
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే కావడంతో సాంగ్ విడుదల చేశారు.
గంటూరు కారం మూవీ నుంచి ధమ్ మసాలా అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
Witness the ULTIMATE EXPLOSION of SUPER 🌟 @urstrulyMahesh in MASS SWAG 🔥💥#GunturKaaram First Single ~ #DumMasala Out Now 🔥
— Guntur kaaram (@GunturKaaram) November 7, 2023
- https://t.co/egSALSY4Xt
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 #SanjithHegde #JyotiNooran#Trivikram #thaman @sreeleela14… pic.twitter.com/0nku6bu9P8