భారతీయుడు.. దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జనాలను ఆలోచింపజేసిన ఈ మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.
లోకనాయకుడిని దింపేసిన బ్రహ్మానందం
ఈ ఈవెంట్‌లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ విశ్వంలోనే కమల్ హాసన్‌లాంటి నటుడు మరొకరు ఉండరని, ఆయనతో నటించినందుకు గర్వపడుతున్నాని తెలిపారు. అలాగే కమల్ హాసన్ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. 'ఈ రోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 మూవీని బాగా హిట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో ఆశీర్వదించారు, అభినందించారు.
మాటలు రావడం లేదు
చాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను హ్యాపీ.. ఆల్‌వేస్.. యువర్ కమల్ హాసన్' అంటూ విశ్వనటుడి వాయిస్‌ను దింపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా బ్రహ్మానందంలోని ఈ టాలెంట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కదా మిమ్మల్ని లెజెండ్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Brahmanandam Garu mimics Kamal Haasan Sir’s voice. Wow!!! #Bharateeyudu2 pic.twitter.com/ka16cyYMGB
— Aakashavaani (@TheAakashavaani) July 7, 2024
Comments
Please login to add a commentAdd a comment