గుంటూరు కారం సాంగ్.. అంత భయంకరంగా ఉందన్న టీమిండియా స్టార్‌ క్రికెటర్! | Team India Cricketer Praises Sreeleela Dance In Guntur karaam Song | Sakshi
Sakshi News home page

Guntur Kaaram Song: 'అదేమన్నా డ్యాన్స్‌ హా'.. శ్రీలీల ఫర్మామెన్స్‌కు రవిచంద్రన్‌ అశ్విన్ ఫిదా..!

Published Tue, Mar 19 2024 7:25 PM | Last Updated on Tue, Mar 19 2024 8:56 PM

Team India Cricketer Praises Sreeleela Dance In Guntur karaam Song - Sakshi

కొత్త ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన భామ శ్రీలీల. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్‌ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు అభిమానులకు అయితే ఏకంగా పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరేమో. అంతలా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది ఈ కన్నడ భామ.

అయితే తాజాగా గుంటూరు కారం సాంగ్‌పై టీమిండియా క్రికెటర్, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా శ్రీలీల, మహేశ్‌బాబు డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని వెల్లడించారు. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్‌ను ప్రస్తావించారు. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్‌లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్‌ భయంకరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్‌ టైప్‌ చూడమని అశ్విన్ సలహా కూడా ఇచ్చాడు. మహేశ్‌ బాబు ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్సర్‌ అని.. అతనితో పాటు శ్రీలీల అదరగొట్టిందని అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సాంగ్‌ ఐపీఎల్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌కు ఊపు తీసుకొస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement