reentry
-
ట్రంప్ రీఎంట్రీ..మార్కెట్ గతేంటి?
‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో ట్రంప్ విజయ విహారం చేశారు. అయితే, ఇప్పుడు ‘మేక్ వరల్డ్ అన్–ప్రెడిక్టబుల్ అగైన్’గా మారుతుందనే అందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో జోష్ నెలకొన్నప్పటికీ, మన మార్కెట్లో మళ్లీ అమ్మకాలు పోటెత్తడంతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరెక్షన్ బాటలో ఉన్న దేశీ సూచీల పయనమెటన్నది అర్థం కావడం లేదు. అయితే, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ పాలసీలతో పాటు సుంకాల పెంపు వంటి చర్యలతో అగ్రరాజ్యంలో వడ్డీరేట్ల తగ్గింపునకు బ్రేకులు పడొచ్చని... డాలరు బలోపేతం, ద్రవ్యోల్బణం పెరుగుదల ఎఫెక్ట్‌తో రూపాయి మరింత బలహీన పడొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో... స్వల్పకాలానికి మన మార్కెట్లో ట్రంప్ సెగలు తప్పవంటున్నారు!అల్‌టైమ్ గరిష్టాల నుంచి కొండ దిగుతున్న దేశీ సూచీలు.. గత నెలన్నర రోజుల్లో 8 శాతానికి పైగానే పడ్డాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం దీనికి ప్రధాన కారణం. ఎన్నికల తర్వాత సెపె్టంబర్ వరకు పెట్టుబడుల మోత మోగించిన విదేశీ ఇన్వెస్టర్లు... అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక నవంబర్లోనూ రివర్స్ గేర్ కొనసాగుతోంది. 6 ట్రేడింగ్ సెషన్లలో రూ.23,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2.9 లక్షల కోట్ల మేర విదేశీ నిధులు తరలిపోయాయి. ఇలాంటి తరుణంలో అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన ట్రంప్.. మళ్లీ సుంకాల జూలు విదిల్చే అవకాశం ఉండటంతో పాటు ‘అమెరికా ఫస్ట్’ పాలసీలను ఆచరణలో పెడితే మన ఎకానమీపై ప్రతికూల ప్రభావానికి దారితీసే అవకాశం ఉందనేది ఆర్థిక వేత్తల అభిప్రాయం. మళ్లీ ద్రవ్యోల్బణం గుబులు... ట్రంప్ చెబుతున్నట్లుగా కార్పొరేట్ ట్యాక్స్ కోతకు తోడు సుంకాల పెంపునకు తెరతీస్తే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశాలున్నాయి. సుంకాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. వస్తు, సేవలపై కనీసం 10 శాతం సుంకాలు పెంచినా, అక్కడ 0.8 శాతం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాం ఉందని ఎకనమిస్టులు లెక్కలేస్తున్నారు. దీనివల్ల యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత అవకాశాలు సన్నగిల్లి.. డాలరు పుంజుకోవడానికి దారితీస్తుంది. వెరసి, ఇప్పుడిప్పుడే వడ్డీరేట్ల తగ్గింపు బాటలో వెళ్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనికి బ్రేక్ వేసే చాన్స్ ఉంటుంది. మరోపక్క, టారిఫ్ వార్‌కు తెగబడితే ఎగుమతులు దెబ్బతినడం... దిగుమతులు గుదిబండగా మారడం వల్ల మన దేశంలోనూ మళ్లీ ద్రవ్యోల్బణం పురి విప్పుతుంది. ఇప్పటికే జారుడుబల్లపై ఉన్న రూపాయిని (తాజాగా డాలరుతో 84.38 ఆల్‌టైమ్ కనిష్టానికి పడింది) ఇది మరింత దిగజార్చుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతపై ఆశలు ఆవిరైనట్లేననేది ఆర్థిక వేత్తల మాట. ‘ట్రంప్ ట్యాక్స్ కట్ అంటే అమెరికాలో రుణ భారం మరింత పెరుగుతుంది. అధిక వడ్డీరేట్లు, డాలరు బలంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు కచి్చతంగా ప్రతికూలమే’ అని ఏఎస్కే వెల్త్ అడ్వయిజర్స్‌కు చెందిన సోమ్‌నాథ్ ముఖర్జీ పేర్కొన్నారు. అయితే, చైనాపై భారీగా సుంకాలు విధించి, భారత్‌పై కాస్త కనికరం చూపితే, మన ఎగుమతులు.. కొన్ని రంగాలకు సానుకూలంగా మారుతుందని కూడా కొంత మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా.. ట్రంప్ పగ్గాలు చేపట్టి (జనవరి 20న), విధానపరమైన స్పష్టత వచ్చే వరకు మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవనేది పరిశీలకుల అభిప్రాయం.ట్రంప్ తొలి జమానాలో..2017లో ట్రంప్ తొలిసారి గద్దెనెక్కినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో అలజడి, క్రూడ్ ధరల క్రాష్, గ్రీస్ దివాలా.. బ్రెగ్జిట్ ప్రభావాలతో స్టాక్ మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా మన మార్కెట్లు మళ్లీ పుంజుకోగలిగాయి. 2017 నుంచి 2020 వరకు ట్రంప్ తొలి విడతలో నిఫ్టీ 50 శాతం మేర పుంజుకోగా... జో బైడన్ జమానాలో ఈ ఏడాది సెపె్టంబర్ వరకు ఏకంగా 120 శాతం పైగా నిఫ్టీ ఎగబాకడం విశేషం. ఇక ట్రంప్ 1.0 హయాంలో డాలర్‌తో రూపాయి విలువ 11% క్షీణిస్తే, 2.0 కాలంలో 8–10% క్షీణించే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదిక తెలిపింది!ట్రంప్ విక్టరీ నేపథ్యంలో చైనా, భారత్ సహా పలు దేశాలపై దిగుమతి సుంకాల మోతకు అవకాశం ఉంది. ఇది అక్కడ ద్య్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీయొచ్చు. దీంతో అమెరికాలో వడ్డీ రేట్ల కోత జాప్యం కావచ్చు. దీనికితోడు ట్రంప్ హామీ మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే, యూఎస్ బాండ్ మార్కెట్లో ఈల్డ్‌లు ఎగబాకుతాయి. ఈ పరిణామాలు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనానికి మరింత పురిగొల్పుతాయి. – నితిన్ అగర్వాల్, క్లయింట్ అసోసియేట్స్ డైరెక్టర్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆరేళ్ల తర్వాత అమెరికన్ బ్రాండ్ రీఎంట్రీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హోమ్‌కేర్ సొల్యూషన్స్ సంస్థ బిస్సెల్ ఆరేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ఈసారి భారత్‌లో ఉత్పత్తుల పంపిణీ కోసం కావిటాక్ గ్లోబల్ కామర్స్ సంస్థతో జట్టు కట్టింది.స్పాట్‌క్లీన్ హైడ్రోస్టీమ్, స్పాట్‌క్లీన్ ప్రోహీట్ పేరిట పోర్టబుల్ వెట్, డ్రై వేక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్‌ల విక్రయాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు బిసెల్ ప్రెసిడెంట్ (గ్లోబల్ మార్కెట్స్) మ్యాక్స్ బిసెల్ తెలిపారు. ప్రస్తుతం ఫ్లోర్ సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించి భారత్‌లో మార్కెట్ పరిమాణం చిన్నగానే ఉన్నప్పటికీ భవిష్యత్‌లో గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ముందుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి భాగస్వాములతో ఆన్లైన్లో అమ్మకాలతో పారంభించి, విక్రయాల పరిమాణాన్ని బట్టి క్రమంగా ఆఫ్‌లైన్‌లో కూడా కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని మ్యాక్స్ వివరించారు. అమెరికా, చైనా తదితర దేశాల్లో గణనీయంగా వ్యాపారం ఉన్న బిసెల్ సంస్థ 2018లో దేశీ మార్కెట్ కోసం యూరేకా ఫోర్బ్స్తో జట్టు కట్టింది. కానీ, ఆ తర్వాత భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించింది. -
విదేశీ బ్రాండ్ల చలో భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి, అధిక యువ జనాభా, బలమైన వినియోగం.. వెరసి భారత్ మార్కెట్ విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తోంది. గతంలో భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయిన సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తిరిగి భారత్‌లోకి పునరాగమనం చేయనున్నట్టు ప్రకటించేశాయి. పలు బహుళజాతి సంస్థలు భారత్‌లో బలమైన వృద్ధి అవకాశాలతో చొచ్చుకుపోతుండగా.. తాము ఎందుకు అలా రాణించకూడదన్న దృక్పథంతో అవి తమ పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా భారత్ ఆశాకిరణంగా కనిపిస్తుండడంతో గతంలో ఇక్కడి నుంచి తట్టా, బుట్టా సర్దేసుకుని వెళ్లిన విదేశీ కంపెనీలు, మరో విడత ఇక్కడ కాలు మోపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.యూరప్‌లో రెండో అతిపెద్ద రిటైల్ చైన్ ‘క్యారీఫోర్’, భారత్‌లోనూ అదే మాదిరి విజయగాధను నమోదు చేయాలని భావించింది. కానీ, విధానాలు ఫలితమివ్వకపోవడంతో 2014 జూలైలో భారత్‌లోని క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని మూసేసి వెళ్లిపోయింది. మరో ఫార్మాట్‌తో తిరిగి భారత్‌లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాదు అమెరికాకు చెందిన బహుళజాతి ఆటో సంస్థ (డెట్రాయిట్) ఫోర్డ్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్‌ను వీడింది.కరోనా తర్వాత డిమాండ్ క్షీణత, పోటీ పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తమిళనాడు సర్కారు ఫోర్డ్ యాజమాన్యంతో మాట్లాడగా.. చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరైమలై ప్లాంట్‌లో తయారీని త్వరలో ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. భారత్‌లో అపార అవకాశాలు మరికొన్ని విదేశీ బ్రాండ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. దీంతో అవి తిరిగొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. జాయింట్ వెంచర్లు అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హార్లే డేవిడ్సన్ సైతం తొలుత భారత మార్కెట్లో సొంతంగా వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేసి, నష్టాలు వస్తుండడంతో తప్పుకుంది. హీరో మోటోకార్ప్‌తో కలసి జాయింట్ వెంచర్ రూపంలో గతేడాది మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఫ్యాషన్ సంస్థ షీన్ రిలయన్స్ రిటైల్‌తో టై అప్ పెట్టుకుని భారత్‌లోకి తిరిగి ప్రవేశించింది. క్యారీఫోర్ యూరప్‌లో మలీ్టబ్రాండ్ (బహుళ బ్రాండ్ల) రిటైల్ అవుట్లెట్లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారత్‌లో ఇదే విధమైన వ్యాపారం కోసం దుబాయ్ అప్పారెల్ గ్రూప్‌తో జట్టు కట్టింది. పోర్డ్ మోటార్స్ సైతం ఈ విడత భారత్‌లో రిటైల్ విక్రయాలు కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకోవాలనే ప్రణాళికతో వస్తోంది. విధానాల ఫలితం.. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం నుంచి మెట్రో సైతం గతేడాది వైదొలగడం గమనార్హం. తన వ్యాపారాన్ని రిలయన్స్‌కు అమ్మేసి వెళ్లిపోయింది. మలీ్టబ్రాండ్ రిటైల్ వ్యాపారం పట్ల వాల్‌మార్ట్ గ్రూప్ సైతం ఆసక్తితో ఉండగా, ఎఫ్‌డీఐ విధానాల్లో స్పష్టత లేమితో.. చివరికి 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాతి కాలంలో ఐకియా, యాపిల్ సంస్థలు ఇక్కడి రిటైల్ మార్కెట్లోకి అడుగు పెట్టడం తెలిసిందే. ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో విదేశీ కంపెనీల్లో ఆసక్తి పెరిగినట్టు సబి్నవిస్ తెలిపారు. విస్మరించలేనివి...భారత వినియోగ మార్కెట్ ప్రపంచంలోనే పెద్దదంటూ, ఇక్కడి అవకాశాలను కంపెనీలు విస్మరించలేనివిగా ఫ్రాంచైజీ ఇండియా చైర్మన్ గౌరవ్ మార్య తెలిపారు. భారత్‌లో అవకాశాలకు అనుగుణంగా తమ వ్యూహాలను సర్దుబాటు చేసుకునేందుకు క్యారీఫోర్, ఫోర్డ్, తదితర విదేశీ బ్రాడ్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే అంశంపై సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్పందిస్తూ.. అతిపెద్ద మార్కెట్, వేగవంతమైన వృద్ధి, విజయవంతమైన ఆర్థిక సంస్కరణలు భారత్‌లో అవకాశాలను అన్వేíÙంచేలా విదేశీ ఇన్వెస్టర్లను ప్రేరేపిస్తున్నట్టు వివరించారు. అతిపెద్ద వినియోగ మార్కెట్, బలమైన వృద్ధి విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ సైతం అభిప్రాయపడ్డారు.ఎల్రక్టానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, విజ్ధానాధారిత సేవలు తదితర రంగాల్లో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నట్టు చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ‘‘విదేశీ సంస్థలతో మాట్లాడినప్పుడు భారత్‌లో కార్యకలాపాలు చేపట్టేందుకు అవి ఎంతో ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ ఇక ముందు పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం’’అని బెనర్జీ వివరించారు. -
కశ్మీర్ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ ప్లాన్
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ బిగ్ స్కెచ్ గీసింది. ఈ క్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఆయన్ని జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. 2014 ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లో బీజేపీని అధికారంలోకి(సంకీర్ణం) తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. రామ్ మాధవ్ దాదాపు ఆరేడు సంవత్సరాల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభం ఉన్న రామ్‌మాధవ్‌ను బీజేపీ మళ్లీ రంగంలోకి దించింది. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రంకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికల ఇన్‌చార్జీగా రామ్‌మాధవ్ కీయాశీలక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. -
భారత్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న ఫోర్డ్!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారత్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టితో భారత మార్కెట్లోకి తిరిగి రావాలని యోచిస్తోంది. రీ-ఎంట్రీ అంశాన్ని కంపెనీ సీఈవో జిమ్ ఫార్లీ నేతృత్వంలోని ఫోర్డ్ గ్లోబల్ టీమ్ సమీక్షిస్తోంది.పాశ్చాత్య మార్కెట్లలో స్తబ్దత కారణంగా భవిష్యత్ వృద్ధికి కీలకమైన మార్కెట్‌గా భావించే భారత్‌లో తిరిగి ప్రవేశించే అవకాశాలను అంచనా వేయడానికి వివరణాత్మక సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఫోర్డ్ గతంలో భారత్‌లో 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఎకో స్పోర్ట్ మినీ-ఎస్యూవీ, ఫిగో చిన్న కారు వంటి మోడళ్లతో విజయాన్ని సాధించింది. మహీంద్రా & మహీంద్రాతో కలిసి జాయింట్ వెంచర్లతో చారిత్రక ఉనికి ఉన్నప్పటికీ, ఫోర్డ్ భారత్‌లో స్థిరమైన వ్యాపారాన్ని స్థాపించడంలో సవాళ్లను ఎదుర్కొంది. ఈ వెంచర్లు కంపెనీ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఫోర్డ్ తన గుజరాత్ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు విక్రయించాలని, భారత మార్కెట్ నుంచి నిష్క్రమించాలనే ఆలోచనకు దారితీసింది.ఫోర్డ్ తన చెన్నై ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూకి విక్రయించే ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించే పునరాలోచన ఊపందుకుంది. ఫోర్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న చెన్నై ప్లాంట్‌ను కంపెనీ పునరుద్ధరణ వ్యూహానికి కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.ఫోర్డ్ గ్లోబల్ టీమ్ రీ-ఎంట్రీ ప్లాన్‌ను ఆమోదించినట్లయితే, కంపెనీ గణనీయమైన చట్టపరమైన సన్నాహాలను చేపట్టవలసి ఉంటుంది. చెన్నై ప్లాంట్‌లో ఇప్పటికే ఉన్న మెషినరీని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వలన ఉత్పత్తి దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితులు, ముఖ్యంగా గత మార్చిలో ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ఫోర్డ్ పునరాలోచనకు కీలకమైన అంశాలు. -
మళ్లీ నటించడానికి సిద్ధం!
బాలీవుడ్ లెజెండ్రీ దిలీప్‌కుమార్ కుటుంబానికి చెందిన నటి సాయేషాసైగల్. టాలీవుడ్ యువ నటుడు అఖిల్ కథానాయకుడిగా నటించిన అఖిల్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నటి సాయేషా సైగల్. ఆ తర్వాత అజయ్‌దేవగన్ సరసన శివాయ్ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఈ చిత్రంతో నటిగానే కాకుండా తనలో మంచి డాన్సర్ ఉన్నట్లు నిరూపించుకున్నారు. ఆ తర్వాత తమిళంలో కార్తీ సరసన కడైకుట్టి సింగం, విజయ్‌సేతుపతితో జూంగా, ఆర్యకు జంటగా గజినీకాంత్, రెడీ, సూర్య సరసన కాప్పాన్ చిత్రాల్లో కథానాయకిగా నటించారు. అలాంటి సమయంలో ఆర్యను ప్రేమించి పెద్దల అనుమతితో 2019లో పెళ్లిచేసుకున్నారు. దీంతో నటనకు చిన్నగ్యాప్ ఇచ్చారు. ఈ సినీజంటకు హర్యానా అనే కూతురు పుట్టింది. కాగా చిన్నగ్యాప్ తర్వాత సాయేషా శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలో ఒక సింగిల్‌సాంగ్‌లో మెరిశారు. ప్రస్తుతం మళ్లీ నటించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. పలు కథలు వింటున్నారని సమాచారం. దీంతో సాయేషా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో ఆనందాన్ని ఇస్తోంది. దీంతో త్వరలోనే సాయేషాసైగల్ రీఎంట్రీ షురూ అవుతుందని భావించవచ్చు. అయితే ఆమె తాజాగా ఏ నటుడి సరసన నటిస్తారన్నదే ఆసక్తిగా మారింది. -
చిన్నమ్మ రీఎంట్రీ.. ఆమె వెనుక ఎవరున్నారు?
శశికళ మరోసారి శపథం చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలో చేరి మళ్లీ అమ్మ పాలన తెస్తానంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. అసలు.. శశికళ ఎంట్రీ వెనుక కారణమేంటి..? ఇది ఆమె సొంత నిర్ణయమా.? లేక ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా..? తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని చెప్పారు. ఇటీవలే వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనమవుతుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె.. తిరిగి అమ్మ పాలనకు నాంది పలుకుతామని వెల్లడించారు. ఇదే క్రమంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు శశికళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ తేల్చిచెప్పారు. ఇక.. తమిళనాడు ప్రజలు తమవైపే ఉన్నారని తెలిపారు శశికళ. అన్నాడీఎంకే కథ ముగిసిపోలేదని.. తన రీ ఎంట్రీతో ఇప్పుడే ప్రారంభమయ్యిందంటూ తన మద్దతుదారుల్లో ఆమె ఉత్సాహం నింపారు. ఎంజీఆర్, జయలలిత హయాంలో అన్నాడీఎంకే చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. కానీ.. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పార్టీలో కుల రాజకీయాలను కార్యకర్తలు సహించరంటూ ఇండైరెక్ట్‌గా పళనిస్వామిని టార్గెట్ చేశారు శశికళ. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని విమర్శించారు. అయినా.. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు శశికళ. దీని కోసం ప్రయత్నాలను మొదలు పెట్టానని వివరించారు.ఇప్పుడు.. శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లడంపై వ్యూహాలు రచిస్తున్నాయి. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. నిజానికి.. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటూ గెలవలేదు. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి డీఎంకేకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇదే ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో శశికళ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే విజయంతో మళ్లీ అమ్మ పాలన తీసుకొస్తానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.శశికళ ఎంట్రీని పళనిస్వామి ఒప్పుకుంటారా..? అంటే కష్టమే అని చెప్పాలి. గతంలోనూ అన్నాడీఎంకేలో ఎంట్రీకోసం ప్రయత్నాలు చేసి ఆమె విఫలమయ్యారు. అప్పుడు పన్నీరు సెల్వం.. పళనిస్వామి ఒక్కటిగా ఉండి శశికళకు ఎంట్రీ లేకుండా చేశారు. ఆ తర్వాత పార్టీపై పట్టుపెంచుకున్న పళనిస్వామి.. పన్నీరు సెల్వంను సైతం బయటకునెట్టారు. కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు పళనిస్వామిని కాదని.. శశికళకు పార్టీ నేతలు పగ్గాలు అప్పగించే పరిస్థితి కూడా లేదు. మరికొందరు పన్నీరుసెల్వంను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో శశికళ ఎంట్రీతో సీన్ ఎలా మారుతుందనేది ఆసక్తిగా మారింది.మరోవైపు.. అన్నాడీఎంకేతో పాటు తమిళనాడులో బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బొక్కాబోర్లా పడింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గెలుస్తారంటూ విపరీతంగా పబ్లిసిటీ చేసినా.. చివరికి ఆ సీటును కూడా గెలుచుకోలేకపోయింది కమలం పార్టీ. అటు.. పార్టీలోని కీలక నేతల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది. బీజేపీ కీలక నేత తమిళి సై, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యే అమిత్ షా బహిరంగంగా తమిళి సైని వారించింది కూడా ఇదే విషయంపై అని ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. అమిత్ షా మాట్లాడిన తర్వాత.. అన్నామలై, తమిళి సై భేటీ అయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే శశికళ ఎంట్రీ ఇవ్వడం యాథృచ్చికం కాదంటున్నారు విశ్లేషకులు. శశికళ ఎంట్రీ వెనుక బీజేపీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టీటీవీ దినకరన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కూటమిగా ఏర్పడి దినకరన్ పార్టీ పోటీ చేసింది. దీంతో దినకరన్ ద్వారానే ఇప్పుడు శశికళను బీజేపీ రంగంలోకి దింపిందని అంతా భావిస్తున్నారు. పన్నీరుసెల్వం, దినకరన్, శశికళ చేరిన అన్నాడీఎంకే తో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే.. డీఎంకేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది. మరి నిజంగానే శశికళ అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇస్తుందా..? ఇచ్చినా ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా.? ఈలోపు తమిళ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. -
పద్దెనిమిదేళ్ల తర్వాత...
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఈ నెల 7న ముంబైలో ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో నటించారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో శోభన పేరు కూడా చేరింది. అయితే ఈ పాత్రల గురించి ప్రస్తుతానికి చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. ‘కల్కి 2898 ఏడీ’లో శోభన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. 2006లో వచ్చిన ‘గేమ్’ సినిమా తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. ఒకవేళ ‘కల్కి 2898 ఏడీ’లో ఆమె నటించినది వాస్తవం అయితే పద్దెనిమిదేళ్ల తర్వాత శోభన నటించిన తెలుగు సినిమా ఇదే అవుతుంది. -
సమంతకు రీ ఎంట్రీలోనే బిగ్ ఆఫర్..!
కోలీవుడ్ సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ వేడి వేడిగా వినిపిస్తున్న పేరు విజయ్. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. సినీ రంగంలో టాప్ హీరోగా రాణిస్తున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, మైక్ మోహన్, అజ్మహల్, జయరామ్, ప్రేమ్‌జీ, వైభవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సరదాగా జరుగుతోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే ఈయన చివరి చిత్రం అవుతుంది అని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా ఇది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ లిస్టులో దర్శకుడు అట్లీ, వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్, ఆర్జే బాలాజీ,హెచ్ వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో కార్తీక్ సుబ్బరాజు గానీ, ఆర్జే బాలాజీ గానీ, విజయ్ 69 చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో విజయ్ సరసన నటించే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటి సమంతను నాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజమైతే నటి సమంత విజయ్‌తో జతకట్టే నాలుగో చిత్రం ఇది అవుతుంది. ఇంతకుముందు మెర్సల్, తేరి చిత్రాల్లో సమంత నటుడు విజయ్‌తో జత కట్టారు అన్నది గమనార్హం. లేకపోతే ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత ఆ తర్వాత కథానాయకిగా నటించే భారీ దక్షిణాది చిత్రం ఇదే అవుతుంది. -
కేసీఆర్ గ్రాండ్ బర్త్ డే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే నెల నుంచి పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకం కానున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా జనంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేర కు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ వచ్చేనెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కోలుకుంటున్న కేసీఆర్: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ప్రస్తుతం నందినగర్‌లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు పరిమిత సంఖ్యలోనే సన్నిహితులు, పార్టీ నాయకులు ఆయన్ను కలుస్తున్నారు. మరో మూడు నుంచి నాలుగు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ను స్వయంగా పరామర్శించేందుకు గత నెల రోజులుగా పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండగా, కేడర్ కూడా అధినేతను చూసేందుకు ఎదురు చూస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. ఈ నెల 3నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్‌సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రీ ఎంట్రీ పారీ్టకి మరింత జోష్ తెస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్వాగత సన్నాహాలు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్షేత్ర స్థాయిలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. జంట నగరాల్లో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొలిసారిగా జనం మధ్యకు వస్తుండటంతో ఆ మేరకు ఘనంగా స్వాగత సన్నాహాలు చేయాలని పార్టీ భావిస్తోంది. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ కాన్వాయ్‌తో కేసీఆర్‌ను తోడ్కొనిరానున్నారు. మరోవైపు కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వందల సంఖ్యలో ముఖ్య నేతలు హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ నేతలు, కేడర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే నెల 20 తర్వాత గజ్వేల్‌కు.. గజ్వేల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా గెలుపొందిన కేసీఆర్ వచ్చే నెల 20 తర్వాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశముంది. ఇకపై రెగ్యులర్‌గా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా గజ్వేల్‌లో కూడా భారీగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయనున్నారు. తొలి పర్యటనలో నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభివృద్ధి పనులపైనా అధికారులతో చర్చిస్తారని సమాచారం. వరంగల్‌లో భారీ బహిరంగ సభ! పార్టీ కార్యకలాపాలను ఇకపై తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కూడా ఇక్కడే జరపనున్నారు. పార్టీ కార్యాలయంలోనే నాయకులు, కేడర్‌తో వరుస భేటీలు జరిపేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 22న పార్టీ లోక్‌సభ సన్నాహక సమావేశాలు ముగియనుండగా, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ ఇదే తరహా మీటింగ్‌లు జరగనున్నాయి. ఒకవైపు విశ్రాంతి తీసుకుంటూనే మరోవైపు వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడుతూ క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఉద్యమ కాలంలో తనతో కలిసి పనిచేసిన వివిధ వర్గాలకు చెందిన నేతలతోనూ మాట్లాడుతూ త్వరలో అందుబాటులో ఉంటానని చెప్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అనేకమార్లు తేదీలు ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడేలోపు బీఆర్ఎస్ సత్తాను చాటేలా అక్కడ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. -
TS: గులాబీ బాస్ గ్రాండ్ రీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆ వెంటనే తుంటి ఎముకకు సర్జరీతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని గులాబీ బాస్ మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పుట్టినరోజు నాడే కేసీఆర్ హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ తెలంగాణ భవన్‌కు రానున్నారని సమాచారం. బాస్ రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. పుట్టినరోజు నాడు కేసీఆర్ తిరిగి తెలంగాణ భవన్‌కు రానుండటంతో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలకు పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. బాస్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో వెళ్లనున్నారు. అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్, గజ్వేల్ క్యాంప్ ఆఫీసు వేదికగా కేసీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. తాను త్వరలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతల సిద్ధమవుతున్నారు. ఇటీవల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీ ఎంట్రీపై హింట్ ఇచ్చారు. త్వరలో కేసీఆర్ తెలంగాణభవన్‌లో అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు కూడా వెళ్తారని వెల్లడించారు. తుంటి ఎముకకు సర్జరీ కారణంగా ప్రస్తుత అసెంబ్లీ తొలి సమావేశాలకు రాలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో రీ ఎంట్రీలో కొత్త ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఇదీచదవండి.. మేమూ రామ భక్తులమే : మంత్రి ఉత్తమ్ -
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
మళ్లీ వార్తల్లోకి వచ్చిన రజనీకాంత్ రెండవ కూతురు
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఆరేళ్ల తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ వారసురాళ్లు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు దర్శకులుగా కొనసాగుతున్నారన్నది తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా లాల్ సలాం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు) కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య ఇంతకుముందు తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదేవిధంగా రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన పలు చిత్రాలకు ఈమె గ్రాఫిక్స్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ధనుష్ కథానాయకుడిగా నటించిన వేలైయిల్లా పట్టాదారి చిత్రానికి ఈమెనే దర్శకురాలు. కాగా ఆరేళ్ల తరువాత సౌందర్య రజనీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈసారి ఆమెజాన్ ప్రైమ్ టైం కోసం రూపొందించబోతున్నారని, ఇందులో నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) -
#Ishant Sharma: 717 రోజుల తర్వాత ఎంట్రీ.. అదరగొట్టాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ రీఎంట్రీని ఘనంగా ఆరంభించాడు. దాదాపు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆకట్టుకున్నాడు. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇషాంత్ శర్మను రూ.50 లక్షలకు దక్కించుకుంది. ఇక 2021లో చివరిసారి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మ్యాచ్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు. కాగా 2019 వరకు మాత్రం రెగ్యులర్‌గా ఐపీఎల్ ఆడిన ఇషాంత్ ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక ఓవరాల్‌గా 93 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే కొన్నేళ్లగా టెస్టులకే మాత్రమే పరిమితమయ్యాడు. 108 టెస్టుల్లో 311 వికెట్లు, 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టి20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. Ishant Sharma spearheads #DelhiCapitals' offence! Keep watching #DCvKKR - LIVE & FREE on #JioCinema | Available across all telecom operators 😊#TATAIPL #IPL2023 #IPLonJioCinema | @ImIshant pic.twitter.com/PYK3rcoRoo — JioCinema (@JioCinema) April 20, 2023 చదవండి: సైగ చేయగానే ఆగిపోయాడు.. నమ్మకాన్ని నిలబెట్టని కోహ్లి -
ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్–1’ పునరాగమనం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్ 12న పీఎస్ఎల్వీ–సీ18 రాకెట్ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి. దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. 26న ఎల్వీఎం3–ఎం3 ప్రయోగం లాంచ్ వెహికల్ మార్క్3–ఎం3 (ఎల్వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్ దశ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్‌షీల్డ్‌లో అమర్చే పనులు జరుగుతున్నాయి. -
30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్‌కు చెల్లిగా..
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు నటి జీవిత రాజశేఖర్. నిర్మాతగా, దర్శకురాలిగా మారి భర్త, పిల్లల సినిమాల బాధ్యత తీసుకున్న ఆమె ఇప్పుడు నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 1991లో నటుడు రాజశేఖర్‌తో వివాహం ఆనంతరం ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత జీవిత ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా పలు చిత్రాలు తెరకెక్కించారు. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇక ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఆమె నటించేందుకు సిద్ధమయ్యారు. ఓ స్టార్ హీరోకు సోదరిగా నటించనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న రజనీ తన నెక్ట్స్ చిత్రం కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చేయబోతున్నారు. మార్చి 7న ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చదవండి: పెళ్లి తర్వాత నయనతారకు కలిసిరావడం లేదా? భర్తకు అలా, నయన్‌కు ఇలా! ఈ సందర్భంగా ఇందులోని ప్రధాన పాత్రలకు చిత్ర బృందం స్వాగతం పలుకుతూ ఓ ట్వీట్ చేసింది. ఇందులో రజనీకాంత్, నటుడు విష్ణు విశాల్‌తో పాటు నటి జీవిత రాజశేఖర్ ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్‌కు సోదరిగా నటించబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. అయితే లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ప్రకటించనున్నారు. #LalSalaam - Shoot to start on March 7 in Chennai - @TheVishnuVishal and @vikranth_offl to play majority of CCL games before joining shoot - Jeevitha Rajasekhar to play Superstar Rajinikanth's sister in the film, an important role pic.twitter.com/C5URzbfFSI — Siddarth Srinivas (@sidhuwrites) February 28, 2023 -
మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్ సిగ్నల్?
అందానికి ప్రతిరూపం నటి అనుష్క. ఈ బెంగళూరు బ్యూటీ తొలి రోజుల్లో యోగా టీచర్ అన్నది తెలిసిందే. ఆ తరువాత సూపర్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు కథానాయకిగా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ ఆదిలో అందాలారబోతకే పరిమితమైంది. అరుంధతి చిత్రంతో తనలోని నటనను నిరూపించుకున్నారు. ఆ తరువాత వరుసగా హీరోయిన్‌కు ప్రాముఖ్యత కలిగిన పాత్రలు రావడం మొదలెట్టాయి. అలా నటించిన చిత్రాలే రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? అలా అగ్రనటిగా రాణించిన అనుష్క కోలీవుడ్‌కు రెండు చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోనూ తన అందాలతో యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దైవ తిరుమగళ్, సింగం వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటిది ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఫలితం శూన్యం. దీంతో చాలా కాలం నటనకు దూరం అయ్యారు. ఆ మధ్య తెలుగులో నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది ఏ స్టేజీలో ఉందో తెలియని పరిస్థితి. కాగా అనుష్క మరింత లావెక్కిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క మళ్లీ కోలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకు ముందు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో దైవతిరుమగళ్ చిత్రంలో నటించారు. కాగా మరోసారి అనుష్కతో చిత్రం చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ కొందరు దర్శకులు అనుష్కతో చిత్రాలు చేయడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం తన బరువే అంటూ ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు విజయ్ దర్శకత్వంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు లావుగా ఉన్న తనను గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చూపించడానికి ఈ దర్శకుడు అంగీకరించినట్లు, అందుకే అనుష్క ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ (ఫొటోలు)
-
Kangana Ranaut: దాదాపు రెండేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ
ముంబై: స్టార్ నటి కంగనా రనౌత్ దాదాపు రెండేళ్ల తర్వాత ట్విటర్‌లోకి అడుగుపెట్టారు.మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ఆమె అకౌంట్‌పై మే 2021లో బ్యాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిషేధాన్ని ట్విటర్ ఎత్తేసింది. ఈ తరుణంలో ఇవాళ సాయంత్రం ఆమె ట్విటర్లో ‘హలో ఎవ్రీవన్, ఇట్స్ నైస్ టు బ్యాక్ హియర్ అంటూ ట్విట్ చేశారు. అయితే.. ఆమె అకౌంట్‌కు బ్లూ టిక్ లేకపోవడం గమనార్హం. బహుశా ట్విటర్ కొత్త పాలసీ వల్లే ఆమె అకౌంట్‌కు బ్లూ మార్క్ పోయి ఉండొచ్చు. ఇదిలా ఉంటే.. బెంగాల్ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన పోస్టులు అప్పట్లో ఆమె ట్వీట్ చేయడంతో కలకలం రేగింది. ఈ తరుణంలో.. తమ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్‌పై బ్యాన్ వేటు పడింది. ఇక పునరాగమ ట్వీట్‌తో పాటు తన అప్‌కమింగ్ చిత్రం ఎమర్జెన్సీకి సంబంధించిన అప్డేట్స్ సైతం ఇచ్చారు.ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాక.. సెలక్టివ్‌గా కొంతమంది ప్రముఖుల ట్విటర్ అకౌంట్లు పునరుద్ధరించబడుతున్నాయి. Hello everyone, it’s nice to be back here 🙂 — Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023 And it’s a wrap !!! Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 … 20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G — Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023 -
Twitter: ఆయన పునరాగమనం కావాలా? వద్దా?
శాన్ఫ్రాన్సిస్కో: ఎలన్ మస్క్ మళ్లీ ఆసక్తికర చర్చ వైపు దారి తీశాడు. ఒకవైపు ట్విటర్ ఉద్యోగులు కంపెనీని వీడుతున్నప్పటికీ.. తనకేం ఫరక్ పడదని, ఉత్తమ ఉద్యోగులు తన వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు పరోక్ష చర్యల ద్వారా అమెరికా రాజకీయాలను కదిలిస్తున్నాడు. ట్విటర్ వేదికగా ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరాగమనం కావాలా? వద్దా? అంటూ ఓ పోల్ నిర్వహించాడు ఈ అపరకుబేరుడు. అయితే అది ట్విటర్ వరకే అనుకుంటే పొరపాటే!. ట్రంప్ తాజాగా 2024-అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ చేసిన ట్వీట్ పరోక్షంగా ఆయన రాజకీయ పునరాగమనం గురించి అని అర్థం చేసుకోవచ్చు!. 2020 జనవరిలో క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌పై ట్విటర్ శాశ్వత నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఎలన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకున్న తర్వాత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ట్రంప్ రీఎంట్రీ ఉండొచ్చనే సంకేతాలు అందించాడు కూడా. అయితే.. ట్విటర్‌ను మస్క్ టేకోవర్ చేయడంపై అభినందించిన ట్రంప్.. తిరిగి ట్విటర్‌లోకి వస్తారా? అనే విషయంపై మాత్రం సరైన స్పందన ఇవ్వలేదు. Reinstate former President Trump — Elon Musk (@elonmusk) November 19, 2022 తాజాగా.. జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలోనూ ట్రంప్ ట్విటర్ రీ-ఎంట్రీపై జోరుగా చర్చ నడిచింది. ఈ క్రమంలో.. తాజాగా ఎలన్ మస్క్ ట్రంప్ ట్విటర్ పునరాగమనం ఉండాలా? వద్దా? అనే అంశంపై పోలింగ్ నిర్వహించాడు. దీనికి అవును అనే స్పందనే ఎక్కువగా లభిస్తోంది. Kathie Griffin, Jorden Peterson & Babylon Bee have been reinstated. Trump decision has not yet been made. — Elon Musk (@elonmusk) November 18, 2022 ట్విటర్ నిషేధం అనంతరం సొంతంగా ట్రూత్‌సోషల్ యాప్ ప్రారంభించాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్విటర్లో ఆయనకు దక్కిన ఫాలోయింగ్కంటే(బ్యాన్ నాటికి 80 మిలియన్ ఫాలోవర్స్).. సొంత ప్లాట్‌ఫారమ్‌లో దక్కిన ఆదరణ చాలా చాలా తక్కువ. ఒకవేళ ఆయన ట్విటర్ అకౌంట్‌ను గనుక పునరుద్ధరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆయన ప్రయత్నానికి బాగా కలిసొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోల్ నిర్వహణ ముందర.. ట్విటర్ శాశ్వత నిషేధం విధించిన మరికొన్ని అకౌంట్లను పునరుద్ధరించేందుకు సుముఖంగా ఉన్నట్లు, ట్విటర్ చేసే పని స్వేచ్ఛవాదులకు ఫ్రీ హ్యాండ్ అని అర్థం వచ్చేలా వరుస ట్వీట్లు చేశాడు ఎలన్ మస్క్. -
ట్విట్టర్లోకి ట్రంప్ రీఎంట్రీ..? ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..
-
ట్విట్టర్ లోకి ట్రంప్ రీ ఎంట్రీ ..?
-
ఎలన్ మస్క్ తెలివైనోడు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, వ్యాపార దిగ్గజం డొనాల్డ్ ట్రంప్.. ట్విట్టర్ కొత్త ఓనర్ ఎలన్ మస్క్‌పై ప్రశంసలు గుప్పించాడు. మస్క్ తెలివైనోడంటూ వ్యాఖ్యలు చేశాడాయన. అయితే.. ట్విటర్ నిషేధం ఎదుర్కొంటున్న ట్రంప్.. తిరిగి చేరతారా? అనే సస్పెన్స్‌కు మాత్రం ఆయన ఫుల్స్టాప్ పెట్టలేదు. టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వ్యవహారం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. నెలల తరబడి ఊగిసలాట నడుమ ఎట్టకేలకు గురువారం రాత్రి ఈ డీల్ ముగిసింది. టేక్ ఓవర్ కంటే ముందే తన మార్క్‌ను చూపించుకునేందుకు మస్క్ చేస్తున్న ప్రయత్నాలపైనా జోరుగా చర్చ నడుస్తోంది. ఇక ఈ పరిణామంపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో స్పందించారు. మన దేశాన్ని(యూఎస్) నిజంగా ద్వేషించే రాడికల్ లెఫ్ట్ వెర్రితలలు, ఉన్మాదులు ఇకపై ట్విట్టర్‌ను నిర్వహించబోరు. ఆ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఒక తెలివైన వ్యక్తి(ఎలన్ మస్క్) చేతుల్లోకి వెళ్లడం సంతోషాన్ని ఇచ్చింది అంటూ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. ట్విట్టర్ నిషేధ సమయానికి ట్రంప్ ఖాతాకు 80 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సొంత సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారం ట్రూత్ సోషల్‌లో మాత్రం ఇప్పటిదాకా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ మాత్రమే ఉండడం గమనార్హం. మస్క్‌తో ట్రంప్ (పాత చిత్రం) ఇక ట్రంప్‌పై ట్విటర్ బ్యాన్ ఎత్తివేతకు సంకేతాలిస్తూ గతంలోనే కామెంట్లు చేశాడు ఎలన్ మస్క్. తానేం ట్రంప్ అభిమానిని కాదంటూనే.. మస్క్ నిషేధ నిర్ణయం సరికాదన్నారు. మరోవైపు ఫాక్స్ న్యూస్ డిజిటల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పందిస్తూ.. ట్విటర్ పునరాగమనంపై ఎటూ తేల్చలేదు. కాకపోతే తాను మస్క్‌ను బాగా ఇష్టపడతానని, అతనికి ట్విట్టర్ డీల్ అన్ని విధాల కలిసిరావాలని చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశాడు. నేను లేకుండా ట్విట్టర్ విజయవంతం కాగలదని నేను అనుకోను అంటూ సరదా వ్యాఖ్య చేశారాయన. యూఎస్ కాపిటల్ దాడి నేపథ్యంలో ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధం విధించింది. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నట్లు ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్.. తిరిగి ట్విట్టర్లోకి రావడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. -
షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ
హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ధర్మ చక్రం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలు చిత్రాల్లో దేవత పాత్రలు చేసి మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె సినిమాలకు దూరమయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం తాజాగా ఆమె ‘అనుకోని ప్రయాణం’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదల కాబోతోంది. చదవండి: రామ్ చరణ్ మాటలకు ఏడ్చేసిన జపాన్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ టాక్‌లో షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినిమా విశేషాల గురించి పంచుకుంది. తాను మొదట కన్నడ ఓం చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చానంది. ఆ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ తనని బాగా తిట్టారంటూ ఆసక్తికర విషయం చెప్పింది. ‘కన్నడ హీరో శివరాజ్ కుమార్‌తో నటించాలన్నది నా చిన్ననాటి కల. ఆయనతోనే నా తొలి సినిమా. ఆయనను చూస్తుంటే అసలు డైలాగ్ చెప్పడానికి రావట్లేదు. డైరెక్టర్ ఎన్నిసార్లు చెప్పిన డైలాగ్స్ అసలు నా తలకెక్కట్లేదు. పదే పదే షాట్స్ తీస్తున్నా డైలాగ్ డెలివరి రావట్లేదు. చివరికి డైరెక్టర్ నాపై అరిచారు. బ్రేక్‌లో మా అమ్మ కూడా నన్ను తిట్టింది. ‘ఎన్ని సార్లు చెప్పించుకుంటావు. ఆయన చెప్తుంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది తలకెక్కట్లేదా?. చదవండి: దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్ 15 షాట్స్ అయ్యాయి నీకు రావడం లేదా’ అని తిట్టింది. అమ్మ తిట్టాగానే కోపం వచ్చింది. షాట్ రెడీ కాగానే వెళ్లి డైలాగ్ చెప్పాను. సింగిల్ షాట్స్‌లోనే ఒకే అయిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగుకు ఎలా వచ్చారని అడగ్గా.. కన్నడ ఓం సినిమా చూసి రామానాయుడు గారు తనకు ధర్మ చక్రం సినిమాలో చాన్స్ ఇచ్చారని తెలిపింది. అనంతరం తెలుగులో మోహన్ బాబు గారు అంటే మొదట్లో భయమేసేదని పేర్కొంది. ‘‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలో మోహన్ బాబు గారితో కలిసి నటించాను. ఇందులో నాది నెగిటివ్ రోల్. ఆయనను డైరెక్ట్‌గా చూడాలంటేనే భయం.. అలాంటిది ఆయనతో పోటీపడి నటించాల్సి వచ్చింది’’ అని ప్రేమ పేర్కొంది. -
సీనియర్ నటి రీఎంట్రీ.. ఐటెం సాంగ్స్ అయినా ఒకే అట
తమిళసినిమా: నటిగా, శృంగార తారగా 1980 ప్రాంతంలో ఊపేసిన తార బబిత. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో 150కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కమలహాసన్ కథానాయకుడిగా నటించిన నాయగన్ చిత్రంలో నాన్ సిరిత్తాల్ దీపావళి పాట వినగానే గుర్తొచ్చేది నటి బబిత పేరే. తెలుగులోనూ మొరటోడు నా మొగుడు వంటి పలు చిత్రాల్లో నటించారు. కె.భాగ్యరాజ్ హీరోగా నటించిన చిన్నవీడు చిత్రంలో ఆయనకు రెండో భార్యగా నటించి అలరించారు. ఈమెది సినీ కుటుంబం అనే చెప్పాలి. ఈమె తండ్రి జస్టిస్ ఎంజీఆర్‌కు పలు చిత్రాల్లో విలన్‌గా నటించడంతో పాటు నిజ జీవితంలోనూ ఆయనకు నీడలా నిలిచిన వ్యక్తి. ఇక బబిత భర్త ఫైట్ మాస్టర్‌గా పలు చిత్రాలకు పని చేశారు. కాగా వివాహ అనంతరం నటి బబిత నటనకు దూరంగా ఉండి పిల్లలతో బాధ్యత గల తల్లిగా నడుచుకున్నారు. కొన్నేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్ష్యను హీరోయిన్ చేస్తూ స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించారు. అయితే అనివార్య కారణాలతో ఈ చిత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తరువాత బబిత నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ నటిగా ఎంత పేరు తెచ్చుకున్నా సినిమా రంగంలో సాంబార్ ఇడ్లీ తినకపోతే ఉండలేకపోతున్నానన్నారు. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యా నని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహల్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. దీనికి పొస్ కుమరస్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. మళ్లీ శృంగార తారగా ఐటమ్ డాన్స్ చేయడానికి కైనా.. అక్క, అమ్మ పాత్రలకైనా సిద్ధమని ప్రకటించారు.