కన్నడ స్టార్ సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళం, కన్నడ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది కబ్జా సినిమాతో అలరించిన కిచ్చా.. ప్రస్తుతం మ్యాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా నెటిజన్ల్‌తో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా ఆస్క్ కిచ్చా అనే సెషన్‌లో పాల్గొన్నారు.
ఈ సెషన్‌కు హాజరైన పలువురు నెటిజన్స్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఇటీవల సచిన్‌ను కిచ్చా సుదీప్ కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫోటోను షేర్ చేసిన నెటిజన్.. కిచ్చాను ఇలా అన్నారు. సచిన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అన్న ఈ ఫోటో గురించి ఒక్కమాటలో చెప్పండి.. సచిన్‌ను కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది' అని అడిగాడు. దీనికి సుదీప్ రిప్లై ఇచ్చారు. ఈ ఫోటోను చూస్తే 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ.. ఇది నా జీవితంలో మధురమైన జ్ఞాపకం' అంటూ బదులిచ్చారు.
అయితే ఈ ట్వీట్ చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం కిచ్చా సుదీప్ రిప్లై ఇచ్చారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు తీసిన మన ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ సచిన్ ట్వీట్ చేశారు. ఇది చూసిన కన్నడ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు సచిన్ రిప్లై ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఈ ట్వీట్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్ సైతం స్పందించారు. 'వావ్.. నేను ఇది ఊహించలేదు... మీరు నాకు మరో మరపురాని క్షణాన్ని అందించారు సార్' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
This pic is just looking like a wowwwwwwwww... 😁
One fond memory my friend . https://t.co/y4C1a0LkPi— Kichcha Sudeepa (@KicchaSudeep) January 16, 2024
It was lovely meeting you. Aur uss din kisine hamara ye photo bhi kitna acha KICHCHA tha. Always wishing you good health and happiness in life. 😊 https://t.co/D3o1ZvwOUM
— Sachin Tendulkar (@sachin_rt) February 2, 2024
Woaaa!!! ♥️♥️..
Didn't expect this ...
You jus gifted me another memorable moment...
Mch luv and wshs always @sachin_rt sir. https://t.co/tWXaV8Givs— Kichcha Sudeepa (@KicchaSudeep) February 2, 2024
Comments
Please login to add a commentAdd a comment