
కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ ఈ ఏడాది మేలో విడుదల కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కూడా స్టార్ట్ చేశారట మేకర్స్. త్వరలోనే ‘ఇండియన్ 2’ సినిమా రిలీజ్ గురించిన అధికారిక ప్రకటన కూడా రానుందని కోలీవుడ్ బోగట్టా.
కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’(తెలుగులో ‘భారతీయుడు 2’) రూపొందుతోంది. ‘ఇండియన్’ సినిమాకు దర్శకత్వం వహించిన శంకరే ‘ఇండియన్ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్‌సింగ్ కీలకపాత్రలు పోషించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్ నిర్మించిన ‘ఇండియన్ 2’ కి అనిరుద్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment