Indian 2 Paaraa Song Promo: కమల్‌ హాసన్‌ ఇండియన్‌-2.. ప్రోమో వచ్చేసింది! | Kamal Haasan Latest Movie Indian 2 Movie Song Promo Out now | Sakshi
Sakshi News home page

Indian 2 Paaraa Song Promo: కమల్‌ హాసన్‌ ఇండియన్‌-2.. ఫస్ట్‌ సింగిల్ ప్రోమో వచ్చేసింది!

Published Tue, May 21 2024 6:37 PM | Last Updated on Tue, May 21 2024 7:08 PM

Kamal Haasan Latest Movie Indian 2 Movie Song Promo Out now

కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీస్థాయిలో  రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు మేకర్స్.

కాగా.. గతంలో శంకర్‌ డైరెక్షన్‌లో  1996లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫుల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, బాబీ సింహా, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది.  కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement