కుర్చీ మడతపెట్టి పాటకు మైండ్‌ బ్లాక్‌ అయ్యే రికార్డ్‌ | Guntur Kaaram: Kurchi Madathapetti Song Garners 500 Million Views | Sakshi
Sakshi News home page

రికార్డులు మడతపెట్టిన గుంటూరు కారం సాంగ్‌.. ఏకంగా!

Published Sat, Nov 30 2024 5:42 PM | Last Updated on Sat, Nov 30 2024 5:55 PM

Guntur Kaaram: Kurchi Madathapetti Song Garners 500 Million Views

కొన్ని పాటలు భాషతో సంబంధం లేకుండా క్లిక్‌ అవుతాయి. అలా ఈ ఏడాది కుర్చీ మడతపెట్టి పాట సూపర్‌డూపర్‌ హిట్టయింది. నేషనల్‌ కాదు, ఇంటర్నేషనల్‌ లెవల్‌లోనూ ఈ పాట మార్మోగిపోయింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు కారం సినిమాలోనిదే ఈ పాట!

పాట బ్లాక్‌బాస్టర్‌ హిట్‌
మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్‌ రాబట్టిన ఈ మూవీలో తమన్‌ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటకైతే విజిల్స్‌ పడ్డాయి.

వన్స్‌మోర్‌
ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్‌ హిట్‌ అయింది. మహేశ్‌, శ్రీలీల ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. రిపీట్‌ మోడ్‌లో పాట వింటూనే ఉన్నారు. తాజాగా ఈ పాట అరుదైన రికార్డు అందుకుంది. ఏకంగా 50 కోట్ల (500 మిలియన్‌) వ్యూస్‌ సాధించింది. ఈ సంతోషకర సమయంలో ఫ్యాన్స్‌ వన్స్‌మోర్‌ అంటూ మరోసారి కుర్చీ మడతపెట్టి సాంగ్‌ వింటున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement