![Kajal Aggarwal Confirms She Will Resume Shooting For Indian2 From This Date - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/5/kaju.jpg.webp?itok=7BL7wsb-)
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఆస్వాదిస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. దీంతో కాజల్ మళ్లీ సినీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. అయితే తాజాగా నేహా ధూపియాతో ఇన్‌స్టా లైవ్‌లో ముచ్చటించిన కాజల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాతో త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్‌లో ప్రమాదం జరగడంతో సినిమాను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత కోవిడ్, ఇతరాత్ర కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ప్రసవం తర్వాత కాజల్ నటిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment