Kamal Haasan Joins The Sets Of Indian 2 Movie Shooting In Tirupathi - Sakshi
Sakshi News home page

Indian 2 Shooting Update: తిరుపతిలో 'ఇండియన్‌-2' షూటింగ్‌

Published Tue, Sep 27 2022 10:52 AM | Last Updated on Tue, Sep 27 2022 11:58 AM

Kamal Haasan Indian 2 Movie Shooting Schedule Shifted To Tirupathi - Sakshi

కమల్‌హాసన్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్‌ 2’. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీ యుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ తిరుపతిలో ప్రారంభం అయిందని సమాచారం.

ఈ కొత్త షెడ్యూల్‌లో కమల్‌హాసన్, కాజల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రసవం అనంతరం కాజల్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement