![Hero Tarun To Re Entry With Mahesh Babu SSMB28 Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/29/Trivikram-Srinivas.jpg.webp?itok=KyDlj6Fd)
మహేశ్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోలు, హీరోయిన్స్‌ని తీసుకుంటాడు. తాజాగా SSMB28 సినిమా కోసం లవర్ బాయ్ తరుణ్‌ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వరుస పరాజయాలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయిన తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కాగా తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతోనే త్రివిక్రమ్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించగా మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment