![Kamal Haasan About Indian 2](/styles/webp/s3/article_images/2024/07/9/indian%202%20pic.jpg.webp?itok=2ZSrTL22)
‘‘ప్రపంచంలో జనాభా పెరుగుతున్న కొద్దీ కరప్షన్ పెరిగిపోతోంది. లంచాల నిర్మూలనకు మనం గట్టిగా ప్రయత్నించడం లేదు. ఈ అంశాలతో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాలోని సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలి’’ అని కమల్‌హాసన్ అన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘భారతీయుడు 2’. సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ప్రీత్ సింగ్ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు.
ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీ లక్ష్మి మూవీస్ విడుదల చేస్తున్నాయి. సోమవారం జరిగిన సమావేశంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ ఆరంభంలో తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన హిట్టు పడలేదు. తెలుగులో నాకు ‘మరోచరిత్ర, ఆకలి రాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం’ వంటి ఎన్నో హిట్స్ వచ్చాయి.
తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ని చేశారు. బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు నన్నెంతో ప్రోత్సహించారు’’ అన్నారు. ‘‘భారతీయుడు’కి సీక్వెల్ తీయాలని ముందు అనుకోలేదు. అయితే కరప్షన్ వార్తలు చదివినప్పుడు నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు. ఆ ఆలోచనతో ‘భారతీయుడు 2’ తీశాను’’ అన్నారు శంకర్. ‘‘వినోదం, సందేశంతో తీసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ‘భారతీయుడు’ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత సురేష్‌బాబు.
Comments
Please login to add a commentAdd a comment