆయన వెండితెరకే ఇష్టమైన దర్శకుడుగా మారారు. అంతే కాదు ఆయన్ని జయాపజయాలకు అతీతుడని చెప్పవచ్చు. అలాంటి శంకర్ ఇక చిన్న చిత్రాలకు రూపకల్పన చేయడం సాధ్యం కాదేమో. చాలా కాలంగా ఒక చక్కని ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆసక్తిని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు అవకాశం లేకపోతోంది. శంకర్ చిత్రం అంటే ఇప్పుడు అద్భుతం, అదరహో లాంటి పదాలకు పర్యాయాలుగా మారిపోయాయి. ఆయన చిత్రాలు 100, 200 దాటి 350 కోట్ల బడ్జెట్ చిత్రాల స్థాయికి పెరిగిపోయాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిస్తున్న 2.ఓ చిత్రం బడ్జెట్ 350 కోట్లు అంటున్నారు. ఇక వాట్ నెక్ట్స్ శంకర్ చిత్రం అన్న ప్రశ్న ఇప్పటి నుంచే తలెత్తడం విశేషం. దానికి సమాధానం కూడా కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఎస్ శంకర్ తదుపరి ఇళయదళపతి విజయ్, విక్రమ్ హీరోగా మల్టీస్టారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. నిజానికి ఈ చిత్రం 2.ఓ చిత్రానికి ముందే నిర్మాణం జరగాల్సి ఉందని, కొన్ని కారణాల వల్ల వెనక్కు వెళ్లి 2.ఓ చిత్రం ముందుకొచ్చిందనేది కోడంబాక్కమ్ వర్గాల టాక్. చాలా కాలం క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ విజయ్, విక్రమ్‌ల కాంబినేషన్లో చిత్రం చేస్తానని బహిరంగంగానే వెల్లడించారు. ఇదే నిజం అయితే విజయ్ హీరోగా నన్భన్, విక్రమ్ హీరోగా అపరిచితుడు, ఐ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన శంకర్ వీరిద్దర్ని కలిసి చేసే చిత్రం ఇంకెంత భారీగా ఉంటుందో ఊహించుకోండి. ఒకప్పుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి చాలా చిత్రాలు చేశారు. అలాంటి ట్రెండ్ కు శంకర్ మళ్లీ శ్రీకారం చుట్టనున్నారా? ఈ ప్రశ్నకు బదులు దొరకాలంటే 2.ఓ చిత్ర విడుదల వరకూ ఆగాల్సిందే. -
న్యూలుక్ కోసం..
2.ఓ చిత్రం కోసం మన సూపర్‌స్టార్ న్యూలుక్‌తో సిద్ధమయ్యారు. ఇది ఆయన అభిమానులకు పండగ చేసుకునే విషయమే. సూపర్‌హిట్ చిత్రం ఎందిరన్ కాంబినేషన్ రజనీకాంత్, శంకర్ మరోసారి కలిసి చేస్తున్న బ్రహ్మాండ చిత్రం 2.ఓ.బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ 350 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న విషయం విదితమే. 2.ఓ చిత్రాన్ని స్వదేశీ ప్రముఖ కళాకారులతో పాటు ప్రఖ్యాత హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో దర్శకుడు శంకర్ అద్భుతంగా సెల్యులాయిడ్‌పైకి ఎక్కిస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఎడాది తమిళ ఉగాదికి విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ కొత్త లుక్‌లో కనిపించి కనువిందు చేయనున్నారు. అలాంటి గెటప్ కోసం ప్రస్తుతం ఆయన అమెరికాలో హాలీవుడ్ మేకప్ నిపుణుల పర్యవేక్షణలో టెస్ట్‌ల్లో పాల్గొంటున్నారు. వదంతులు: కొద్ది రోజులుగా రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురైయ్యారని, అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారనే వదంతులు హల్చల్ చేస్తున్నాయి.కుటుంబసభ్యులతో కలిసి అమెరికాకు విహార యాత్రకు వెళ్లిన రజనీకాంత్ పనిలో పనిగా 2.ఓ చిత్రంలో గెటప్ కోసం మేకప్ టెస్ట్‌ల్లో పాల్గొంటున్నారు. ఎప్పుడు విహార యాత్రకు వెళ్ళినా వారంలోపు తిరిగొచ్చే రజనీకాంత్ రెండు వారాలు దాటినా చెన్నైకి రాకపోవడం, ఆయన నటించిన మరో చిత్రం కబాలి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా రాకపోవడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వదంతులు ప్రచారం అవుతున్నాయి.అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రజనీ కుటుంబ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.అందులో రజనీకాంత్ క్షేమంగా ఉన్నారనీ,ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదనీ పేర్కొన్నారు.ఆయన త్వరలోనే చెన్నైకి తిరిగి రానున్నారని తెలిపారు. వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంలూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
అందుకే రజనీకి విలన్‌గా నటించలేదు!
‘రోబో’ సీక్వెల్ ‘2.0’లో రజనీకాంత్ హీరో... కమల్‌హాసన్ విలన్. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు దర్శకుడు శంకర్ ఈ విధంగానే అనుకున్నారు. ఈ కాంబినేషన్ అయితే ఈ సీక్వెల్‌కు భారీతనం వస్తుందనీ, భారీ అంచనాలు ఏర్పడతాయనీ, నిర్మాణ వ్యయం ఎక్కువైనా ఫర్వాలేదని శంకర్ అనుకున్నారు. సీక్వెల్లో హీరోగా నటించడానికి రజనీ ఓకే చెప్పారు కానీ, కమల్ మాత్రం ‘నో’ అనేశారు. ఆ తర్వాత శంకర్ ఈ చిత్రంలో విలన్‌గా అక్షయ్‌కుమార్‌ని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. కమల్ ఈ సీక్వెల్‌కు నో చెప్పడానికి బలమైన కారణమే ఉందట. దర్శక దిగ్గజం బాలచందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చేసిన తర్వాత కమల్, రజనీలు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ, స్టార్డమ్ వచ్చాక మాత్రం కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారట. దీనికి ఓ రహస్య ఒప్పందం చేసుకున్నామని కమల్‌హాసన్ చెప్పారు. ‘‘ ‘2.0’లో విలన్ రోల్ కాబట్టి నేను కాదనలేదు. అలాంటి పాత్రలు నేనెన్నో చేశాను. కాకపోతే రజనీ, నేను కలిస్తే మా మార్కెట్‌కి తగ్గ పారితోషికం ఇవ్వాలి. మాకంత ఇస్తే.. ఇక సినిమా నిర్మించడానికి డబ్బులెక్కడుంటాయ్? అందుకే నో చెప్పా’’ అని అసలు కారణం బయటపెట్టారు కమల్. ఫ్యాన్స్ మళ్లీ తమ కాంబినేషన్‌ని కోరుకుంటే.. ఫుల్ మూవీయే చేయనవసరంలేదనీ, అతిథి పాత్రలైనా చేయొచ్చనీ, అందుకు తాను రెడీ అని కమల్ పేర్కొన్నారు. ఫ్యాన్స్ కోసం ఇద్దరూ కలిసి ఫుల్ సినిమా చేస్తే, అప్పుడు పారితోషికం తగ్గించుకోవాల్సి వస్తుందనీ, అలా ఎందుకు చేయాలని కమల్ ప్రశ్నించారు. పాయింటే కదా...! -
సునీల్‌తో శంకర్ కొత్త చిత్రం!
వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.శంకర్ ‘జై బోలో తెలంగాణ’ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల నూతన తారలతో దర్శకునిగా తన తొమ్మిదో చిత్రాన్ని ప్రారంభించిన ఎన్.శంకర్ ఇప్పుడు సునీల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారిగా తన బ్యానర్లో వేరే దర్శకునికి అవకాశం ఇచ్చారు. ‘దూకుడు’, ‘బాద్షా’, ‘ఆగడు’ చిత్రాలకు స్టోరీ డిపార్ట్మెంట్లో పని చేసిన ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. -
చలో బొలీవియా
‘రోబో-2’ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి గ్రాఫిక్స్ వర్క్‌లో శంకర్ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీరికలేని పనిలో ఉన్నారు. రజనీకాంత్‌ను మరోసారి రోబోగా చూపిస్తూ, తీస్తున్న కొత్త చిత్రం ‘2.0’ షూటింగ్ వ్యవహారంతో తలమునకలుగా ఉన్నారు. దాదాపు గడచిన మూడు, నాలుగు వారాలుగా ఢిల్లీలోని నెహ్రూ స్టేడియమ్లో కీలక సన్నివేశాలను శంకర్, ఆయన బృందంలోని ఇతర నిపుణులు షూటింగ్ చేస్తూ వచ్చారు. హీరో రజనీకాంత్, విలన్‌గా నటిస్తున్న హిందీ నటుడు అక్షయ్ కుమార్ తదితరుల మీద వచ్చే ఆ స్టేడియమ్ దృశ్యాలను వారం, పది రోజుల క్రితమే పూర్తి చేశారు. శుక్రవారంతో ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అయిపోయినట్లు సమాచారం. హీరో, విలన్, మరో కీలక పాత్రధారిణి అమీ జాక్సన్‌ల మీద కావాల్సిన దృశ్యాలను చిత్రీకరించిన దర్శకుడు అటుపైన ఆ దృశ్యాలకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ పనుల మీద పడ్డారు. కళాదర్శకుడు ముత్తురాజ్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు శ్రీనివాస మోహన్, కెమేరామన్ నీరవ్ షా, యాక్షన్ దృశ్యాల సారథి కెన్నీ బేట్స్లతో కలసి శంకర్ ఆ వ్యవహారంలో ఉన్నారు. మరోపక్క రజనీకాంత్ తన మరో చిత్రం ‘కబాలి’కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఆ పనులు పూర్తయ్యాక, మళ్ళీ ‘2.0’లోకి వచ్చేస్తారాయన. ‘‘ఈ స్వల్ప విరామం తరువాత యూనిట్ మొత్తం బొలీవియాకు వెళుతున్నాం. అక్కడ ఒకటి, రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని ‘2.0’ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఎమీ జాక్సన్, సుధాంశు పాండే తదితరులు నటించగా, ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం. -
ఒకే చిత్ర నిర్మాణ సంస్థలో మామాఅల్లుళ్లు
మామా అల్లుళ్లు ఒకే చిత్ర నిర్మాణ సంస్థలో నటించడం విశేషం కాక పోయినా అరుదైన విషయమే అవుతుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్‌ల విషయంలో అలాంటి అరుదైన విషయం జరగడం గమనార్హం. రజనీకాంత్ దర్శకుడు శంకర్ల కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 2.ఓ. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా యాడ్ అవడంతో మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఈ భారీ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు ధనుష్ హీరోగా వడచెన్నై చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. బాహుబలి చిత్రం తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. విచారణై వంటి జాతీయ అవార్డును కొల్లగొట్టిన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహించనున్న వడచెన్నై చిత్రంలో సమంత హీరోయిన్గా నటించనున్నారు. తంగమగన్ చిత్రం తరువాత ఈమె ధనుష్‌లో నటించడానికి సిద్ధమవుతున్న ఈ వడచెన్నై చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించనుందని ఆ సంస్థ నిర్వాహకుడు రాజూమహాలింగం వెల్లడించారు.ఆయన తెలుపుతూ లైకా సంస్థ ధనుష్ నటించిన తాజా చిత్రం కొడి పంపిణి హక్కుల్ని పొందిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయితే ధనుష్ కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రాన్ని మేలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు, దానితో పాటు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు, విజయ్‌ఆంటోని హీరోగా యమన్, కమలహాసన్ కథానాయకుడిగా ఒక చిత్రం నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. మొత్తం మీద మామ రజనీకాంత్‌లో 2, ఓ చిత్రాన్ని అల్లుడు ధనుష్‌తో వడచెన్నై చిత్రాలను లైకా సంస్థ ఏక కాలంలో నిర్మించడం అరుదైన విషయమే అవుతుంది.