తెలుగు సాంగ్ గ్లోబల్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన సాంగ్స్‌లలో టాప్-10 లిస్ట్‌ను యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. అందులో ఇండియా నుంచి ఒక సాంగ్ మాత్రమే ఉంది. అయితే, అది తెలుగు సినిమాకు సంబంధించిన పాట కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో 'గుంటూరు కారం'తో సందడి చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్‌తో లెక్కలేనన్నీ రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది.
'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. 527+ మిలియన్ వ్యూస్‌తో ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దీంతో 2024 యూట్యూబ్ టాప్ సాంగ్స్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్ పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 7 టాప్ హిట్ సాంగ్స్‌ను యూట్యూబ్ ప్రకటించింది. అందులో భారత్ నుంచి ఎంపికైన ఏకైక పాట 'కుర్చీ మడతపెట్టి' అనే సాంగ్ ఉండటం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడంతో మహేష్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న విడుదలైంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్ హసిని బ్యానర్స్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, మహేష్ వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లాయి.
Comments
Please login to add a commentAdd a comment