Sudeep
-
ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్
శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచే జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మొదట ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్కు రానుందని భావించారు. కానీ వారం రోజుల ముందుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఈ మేరకు ప్రత్యేత పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకులను అలరించనుంది మ్యాక్స్ మూవీ. ఈ చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ అభిమానులను మెప్పించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. The MAXxive blockbuster from Kannada cinema!Premieres 15th February@KicchaSudeep @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @dhilipaction @kevinkumarrrr @ChethanDsouza @shobimaster @saregamasouth @ZeeKannada pic.twitter.com/ox5wN6U4OO— ZEE5 Telugu (@ZEE5Telugu) February 13, 2025 -
హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించిన కిచ్చా సుదీప్
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హైదరాబాద్ మెట్రో రైలులో సందడి చేశారు. సీసీఎల్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన సుదీప్ మెట్రోలో ప్రయాణించారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లో తన టీమ్‌తో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఏడాది సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంతో రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఉప్పల్ స్డేడియం వెళ్లేందుకు మెట్రోలో ప్రయాణించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. కిచ్చా సుదీప్ కర్ణాటక బుల్డోజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఉప్పల్ స్డేడియంలో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై రైనోస్‌తో తలపడతారు. మరో మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్- తెలుగు వారియర్స్‌ను ఢీకొట్టనుంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫైనల్స్ మార్చి 2న జరగనుంది. ఇక సినిమాల విషయానికొస్తే కిచ్చా సుదీప్ చివరిసారిగా మాక్స్ మూవీలో కనిపించాడు. View this post on Instagram A post shared by Hyderabad Metro Rail (@lthydmetrorail) -
ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జీ5 వేదికగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కాగా.. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
కన్నడ బిగ్‌బాస్ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
కన్నడలో బిగ్‌బాస్ సీజన్ 11 (Kannada Bigg Boss 11) ముగిసింది. మొదటిసారి ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ విజేతగా నిలిచాడు. సుమారు 120 రోజులుగా కొనసాగిన ఈ సీజన్లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కొనసాగారు. జనవరి 26న బిగ్‌బాస్ ఫైనల్ ముగిసింది. దీంతో ట్రోఫీతో పాటు నగదును విజేతకు సుదీప్ అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంది.బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత(Hanumantha) విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆట మొదలపెట్టిన అతను ఏకంగా టైటిల్ విన్నర్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మంచి గుర్తింపు పొందాడు. సంగీతంతో పరిచయం లేకుండానే 2018 సారిగమప కన్నడ 15వ సీజన్లో హనుమంత రన్నరప్‌గా నిలిచాడు. దీంతో చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. ఆపై మరుసటి ఏడాదిలో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ సీజన్ 2లో పాల్గొన్న హనుమంత ఇక్కడ కూడా తన టాలెంట్తోనూ మెప్పించాడు. ఈ గుర్తింపుతో బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా 21వ రోజున హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. చివరకు కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విజేతగా నిలిచాడు.ప్రైజ్‌మనీ ఎంత..?ట్రోఫీ రేసులో హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు టాప్-5లో ఉన్నారు. అయితే, గట్టిపోటీ తట్టుకుని హనుమంత విజేత కాగా.. రన్నరప్‌గా త్రివిక్రమ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో రజత్, మోక్షిత, మంజు వరుసగా ఉన్నారు. విజేత హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన త్రివిక్రమ్‌కు రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్న విషయం తెలిసింది.ಅತೀ ಹೆಚ್ಚು ವೋಟ್ಸ್ ಪಡೆದು ವಿಕ್ಟರಿ ಬಾರಿಸಿದ ಹನುಮಂತು!ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 11 ಗ್ರಾಂಡ್ ಫಿನಾಲೆ#BiggBossKannada11 #BBK11 #GrandFinale #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/a6YfYVNVWm— Colors Kannada (@ColorsKannada) January 26, 2025 -
సారీ.. మీ అవార్డ్ నాకొద్దు.. క్షమాపణలు చెప్పిన కిచ్చా సుదీప్
శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్‌ను ప్రతిష్టత్మక అవార్డ్ వరించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఉత్తమ నటుడిగా పురస్కారం ప్రకటించింది. ఉత్తమ నటుడి కేటగిరీ కిచ్చా సుదీప్‌కు అవార్డ్ దక్కింది. ఈ ఘనత దక్కడం పట్ల హీరో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు.కిచ్చా సుదీప్ తన ట్వీట్లో రాస్తూ..' ఉత్తమ నటుడి కేటగిరీ కింద రాష్ట్రస్థాయి అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ గౌరవం కల్పించిన జ్యూరీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చాలా సంవత్సరాలుగా అవార్డులు అందుకోవడం ఆపివేయాలని నిర్ణయించుకున్నా. వివిధ వ్యక్తిగత కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. కానీ ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నా. చాలా మంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఇస్తే నా కంటే చాలా ఎక్కువగా అభినందిస్తారు. వారిలో ఒకరు దానిని స్వీకరించడం నాకు మరింత సంతోషాన్నిస్తుంది. ఎలాంటి అవార్డులు ఆశించకుండా అభిమానులను అలరించడమే నా ధ్యేయం.' అని పోస్ట్ చేశారు.అవార్డ్‌కు ఎంపిక చేసినందుకు ప్రతి జ్యూరీ సభ్యునికి కృతజ్ఞతలు.. ఎందుకంటే నా ప్రతిఫలానికి దక్కిన గుర్తింపని కిచ్చా సుదీప్ పోస్ట్ చేశారు. నా నిర్ణయం ఏదైనా నిరాశ కలిగించినందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు రాసుకొచ్చారు. మీరు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని.. నేను ఎంచుకున్న మార్గంలో మద్దతు ఇస్తారని విశ్వసిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. నా కృషిని గుర్తించి ఈ అవార్డుకు నన్ను పరిగణనలోకి తీసుకున్నందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. కిచ్చా సుదీప్ కేవలం శాండల్వుడ్లోనే కాదు.. టాలీవుడ్‌లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి ఈగ మూవీతో తెలుగులో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కిచ్చా సుదీప్ చివరిసారిగా మ్యాక్స్ చిత్రంతో అభిమానులను అలరించారు.Respected Government of Karnataka and Members of the Jury, It is truly a privilege to have received the state award under the best actor category, and I extend my heartfelt thanks to the respected jury for this honor. However, I must express that I have chosen to stop receiving…— Kichcha Sudeepa (@KicchaSudeep) January 23, 2025 -
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. అలా ఆయన పాన్ ఇండియా రేంజ్లో పరిచయం అయ్యాడు. అయితే, ఇప్పుడు మ్యాక్స్ సినిమాతో థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా విలన్‌గా సునీల్ కన్నడలో ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానున్నడంతో మ్యాక్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా డేట్ అనౌన్స్ మెంట్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం పోస్టర్స్ ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. క్రిస్మస్ రేసులో ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉంది. -
బిగ్ ఫైట్.. కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' కూడా ఆ రోజే విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. మ్యాక్స్ చిత్రం తెలుగులో డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. క్రిస్మస్ రేసులు ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉండనుంది. -
'మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపింది'.. ప్రధానికి హీరో రిప్లై!
కన్నడ హీరో కిచ్చా సుదీప్ పీఎంవో నుంచి వచ్చిన లేఖపై స్పందించారు. ఇలాంటి కష్ట సమయంలో అండగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపిందని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.కాగా ఇటీవల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాతృమూర్తి సరోజా సంజీవ్ (86) కన్నుమూసింది. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ పీఎంవో నుంచి లేఖ కూడా వచ్చింది. తాజాగా ఆ లేఖకు హీరో సుదీప్ రిప్లై ఇచ్చారు. Honarable @PMOIndia @narendramodi ji, I am writing to sincerely thank you for this compassionate condolence letter. Your thoughtful words provide a source of comfort during this profoundly difficult time.Your empathy has touched my heart deeply, and I am truly grateful for your… pic.twitter.com/u4aeRF8Sw3— Kichcha Sudeepa (@KicchaSudeep) October 28, 2024 -
'ఇకపై నాకు మేసేజ్ రాదు'.. కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్!
తల్లి మరణాన్ని తలుచుకుని శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను గుర్తు చేసుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ సమయంలో ప్రస్తుతం నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తీకరించడానికి నా దగ్గర పదాలు రావడం లేదని బాధను వ్యక్తం చేశారు. సడన్‌గా ఈ శూన్యాన్ని అంగీకరించలేకపోతున్నాని.. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయిందని భావోద్వేగ ట్వీట్ చేశారు.కిచ్చా తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'మనిషి రూపంలో ఎప్పుడు నా పక్కనే నిజమైన దైవం అమ్మ. నా గురువు. నా నిజమైన శ్రేయోభిలాషి. నా మొదటి అభిమాని. ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. ప్రతి రోజు ఉదయం నా ఫోన్లో ఆ మేసేజ్ వచ్చేది. ఉదయం 5.30 గంటలకే గుడ్ మార్నింగ్ కన్నా అని సందేశం వస్తుంది. ఆ మేసేజ్ చివరిసారిగా అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం వచ్చింది. శనివారం బిగ్‌బాస్ షూటింగ్లో ఉన్నప్పుడు అమ్మ ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ఆసుపత్రిలో ఉన్న మా సోదరితో పాటు, డాక్టర్లతో మాట్లాడి వేదికపైకి వెళ్లా. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్ చేశా. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లేసరికి వెంటిలేటర్‌పై ఉంచారు. ఆదివారం ఉదయం మాకు శాశ్వతంగా దూరమైంది. కేవలం 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన అమ్మ.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది' అంటూ కిచ్చా సుదీప్ బాధను వ్యక్తం చేశారు.(ఇది చదవండి: నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం)కాగా.. కన్నడ హీరో కిచ్చాసుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.సుదీప్ కూతురు ఆవేదనకిచ్చా సుదీప్ కుమార్తె శాన్వీ కూడా ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. నానమ్మతో దిగిన ఫోటోను పంచుకుంది. అయితే అంత్యక్రియల్లో మీడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు చాలా దారుణంగా ప్రవర్తించారని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొందరు వ్యక్తులు అంత్యక్రియలకు అంతరాయం కలిగించారని రాసుకొచ్చింది. నానమ్మను కోల్పోయిన బాధలో మేము ఉంటే.. కొందరు మా మొహాలపై కెమెరాలు పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపింది. వారు నాన్నతో కూడా వారు అలానే ప్రవర్తించారని.. మా భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా రీల్స్ కోసం అలా వ్యవహరించడం దారుణమని శాన్వీ పోస్ట్‌లో వివరించింది. My mother , the most unbiased, loving, forgiving, caring, and giving, in my life was valued , celebrated, and will always be cherished.*Valued... because she was my true god next to me in the form of a human.*Celeberated... because she was my festival. My teacher. My true… pic.twitter.com/UTU9mEq944— Kichcha Sudeepa (@KicchaSudeep) October 21, 2024 -
నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం జరిగింది. అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఆయన తల్లి సరోజా సంజీవ్ (86) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో సుదీప్ కుటుంబం శోకసంద్రంలో ఉంది.బెంగళూరు జేపీ నగర్‌లోని సుదీప్ నివాసంలో సరోజ భౌతికకాయాన్ని చివరి చూపు కోసం ఉంచనున్నారు. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. సరోజకు నటుడు సుదీప్తో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరోజ మృతి పట్ల సుదీప్ అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, బంధువులు సంతాపం తెలిపారు. జేపీ నగర్ నివాసానికి ఇప్పటికే సుదీప్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మంగళూరుకు చెందిన సుదీప్ తల్లి సరోజ సినిమా పరిశ్రమకు దూరంగానే ఉండేవారు. అయితే, తన తల్లితో పాటు మంగళూరుకు కొద్దిరోజుల క్రితమే సుదీప్ వెళ్లిన విషయం తెలసిందే. -
బిగ్ బాస్‌కు షాకిచ్చిన సుదీప్.. హౌస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన
బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైంది. సెప్టెంబర్ 29 నుంచి మొదలైన ఈ సీజన్లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అయితే, ఈ సీజన్ తర్వాత హోస్ట్‌గా తాను వ్యవహరించలేనని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. వాస్తవంగా ఈ సీజన్ ప్రారంభానికి ముందే బిగ్ బాస్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ షో నిర్వాహకులు సుదీప్ ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేయడంతో ఆయన తిరిగి సెట్లో అడుగుపెట్టారు.బిగ్ బాస్‌తో కిచ్చా సుదీప్‌కు పదేళ్ల అనుబంధం ఉంది. కన్నడలో ఈ రియాలిటీ షో ప్రారంభ సమయం నుంచి ఆయనే హోస్ట్‌గా కొనసాగుతున్నారు. కలర్స్ ఛానల్లో ప్రసారం అయ్యే ఈ షో కోసం చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ సీజన్ తర్వాత తాను హోస్ట్‌గా కొనసాగలేనని సోషల్‌మీడియా ద్వారా ఇలా ప్రకటించారు. 'బిగ్ బాస్ పట్ల ఆదరణ చూపుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ నామీద చూపుతున్న ప్రేమ ఏ రేంజ్లో ఉందో ఈ షో కోసం వస్తున్న రేటింగ్ చెబుతుంది. మీ ప్రేమకు ఫిదా అవుతున్నాను. అయితే, బిగ్ బాస్‌తో నా ప్రయాణం ఇప్పటికి పదేళ్లు పూర్తి అయింది. 11వ ఏడాది కూడా కలిసి ప్రయాణం చేస్తున్నా. కానీ, నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఎంతో ఉంది. దీంతో బిగ్ బాస్‌తో నా ప్రయాణాన్ని ముగించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే నా చివరి సీజన్‌గా ఉండబోతుంది. ఇన్నేళ్లపాటు మీరందరూ నన్ను ఆదరించారు. ప్రస్తుతం నేను తీసుకున్న నిర్ణయాన్ని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాను. ఈ సీజన్‌ని అత్యుత్తమమైనదిగా ఉండేలా నా వంతు ప్రయత్నం చేస్తా.' అని సుదీప్ తెలిపారు.బిగ్ బాస్ కన్నడతో సుదీప్ అనుబంధం ఒక దశాబ్దం పాటు కొనసాగింది. బిగ్ బాస్ షోకు ఆయన పేరు పర్యాయపదంగా మారింది. తనదైన స్టైల్లో హోస్టింగ్, చమత్కారమైన వ్యాఖ్యలతో పోటీదారులను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించారు. సుదీప్ ముందు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో ఈ షో నుంచి ఆయన తప్పుకుంటున్నారని తెలుస్తోంది. Thank you all for the great response shown towards #BBK11.The TVR (number) speaks in volumes about the love you all have shown towards the show and me.It's been a great 10+1 years of travel together, and it's time for me to move on with what I need to do. This will be my last… pic.twitter.com/uCV6qch6eS— Kichcha Sudeepa (@KicchaSudeep) October 13, 2024 -
హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్
సౌత్ ఇండియా సినిమా అవార్డుల వేడుక(సైమా) దుబాయ్‌లో జరుగుతోంది. సౌత్‌కు చెందిన వివిధ భాషలకు చెందిన సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్ సైతం సైమా ఈవెంట్లో మెరిశారు. అయితే ఈ వేడుకల్లో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తనదైన స్టైల్లో కనిపించారు. ఈ సందర్భంగా సీసీఎల్ కొత్త సీజన్‌ను వేదికపై కిచ్చా సుదీప్ ప్రకటించారు.అయితే వేదికపై హైదరాబాద్‌కు చెందిన యాంకర్ పొరపాటున కన్నడను కన్నడ్ అంటూ సంభోధించారు. దీనిపై హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ముంబయి వాళ్లు అలా పిలిస్తే ఓకే.. కానీ నువ్వు హైదరాబాదీ అయి ఉండి అలా పిలవడం కరెక్ట్ కాదు' అని సుదీప్ అన్నారు. దీంతో యాంకర్ వెంటనే సారీ చెప్పాడు. ఇకపై కన్నడ అని సంబోధించాలంటూ అతనికి కిచ్చా సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో 2022లో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైన సుదీప్ 'హిందీ జాతీయ భాష కాదు' అని అన్నారు. దీంతో అజయ్ దేవగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుదీప్‌కి హిందీలో సమాధానమిచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విటర్లో వార్ జరిగింది. అయితే ఆ తర్వాత అనువాదంలో పొరపాటు జరిగిందంటూ అజయ్ దేవగణ్ ఈ వివాదానికి చెక్ పెట్టాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సుదీప్ మ్యాక్స్ చిత్రంలో కనిపించనున్నారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022(ఇది చదవండి: గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్.. అభినందిస్తున్న ఫ్యాన్స్)కాగా.. ఈ ఏడాది సైమా అవార్డుల్లో టాలీవుడ్లో నాని హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమనటుడుగా నాని, ఉత్తమనటిగా కీర్తి సురేశ్ నిలిచారు. ఈ రెండు చిత్రాలకు కలిపి వివిధ విభాగాల్లో దాదాపు ఎనిమిది అవార్డులు వచ్చాయి. PRIDE OF KANNADA CINEMA ♥️It’s not kannad ,, it’s KANNADA 💥💥Boss on Fire mode @#SIIMA2024 ♥️#KicchaBOSS #MaxTheMovie#BRBFirstBlood pic.twitter.com/gWTUMik4s9— K R R I I S S H H ™ 𝕏 (@krriisshhtveezz) September 15, 2024 -
గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్.. అభినందిస్తున్న ఫ్యాన్స్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. సుమారు 28 ఏళ్లుగా అక్కడ చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు అందిస్తున్నారు. అందుకు గుర్తింపుగా అందివచ్చిన డాక్టరేట్‌ను ఆయన కాదన్నారు. టాలీవుడ్లో ఈగ సినిమాతో ఇక్కడ వారికి బాగా దగ్గరయిన కిచ్చా సుదీప్ ఆ తర్వాత బాహుబలి సినిమాతో మెప్పించారు. దీంతో గతేడాది విడుదలైన విక్రాంత్ రోణా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆధరించారు.వినోదం, నటనలో నటుడు కిచ్చా సుదీప్ చేసిన సేవలను కర్ణాటకలోని తుమకూరు విశ్వవిద్యాలయం గుర్తించింది. దీంతో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. వీవీ సిండికేట్ సమావేశంలో జరిగిన ఈ చర్చను సుదీప్ పీఏ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సుదీప్ రిప్లై ఇచ్చారు. అయితే, అందివచ్చిన గౌరవాన్ని కిచ్చా సుదీప్ వదులుకున్నారు. యూనివర్శిటీ నిర్ణయం పట్ల సుదీప్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా చెప్పారు. 'సమాజానికి సేవ చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. నాకంటే కూడా వాళ్లే ఎక్కువ చేస్తున్నారు. వారిని గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది. నాకు ఇంకా అంతటి స్థాయి రాలేదు అనుకుంటున్నాను.' అంటూ యూనివర్సిటీ ఇచ్చిన గౌరవాన్ని సుదీప్ నిరాకరించారు. యూనివర్సిటీ స్నాతకోత్సవ విలేకరుల సమావేశంలో తుమకూరు యూనివర్సిటీ ఛాన్సలర్ వెంకటేశ్వర్లు ఈ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి ముగ్గురు గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు. -
Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
స్టార్ హీరో ట్వీట్‌కు సచిన్ రిప్లై.. అదేంటో తెలుసా!
కన్నడ స్టార్ సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళం, కన్నడ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది కబ్జా సినిమాతో అలరించిన కిచ్చా.. ప్రస్తుతం మ్యాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా నెటిజన్ల్తో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా ఆస్క్ కిచ్చా అనే సెషన్లో పాల్గొన్నారు. ఈ సెషన్‌కు హాజరైన పలువురు నెటిజన్స్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఇటీవల సచిన్‌ను కిచ్చా సుదీప్ కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫోటోను షేర్ చేసిన నెటిజన్.. కిచ్చాను ఇలా అన్నారు. సచిన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అన్న ఈ ఫోటో గురించి ఒక్కమాటలో చెప్పండి.. సచిన్‌ను కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది' అని అడిగాడు. దీనికి సుదీప్ రిప్లై ఇచ్చారు. ఈ ఫోటోను చూస్తే 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ.. ఇది నా జీవితంలో మధురమైన జ్ఞాపకం' అంటూ బదులిచ్చారు. అయితే ఈ ట్వీట్ చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం కిచ్చా సుదీప్ రిప్లై ఇచ్చారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు తీసిన మన ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ సచిన్ ట్వీట్ చేశారు. ఇది చూసిన కన్నడ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు సచిన్ రిప్లై ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ట్వీట్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్ సైతం స్పందించారు. 'వావ్.. నేను ఇది ఊహించలేదు... మీరు నాకు మరో మరపురాని క్షణాన్ని అందించారు సార్' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This pic is just looking like a wowwwwwwwww... 😁 One fond memory my friend . https://t.co/y4C1a0LkPi — Kichcha Sudeepa (@KicchaSudeep) January 16, 2024 It was lovely meeting you. Aur uss din kisine hamara ye photo bhi kitna acha KICHCHA tha. Always wishing you good health and happiness in life. 😊 https://t.co/D3o1ZvwOUM — Sachin Tendulkar (@sachin_rt) February 2, 2024 Woaaa!!! ♥️♥️.. Didn't expect this ... You jus gifted me another memorable moment... Mch luv and wshs always @sachin_rt sir. https://t.co/tWXaV8Givs — Kichcha Sudeepa (@KicchaSudeep) February 2, 2024 -
కొద్దిరోజుల్లో 'బిగ్ బాస్' ఫైనల్.. ఆస్పత్రిలో టాప్- 5 కంటెస్టెంట్
బిగ్ బాస్ రియాలిటీ షో భారత్‌లోని దాదాపు అన్ని భాషల్లో ప్రసారం అవుతుంది. ప్రస్తుతం కన్నడలో కూడా ఈ రియాలిటీ షో బిగ్ సక్సెస్ అయింది. తాజాగా ఇందులోని కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రతాప్ ఆరోగ్యంలో మార్పులు రావడంతో ప్రస్తుతం బెంగుళూరులోని ఆర్ఆర్ నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫుడ్ పాయిజన్ వల్ల ప్రతాప్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం డ్రోన్ ప్రతాప్ ఈరోజు బిగ్ బాస్ హౌస్‌కి తిరిగి వస్తాడని బిగ్ బాస్ షో వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 9 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షక్ష.. 10వ సీజన్ ఫైనల్‌కు సిద్ధమైంది. అక్కడ హోస్ట్‌గా కిచ్చ సుదీప్ ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్లో టఫ్ ఫైట్ ఉంటుందని ప్రేక్షకులు ఊహిస్తున్నారు. సీజన్ 10లో ఎవరు గెలుస్తారు? క్యూరియాసిటీ కూడా భారీగా పెరిగింది. టైటిల్ రేసులో డ్రోన్ ప్రతాప్ కూడా ఉన్నాడు. గత వారం బిగ్ బాస్ హౌస్‌కి ప్రతాప్ తల్లిదండ్రులు వచ్చారు. ఆ సమయంలో ఆతను బాగా ఎమోషనల్ అయ్యాడు.. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. కర్ణాటకకు చెందిన ప్రతాప్ భారతదేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన 'డ్రోన్ శాస్త్రవేత్త'గా కూడా కీర్తించబడ్డాడు. 14 ఏళ్ల వయస్సులోనే సుమారు 600కు పైగా డ్రోన్స్ తయారు చేశాడు. అతను జపాన్, ఫ్రాన్స్ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డును గెలుచుకున్నాడు. అతను జర్మనీ, USA లలో డ్రోన్లపై చేసిన పరిశోధనలకు బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. ఒకసారి అతను పాము కాటుకు గురైన ఒక చిన్న అమ్మాయి జీవితాన్ని రోడ్డు మార్గంలో 10 గంటల దూరంలో ఉన్న ప్రదేశానికి యాంటీవినమ్ రవాణా చేసి రక్షించాడు. ఈ దూరాన్ని ఈగిల్ 2.8 డ్రోన్.. దాదాపు 9 నిమిషాల్లో గంటకు 280 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. అలా 10 గంటలు పట్టే సమయాన్ని కేవలం 9 నిమిషాల్లోనే ఆ ఇంజెక్షన్‌ను అందించి ఆ చిన్నారిని కాపాడాడు. అంతేకాకుండా కేరలలో వరదలు వచ్చిన సమయంలో చాలా మందికి ఆహారం,నీళ్లు,మెడిసిన్స్ సరఫరా చేశాడు. అలా అతని పేరు కర్ణాటకలో వైరల్ అయింది. -
స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్!
టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్నాడు. పుష్ప సినిమాలో శీనప్పగా మెప్పించిన సునీల్.. వరుస ఆఫర్లు వస్తున్నాయి. రజినీకాంత్ జైలర్‌లోనూ కీలక పాత్ర పోషించారు. తాజాగా శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. పుష్ప తరహాలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!) ఇప్పటికే పుష్ప సినిమాతో సునీల్ రేంజ్ మారిపోయింది. కమెడియన్ నుంచి పూర్తిస్థాయిలో విలన్ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నారు. అదే క్రేజ్‌తో శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు. కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహాబలిపురంలో జరుగుతోంది. ఇటీవలే సునీల్ ఈ మూవీలో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సునీల్ శాండల్‌వుడ్ ఎంట్రీపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుదీప్ ఆ తర్వాత కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టితో మరో సినిమా చేయనున్నారు. అంతకుముందే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనూ ఆయన పాల్గొననున్నారు. మిశ్రమ స్పందన అయితే సునీల్ ను మ్యాక్స్ లోకి తీసుకోవడంపై కన్నడ సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమాకు సునీల్ అదనపు బలం అవుతాడని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం స్థానికంగా ఉన్న నటులను కాదని.. పక్క ఇండస్ట్రీలో నుంచి నటీనటులను తీసుకొని రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్) Telugu actor Sunil, who impressed pan-India audience with a negative role in Pushpa, has been roped in to play antagonist in @KicchaSudeep #Max#Kichcha #Sudeep #Kichcha46 #Sudeepfans #Kichchafans #Sunil #Pushpa pic.twitter.com/hIgFMMkGWL — Bangalore Times (@BangaloreTimes1) November 3, 2023 -
భలే చాన్స్
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మంచి జోరుమీద ఉన్నారు. ఇటీవల తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించేందుకు శ్రీనిధి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భలే చాన్స్ అందుకున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సరసన నటించను న్నారు శ్రీనిధి శెట్టి. హీరో సుదీప్, దర్శకుడు చేరన్ కాంబినేషన్లో సత్యజ్యోతి ఫిలింస్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు శ్రీనిధి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారట ఈ బ్యూటీ. -
'ఏంటి సార్ కొత్త ఫోనా'.. ఆసక్తి పెంచుతోన్న బిగ్ బాస్ ప్రోమో!
తెలుగువారిని అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటివారం కాస్తా నెమ్మదిగా సాగిన బిగ్‌బాస్ షో.. రెండోవారం నుంచే హాట్‌హాట్‌గా మారిపోయింది. అయితే తెలుగులో ఏడో సీజన్ కాగా.. కన్నడలో బిగ్ బాస్ సీజన్ 10కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. త్వరలో ప్రారంభం కానున్నట్లు ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 2వ తేదీన సుదీప్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మొదటి ప్రోమోలో కిచ్చా కనిపించలేదు. దీంతో మరోసారి స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు. దీంతో త్వరలోనే బిగ్‌బాస్ శాండల్‌వుడ్ అభిమానులకు సందడి చేయనుంది. (ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం! ) సరికొత్తగా ప్రోమో బిగ్ బాస్ ప్రతి సీజన్‌కు విడుదల చేసే ప్రోమోలు కాస్తా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. అందుకు తగ్గట్టుగానే ప్రోమోను రిలీజ్ చేశారు. సరికొత్త "ఏంటి సార్ కొత్త ఫోన్" అని ఓ ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్‌ను అడిగాడు యువకుడు. అవును సార్ నా కొడుకు పండగకి కొనిచ్చాడు. అని చెప్పగానే ప్రోమోలో సుదీప్ కనిపించాడు. ఆ తర్వాత అదే యువకుడు ఆటో ఎక్కి ఇంటికి వెళ్తే.. పండగ మొదలవుతోంది సార్ అంటూ ఆటోడ్రైవర్ నుంచి సమాధానం వస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి వీధి అంతా పండుగలా కనిపిస్తుంది. ఏంటిరా ఇందతా సందడి అని అక్కడి యువకులను అడుగుతాడు. వారంతా ఇది వందరోజుల పండగ అని సమాధానమిస్తారు.' ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 లుక్ చూపించారు. సుదీప్ కనుసైగ చేస్తూ "హ్యాపీ బిగ్ బాస్" త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది అంటూ సుదీప్ ఫోటోను ఆవిష్కరిస్తూ సందడి చేస్తూ కనిపించారు ఫ్యాన్స్. కంటెస్టెంట్స్ ఎవరు? అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ లిస్ట్ లో పది మందికి పైగా పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నప్పటికీ.. కంటెస్టెంట్స్ గురించి అధికారికంగా తెలియరాలేదు. త్వరలోనే ఈ షో ప్రారంభమైన తర్వాతే ఆ క్యూరియాసిటీకి బ్రేక్ పడనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరున షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి) ಊರ ಹಬ್ಬಕ್ಕೆ ಇಲ್ಲಿದೆ ರೀಸನ್; ಶುರುವಾಗ್ತಿದೆ HAPPY 'BIGG BOSS KANNADA' ಹತ್ತನೇ ಸೀಸನ್! #BiggBossKannada #BBK10 #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ @KicchaSudeep pic.twitter.com/qCQkXGkQgI — Colors Kannada (@ColorsKannada) September 14, 2023 -
ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?
యాక్షన్ మాత్రమే కాదు.. కొందరు స్టార్స్‌లో డైరెక్షన్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది. అయితే యాక్షన్ ఫ్రంట్ సీట్.. డైరెక్షన్ బ్యాక్ సీట్లో ఉంటుంది. అందుకే డైరెక్షన్‌కి గ్యాప్ ఇచ్చి, యాక్షన్‌కి మాత్రం నో గ్యాప్ అంటారు. అలా కొందరు హీరోలు డైరెక్షన్ సీట్‌కి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని ‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ అంటున్నారు. కొందరు స్టార్స్ ఇటు కెమెరా వెనకాల డైరెక్షన్ చేస్తూ అటు కెమెరా ముందు యాక్షన్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఆరేళ్లకు... కెరీర్లో 50వ సినిమా అంటే ఏ ఆర్టిస్టుకైనా ప్రత్యేకమే. కోలీవుడ్ హీరో ధనుష్ కూడా తన 50వ సినిమాని చాలా స్పెషల్ అనుకున్నారు. అందుకే తన హాఫ్ సెంచరీ సినిమాలో తానే నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. హీరోగా దాదాపు 30 సినిమాల్లో నటించిన తర్వాత ‘పా. పాండి’ (2017) చిత్రం కోసం తొలిసారి దనుష్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. దీంతో 2019లో దర్శకుడుగా ధనుష్ మరో మూవీని తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. అయితే ఈ ఏడాది జూలైలో తన దర్శకత్వంలోని రెండో చిత్రం సెట్స్‌పైకి వెళ్లినట్లుగా ధనుష్ వెల్లడించారు. ఇలా దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడిగా మరోసారి మెగాఫోన్ పట్టారు. ఇక నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, ఎస్జే సూర్య, విష్ణు విశాల్, వరలక్ష్మీ శర కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్. ఏడేళ్ల తర్వాత... యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకూ అంతే క్రేజ్ ఉంది. ‘ష్..! (1993)’, ‘ఓం (1995)’, ‘ఉపేంద్ర (1999)’ వంటి సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించారు ఉపేంద్ర. కన్నడంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో అనువాదపై, ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే 2015లో వచ్చిన ‘ఉప్పి 2’ తర్వాత దర్శకుడిగా ఉపేంద్ర గ్యాప్ తీసుకున్నారు. ఏడేళ్ల తర్వాత 2022లో ‘యూఐ’ సినిమా వర్క్స్‌ను మొదలు పెట్టారు ఉపేంద్ర. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఉపేంద్ర అండ్ టీమ్ పేర్కొంది. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పదేళ్లకు... కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన సుదీప్ దర్శకుడిగా ఆరు సినిమాలను తెరకెక్కించారు. కానీ ఈ ఆరూ రీమేక్ చిత్రాలే కావడం విశేషం. తమిళ ‘ఆటోగ్రాఫ్’ని కన్నడంలో ‘మై ఆటోగ్రాఫ్’ (2006)గా రీమేక్ చేసి, నటించారు సుదీప్. అలాగే దర్శకుడిగా తెలుగు హిట్ ఫిల్మ్ ‘మిర్చి (2013)’ కన్నడ రీమేక్ ‘మాణిక్య (2014)’లో టైటిల్ రోల్ చేసి, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు సుదీప్. ఈ సినిమా తర్వాత సుదీప్ మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత అంటే... 2024లో సుదీప్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కేకే’ (వర్కింగ్ టైటిల్) సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘దేవుడు క్షమిస్తాడు.. నేను కాదు...!’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథతో సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడిగా ఇప్పటివరకూ రీమేక్ చిత్రాలే చేసిన సుదీప్.. ఈ ఏడవ సినిమాని స్ట్రయిట్ కథతో తీయనున్నారా లేక రీమేకా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ‘ఈగ’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాలతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. పుష్కర కాలం తర్వాత... ‘దిల్ చాహ్ తా హై’ (2001) చిత్రంతో రచయితగా, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు ఫర్హాన్ అక్తర్. ‘డాన్: ది చేజ్ బిగిన్స్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన పేరు సంపాదించారు. అయితే 2011లో వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రం తర్వాత నటుడిగా కాస్త బిజీ అయిన ఫర్హాన్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. పదేళ్ల తర్వాత 2021 ఆగస్టులో ‘జి లే జరా’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఫర్హాన్ వెల్లడించారు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో తన డైరెక్షన్లోనే ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు ఫర్హాన్. అయితే ఈ సినిమాలో ఆయన నటించడం లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇలా ఫర్హాన్ దర్శకత్వంలోని మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి పుష్కరకాలం అంటే పన్నెండేళ్లు పట్టిందని చెప్పొచ్చు. ‘డాన్ 3’ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇలా కొంత విరామం తర్వాత దర్శకులుగా మెగాఫోన్ పట్టిన స్టార్స్ ఇంకొందరు ఉన్నారు. -
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి!
కిచ్చా సుదీప్ ఈ పేరు వింటే చాలా తెలుగువారికి రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ ఏడాది ఆయన నటించిన విక్రాంత్ రోణ అభిమానులను పెద్ద ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల సుమలత అంబరీష్ బర్త్ డే పార్టీలో కిచ్చా సుదీప్ కనిపించారు. ప్రస్తుతం ఆయన కిచ్చా46 చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ రోణ సినిమా తర్వాత కిచ్చా సుదీప్ నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా తన న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కిచ్చా తన ఇన్‌స్టాలో సిక్స్ ప్యాక్‌తో బాడీని ప్రదర్శిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. అయితే ఇదంతా కిచ్చా46 సినిమా కోసమేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం సుదీప్ ఇలా రెడీ అయ్యారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం సుదీప్ తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పైల్వాన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'వర్కవుట్ చేయడం నా సంతోషకరమైన క్షణాలలో ఒకటి. ఇది నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. కిచ్చా46 చిత్రం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం మరో నెల సమయం ఉంది. దానికి ముందే ఈ వర్కవుట్.' అని సుదీప్ రాసుకొచ్చారు. కాగా.. తుపాకి, కబాలి, కర్ణన్, అసురన్‌తో సహా తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలైపులి ఎస్ తాను ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) View this post on Instagram A post shared by KicchaSudeepa (@kichchasudeepa) -
యాక్షన్ హెబ్బులి.. ఆగస్టు 4న తెలుగులో రిలీజ్
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన కన్నడ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’. ఈ సినిమాను అదే టైటిల్‌తో సి. సుబ్రహ్మణ్యం ఆగస్టు 4న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ మిళితమై ఉన్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ ‘హెబ్బులి’. కన్నడంలో రూ. 100 కోట్లు సాధించింది. తెలుగులోనూ హిట్ అవు తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!
కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కిచ్చా సుదీప్‌పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా') దీంతో తనపై కామెంట్స్ చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లపై కిచ్చా సుదీప్ మండిపడ్డారు. అంతేకాకుండా వారిద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు వివాదం ఏంటి? ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుని ఎగ్గొట్టాడని నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని నిర్మాత పేర్కొన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనా చిత్రాల తర్వాత తన సినిమా పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడని.. కానీ సుదీప్ వద్దకు వెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్‌ను నమోదు చేశానని.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని ఎంఎన్ కుమార్ ప్రకటించారు. కాగా.. కిచ్చా సుదీప్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు విజయ్ కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కిచ్చా46 అని టైటిల్ పెట్టగా.. కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
కిచ్చా సుదీప్ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత
కిచ్చా సుదీప్ టాలీవుడ్ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఇటీవల విక్రాంత్ రోణాతో తెలుగులో కూడా మెప్పించాడు. తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) తాజాగా సుదీప్‌పై కన్నడ నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. తన బ్యానర్లో సినిమా చేస్తానని రెమ్యూనరేషన్ తీసుకుని మూవీ చేయకుండా మోసం చేశాడని ఆయన తెలుపుతున్నాడు. ప్రాజెక్ట్ కోసం సుదీప్‌కు రూ. 9 కోట్ల రూపాయలు ఇచ్చానని, కానీ డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని నిర్మాత ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు చేశానన్నారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి ఇద్దరి మధ్య పరస్పరం అంగీకారం కుదిరనట్లు తెలిపాడు. కానీ ఇప్పటి వరకు డేట్స్ కేటాయించడంలో సుదీప్ విఫలమయ్యారని నిర్మాత పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి రెమ్యూనరేషన్ రూ. 9 కోట్లతో పాటు.. మరో రూ. 10 లక్షలు తన వంట గది రెనోవేషన్ కోసం సుదీప్ తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్‌కి అడ్వాన్స్ చెల్లించడంతో పాటు ఈ చిత్రానికి 'ముత్తట్టి సత్యరాజు' అనే టైటిల్‌ను కూడా ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేశామన్నారు. కానీ తమ బ్యానర్లో సినిమా చేయకుండా ఇప్పుడు, ఒక తమిళ నిర్మాతతో సుదీప్ మూవీ ప్రకటించారు. (ఇదీ చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్) తన వద్ద డబ్బు తీసుకున్న తర్వాత ఇప్పటికే వివిధ నిర్మాతలతో సుదీప్ నాలుగు సినిమాలు చేశాడు. కానీ తన బ్యానర్లో చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. దీంతో తాను సుదీప్‌ను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని, అయితే అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్‌కి సమస్యను తీసుకెళ్లానని, అతను మాట్లాడితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ చెప్పారు. -
'ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్'... ఆసక్తిగా టీజర్ ప్రోమో
కిచ్చా సుదీప్ టాలీవుడ్ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయకునిగా నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్ హీరోగా కన్నడ చిత్రం విక్రాంత్ రోణాలో నటించారు. ఈ చిత్రం తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. (ఇది చదవండి: కోలీవుడ్‌లో పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్) తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ది డెమోన్ వార్ బిగిన్స్ ప్రోమో పేరుతో ఈ టీజర్‌ను విడుదల చేశారు. వి క్రియేషన్స్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిచ్చా నేరుగా తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాడీలో బుల్లెట్స్ తీస్తూ మరింత వైల్డ్‌గా కిచ్చా సుదీప్ టీజర్లో కనిపించారు. ఈ టీజర్లో 'యుద్ధాన్ని ఆరంభించే వాడు నాకు నచ్చడు.. యుద్ధానికి భయపడి పారిపోయేవాడు నాకు నచ్చడు. రంగంలో దిగి శత్రువుని వెంటాడి, వేటాడి.. వాళ్లు రక్తంతో పరిగెత్తి పారిపోయేదాన్ని చూసేవాడు నేను.. దిగితే దయ, క్షమా, సంధానం లాంటిది ఏదీ ఉండదు.. ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్..' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కాగా.. ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఇటీవల వరుసగా అసురన్, కర్ణన్, నానే వరువేన్ చిత్రాలు నిర్మించారు. వీటిలో అసురన్, కర్ణన్ చిత్రాలు సూపర్ హిట్ కాగా.. నానే వరువేన్ చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. (ఇది చదవండి: హాలీవుడ్ హారర్ మూవీ ‘ఇన్సిడియస్: ది రెడ్ డోర్’ రిలీజ్ డేట్ ఇదే) -
Karnataka Assembly elections 2023: కిచ్చ సుదీప్ ఎన్నికల ప్రచారం
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలో కిచ్చ సుదీప్ ఎన్నికల ప్రచారం చేసారు. బీజేపీ అభ్యర్థి ధీరజ్ మునిరాజుకు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న ఆయన బీజేపీకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కిచ్చ సుదీప్‌ను చూడడానికి ఆయన అభిమానులు వందల సంఖ్యలో తరలి రావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. -
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తున్న సినీ గ్లామర్
-
ఇంటింటా ‘గాలి’ ప్రచారం
గంగావతి రూరల్: నగరంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా శుక్రవారం కేఆర్పీపీ వ్యవస్థాపకులు, అభ్యర్థి గాలి జనార్దన్‌రెడ్డి మే 10న జరిగే ఎన్నికల్లో పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి, వేయించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన 19, 20, 21వ వార్డులతో పాటు రాయర్ ఓణి. ఉపకార్ ఓణి, గాంధీసర్కిల్, బసవన్న సర్కిల్ మీదుగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలుసుకుని విజ్ఞప్తి చేశారు. నగరంలో మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతిస్తూ ఈ ఎన్నికల్లో మీ విజయం తథ్యం అని ఆశీర్వదించారు. ఈసందర్భంగా వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆ ప్రసారాలు ఆపండి.. కోర్టును ఆశ్రయించిన కన్నడ స్టార్ హీరో!
యశవంతపుర(బెంగళూరు): అపరిచిత వ్యక్తి రాసిన లేఖపై వస్తున్న వదంతులను పత్రికల్లో, టీవీల్లో ప్రసారం చేయరాదని కోరుతూ ప్రముఖ నటుడు సుదీప్ కోర్టు తలుపు తట్టారు. నగరంలో మెయో హాల్లోని కోర్టులో పిటిషన్ వేశారు. అపరిచిత వ్యక్తి రాసిన లేఖలోని వివరాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్‌కోర్టును కోరారు. ఇటీవల సుదీప్ సీఎం బొమ్మైను కలిసి మద్దతు ప్రకటించడం, ఆ వెంటనే నీ ప్రైవేటు వీడియోలను బయటపెడతామని రెండు బెదిరింపు లేఖలు రావడం తెలిసిందే. ప్రాణహాని బెదిరింపులతో పాటు సుదీప్ కుటుంబసభ్యుల పేర్లను అపరిచితులు లేఖలో రాశారు. వీటిపై అనేక రకాలుగా మాధ్యమాలలో వార్తలు వస్తుండగా, వాటిని నివారించాలని ఆయన లాయర్లు కోరారు. మరోవైపు సుదీప్‌కి గన్‌మాన్ రక్షణ కల్పించాలని నిర్మాత మంజు పోలీస్ కమిషనర్‌కు విన్నవించారు. -
కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియో.. అతని పనేనా?
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ వివాదం కర్ణాటక రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ఇటీవల ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే సుదీప్ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది. ‘బీజేపీలో చెరితే నీ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బహిరంగంగా ప్రజలందరి ముందు పెడతాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సుదీప్.. తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఇదంతా చేసింది సుదీప్ కారు డ్రైవరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఓ కారు డ్రైవర్ ను పనిలోనుంచి తీసేశారట సుదీప్. అతనే కక్ష్య పెంచుకొని ఈ పని చేసి ఉంటాడని సుదీప్ అండ్ టీమ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని భావిస్తున్నారు పోలీసులు. అయితే సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని సుదీప్ కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆ కారు డ్రైవర్ పరారీలో ఉండడం.. ఆ అనుమానాలకు మరితం బలం చేకూరినట్లైంది. అతని ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ఆ కారు డ్రైవర్ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. అతను దొరికితేగానీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది. -
సినిమాలకు బ్రేక్.. కిచ్చా సుదీప్ సంచలన నిర్ణయం!
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈగతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఇటీవల కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణతో ప్రేక్షకులను అలరించాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఈ చిత్రం అభిమానుల అంతగా మెప్పించలేకపోయింది. ఇటీవల సుదీప్ నటించిన కబ్జ సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే తాజాగా ఆయన అభిమానులకు ఓ నోట్ విడుదల చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కిచ్చా సుదీప్ నోట్లో రాస్తూ.. ' హాయ్ ఫ్రెండ్స్. కిచ్చా46 గురించి మీ ట్వీట్స్ అండ్ మీమ్స్ చూశా. అలా పిలవడం నాకు కూడా సంతోషంగా ఉంది. దీనిపై మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలచుకున్నా. ప్రస్తుతం నేను స్వల్ప విరామం తీసుకుంటున్నా. ఇది నా మొదటి బ్రేక్. విక్రాంత్ రోణ, బిగ్ బాస్ సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ సమయాన్ని ఆనందంగా ఆస్వాదించాలనుకున్నా. క్రికెట్ కూడా నా లైఫ్‌లో ఓ భాగం. సీసీఎల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ తరఫున మ్యాచులు ఆస్వాదించా. నా సినిమాలకు సంబంధించి మూడు స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వాటిని ఓకే చేశా. ప్రతి రోజు వాటిపై వర్క్ జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే అప్డేట్స్తో మీ ముందుకు వస్తా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. About my Next ❤️🥂 pic.twitter.com/3vkCmS6FBF — Kichcha Sudeepa (@KicchaSudeep) April 2, 2023 -
ఓటీటీకి వచ్చేస్తున్న పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియాశరణ్ హీరోయిన్గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. కేజీఎఫ్, కాంతార హిట్ చిత్రాల్లాగే అలరిస్తుందని ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ‘కబ్జ’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కబ్జ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది: కిచ్చా సుదీప్
కన్నడ హీరో దర్శన్‌పై చెప్పుల దాడిని మరో నటుడు కిచ్చా సుదీప్ ఖండించారు. ఇలా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని అన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఉండి ఉంటే ఇలాంటి చర్యలను సమర్థించేవారా అని ఆయన అభిమానులను సుదీప్ ప్రశ్నించారు. దర్శన్‌పై చెప్పులు విసరడాన్ని ఖండిస్తూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్లో సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. కిచ్చా సుదీప్ ట్విటర్లో రాస్తూ.. 'మన భూమి, భాష, సంస్కృతి అనేది ప్రేమ, గౌరవానికి సంబంధించినది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి వ్యక్తి గౌరవంగా వ్యవహరించడానికి అర్హులు. నేను చూసిన వీడియో నన్ను చాలా కలవరపెట్టింది. ఇంకా చాలా మంది అలాగే సినిమాలోని ప్రముఖ మహిళ కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వారంతా ఈవెంట్లో నిమగ్నమై ఉన్నారు. మీరు వారిని అవమానించారు. ఇలాంటి పనులు చేసింది కన్నడిగులేనా అన్న అనుమానం వస్తోంది.' అని రాసుకొచ్చారు. దర్శన్, పునీత్ అభిమానులకు మధ్య పరిస్థితులు బాగా లేవని నేను అంగీకరిస్తున్నా.. కానీ ఇలాంటి ప్రతిచర్యను పునీత్ స్వయంగా మెచ్చుకుని మద్దతు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..: కాగా దర్శన్ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. కాగా.. దర్శన్ నటించిన చిత్రం క్రాంతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దర్శన్ సరసన రచితా రామ్ నటిస్తోంది. Rebellion isn't always an Answer. ❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0 — Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022 -
విక్రాంత్ రోణ పోస్టర్ పెట్టాలని ఉంది!
‘‘తెలుగు ప్రేక్షకులది మంచి మనసు. వారికి సినిమా నచ్చిందంటే పెద్ద హిట్ చేస్తారు. త్రీడీ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ‘విక్రాంత్ రోణ’తో ఆ ఎక్స్‌పీరియన్స్‌ను మరోసారి చూడబోతున్నారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు నాగార్జున. సుదీప్ టైటిల్ రోల్లో అనూప్ బండారి దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ’. నీతూ అశోక్, నిరూప్ బండారి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. జాక్ మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ – ‘‘సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారు. అందరికీ సుదీప్ నటుడిగా సుపరిచితుడు. సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించిన కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌ను మేం పెడుతుంటాం. ఆ సినిమాల్లో మేం కూడా భాగమయ్యామనే గర్వంతో అలా చేస్తాం. ఇంతకుముందు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ పెట్టాం. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ పోస్టర్ పెట్టాలని ఉంది’’ అన్నారు. ‘‘నేను థియేటర్స్‌లో చూసిన తొలి సినిమా నాగార్జునగారి ‘శివ’. అప్పట్లో సైకిల్ చైన్‌తో కొట్టడం అనేది స్టయిల్‌గా మారిపోయింది. నేనూ సైకిల్ చైన్‌ను బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇక ‘విక్రాంత్ రోణ’ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లోనే జరిగింది. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాల్లో యాక్టర్‌గా నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ‘విక్రాంత్ రోణ’ను కూడా ఆద రించి, హిట్ చేయాలి’’ అన్నారు సుదీప్. ‘‘నాగార్జునగారి ‘గీతాంజలి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఇక నా తొలి స్క్రిప్ట్ సుదీప్గారి కోసమే రాసుకున్నాను. ‘విక్రాంత్ రోణ’ నా ఇరవయ్యేళ్ల కల. సుదీప్గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అనూప్ బండారి. -
హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Response On Hindi Language Controversy: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో వివాదస్పదమయ్యాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ సందర్భంగా ఆమె హిందీ జాతీయ భాష కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: హీరోయిన్ రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా? ఆమె లేటెస్ట్ మూవీ ‘ధాకడ్’ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా మీడియాతో మాట్లాడుతూ హిందీ భాష వివాదంపై స్పందించింది. ‘హిందీ కంటే సంస్కృతం పాతది. సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి. అయితే, హిందీని జాతీయ భాషగా తిరస్కరించడం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే’ అని ఆమె అభిప్రాయపడింది. అయితే మొదట మన భాష, మూలాలు, సంస్కృతి గురించి గర్వపడే హక్కు మనందరికీ ఉందని వ్యాఖ్యానించింది. చదవండి: ‘ఆచార్య’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ మేరకు ఆమె ‘మన దేశం సాంస్కృతికంగా, భాషల వారీగా చాలా వైవిధ్యమైనది. కాబట్టి వాటిని తీసుకురావడానికి మనకు ఒక ఉమ్మడి భాష అవసరం. భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు హిందీని జాతీయ భాషగా చేశారు. నిజానికి హిందీ కంటే తమిళం పాత భాష. కానీ పురాతనమైనది సంస్కృత భాష. కాబట్టి, నా అభిప్రాయం ప్రకారం, సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి కానీ హిందీ కాదు’ అని కంగనా వివరణ ఇచ్చింది. అనంతరం హిందీని జాతీయ భాషగా ఎందుకు ఎంచుకున్నారనేదానికి తన దగ్గర సమాధానం లేదని, కానీ ఇప్పుడు దానిని పాటించకపోతే రాజ్యాంగాన్ని తిరస్కరించినట్లవుతుందని కంగనా పేర్కొంది. -
హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్
హిందీ భాషపై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఆయనకు ఓ వర్గం నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్లో భాగంగా సుదీప్ కేజీయఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత దీంతో సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు. దీంతో అజయ్ దేవగన్ ట్వీట్‌కు సుదీప్ స్పందిస్తూ.. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 అలాగే మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితే ఈ టాపిక్‌ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంత దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ అంటూ సుదీప్ ట్వీట్‌కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది. I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context. Mch luv and wshs to you always. Hoping to seeing you soon. 🥳🥂🤜🏻🤛🏻 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 కాగా సుదీప్.. 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: హిందీ భాషపై కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు..
Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 'ఈగ' సినిమాలో విలన్‌గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు కిచ్చా సుదీప్. ఓ ప్రెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ? Kannada Actor @KicchaSudeep said ,"correct it,Hindi is no more the National Language, its no more a National language"! In a film launch & a huge applause from the crowd & the media. Hope the efforts of Kannada activists are reaching the intended places.👏👏#stophindilmposition pic.twitter.com/qpj06HJseG — ರವಿ-Ravi ಆಲದಮರ (@AaladaMara) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోగా 'ఈగ' విలన్ సుదీప్ టాలీవుడ్ ఎంట్రీ..
‘ఈగ’ ఫేమ్ సుదీప్ ‘కే3 కోటికొక్కడు’ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కే3’. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో గుడ్ సినిమా గ్రూప్‌పై ‘కే3 కోటికొక్కడు’ పేరుతో శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో సుదీప్ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్–సుదీప్ జోడి చూడముచ్చటగా ఉంది. ‘కే3’ చిత్రం కన్నడలో తొలి నాలుగు రోజుల్లోనే 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ చంద్ర, సంగీతం: అర్జున్ జెన్యా. -
కరోనా కల్లోలం.. మరో పాన్ ఇండియా చిత్రం వాయిదా
Sudeep Vikrant Rona Movie Postponed: కరోనా మహమ్మారి కలకలం ఇండియాలో తగ్గట్లేదు. రోజురోజుకీ కేసులు పెరుగుతూ విజృంభణ కొనసాగిస్తుంది. వైరస్ విలయంతో పెద్ద సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా చిత్రాల విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా మరో పాన్ ఇండియా మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. కన్నడ స్టార్ సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'విక్రాంత్ రోణ'. త్రీడీలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకుడు. కరోనా తీవ్రత, పరిస్థితులు, థియేటర్లలో పూర్తిగా లేని ఆక్యుపెన్సీ వంటి నిబంధనల కారణంగా 'విక్రాంత్ రోణ' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలో నటించారు. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. -
ఈఎన్టీ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్
ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన ఈఎన్టీ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. చెన్నైలో జరిగిన లైవ్ సర్జరీలను ఈ సదస్సులో ప్రదర్శించి.. పలు కొత్త అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈఎన్టీ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్, ఎలక్ట్ ప్రెసిడెంట్‌గా రమణ, ఉపాధ్యక్షులుగా రవిశంకర్, కార్యదర్శిగా రమేశ్, జాయింట్ సెక్రటరీగా రవికాంత్, కోశాధికారిగా సాహెల్ హమీద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గిఫ్ట్సన్, గౌడ రమేశ్, వెంకటరత్నం ఎన్నికయ్యారు. -
కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ?
Kicha Sudeep 3D Movie Vikrant Rona Release Date Out: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రధారులుగా అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మంగళవారం విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘మిస్టరీ థ్రిల్లర్‌గా త్రీ డీ టెక్నాలజీతో రూపొందించిన ‘విక్రాంత్ రోణ’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రపంచానికి సరికొత్త సూపర్ హీరోను పరిచయం చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. దాదాపు 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’అని చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో కనిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తూ అంచనాలను పెంచుతూ వచ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన హీరో సుదీప్
బెంగళూరు: ప్రముఖ హీరో కిచ్చ సుదీప్ చెన్నపట్టణ తాలూకా గౌడగెరె గ్రామంలో హల్చల్ చేశారు. శనివారం సతీసమేతంగా సుదీప్ గ్రామంలోని చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవలె గ్రామంలో 65 అడుగుల చాముండేశ్వరిదేవి పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దావాలయం ట్రస్ట్ వారు సుదీప్‌ను ఆత్మీయంగా సన్మానించారు. హీరో సుదీప్‌ను చూడటానికి గ్రామస్థులు ఎగబడ్డారు. -
కన్నడ నాట రెచ్చిపోయిన సుదీప్ ఫ్యాన్స్, కేసు నమోదు
తమ అభిమాన హీరోల పుట్టిన రోజు అంటే చాలు అభిమానులు చేసే రచ్చ అంతాఇంత కాదు. బర్త్‌డేకు పది రోజుల ముందు నుంచే నానా హంగామ చేస్తారు. ఫ్లెక్సీలు, భారీ భారీ కటౌట్స్, కేక్ కంటిగ్, బాణా సంచాలు పేల్చడంతో పాటు రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇక కన్నడ స్టార్ హీరో సుదీప్ బర్త్‌డే(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజున రక్తదానం ఇవ్వడం, బాణ సంచాలు పేలుస్తూ బహిరంగ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అంతేగాక వీధి వీధికి సుదీప్ కటౌట్స్, ఫ్లెక్సీలు కట్టి కేకులు కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. చదవండి: హీరో సూర్య పాట విని కన్నీళ్లు ఆపుకోలేకపోయా: అమితాబ్ అయితే ఈ సారి వారి అభిమానం తారాస్థాయికి చేరింది. ఇటీవల(సెప్టెంబర్ 2) ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు మరింత రెచ్చిపోయారు. బళ్లారి జిల్లాలోని సండూరి తాలూక్ బండ్రి వద్ద సుదీప్ ఫ్లెక్సీ ముందు ఫ్యాన్స్ అంతా బహిరంగంగా చేరి దున్నపోతును బలిచ్చారు. సద్భావన పేరుతో జీవ హింసకు వ్యతిరేకంగా వారు జంతుబలి ఇవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో సుదీప్ ఫ్యాన్స్‌పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: దమ్మున్న దర్శకుడు.. 14 ఏళ్లలో ఐదు బ్లాక్బస్టర్లు -
హెల్త్ ఓకే అంబాసిడర్‌గా..బ్రాండ్ 'బాబు'
న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్‌కైండ్ ఉత్పత్తి చేస్తున్న హెల్త్ ఓకే మల్టీ విటమిన్, మినరల్ ట్యాబ్లెట్లకు సినీ నటులు మహేష్ బాబు, సుదీప్‌ను దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. త్వరలో హెల్త్ ఓకే ట్యాబ్లెట్ల ఉపయోగాలపై మహేష్, సుదీప్‌ల ప్రకటనలు దక్షిణాది ఛానళ్లలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. తద్వారా కస్టమర్లకు మరింత చేరువ అవుతామని మ్యాన్‌కైండ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. హెల్త్ ఓకేతో జతకట్టడంపై ఇరువురు నటులు హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల ప్రచారంతో అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ సేల్స్ మేనేజర్ జోయ్ ఛటర్జీ తెలిపారు. -
హీరో సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : సూపర్‌స్టార్
చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ నటుడు సూర్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూరరై పోట్రు చిత్రం, కథానాయకుడిగా చేసిన సూర్య గురించి మాట్లాడారు. ‘నేను ఇటీవల సూరరై పోట్రు చిత్రం చూశాను. అందులో నటనకు సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అందుకు ఆయన అర్హుడు. నేను కలిసిన అరుదైన నటుల్లో సూర్య ఒకరు. చాలా నిజాయితీ గల వ్యక్తి’ అని అన్నారు. కాగా నటుడు సూర్య నటించి నిర్మించిన చిత్రం సూరరై పోట్రు ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. -
Adipurush: విభీషణుడు, మేఘనాథుడు దొరికేసినట్లేనా?
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. కాగా విభీషణుడి పాత్రకు కన్నడ స్టార్ సుదీప్‌ను, రావణుడి కుమారుడు మేఘనాథుడి పాత్రకు బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లాను సంప్రదించిందట చిత్రబృందం. ‘‘నన్ను ‘ఆదిపురుష్’ చిత్రబృందం సంప్రదించిన మాట వాస్తవమే’’ అని ఇటీవల సుదీప్ ఓ సందర్భంలో వెల్లడించారు. అలాగే ‘బిగ్ బాస్’ ఫేమ్ సిద్ధార్థ్ శుక్లాకు ‘ఆదిపురుష్’ సినిమా మంచి అవకాశం అని, సో.. ఈ ప్యాన్ ఇండియన్ మూవీలో నటించే చాన్స్‌ని సిద్ధార్థ్ వదులుకోడని బీ టౌన్లో వార్తలు వస్తున్నాయి. మరి.. విభీషణుడిగా సుదీప్, మేఘనాథుడిగా సిద్ధార్థ్ శుక్లా కనిపిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. చదవండి: బాలీవుడ్ రీమేక్.. బెల్లంకొండ బ్రదర్‌తో కృతిశెట్టి? -
కంటెస్టెంట్లకే షాక్: బిగ్‌బాస్ షో క్యాన్సిల్
ఎంతో ఉత్కంఠతో కొనసాగుతున్న బిగ్‌బాస్ రియాల్టీ షోపై కరోనా పడగ విప్పింది. వాస్తవంగా గతేడాది ప్రారంభం కావాల్సిన కన్నడ బిగ్‌బాస్ షో క్యాన్సిల్ సీజన్-8 ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత విశేష ప్రేక్షకాదరణతో షో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దేశంలో అత్యధికంగా కరోనా వ్యాపిస్తున్న రాష్ట్రంగా కర్నాటక నిలిచింది. దీంతో ఆ కరోనా ప్రభావం బిగ్‌బాస్ షోపై కూడా పడింది. వాటితోపాటు ఈ షోను హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్ అనారోగ్యం బారిన పడ్డాడు. కొన్నాళ్లు షోకు కూడా రాలేదు. అయినా కూడా షో విరామం లేకుండా కొనసాగింది. అయితే కరోనా కల్లోలం సృష్టిస్తుండడంతో కర్నాటకలో లాక్డౌన్ విధించారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో షో కొనసాగించడం కొంత ఇబ్బందికరంగా మారింది. కంటెస్టెంట్ల ఆరోగ్యం దృష్ట్యా వారిని ఇళ్లకు పంపించేసి ఈ షోను అర్ధాంతరంగా ప్రకటించారు. 71 రోజుల పాటు షో కొనసాగింది. చివరకు 8 మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. వంద రోజుల షో 29 రోజులు మిగిలి ఉండగానే రద్దయ్యింది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లు కూడా షాకయ్యారు. కలర్స్ ఆధ్వర్యంలో ఈ షో కొనసాగింది. ప్రశాంత్ సమ్ బర్గీ, అరవింద్ కేపీ మధ్య ట్రోఫీ పోరు కొనసాగుతోంది. వైష్ణవి, శమంత్, దివ్య సురేశ్ టాప్ 5 రేసులో ఉన్నారు. ట్రోఫీ లేకుండానే షో ముగిసింది. అయితే కొన్ని రోజులకు షో విజేతను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాకపోతే వారికి బహుమతులు, ట్రోఫీ ప్రదానం పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నిర్వహించనున్నట్లు సమాచారం. చదవండి: రేపు కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్ చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ -
రామ్ చరణ్‌ను ఢీ కొట్టే విలన్‌గా కన్నడ స్టార్!
పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు సుదీప్. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా చేస్తుంటారు. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. తాజాగా సుదీప్ మరో పాత్రకు ‘యస్’ చెప్పారట. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సుదీప్‌ను సంప్రదించారట శంకర్. అది విలన్ పాత్ర అని కోలీవుడ్ టాక్. సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకున్న సుదీప్ ప్రస్తుతం విక్రాంత్ రోణ సినిమా చేస్తున్నాడు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల కానుంది. చదవండి: సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం -
‘సాహో’ డైరెక్టర్‌తో కన్నడ స్టార్ హీరో సుదీప్ మూవీ!
కన్నడ స్టార్ హీరో సుదీప్, తెలుగు యువదర్శకుడు సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి శాండిల్‌వుడ్ వర్గాలు. ఇటీవల బెంగళూరు వెళ్లి సుదీప్‌కు ఓ కథ చెప్పారట సుజిత్. ఈ స్టోరీ లైన్ సుదీప్‌కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌తో రావాల్సిందిగా సుజిత్‌ను కోరారని సమాచారం. మరి... ఎస్ (సుదీప్) అండ్ ఎస్ (సుజిత్) కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా? వేచి చూడాలి. ఇదిలా ఉంటే తెలుగులో శర్వానంద్‌తో ‘రన్ రాజా రన్’, ప్రభాస్‌తో ‘సాహో’ చిత్రాలు తెరకెక్కించారు సుజిత్. ‘సాహో’ తర్వాత సుజిత్ ఓ హిందీ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. మరి.. సుదీప్తో చేయనున్నది ఆ చిత్రమేనా? లేక కన్నడంలో ఏమైనా ప్లాన్ చేశారా? ఈ రెండూ కాకుండా తెలుగులో స్టార్ హీరోతో తీయబోయే సినిమాలో సుదీప్‌ని కీలక పాత్రకు అడిగారా? అనేది తెలియాల్సి ఉంది. -
సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం
కన్నడ నటుడు సుదీప్ తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. అనూప్ భండారి దర్శకత్వంలో జాన్ మంజునాథ్, శాలినీ మంజునాథ్ నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్ క్రియేట్ చేసిన సుదీప్ ‘విక్రాంత్ రోణ’తో సరికొత్తగా పరిచయం అవుతున్నారు. బూర్జ్ ఖలీఫాలో ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం చుట్టారు. ఇండియన్ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టమిది. ఈ వేడుక కోసం 2000 అడుగుల ఎత్తున్న సుదీప్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ కటౌట్‌తో సుదీప్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్. -
సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం
యశవంతపుర: లాక్‌డౌన్‌ను సడలించటంతో కరోనా రోజురోజుకు బెంగళూరు నగరంలో పెరిగిపోతోంది. ప్రముఖ హీరో సుదీప్ నివాసం ఉంటున్న హొసకెరెహళ్లిలోని రోడ్డు మార్గంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని సీల్‌డౌన్ చేశారు. ఇప్పుడు దర్శన్ భార్య విజయలక్ష్మీ, మరో నటుడు రవిశంకర్‌గౌడ ఉంటున్న అపార్ట్మెంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రవిశంకర్‌గౌడ ఫేస్బుక్లో పోస్టు చేశారు. తన పిల్లలను దేవుడే కాపాడాలని ఆయన వేడుకొన్నారు. ఇక ఇంటి వాకిళ్లను 14 రోజుల పాటు తెరవటానికి సాధ్యం కాదని పోస్టులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుదీప్, గణప, సైజన్‌లు పిల్లలను తీసుకొని తమ ఇంటికి రావాలని ఫేస్బుక్లో పోస్టు చేశారు. హొసకెరెహళ్లిలో ఒక అపార్ట్మెంట్లో వీరు నివాసం ఉండగా, వీరితో పాటు దర్శన్, పూజా గాంధీలు అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మికి కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వదంతులను ఆమె కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బెంగళూరులో కరోనా కేసులు రావడంతో ఓ ప్రాంతంలో సీల్‌డౌన్ చేసిన దృశ్యం మంత్రి బావమరిదికి పాజిటివ్ రాష్ట్ర వైద్యా విద్యాశాఖ మంత్రి సుధాకర్ ఇంట్లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన బావమరిదికి గురువారం పాజిటివ్‌గా వెల్లడైంది. ఇప్పటికే ఆయన ఇంట్లో వంట మనిషి, తండ్రి, భార్య, కూతురు కరోనాతో చికిత్స పొందుతుండడం తెలిసిందే. బావమరిదిని కలిసిన ఒక స్నేహితునికి సైతం కరోనా సోకింది. దీనితో ఆరోగ్యశాఖ అధికారులు వీరితో కలిసిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. -
సుదీప్‌కు జోడీ
సౌత్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్. తాజాగా కన్నడలో మరో సినిమాకు సై అన్నారీ బ్యూటీ. సుదీప్ హీరోగా ‘రంగితరంగ’ ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో ‘ఫాంటమ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శ్రద్ధాను కథానాయికగా తీసుకున్నారని శాండల్‌వుడ్ టాక్. యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో శ్రద్ధా కూడా సై అన్నారట. కన్నడ ‘యు టర్న్’తో నటిగా మంచి ఫేమ్ సంపాదించుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నాని ‘జెర్సీ’ చిత్రంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. -
నివేదితను పెళ్లాడిన చందన్ శెట్టి
మైసూరు: కన్నడ బిగ్‌బాస్ 5వ సీజన్ విన్నర్, కన్నడ ప్రముఖ ర్యాపర్ గాయకుడు చందన్‌శెట్టి, నివేదితా గౌడ బుధవారం మూడుముళ్లతో ఒక్కటయ్యారు. మైసూరులోని హుణసూరు రోడ్డులో ఉన్న హినకల్‌లోని ఫంక్షన్ హాల్లో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. నివేదితా తల్లిదండ్రులు హేమా, రమేష్, దంపతులు, చందన్‌శెట్టి తల్లిదండ్రులు ప్రేమలతా, పరమేష్‌లు, బంధుమిత్రులు, పలువురు సినీనటులు కొత్త జంటను ఆశీర్వదించారు. కన్నడ ప్రముఖ సినినటుడు పవర్ స్టార్ పునిత్ రాజ్‌కుమార్ దంపతులు కొత్త జంటను ఆశీర్వదించారు. చందన్‌శెట్టి మాట్లాడుతూ ‘పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. ఇక పైన నాతో పాటు నా భార్య నివేదితా కూడా ఉంటుంది’ అని సంతోషంగా తెలిపారు. వధువు నివేదితా గౌడ మాట్లాడుతూ తన జీవితంలో చాలా గొప్ప రోజు అని, ఈ శుభదినాన్ని ఎప్పుడు కూడా మరిచిపోనని అన్నారు. సుదీప్.. జూదం ఆడమంటావా? ప్రముఖ నటుడు సుదీప్ ఇస్పేట్ జూదం ప్రకటనల్లో కనిపించటంపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. జూదాన్ని సుదీప్ ప్రోత్సహించేలా చేస్తున్నట్లు ఆరోపిస్తూ వివిధ కన్నడ సంఘలు బుధవారం బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. జూదం ఆడండి, డబ్బులు సంపాదించండి అని ఆన్లైన్లో సుదీప్ ప్రకటనలు చేయడం తగదన్నారు. యువతను తప్పుదారి పట్టించేలా ఉందని, ఆయన కన్నడ సినిమాల నుండి నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ ఇలాంటి ప్రకటనల్లో నటించడం సబబు కాదని హితవు పలికారు. -
శింబు సినిమాలో విలన్‌గా సుదీప్
ఇటివలే విడుదలైన సల్మాన్‌ఖాన్ దబాంగ్-3 సినిమాలో కన్నడ హీరో సుదీప్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సుదీప్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే సుదీప్ మరోసారి విలన్‌గా నటించనున్నాడు. కాకపోతే ఈసారి తమిళ్ సినిమాలో ఆ పాత్రను చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే.. శింబు హీరోగా 'మానాడు' అనే సినిమా చేస్తున్నట్లు 2018లోనే వెంకట్ ప్రభు వెల్లడించారు. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న సురేశ్ కామట్జి, శింబుల మధ్య మనస్పర్థలు రావడంతో నిర్మాణ దశలోనే ఈ చిత్రం ఆగిపోయింది. శింబు తండ్రి, సినీ దర్శకుడు టి. రాజేందర్ జోక్యంతో ' మానాడు' సినిమాను చేస్తున్నట్లు వెంకట్ ప్రభు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత సురేశ్ కామట్జి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్‌గా నటించాలని దబంగ్-3 షూటింగ్ సమయంలోనే సుదీప్‌ను అడిగామని ప్రొడ్యూసర్ సురేశ్ కామట్జి తెలిపారు. స్టోరీ విన్న సుదీప్ వెంటనే ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పొలిటికల్ బాక్డ్రాఫ్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిగతా పాత్రలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. కాగా సుదీప్ గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' సినిమాలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
ఒక్క హౌస్‌ఫుల్ చాలు అనుకున్నా
ఎక్కువ ఊహించుకుంటే.. తక్కువగా కోరుకోలేం. సుదీప్ ఊహలకు రెక్కలు కట్టుకునే మనిషి కాదు. అందుకే ఏనాడూ.. తక్కువైందని బాధపడే అవసరం రాలేదు. అవసరం ఎందుకు రాలేదంటే ఎక్కువగా కోరుకోలేదు! ఒక్క హౌస్ ఫుల్ ఉంటే చాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. కన్నడలో ఇప్పుడు స్టార్ హీరో! స్టార్ కాకపోయుంటే? అసలు హీరోనే అవకపోయుంటే? కనీసం కాఫీ కప్పులైనా అందిస్తుండేవారట! అంతిష్టం.. సుదీప్‌కి సినిమా అంటే. ప్రస్తుతం ‘దబాంగ్ 3’లో యాక్ట్ చేస్తున్నారు. ఆ విశేషాలకేం గానీ.. సుదీప్‌లో ఇంకో సుదీప్‌ని కనిపెట్టింది ‘సాక్షి’! ఆ ఇంకో సుదీప్ ఎవరో చదివి మీరూ కనిపెట్టండి. మీరు జిమ్ చేయరని, యోగా మీద ఆసక్తి లేదని విన్నాం. కానీ ఈ మధ్య విడుదలైన ‘పహిల్వాన్’ కోసం జిమ్ చేశారట? ఫిట్నెస్ అంటే జిమ్, యోగా మాత్రమే కాదు. జాగింగ్, స్పోర్ట్స్ వల్ల కూడా ఫిట్‌గా ఉండొచ్చు. అలా నేనెప్పుడూ ఫిట్‌గా ఉన్నాను. నాకిష్టం లేకపోయినా ‘పహిల్వాన్’కు జిమ్ చేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్ నాకు కొత్త కాదు కానీ జిమ్ కొత్తగా అనిపించింది. మరి జిమ్ వల్ల కొత్తగా అలవర్చుకున్న విషయాలేమైనా? మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్రపోవడం వల్ల కోరుకున్నట్టుగా బాడీ మారిపోతుంది. బ్యాలెన్స్‌తో ఉంటాం. నేను 89 ఉండేవాణ్ణి. ఇప్పుడు 74 కేజీలు ఉన్నాను. చాలా తేలికగా అనిపిస్తుంది. నా డ్రెస్‌లన్నీ మారిపోయాయి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అయితే నేను జిమ్‌కి ఎందుకు దూరంగా ఉంటానంటే.. రోజూ ఒకే టైమ్‌కి నిద్రలేవాలి. ఒక టైమింగ్ ప్రకారం జిమ్ చేయాలి. అది నాకు కష్టంగా ఉంటుంది (నవ్వుతూ). అదే స్పోర్ట్స్ అనుకోండి మన ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోవచ్చు. బరువు తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అన్నారు. బరువుకి, కాన్ఫిడెన్స్‌కి సంబంధం ఏటి? స్లిమ్‌గా ఉంటే స్క్రీన్ మీద సన్నివేశం కోసం షర్ట్ తీయాల్సి వచ్చినప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటాం. ఒక ఆర్టిస్ట్‌గా ఇలాంటి సీన్స్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. నా సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. నా బలం నా విజయాలు. దానికి మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? ఆ సంగతి అలా ఉంచితే ఫిట్నెస్ అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. మెదడు షార్ప్‌గా ఉన్నట్టే బాడీ కూడా ఫిట్‌గా ఉంటే ప్లస్. ‘స్లిమ్’గా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. లావుగా ఉన్నవాళ్లను కొందరు ‘బాడీ షేమింగ్’ చేస్తుంటారు. దాని గురించి? బాడీ షేమింగ్ తప్పు. అది ఆ మాటలు పడేవాళ్ల పర్సనాలిటీ కంటే షేమింగ్ చేసేవాళ్ల పర్సనాలిటీ ఏంటో చెబుతుంది. బరువుగా ఉన్నారే అనుకుందాం. వాళ్లకి ఏ ఇబ్బందీ లేకుండా ఉన్నప్పుడు మధ్యలో నీ సమస్య ఏంటి? అంత కఠినంగా ఎందుకు వాళ్లను హేళన చేయాలి. మనలోనే బోలెడు తప్పులు ఉంటాయి. బాడీ ఫిట్‌గా ఉండొచ్చు. కానీ బ్రెయిన్ సరిగ్గా లేకపోవచ్చుగా? మనం కామెంట్ చేసేవాళ్లకు ఫిట్ బాడీ లేదేమో. ప్రపంచంలోనే బెస్ట్ బ్రెయిన్ ఉంటే? అప్పుడు వాళ్లకన్నా మనం తక్కువే కదా. ప్రస్తుతం నా బాడీ ఫిట్‌గా ఉండటం నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ సార్‌తో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాను. ఇద్దరం షర్ట్ లేకుండా ఓ ఫైట్ సీన్ ఉంది. ‘పహిల్వాన్’ కోసం ఫిట్‌గా మారడం వల్ల ఆ ఫైట్ చేయగలి గాను. íసినిమా యాక్టర్‌ని కాబట్టి నేను స్లిమ్‌గా ఉండటం అవసరం. అదే బయటివాళ్లు లావుగా ఉండి, వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోతే వాళ్లు కాన్ఫిడెన్స్‌గా ఉండొచ్చు. ఆరోగ్యానికి మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? అయితే నా ఉద్దేశం ఏంటంటే.. మనిషిగా ఉన్నంతకాలం వేరేవాళ్లను కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మనిషి అంటేనే ఏదో ఓ వీక్నెస్ ఉంటుంది. అందుకే మనం మనుషులం. దాన్ని కవర్ చేసుకు నేంత తెలివిని మనకు దేవుడు ఇచ్చాడు. ప్రతి దశను ఎంజాయ్ చేస్తూ, సూపర్ స్టార్ స్టేజ్‌ని చేరుకునే క్రమంలో మీరు ఎన్ని చేదు అనుభవాలను దాటారు? ఒక్క హౌస్‌ఫుల్ ఉంటే చాలు అని నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్లో 15 మంది ఉన్నారు సుమారుగా. ఆల్రెడీ రెండు మూడు సినిమాలు ఆగిపోయాయి కూడా. అయితే నిరాశపడలేదు. ఎందుకంటే లక్ష్యం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి. మనం కూడా ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఆలోచనల్ని ఎదగనిస్తూనే ఉండాలి. ప్రస్తుతం ఉన్న మూమెంట్లో ఉండటం నేర్చుకోవాలి. ప్రస్తుతంలో బతకలేనప్పుడు మన జీవితాల్లో గ్రోత్ ఎక్కడ ఉంటుంది? అందుకే అప్పటి ఆ చేదు అనుభవాలను నన్ను నేను ముందుకు పుష్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. సంతోషం ఎక్కడో లేదు. మనలోనే ఉంటుంది. వేరే వాళ్లలో వేరే వస్తువుల్లో వెతికితే ఫూల్స్ కిందే లెక్క. మీ మాటలన్నీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.. బహుశా అనుభవాలు నేర్పించిన పాఠాలేమో? అవును. టైమ్ ప్రతీది మనకు నేర్పిస్తుంది. అయితే ఆ టైమ్‌కి జరగాల్సినవి జరుగుతున్నప్పుడు ఆ మూమెంట్లో లేకపోవడం వల్ల గతంలో నేను చాలా విషయాలను మిస్ అయ్యాను. మా పాప ఎదగడాన్ని నేను గ్రహించే ముందే ఎదిగిపోయింది. సడెన్‌గా చూస్తే.. మన పాప ఇంత పెద్దది అయిపోయిందా అనిపిస్తుంది. నటుడిగా బిజీ అయిపోయి పాప ఎదిగే క్రమాన్ని ఆస్వా దించలేదు. మన మూమెంట్‌ని ఎంజాయ్ చేయడం ముఖ్యం అని ఆ తర్వాత తెలిసింది. హౌస్‌ఫుల్స్, వరుస బ్లాక్‌బస్టర్స్ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఏదీ ఆశించడంలేదు. ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఇదే మన ఆఖరి రోజు అని ఫీల్ అయి పని చేయడమే. ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆఖరి రోజే అవుతుంది. నేను హీరో అవ్వాలనుకున్నాను. అసాధ్యం అన్నది చాలామంది అభిప్రాయం. కానీ అయ్యాను కదా (నవ్వుతూ). నన్ను నేను నమ్మాను. ప్రయత్నించాను. అయ్యాను. నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాల్లో ఉండాలనుకున్నాను. యాక్సిడెంటల్‌గా హీరో అయ్యాను. ఒకవేళ హీరోక ఆకపోయి ఉంటే.. సినిమా స్టూడియోల్లో కాఫీలు ఇస్తూ అయినా ఉండేవాణ్ణి. సినిమా అంటే అంత ఇష్టం. టాలెంట్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లు ఇక్కడికి రాలేకపోయారు. నేను వచ్చాను కదా. ఇంకా ఏం కోరుకోవాలి? మనం వచ్చాం అని ఆనందం వేస్తుంది, భయం కూడా వేస్తుంది. సినిమాల్లో రఫ్‌గా కనిపించే సుదీప్‌కి భయమా? (నవ్వుతూ) భయమే ఒక మనిషిని కాన్ఫిడెంట్‌గా మార్చుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ భయాన్ని అధిగమించాలని కష్టపడుతుంటాం. నా ఇవాళ్టి భయాలు రేపటికి నా భయాలు కావు. ఎందుకంటే రేపు ఉదయానికల్లా దాన్ని అధిగమించేసి ఉంటాను కాబట్టి. అందరూ అలా ఆలోచించాలని కోరుకుంటాను. లేకపోతే జీవితాంతం పరిగెట్టడమే. ఎంతకాలం పరిగెడతావు? ప్రయత్నించు. ఒకటి అది నిన్ను ఓడించాలి లేదా నువ్వు దాన్ని ఓడించాలి. అంతేకానీ చేస్తే ఏమవుతుందో అనే ఆలోచనల్లో ఉండిపోకూడదు. కొన్ని టిని అంగీకరించాలి, కొన్నిటిని అధిగమించాలి. అవునూ.. మీరు పుట్టినరోజు (సెప్టెంబర్ 2)లు చేసుకోరట? కారణం ఏంటి? ఒకప్పుడు చేసుకునేవాడిని. ఆ తర్వాత అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆపేశాను. నాక్కూడా మొదట్లో నా బర్త్‌డేను చాలామంది మధ్యలో జరుపుకోవాలని, పాపులర్ అవ్వాలి అని, పూలమాలలు, కటౌట్స్ ఏర్పాటు చేయాలనీ ఉండేది. అదంతా ఓ ఫేజ్. ఓ రోజు నా బర్త్‌డే హంగామా అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పాప రోడ్డు మీద పడిపోయిన కేక్ ముక్కను ఏరుకొని తినడం కనిపించింది. ఆ దృశ్యం నన్ను చాలా బలంగా తాకింది. నాక్కూడా ఓ కూతురు ఉంది. నా లగ్జరీ ఒకరికి ఒక పూట తిండి. ఇక కేక్ కటింగులు, కటౌటులు వద్దనుకున్నా. ఫ్యాన్స్‌కి కూడా చెప్పాను. ఆ తర్వాతి సంవత్సరం ఇంట్లో లేకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాను. చాలా మంది తిట్టారు. కోపగించుకున్నారు. అంత దూరం నుంచి నీ ఇంటికి వస్తే ఇంట్లో లేకుండా వెళ్లిపోతావా? అన్నారు. అవన్నీ తీసుకున్నాను. రెండు రోజులు వాళ్లను తిట్టనిచ్చాను. ఆ తర్వాత ఓ వీడియో నా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ‘నన్ను సంతోషపెట్టడానికే మీరు ఇక్కడికి వస్తే నా కోసం ఏదీ తేవద్దు. అవన్నీ తీసుకొస్తానంటే నేను కలవను. అంతగా ఇవ్వాలనుంటే ఓ కేక్ కొని మీ వీధిలో వాళ్లకు పంచండి. నన్ను ప్రేమిస్తే అలా చేయండి అన్నాను. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ తర్వాత అర్థమయింది. ఫ్యాన్స్ అందరూ మంచి పనులు చేయడం గమనించాను. ఒక్క రోజా పువ్వు కూడా తేలేదు. జీవితంలో ఒక స్టేజ్‌కి వచ్చాక పూలమాలలు, కటౌట్లు మనల్ని ఎగ్జయిట్ చేయవు. నేను అద్భుతాలు చేయలేకపోవచ్చు. కానీ నాకు ఉన్న దానిలో నాకు చేతనైనంత చేయగలను. నాకోసం వృథా ఖర్చు చేయడం మానేశాను. నా దగ్గర ఉండేవన్నీ 200, 300 ఖరీదు గల వస్తువులే. నా బట్టలు కూడా అంతే. 200, 300 టీషర్ట్స్ వేసుకుంటాను. మీ భార్య, మీ పాప ఏమీ అనరా? నా వైఫ్ చాలా స్వీట్. నా కూతురు కూడా సింపుల్‌గా బతకడానికే ఇష్టపడుతుంది. చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటుంది. లగ్జరీ లైఫ్ పట్ల ఆసక్తి చూపించదు. ఇద్దరూ సంప్రదాయాలకు విలువ ఇస్తారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై... ఇలా ఎక్కువ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏదో ఒకరోజు ప్రతి ఒక్క హీరో ఆడియన్స్‌కి బోర్ కొడతారు. ఏదో ఒకరోజు ప్రతి హీరో వెనక్కి వెళ్లక తప్పదు. అలాంటప్పుడు మనకు పని ఉన్నప్పుడు వదులుకోకూడదు. నేను కష్టపడుతున్నాను అని అనుకోకూడదు. ఇష్టపడుతూ పని చేసినప్పుడే పనిని ఎంజాయ్ చేయగలం. వరుసగా పది ఫ్లాప్‌లు వచ్చినా ఓ హీరోకి ఏం కాదు. కానీ నీ కోసం ఎవరూ స్టోరీ రాయకపోతే మన పని అయిపోయినట్లే. మన కోసం ఎవరూ స్టోరీ రాయడం లేదని తెలిసినప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఒకరు ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు యాక్టింగ్ విషయంలో నీ పేరు ఒక్కసారి అయినా వారి ఆలోచనల్లోకి వచ్చి పోవాలి. దాని అర్ధం ఏంటంటే ప్రతి పాత్రకు నువ్వు సూట్ అవుతావని. అయితే ఒక్క విషయం ఏంటంటే.. నేను ఇండస్ట్రీకి ఖాళీగా వచ్చాను. సో.. నేను దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. కన్నడంలో స్టార్ హీరో అనిపించుకుని, తెలుగు ‘ఈగ’లో విలన్‌గా చేసిన అనుభవం గురించి? ఆ సినిమా ప్రాసెస్‌ను ఎంజాయ్ చేయకుండా అయ్యో ఈ సినిమాలో మనం హీరో కాదు... వెంటనే తెలుగులో హీరోగా పెద్ద సినిమా చేయాలి అని ఆలోచిస్తే కుదరదు. టిఫిన్ తినడానికి కూర్చుని దాన్ని ఆస్వాదించకుండా లంచ్‌కి ఆలోచిస్తున్నట్టుంటుంది. ఇడ్లీలు వడ్డించగానే ‘ఆ లంచ్ ఏంటి? అంటే.. ఆ ఇడ్లీ తయారు చేయడానికి నీ భార్య, తల్లి లేక వేరే ఎవరో ఎంతో కష్టపడి ఉంటారు. దాన్ని తయారు చేయడానికి ఉదయాన్నే వాళ్లు నిద్రలేచి చేస్తే, దాన్ని ఆస్వాదించకుంటే వాళ్లను గౌరవించనట్టే లెక్క. మీరు మీ వీక్నెస్లను ఎలా కవర్ చేసుకుంటారు? నేను లుక్స్ పరంగా ది బెస్ట్ కాకపోవచ్చు. నా కంటే లుక్స్‌లో అద్భుతంగా ఉండేవాళ్లు ఉండొచ్చు. కానీ నేనెక్కడున్నా నా ప్రెజెన్స్ తెలిసేంత కాన్ఫిడెంట్‌గా ఉండగలను. మనకంటే బెస్ట్ వాళ్లతో పోల్చుకుని బాధపడటం ఎందుకు? బెటర్‌గా మారేందుకు కష్టపడదాం. అన్నీ అరచేతిలో ఉండి కూడా ఇంకా ఏదో కావాలని ఏడుస్తాం. అది పర్సనాలిటీ డిజార్డర్. ఆ వీక్నెస్ ఉంటే కష్టం. లక్కీగా నాకది లేదు. నాతో నన్ను పోల్చుకుని బెటర్ అవడానికి ట్రై చేస్తుంటాను. ఇతరులను పట్టించుకోను. – డి.జి. భవాని -
నా ఓపికను పరీక్షించొద్దు : హీరో
బెంగళూరు : ‘నేను, నా స్నేహితులు చేతికి వేసుకునేది కంకణం. గాజులు కాదు’ అని బహుభాషా నటుడు కిచ్చ సుదీప్ ప్రకటించారు.తనపైన కుట్రలు చేస్తున్నవారు ఇంక కొన్నిరోజులు మాత్రమే ప్రశాంతంగా నిద్రపోతారని, మరోసారి ట్విట్టర్లో గొడవల జోలికి రావద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు. ప్రస్తుతం శ్యాండల్‌వుడ్‌లో జరుగుతున్న స్టార్‌వార్ తీవ్రస్థాయికి చేరడంతో సుదీప్, మరో హీరో దర్శన్ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా యుద్ధం ఆ తారలనూ తాకింది. సుదీప్ హీరోగా తాజాగా విడుదలైన పైల్వాన్ సినిమాను వీరేష్ అనే యువకుడు ఇంటర్నెట్లో పెట్టడంతో పాటు తాను హీరో దర్శన్ అభిమానిని అని ప్రకటించుకున్నాడు. మా శ్రమను వృథా చేస్తున్నారు తన సినిమా నెట్లోకి రావడంతో సుదీప్ ట్విట్టర్లో భగ్గుమన్నారు. ‘నాకు సినిమాలు వదిలేస్తే మరో పని ఏమీ లేదు. అందుకే మౌనంగా ఉన్నాను. నా మౌనానికి పరీక్ష పెడుతున్నారు. ఇంత మంచి సినిమాను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా తననే కాదని పైల్వాన్ సినిమా కుటుంబసభ్యులు పడిన కష్టం మొత్తం వృథా చేస్తున్నారు. దీని వెనకల ఎవరి కుట్ర ఉందో నాకు తెలుసు. ప్రస్తుతం వారు ప్రశాంతంగా నిద్రపోతుండవచ్చు. కానీ ముందురోజుల్లో నిద్రపోనివ్వను’ అని హెచ్చరించారు. పైల్వాన్ వీడియోలను పెట్టి సినిమా కలెక్షన్లను తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇరు హీరోల అభిమానులు పరస్పరం సోషల్ మీడియాలో విమర్శలకు దిగుతున్నారు. అభిమానులకు మద్దతుగా హీరోలు కూడా యుద్ధంలోకి దిగితే శాండల్‌వుడ్‌కు సెగలు తప్పవు. -
నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్ హీరో
బెంగళూరు : నా అభిమానుల జోలికి రావద్దని, వారిపట్ల ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తే ఊరుకునేది లేదని హీరో దర్శన్ హెచ్చరించారు. సుదీప్ నటించిన పైల్వాన్ సినిమా విషయంలో నటుడు దర్శన్, సుదీప్ అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఈ విషయం నటుల వరకు చేరింది. దీంతో దర్శన్ తన అభిమానులను ఎవరిని ఏమి అనొద్దని ట్వీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరి నటుల మధ్య, అభిమానుల మధ్య సోషల్ వార్ మొదలైంది. సుదీప్ నటించిన పైల్వాన్ సినిమాను దర్శన్ అభిమానులు పైరసీ చేసి సినిమాను నడవకుండా చేస్తున్నారని సుదీప్ అభిమానులు దర్శన్ అభిమానులపైన ఆరోపణలు చేస్తున్నారు. దర్శన్ ట్వీట్‌ను చూసిన సుదీప్ అభిమానులు కూడా ఎక్కడ తగ్గకుండా సమాధానం ఇచ్చారు. దర్శన్ మీరు మీ అభిమానులను అన్నదాతలు, సెలబ్రెటీలు అని పిలిస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషం, ఈ విషయంలో అభిమానులుగా తాము కూడా చాలా గర్వపడుతున్నాము. అయితే మీ అభిమానులు వేరే వాళ్ల అన్నం గుంజుకొని తింటున్నారు. మేము ఎవరి అన్నం లాక్కోలేదు. ఎవరి గురించి చులకనగా మాట్లాడలేదు. ఒక నటుడి సినిమాను డీప్రమోట్ చేయడం ఎంత వరకుసమంజసం, ఈ విషయం మీ అభిమానులకు తెలియదా? మీ సినిమా విడుదల అయిన సమయంలో మేము కూడా ఇలా మీ సినిమాను డీప్రమోట్ చేస్తే మీకు బాధ కలగదా, అనిపించదా మీకో న్యాయం మాకో న్యాయమా చెప్పండి అంటు సోషల్ మీడియాలోనే సుదీప్ అభిమానులు పోస్టు చేశారు. దీంతో ఇద్దరి హీరోలు, అభిమానుల మధ్య సోషల్ వార్ వేడి వేడిగా జరుగుతోంది. హెచ్చరికలు పట్టించుకోను ఎవరి హెచ్చరికలను తాను పట్టించుకోనని హీరో సుదీప్ తన ట్విటర్లో పోస్టు చేశారు. దర్శన్ ట్విటర్‌పై ఆయన తన ట్విటర్ ఖాతాలో స్పందించారు. తన పైల్వాన్ చిత్రం విడుదల నుంచి అనేక విషయాలు జరుగుతున్నాయని, అయితే అవి మంచివి కావన్నారు. అదే విధంగా అన్ని సమయాల్లో సమాధానం ఇవ్వటం మంచిది కాదన్నారు. ఇందులో ఎవరి తప్పు ఉందో లేదో, ఏది అబద్ధమో తెలియదు, అలాంటి సమయంలో అన్నింటికి స్పందించాల్సిన అవసరం లేదు అని ట్విటర్లో పేర్కొన్నారు. -
‘పహిల్వాన్’ మూవీ స్టిల్స్
-
‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’
సాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చా సుధీప్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం పహిల్వాన్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సుధీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ కుస్తీ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయి బాక్సార్‌గా ఎదిగి నేపథ్యంలో ఎదురైన కష్టాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కబీర్ దుహన్ సింగ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతమందిస్తున్నాడు. -
గ్యాంగ్ వార్
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముంబైలో ఆవిష్కరించారు. ఆర్.ఎస్. సురేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్ కథాంశమిది. ఇందులోని 5 ఫైట్స్ చాలా బాగుంటాయి. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాల సంగీత దర్శకుడు రవిశంకర్ అందించిన ఆర్ఆర్ మా సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ అంశాలున్న చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా నిర్మించాం. జూలైలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
పహిల్వాన్ సుదీప్
సుదీప్ ఇప్పుడు పహిల్వాన్ అయ్యారు. అచ్చమైన పహిల్వాన్లా కనిపించడానికి ఆయన ఎంత శ్రద్ధగా కసరత్తులు చేశారో ఇక్కడున్న ఫొటో చూస్తే అర్థమవుతోంది. ‘పహిల్వాన్’లోని సుదీప్ లుక్‌ని మంగళవారం విడుదల చేశారు. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయింది. ఇందులో సుదీప్ బాక్సర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. 2017లో ‘హెబ్బులి’లాంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన తర్వాత మళ్లీ దర్శకుడు ఎస్. కృష్ణ, సుదీప్ కాంబినేషన్ రూపొందిన చిత్రం ‘పహిల్వాన్’. దాంతో ఈ చిత్రంపై మొదటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు విడుదలైన లుక్ ఆ అంచనాలను మరింత పెంచింది. కన్నడంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
‘పహిల్వాన్’పై ‘చిరు’ ప్రశంసలు
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ పహిల్వాన్‌తో ప్రేక్షకులను పలకరించబోతోన్న సంగతి తెలిసిందే. పహిల్వాన్‌కు సంబంధించి అప్పట్లో విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుస్తీ వీరుడుగా నటించనున్న సుదీప్ లుక్కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా సుదీప్ లుక్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాలో సుదీప్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీప్ నటిస్తున్న మరో చిత్రం పహిల్వాన్ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టిన చిత్రయూనిట్.. టాలీవుడ్లో సినిమాపై హైప్‌ను క్రియేట్చేయించేందుకు చిరంజీవిని రంగంలోకి దించారు. ఈ మూవీపై చిరు స్పందిస్తూ.. విలక్షణ నటుడు, నిబద్దత కలిగిన సుదీప్ ప్రస్తుతం పహిల్వాన్‌గా మనముందుకు రాబోతున్నాడని, రియల్ పహిల్వాన్ లుక్‌లోకి మారడానికి సుదీప్ ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. -
మాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి
‘‘ఉపేంద్ర లెగసీ వల్లే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి మాకంటూ ఒక పేరును సంపాదించుకుంటున్నాం. నాతో సహా చాలామందికి ఉపేంద్ర హార్డ్‌వర్క్, అంకితభావం స్ఫూర్తినిస్తాయి ’’ అని నటుడు, దర్శకుడు సుదీప్ అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ లవ్ యు’. ‘నన్నే.. ప్రేమించు’ అనేది ఉపశీర్షిక. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రచితా రామ్ కథానాయికగా నటించారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆర్. చంద్రు స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్ 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. బెంగళూరులో ఈ సినిమా ప్రీ–రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘ఈగ’ ఫేమ్ సుదీప్ మాట్లాడుతూ– ‘‘ఉపేంద్ర ఇంట్రడక్షన్ సాంగ్ ట్రెండీగా ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇది చూశాక ఉపేంద్రతో మళ్లీ పోటీపడాలనిపిస్తోంది. ఉపేంద్రలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం. చంద్రు, ప్రేమ్ వంటి దర్శకులకు ఆయనే స్ఫూర్తి. ఆయన మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నాకు, సుదీప్‌కు 25ఏళ్లుగా పరిచయం ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సుదీప్‌లో ఎంత ఫైర్ ఉందో ఇప్పుడూ అంతే ఉంది. దర్శకుడు చంద్రు అద్భుతమైన కథ రాసుకుని పెద్దకలలతో వచ్చాడు’’ అన్నారు ఉపేంద్ర. ‘‘ఉపేంద్రగారు అభిమానుల చక్రవర్తి. ఇండస్ట్రీ కీర్తిప్రతిష్ఠలను ఇతర చిత్రసీమలకు తీసుకెళ్లిన అభినయ చక్రవర్తి సుదీప్‌గారు.. త్వరలో విశాఖ తీరంలో తెలుగు వెర్షన్ పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు చంద్రు. -
జిమ్ బోనస్
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, శాండల్‌వుడ్‌లో ‘కిచ్చ’ సుదీప్ టాప్ స్టార్స్. అదీ కాకుండా బాడీ ఫిట్‌గా ఉంచుకోవడంలో వాళ్లు చూపించే శ్రద్ధ ఎక్కువే. ఈ ఇద్దరూ ‘దబాంగ్ 3’ కోసం కలిశారు. సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సుదీప్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సెట్లో ఇటీవల జాయిన్ అయ్యారు సుదీప్. ‘‘బయట భరించలేని ఎండ. అయినప్పటికీ మా సెట్లో ఉన్న ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోతోంది. అద్భుతమైన సెట్, అద్భుతమైన మనుషుల మధ్య ఫస్ట్ డే షూట్ గడిచింది. సెట్లో జిమ్ ఉండటం బోనస్. థ్యాంక్యూ సల్మాన్ సార్. ఇంటి దగ్గరే ఉన్నట్టు మమ్మల్ని చూసుకుంటున్నందుకు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. -
2209కి తీసుకెళ్తాను
టైమ్ మిషన్ ఎక్కి 200 సంవత్సరాలు ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు కన్నడ హీరో సుదీప్. ఆయన వెళ్లడమే కాదు ప్రేక్షకుల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. ‘బిల్లా రంగా భాషా’ చిత్రం కోసమే ఈ టైమ్ మిషన్ ప్రయాణం. 2209లో ఈ చిత్రకథ సాగనుంది. అనూప్ బండారీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ‘‘190 ఏళ్ల తర్వాత జీవన విధానం ఎలా ఉండబోతోందనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రత్యేకంగా 2209 అనే సంవత్సరాన్నే ఎందుకు చూపిస్తున్నామో సినిమా చూసి తెలుసుకోవాలి. సుదీప్ సరికొత్త గెటప్స్‌లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆఫీసర్ కంగన
ఏంటి.. హెడ్డింగ్‌లో కంగన అని పెట్టి ఇక్కడ హీరోయిన్ శద్ధ్రాదాస్ ఫొటో పెట్టామని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. కన్నడ చిత్రం ‘కోటిగొబ్బ 3’లో శ్రద్ధాదాస్ చేస్తున్న పాత్ర పేరు కంగన అని తెలిసింది. ‘కోటిగొబ్బ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ఇది. సుదీప్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఇంటర్‌పోల్ ఆఫీసర్ కంగన పాత్రలో నటిస్తున్నారు శ్రద్ధాదాస్. బెంగళూరులో షూటింగ్ జరుగుతోంది. ‘‘కోటిగొబ్బ 3 షూటింగ్ గురువారం మళ్లీ ప్రారంభం అయ్యింది. నాకు ఇష్టమైన పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. శివకార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుదీప్‌నే కథ అందించారట. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనకుంటున్నారు. ‘కోటికొక్కడు’ అనే టైటిల్‌తో ‘కోటిగొప్ప 2’ తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
రాజకీయ నేపథ్యంలో...
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఆర్.ఎస్.సురేష్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే కథాంశమిది. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాలకు సంగీతం అందించిన రవిశంకర్ ఆర్.ఆర్ స్వరాలు మా సినిమాకి ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాలు మరో హైలైట్’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా తెరకెక్కించాం. ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
సల్మాన్ సినిమాలో సౌత్ హీరో..!
సౌత్ సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న కన్నడ స్టార్ హీరో సుధీప్. ఈగ సినిమాతో విలన్‌గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుధీప్, మరోసారి బాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. సాండల్‌వుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇతర భాషల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సుధీప్ త్వరలో బాలీవుడ్ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ హీరోగా సూపర్ హిట్ అయిన సిరీస్ దబాంగ్. ఈ సిరీస్‌లో మూడో భాగంగా రిలీజ్ అవుతున్న దబాంగ్ 3లో సుధీప్ విలన్‌గా నటించనున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సుధీప్ పహిల్వాన్ టీజర్‌పై సల్మాన్ ప్రశంసల జల్లు కురిపించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బాలీవుడ్లో వాంటెడ్, రౌడీ రాథోడ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రభుదేవా దబాంగ్ 3కి దర్శకత్వం వహించనున్నాడు. -
సైరా.. జాతర!
హైదారాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ వేసి వారం రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు ‘సైరా: నరసింహారెడ్డి’ టీమ్. ప్రస్తుతానికైతే యాక్షన్ సన్నివేశాల కోసం కాదు. ఓ సాంగ్ కోసం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రేపటి నుంచి చిత్రీకరించబోయే ఈ సాంగ్‌లో చిరంజీవి, తమన్నా, జగపతిబాబు, సుదీప్ పాల్గొంటారని సమాచారం. జాతర నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ను దాదాపు వారం రోజుల పాటు చిత్రీకరిస్తారని తెలిసింది. అంతేకాదు.. వెయ్యిమంది డ్యాన్సర్లు ఈ పాటలో పాల్గొంటారట. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని తెలుస్తోంది. -
‘ఇది నిజమేనా.. నన్నెవరైనా నిద్ర లేపండి’
తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన కన్నడ స్టార్ సుధీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పహిల్వాన్. సుధీప్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ టీజర్‌కు బాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా సల్మాన్ పహిల్వాన్ టీజర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయటంతో సుధీప్ స్పందిస్తూ ‘సార్.. ఇది నిజమేనా.. నన్నెవరైనా నిద్ర లేపండి. సుల్తాన్ ట్వీట్ చేశారు. థాంక్యూ’ అంటూ కామెంట్ చేశారు. Sirrrrrrr 😯.... ✨✨✨✨😃😃... is this real ,,,lemme wake upppp.. The sultan @BeingSalmanKhan tweets !! U jussssss made my day..thank uuuuuuuuuuuuuu..... Hugs hugs n hugs . https://t.co/ttQBrNwuou — Kichcha Sudeepa (@KicchaSudeep) 15 January 2019 అంతేకాదు టీజర్‌ను ప్రంశసిస్తూ ట్వీట్ చేసిన ప్రతీ ఒక్కరికి సుధీప్ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రితేష్ దేశ్‌ముఖ్‌లతో పాటు ధనుష్, రవి కిషన్, రామ్ గోపాల్ వర్మ లాంటి స్టార్స్ పహిల్వాన్ టీజర్‌పై ప్రశంసలు కురింపించారు. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళ్ళీరావా ఫేం ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. -
ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ అధికారి గుడ్‌బై
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ స్థాయి అధికారుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా సంస్థ గ్లోబల్ హెడ్ (ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్, సర్వీసెస్ విభాగం) సుదీప్ సింగ్ రాజీనామా చేశారు. సింగ్ సారథ్యంలో ఈ విభాగం ఆదాయం 100 మిలియన్ డాలర్ల నుంచి 750 మిలియన్ డాలర్లకు చేరింది. సుదీప్ రాజీనామాపై స్పందించేందుకు ఇన్ఫీ నిరాకరించింది. కన్సల్టింగ్ విభాగం గ్లోబల్ హెడ్ కెన్ టూంబ్స్ గతేడాది అక్టోబర్‌లో వైదొలిగారు. అంతకు ముందు ఆగస్టులో మరో కీలకమైన అధికారి ఎం.డీ.రంగనాథ్ కూడా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకున్నారు. -
కన్నడ దాడుల్లో 11 కోట్ల ఆస్తులు లభ్యం
బెంగళూరు: కన్నడ సినీ ప్రముఖుల నివాసాల్లో చేపట్టిన సోదాల్లో రూ. 11 కోట్ల విలువైన ఆస్తులు, నగదు లభ్యమైనట్లు ఆదాయ పన్ను అధికారులు వెల్లడించారు. అలాగే, లెక్కల్లో చూపని రూ.109 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు కూడా నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. నటులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, నిర్మాతలు సీఆర్ మనోహర్, రాక్‌లైన్ వెంకటేశ్, విజయ్ కిరిగందూర్ ఇళ్లపై గురువారం నుంచి శనివారం వరకు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివరాల్ని అధికారులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన రూ.11 కోట్ల ఆస్తుల్లో రూ.2.85 కోట్ల నగదు, 25.3 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. తమకు దొరికిన ఆధారాల్ని రెవెన్యూ, ఇతర విచారణ సంస్థలకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కర్ణాటక, గోవాలో పనిచేస్తున్న 180 మంది అధికారులు మొత్తం 26 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. -
కన్నడ హీరోలకు ఐటీ షాక్
సాక్షి, బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ గురువారం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. నలుగురు పెద్ద హీరోలు, ముగ్గురు బడా నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. ఇటీవల కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందాయి. అందులో కొన్ని సక్సెస్ సాధించి బడా నిర్మాతలకు, హీరోలకు కోట్ల రాబడి తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణలు పెరగడంతో ఐటీ శాఖ సోదాలు ప్రారం భించింది. కర్ణాటకలోని సుమారు 23 ప్రాంతా ల్లో 200 మంది ఐటీ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ప్రముఖ శాండల్‌వుడ్ హీరోలు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, ప్రముఖ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఐటీ అధికారులు నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏకకాలంలో వేర్వేరుగా సోదాలు ఉదయం 7 గంటల నుంచే ఏకకాలంలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. సదాశివనగరలోని పునీత్ రాజ్‌కుమార్ ఇల్లు, మాన్యత టెక్‌పార్కు దగ్గర్లో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ఇల్లు, కేజీఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యశ్ ఇల్లు, తెలుగులో ‘ఈగ’సినిమా విలన్ కిచ్చ సుదీప్ ఇంట్లో సోదాలు చేశారు. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలు విజయ్ కిరంగదూరు, రాక్‌లైన్ వెంకటేశ్, నిర్మాత, జేడీఎస్ ఎమ్మెల్సీ సీఆర్ మనోహర్ నివాసాల్లో కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ ప్రముఖులు నటించిన, నిర్మించిన సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్స్ వివరాలను అధికారులు సేకరించారు. కర్ణాటక సీఎం కుమారస్వామి రెండో భార్య, నటి రాధిక ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారని వార్తలు వినిపించాయి. ఐటీ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. తమిళనాట ప్రముఖ హోటళ్లపైనా... సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్న హోటల్ శరవణ భవన్, అంజప్పర్ హోటల్స్, గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రెడ్ తదితర వ్యాపార సంస్థలకు చెందిన 32 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లపై కేంద్రం జీఎస్టీని తగ్గించినా వినియోగదారుల నుంచి పాత జీఎస్టీనే వసూలు చేస్తున్నారని, కొత్త ఏడాది సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాల అమ్మకాలు జరిగినా తక్కువ అయినట్లుగా లెక్కలు రాసినట్లు ఐటీశాఖకు సమాచారం అందింది. దీంతో ఐటీ సిబ్బంది సోదాలు చేపట్టింది. -
సీఎం భార్య ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, బెంగళూరు/చెన్నై: కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో 60 ప్రాంతాలలో దాడులకు దిగడం సంచలనం సృష్టించింది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య రాధిక, సినీ దిగ్గజ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కుమారులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ నివాసాల్లో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. వీరితోపాటు పలువురు నటులు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించింది. హీరో సుదీప్, ‘కేజీఎఫ్’ నటుడు యశ్, ఈ సినిమా నిర్మాత విజయ్ ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే కుమారస్వామి భార్య రాధిక నివాసంలో ఐటీ దాడులు చేపట్టారని జేడీ(ఎస్) నాయకులు ఆరోపిస్తున్నారు. చెన్నైలోనూ ఐటీ దాడులు తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు ప్రముఖ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. 32 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పన్ను ఎగవేత కారణంతో శరవణభవన్, అంజప్పార్ తదితర ప్రముఖ హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. -
పహిల్వాన్‌గా కిచ్చ సుదీప్
స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మిస్తున్న పహిల్వాన్. ఈ సినిమాలో కన్నడ హీరో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే కసరత్తులు సైతం చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తుండటంతో విశేషం. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. సినిమాకు ఎస్.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అర్జున్ జన్యా సంగీతాన్ని అందిస్తున్నారు. స్టంట్స్ కోసం హాలీవుడ్ నుంచి లార్వెన్ సోహైల్ అనే నిపుణున్ని పిలిపించారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఏకంగా 20 సెట్లను రూపొందించారు. -
అభిమానికి నటుడు కిచ్చ సుదీప్ భరోసా
సాండల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ లేదనకుండా సహాయం చేయడంలో పైచేయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువ అభిమానిని కలిసి ఆర్థిక సాయం చేయటానికి ముందుకొచ్చారు సుదీప్. బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల రాహుల్ అనే బాలుడు బ్రెయిన్ ట్యూమర్, రక్తస్రావం వ్యాధితో పడుతున్నాడు. బాలుడి శస్త్ర చికిత్సకు రూ. 8 లక్షలు ఖర్చువుతాయని వైద్యులు సూచించారు. రాహుల్ తల్లిదండ్రులు జలందర్ వెల్డర్‌గా పనిచేస్తూ రూ. 4 లక్షలు సమకూర్చుకున్నాడు. మరో మూడు లక్షల అవసరం ఉంది. అయితే రాహుల్ తన అభిమాన హీరో సుదీప్‌కు ట్విట్టర్ ద్వారా సందేశం పంపాడు. దీనిని గమనించి సుదీప్ దానికి సమాధానమిస్తూ స్వయంగా వచ్చి కలవాలని సూచించాడు. దీంతో రాహుల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ తమకు దేవుడిలా వచ్చి సాయం చేస్తున్నారని అన్నారు. -
వెలిసిన వర్ణాలు
సుదీప్ తల బొంగరంలా తిరుగుతున్నది. నవడలేకపోతున్నాడు. అద్భుతమైన ఆకుపచ్చ సౌందర్యం కళ్ల ముందు కదలాడుతున్నది. దాని వెనుకనే గుండెను పిండే బాధ, మనసును ముక్కలు చేసే జ్ఞాపకాలు తారాడుతున్నాయి. బిదిత వదనం అతడిని రేయింబవళ్లు వెంటాడుతున్నది. యూనివర్సిటీ చదువు అతనికి విషాదమే మిగిల్చింది. రబ్బరు సేకరించే కార్మికులు వదిలేసిన ఒక ముక్కని సుదీప్ తన చేతిలో నలుపుతున్నాడు. ఆ ముద్ద అతనికి తన దగ్ధ హృదయాన్ని గుర్తు చేస్తున్నది. అది తను చదువుకునే బల్లపై ఉంచితే ఒక జ్ఞాపికలాగా ఉంటుందని భావిస్తున్నాడు. కృతకమైన, క్రూరమైన నాగరికతకు అతి దూరంగా ఈ చిటగాంగ్ మహారణ్యం ఒక దుప్పటిలాగా అతడిని కౌగిలించుకుని తనలో ఇముడ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అతడు ఇక్కడే ఊరట పొందగలడు. అతి కష్టం మీద తన ఉద్వేగాలను అదుపు చేసుకున్నాడు. నెమ్మదిగా కొండపైకి ఎక్కుతున్నాడు. అతడికి తెలియకుండానే తన వ్యథకు సంకేతంగా అతడు పదిలపరచుకున్న రబ్బరు ముక్క కింద పడిపోయింది. తన క్లాస్మేట్, తను ఎంతగానో ప్రేమించి ఆరాధించిన బిదిత ఒక కృతనిశ్చయంతో చెప్పేసింది. ఆమె మాటలు సందీప్ చెవిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. ‘‘మనిద్దరి మధ్య అంతరాలు అడ్డుగోడలు ఉన్నాయి. మనం ఈ జన్మలో కలిసి జీవించడం సాధ్యం కాదు. నేను కోరుకున్న జీవితం వేరు.’’ అని తెగేసి చెప్పింది. ఆమె నిజాయితీని శంకించడానికి వీల్లేదు. ఆమె వెనుకనున్న పరిస్థితులు అటువంటివి. ఆమె సుదీప్‌ని మోసం చెయ్యలేదు. కానీ సుదీప్ కోణంలో చూస్తే మరపు అంత తేలికైనది కాదు. శుభప్రియొ ఆదివాసీ. సుదీప్ బెంగాలీ. ఇద్దరూ క్లాస్మేట్లు, రూమ్మేట్లు. బిదిత వియోగంతో సుదీప్ కుంగిపోతున్న స్థితిలో శుభప్రియొ అతని బాధను అర్థం చేసుకున్నాడు. పర్వతాల్లోని తన పురాతనమైన ఇంటికి వచ్చి, తన కుటుంబంతో కలసి ఉండమని కోరాడు. కొంత ఉపశమనాన్ని పొంది, మిత్రుడు గాయాన్ని మరచిపోగలడని భావించాడు. వారిది చాలా పెద్ద కుటుంబం. వివాహితులైన ఇద్దరు అక్కలు వేరే ఊర్లో ఉన్నారు. మూడో సోదరి కజోలికా పట్నంలో చదువుతూ హాస్టల్లో ఉంటున్నది. ప్రస్తుతం ఆమె సెలవులకని ఇంటికి వచ్చింది. పెద్దవాడు శుభప్రియొ. చిన్నవాడు పూర్ణచంద్ర పదేళ్ల వయసు వాడు. ఆ కుర్రవాడే ఇప్పుడు సుదీప్‌కు మిత్రుడూ మార్గనిర్దేశకుడూ అయ్యాడు. పూర్ణచంద్ర తనకు మాత్రమే తెలిసిన మహారణ్యాల అద్భుత రహస్యాలను చెబుతున్నాడు. అంత సుందరమైన నందనాన్ని చూసి సుదీప్ సంబరపడిపోయాడు.‘‘నీకెవరు బాబూ! ఈ పేరు పెట్టారు? పూర్ణచంద్రుడంటే నిండు పౌర్ణమి’ అడిగాడు సుదీప్.పూర్ణచంద్ర ముఖంలో హఠాత్తుగా రంగులు మారిపోయాయి. కన్నుల్లో క్రోధం కదలాడింది. ఒక్కసారిగా చలించిపోయాడు. ‘‘నాకీ పేరు ఠాకూర్‌దా పెట్టాడు’’ అంటూ బిగుసుకుపోయాడు. ‘‘ఆయన్ని వాళ్లు పొట్టన పెట్టుకున్నారు. నేను వాళ్లని చంపేస్తాను.’’ అన్నాడు. మిత్రుడు శుభప్రియొ గత సన్నివేశాల్ని పూసగుచ్చిట్టు వివరించాడు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఆ కుటుంబం వారంతా తల దాచుకునేందుకు కీకారణ్యం లోనికి వెళ్లబోయారు. వృద్ధుడు ఠాకుర్దా నడవలేకపోయాడు. అతడ్ని ఉన్న చోటునే వాళ్లు కాల్చి చంపేశారు. ఆ దృశ్యాన్ని చిన్నవాడైనా పూర్ణచంద్ర కళ్లారా చూసేశాడు. అప్పటి నుంచి పిల్లవాడు మనిషి కాలేకపోతున్నాడు. శుభప్రియొ తమ స్థితిని ఇంకా ఇలా వివరించాడు: ‘‘మేం ఒక యుద్ధ వాతావరణంలో బతుకులీడుస్తున్నాం. మా సమరానికి పగలూ రాత్రీ తేడా లేదు. బెంగాలీ వలస జనం మా నేలని ఒక్కొక్క అంగుళమూ ఆక్రమించుకుంటున్నారు.దాన్ని ఆదీవాసీలం మేం ప్రతిఘటిస్తున్నాం. వారు మమ్మల్ని చంపుతుంటుంటారు. మేం వారి జనావాసాల్ని తగలబెడుతుంటాం. మా జీవితాలు అతలాకుతలమయ్యాయి. ప్రశాంతతని నెలకొల్పడానికి సైనిక పటాలాలు వస్తాయి. అసలు చిక్కంతా వారితోనే. వారి చేతిలో తుపాకులుంటాయి. మా ఆడవారి మానప్రాణాలను వారు హరిస్తున్నారు. మా వారసత్వ సంపదనీ నాగరికతనీ ధ్వంసం చేస్తున్నారు. మా ఆర్థిక వనరుల్ని మట్టిపాలు చేస్తున్నారు...’’ ఈ ధోరణిలో ఇంకా చాలా చెప్పాడు. సుదీప్ నాడులు బిగుసుకున్నాయి. ఒకవైపు బిదిత వల్ల ఏర్పడిన సొంత విషాదముంది. రెండోవైపున సూర్యుడి కింద పిడికెడు నేల కోసం, అంగుళం నీడ కోసం ఈ అశేష ప్రజానీకం సాగిస్తున్న నిరంతర సంఘర్షణ ఉంది. రెండూ మనుగడ కోసం పోరాటాలే. కాని వీరి విషాదంతో పోలిస్తే తన వ్యక్తిగత దుఃఖం అత్యంత స్వల్పమైనది. వీరి ప్రయోజనం కోసం, వీరి పక్షాన నిలబడి, వీర్ని ఉద్ధరించడానికి పోరాటం సాగించడం గొప్ప అంశంగా భావిస్తున్నాడు. సుదీప్ ఒక మహావృక్షం కింద వెల్లకిలా చేరబడి స్తబ్దమవుతున్న తన పంచేంద్రియాలనూ కూడగట్టుకుంటున్నాడు. అంతలో ఒక ఉడుత చెట్టు కొమ్మ నుంచి కిందకు దిగింది. నెమ్మదిగా అతని మీదకు పాకడానికి ప్రయత్నించింది. ఆ పరిసరాలకు కొత్తగా ఉన్న ఆ శాల్తీ వైపు కొన్ని సెకన్ల పాటు చూసింది. సుదీప్ ఊపిరి బిగపట్టాడు. ఈ వన్యప్రాణి తన భగ్నహృదయానికి శాంతినివ్వగలడేమో అనుకున్నాడు. కాసేపు పరిశీలించిన తర్వాత ఉడుత ఈ నరజాతిని నమ్మడం సురక్షితం కాదని నిశ్చయించుకుంది. ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానూ చెట్టెక్కిపోయింది. సుదీప్ నవ్వుకున్నాడు. ఉడుత కూడా తనని తిరస్కరించినట్టు భావించాడు. ఈ స్థలం కూడా ప్రమాదరహితమైనది కాదు. ఏ వైపు నుంచి అయినా ఒక బుల్లెట్ దూసుకు రావచ్చు. పోరు భీకరంగా సాగుతున్నది. కానీ పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్నది. మరోసారి బిదిత అమాయకమైన ముఖం అతని మనోఫలకం మీద కనపడి మాయమైపోయింది. ఇంతలో ఒక ధ్వని అతని దగ్గరగా వస్తున్నది. ఒక పక్షి ఆకుల మధ్య నుంచి గొంతు విప్పి అరుస్తున్నది.ఒక పిల్ల తెమ్మెర నెమ్మదిగా వచ్చి అతన్ని లాలించింది. పూర్ణచంద్ర పులిలాగా గాండ్రిస్తూ, పెంకెగా నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక పశువుల గంట ఉన్నది. ‘‘దీన్ని మీ మెడకు కడతాను’’ అన్నాడు. ‘‘నేను ఆవుని కాదే!’’‘‘మీకు ఈ స్థలం తెలియదు. ఒకవేళ దారి తప్పితే ఈ గంట మిమ్మల్ని గుర్తుపట్టడానికి సహాయం చేస్తుంది.’’‘‘పూర్ణా! నువ్వు నన్ను నమ్మగలవా?’’ సుదీప్ అడిగాడు.క్షణం ఆలోచించకుండా ఆ కుర్రవాడు ‘‘నమ్మను’’ అన్నాడు.‘‘ఎందుకని’’‘‘మీ బెంగాలీలు మా తాతయ్యని చంపారు.’’ అన్నాడు పూర్ణచంద్ర.‘‘శుభప్రియొ దాదాకు మీరంటే ఇష్టం. మీకేదో ఆపద వచ్చిందని చెప్పాడు. అందుకనే బాబా, అమ్మా మీరు మాతో ఉండటానికి అంగీకరించారు. లేకుంటే ఉండనివ్వరు’’ఎంత ద్వేషం? ఎంత అపనమ్మకం? ఇవి సుదీప్ గుండె మూలలకు గుచ్చుకున్నాయి. ఈ పిల్లవాడు అభం శుభంతెలియనివాడు. వాళ్ల తాతని చంపడం స్వయంగా చూశాడు. ఇంకా ఎన్నో అకృత్యాల్ని చూసే ఉంటాడు. ఆ చిన్నారి మనసు కరడుగట్టిపోయింది. ‘‘మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. అప్పుడే మా జనం మీ గురించి గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని పర్వతాల మీద నుంచి కిందకు నెట్టెయ్యాలని అంటున్నారు.’’ అన్నాడు పూర్ణచంద్ర.‘‘ఎందుకు?’’‘‘మీరు మా శత్రువర్గానికి చెందినవారు.’’‘‘ నేను ఎవరికీ శత్రువుని కాను. ఈ కొండల మీద నేను కూడా నివసించి నా సర్వస్వాన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను.’’‘‘అదంతా నాకు తెలీదు. వాళ్ల మాటలు మీకు నేను చెబుతున్నాను. ఇక్కడ ఎక్కువ కాలం ఉండొద్దు.’’ పదేళ్ల పూర్ణచంద్ర స్వరంలోని తీవ్రత సుదీప్‌ని చకితుడ్ని చేసింది. మళ్లీ పూర్ణ ఇలా అన్నాడు: ‘‘బాబా మాటికీ గొణుగుతున్నాడు. మీరిక్కడే ఉంటే మిలటరీ వారికి అనుమానం వచ్చి మొత్తం మా పల్లెనే తగులబెట్టేస్తారట.’’ సుదీప్‌కి మరో దెబ్బ తగిలింది. ‘‘తన బాధ నుంచి విముక్తుడు కావడానికి ఇతరుల్ని బాధపెట్టాలా?’’ ఒకవైపు బిదిత వియోగం, రెండో వైపు ఆదివాసీల జీవన్మరణ సమస్య సుదీప్‌ని కుంగదీస్తున్నాయి. పూర్ణచంద్ర ఇలా అన్నాడు: ‘‘ఈ గంటను మీ మెడకు కట్టుకోండి’’ అంటూ ఇంకా ఇలా అన్నాడు. ‘‘దీదీ కజోలికా కూడా మీ ఉనికిని ఇష్టపడటం లేదు.’’‘‘అర్థమైంది. ఆమె... ఆమె.. ఎవర్నైనా ప్రేమిస్తున్నదా?’’‘‘ఔను. రేబొతీ దాదాను ప్రేమిస్తున్నది. అతడు శాంతిబాహినిలో చేరిపోయాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలీదు. అందుకే ఎప్పుడూ ఆమె విచారంగా ఉంటున్నది. త్వరలో ఆమె కూడా చేరబోతున్నది.’’‘‘పోరాటం చేస్తుందా?’’‘‘ఔను. మేం మిలటరీ వారిని మా నేలమీద నుంచి తగిలెయ్యాలి కదా!’’ అన్నాడు పూర్ణచంద్ర.సుదీప్ ఏమనగలడు? ఇక్కడికి రావడం వల్ల తన సొంత బాధ కన్నా మరింత అధికమైన భారం అతని భుజాల మీద పడుతున్నది. పట్నంలో ఉన్నప్పుడు కొండ ప్రాంతాల్లోని అశాంతిని గూర్చి లీలగా విన్నాడు.కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అంతలో ఒక పెద్దవృక్షానికి ఉన్న వేళ్లు కాళ్లకు తగిలాయి. కింద పడిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో చాలా తొందరగా వస్తున్న ఒక జీపు ధ్వని వినపడింది. వెంటనే పూర్ణచంద్ర కూడా సుదీప్ పక్కన నేల మీద బోర్లపడిపోయాడు. ‘‘మీరు కిందపడటం మంచిదైంది. అది మిలటరీ జీపు.’’ అని చెవిలో మెల్లగా అన్నాడు. అక్కడి వృక్షాలు పొదలు వారిని కనపడకుండా చేశాయి.జీపు దగ్గరగా వచ్చి ఆగింది. కాని కనపడలేదు. కొంతసేపటి తర్వాత వెళ్లిపోయిన శబ్దం వినపడింది. సుదీప్ మోకాలికి దెబ్బ తగిలింది. ఏదో చెప్పాలనుకున్నాడు. కాని ఆ పిల్లవాడి ముఖంలో ద్వేషాగ్ని కీలల్ని చూసి మాట్లాడలేకపోయాడు. పూర్ణచంద్ర పిడికిలి బిగించాడు. ‘‘నేను మా మహారణ్యంలోని పచ్చని పచ్చికను పట్టి ప్రమాణం చేస్తున్నాను. నేను ఏదో ఒక రోజున వార్ని చంపి పగ తీర్చుకుంటాను’’‘‘పూర్ణా! మీ దాదా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్లిపోతాను. నన్ను నమ్ము.’’‘‘శుభప్రియొ దాదా మరి చదువు కొనసాగించడు. శాంతిబాహినిలో చేరడానికి నిర్ణయించుకున్నాడు.’’ అంటూ పూర్ణచంద్ర ఇంకా ఇలా అన్నాడు: ‘‘దీదీ కజోలికా వెదురుపొదల వద్ద వేచి ఉంటుంది. మనం ఆమెను కలిసి ఇంటికి వెళ్లిపోదాం.’’‘‘వెదురు పొదల వద్ద ఎందుకు?’’‘‘రేబొతీ వస్తే అక్కడ కలుసుకుంటుంది.’’‘‘అతనెప్పుడొస్తాడో ఆమెకు తెలీదా?’’‘‘తెలీదు. ఆమె కూడా గంట కట్టుకునే ఉంటుంది. దాంతోనే మేం గుర్తుపడతాం. ఇది మా రహస్యం. నాకు దీదీ అంటే చాలా ఇష్టం.’’ఇద్దరూ ఇంకా దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. ‘‘ఈ ప్రాంతంలో ఏదైనా మిలటరీ ఆపరేషన్ ఉన్నదేమో!’’ అంటూ సుదీప్ పూర్ణచంద్ర భుజాల మీద చేతులు వేశాడు.‘‘కావచ్చు. వారికి దీదీ కనపడితేనే ప్రమాదం’’ పూర్ణచంద్ర కంఠం కటువైపోయింది ఇలా ఒంటరిగా తిరగొద్దని నేను దీదీకి చాలాసార్లు హెచ్చరించాను.’’సుదీప్ పూర్ణచంద్రను దగ్గరగా తీసుకున్నాడు. ‘‘భయపడకు. నేను నీతో ఉన్నాను. మీ దీదీకేమీ కాదు. ఇలాంటి రాత్రి మనకు చంద్రుడు కనిపిస్తాడు. జంతువులు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. ఇంత నిశ్శబ్దంలో మనం కజోలికా గంటను స్పష్టంగా వినగలం.’’ ‘‘మీరేమంటున్నారు? ఇది రాత్రి కాదు పగలు. ఈ చెట్లు సృష్టినే చీకటి చేసేస్తాయి. మీరు కొత్త ఈ ప్రదేశమంతా నాకు తెలుసు. అందుకే రాత్రి అనిపిస్తున్నది.’’ అని పూర్ణచంద్ర నవ్వాడు. అంతలోనే ఏదో కీడు శంకించిన వాడిలా నవ్వు ఆపేసి, సుదీప్‌ని వెనక్కు నెట్టి ‘‘దీదీ..’’ అని అరుస్తూ పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఈ హఠాత్ పరిణామానికి సుదీప్ కూడా భయభ్రాంతుడయ్యాడు. పూర్ణ వెనుకనే సుదీప్ కూడా పరుగెత్తాడు. ఈ సరికి పూర్ణచంద్ర బిగ్గరగా ఏడుస్తున్నాడు. వారికి కజోలికా కనపడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్నది. ఆమె దుస్తులు చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె అనాచ్ఛాదితంగా ఉంది. కాళ్ల మధ్య నుంచి రక్తం స్రవిస్తున్నది.పూర్ణచంద్ర ఆమె దగ్గరగా వెళ్లి అసహాయంగా చేతులూపుతూ అరుస్తున్నాడు ‘‘దీదీ... మాట్లాడ్డం లేదు. కదలడం లేదు. చనిపోయిందా? దీదీ... దీదీ’’అక్కడి మెత్తని నేల మీద జీపు టైలర్ల గుర్తులున్నాయి. జరిగిన క్రూరమైన కథ సుదీప్‌కు అర్థమైంది. కాని ఆ పసివాడికి ఎలా చెప్పగలడు? ఈ దారుణానికి తను ప్రత్యక్ష సాక్షిగా మిగిలాడు.‘‘దీదీకేమైంది? దీదీకేమైంది?’’ పూర్ణచంద్ర పదేపదే ఏడుస్తూ అరుస్తున్నాడు. కజోలికా బోర్లా పడి ఉంది. సుదీప్ తన చేతిని ఆమె వీపు మీద ఆనించాడు. శ్వాస ఆడుతున్నది. అంటే చనిపోలేదు. కాని తీవ్రంగా గాయపడింది. ‘‘పూర్ణా! మీ దీదీకి వెంటనే వైద్యం చేయించాలి. ఆమెను బతికించాలి’’పూర్ణ చెదిరి ఉన్న దుస్తుల్ని ఏరి సుదీప్ చేతికిచ్చాడు. ‘‘ఆమెకు దుస్తులు వెయ్యండి’’ అన్నాడు.‘‘మరి నువ్వేం చేస్తావు?’’‘‘నేను ఆ మృగాన్ని చంపే మార్గం కనుగొంటాను.’’కజోలికాకు ఆచ్ఛాదన ఏర్పరుస్తుండగా సుదీప్‌కు వేళ్లు వణికాయి. కజోలికాను పైకెత్తి భుజాల మీద వేసుకున్నాడు. ఆమెని కుటుంబానికి అందజేయాలి. వైద్యం చేయించాలి. బతికించాలి. ఇంటి వైపు బయల్దేరారు.ఒక్కసారిగా రేబొతీ, తుపాకులు ధరించిన అతని సహచరులూ ప్రత్యక్షమయ్యారు. సుదీప్‌ని అడ్డగించారు.‘‘రేబొతీ దాదా! మీరు ఆలస్యంగా వచ్చారు. వాళ్లు దీదీని చంపేశారు.’’‘‘ఎవరు.. ఎవరు?’’‘‘ఆ జీపులో వచ్చిన వాళ్లు’’‘‘నాకిప్పుడు అర్థమైంది’’ అంటూ రేబొతీ తన తుపాకీని సుదీప్ గుండెకు గురిపెట్టాడు.‘‘వొద్దు.. వొద్దు... ఇతడ్ని చంపొద్దు’’ అంటూ పూర్ణచంద్ర అరుస్తూ అడ్డుపడ్డాడు. ‘‘ఇతడేమీ చేయలేదు. ఇతడు దాదా స్నేహితుడు.’’సుదీప్ రానున్న పరిణామాలకు సిద్ధంగా ఉన్నాడు. ‘‘ముందు ఈమెకు వైద్యం చేయించాలి’’ అన్నాడు.రేబొతీ ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. అతని మిత్రులు కూడా తుపాకులు దించి విషాదగ్రస్తులయ్యారు. ‘‘పగ తీర్చుకుంటాం’’ అని ప్రతిజ్ఞ చేశారు.సుదీప్ కజోలికాను ఆమె ఇంటి వైపు మోసుకెళ్లాడు. పూర్ణచంద్ర దుఃఖిస్తూ వెంబడించాడు. వారు చేరే సరికే జనం పోగై ఉన్నారు. శుభప్రియో తిరిగి వచ్చాడు. అతడూ విచక్షణ కోల్పోయాడు. స్నేహాన్ని జాతి విద్వేషం అధిగమించింది. అతని కళ్లు నిప్పు కణికల్లా ఉన్నాయి. సుదీప్ వైపు తిరిగి విషం చిమ్మాయి. ‘‘నువ్వు... నువ్వు... మీ జనం చేసినదానికి నువ్వే మూల్యం చెల్లించాలి..’’ అని అరిచాడు.సుదీప్ మౌనం వహించాడు. తన జాతి మొత్తం చేసిన అకృత్యాలకు సిగ్గుతో తల దించుకున్నాడు.శుభప్రియొ తండ్రి ఒక తాడుని తెచ్చాడు. సుదీప్ వారించలేదు. వారు అతడ్ని ఒక చెట్టుకు కట్టివేశారు. దాన్నీ నిశ్శబ్దంగా భరించాడు. వారి ప్రచండ క్రో«ధాన్ని అర్థం చేసుకున్నాడు. వారేం చేయగలరో అదే చేస్తున్నారు.శుభప్రియొ కూడా నిశ్చయుడైపోయాడు. ‘‘నీ ఒక్కడి బాధ మరచిపోవడం ముఖ్యం కాదు. ఒక నిజమైన బాధ... ఒక జాతి కన్నీటిగాథని నువ్వు తెలుసుకోవాలి... అనుభవించాలి.’’ సుదీప్ మౌనం వహించాడు. శిక్షని అంగీకరించాడు. తలవంచుకున్నాడు. ఒక పండు వెన్నెల రాత్రి నెమ్మదిగా నిబిడ గాఢాంధకారంగా మారింది. బంగ్లా మూలం : సెలీనా హుస్సేన్ అనువాదం: టి.షణ్ముఖరావు -
‘విలన్’ వివాదంపై స్పందించిన హీరో
కరునాడ చక్రవర్తి, హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ 36 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నారని, సినిమా కథ వినకుండా నటించేంందుకు ఆయన ఒప్పుకుంటారా అని శివన్న అభిమానులను కిచ్చా సుదీప్ ప్రశ్నించారు. సుదీప్, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రధారులుగా గురువారం ‘విలన్’ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌పై సుదీప్ చేయి చేసుకునే సన్నివేశం ఉంది. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడిపై సుదీప్ చేయి చేసుకున్నారని సుదీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో దావణగెరెలో మీడియాతో సుదీప్ మాట్లాడుతూ... చిత్రరంగంలో ఎంతో అనుభవం ఉన్న శివరాజ్‌కుమార్ కథ వినకుండా సినిమాలో నటిస్తారా అని ప్రశ్నించారు. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా సినిమాను సినిమాగా చూడాలని సూచించారు. కావాలంటే ఆ ఫైట్ సీన్ సినిమా నుంచి తొలగిస్తే తనకు ఏలాంటి అభ్యంతరంలేదని సుదీప్ స్పష్టం చేశారు. సినిమాను చూసిన శివరాజ్‌కుమార్ అభిమానులు డైరెక్టర్ ప్రేమ్‌పై ఆక్రోశంను వ్యక్తం చేస్తున్నారు. ఆ సీన్‌ను సినిమా నుండి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అందోళన చేయాలని శివరాజ్‌కుమార్ అభిమానులు నిర్ణయించారు. అలాగే మరో సీనియర్ నటుడు దర్శన్‌పై కూడా సుదీప్ స్పందించారు. దర్శన్‌కు తనకు ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరి మధ్య కొద్దిపాటి మనస్పర్థలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. -
గౌరవంగా ఫీలవుతున్నా
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ సినిమా తాజా షెడ్యూల్ జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టైమ్‌లోనే చిరంజీవితో కలిసి ఫొటోకు ఫోజు ఇచ్చారు సుదీప్. ‘‘లెజండ్ చిరంజీవిగారితో స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. గౌరవంగా ఫీలవుతున్నాను. జార్జియా షెడ్యూల్లో నా షూటింగ్ పూర్తయింది. నేను నటించిన ‘ది విలన్’ సినిమా రేపు విడుదల అవుతోంది. ‘బిగ్‌బాస్’ కొత్త సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ వీకెండ్ ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు సుదీప్. ‘సైరా’ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా ‘కోటిగొబ్బ–3’, ‘పహిల్వాన్’ సినిమాలు కూడా సుదీప్ చేతిలో ఉన్నాయి. -
స్టార్ హీరోల మధ్య చిచ్చు..!
‘మదకరి నాయక’... ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో ఈ పేరు పలు వివాదాలకు కారణమైంది. ఇద్దరు స్టార్ హీరో అభిమానుల మధ్య ‘మదకరి నాయక’ వివాదాన్ని రేపుతోంది. 18వ శతాబ్దాపు రాజు మదకరి నాయకుడికి సంబంధించిన కథతో సినిమాను నిర్మించేందుకు కన్నడ సినిమా రంగంలోని చాలా మంది ఆసక్తి కనపరుస్తున్నారు. కిచ్చా సుదీప్ తన సొంత బ్యానర్లో మదకరి నాయకపై సినిమాను నిర్మిస్తానని ఇటీవల ప్రకటించారు. కిచ్చా సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ నిర్మాతగా మదకరి నాయక పాత్రను సుదీప్ పోషిస్తూ సుమారు 100 కోట్లతో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాను గురుదత్తా గనిగా, సంచిత్లల్లో ఎవరో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా మదకరి నాయకుడిపై సుదీప్తో సినిమా నిర్మించాలని వాల్మీకి ఫౌండేషన్ ప్రయత్నాలు చేస్తోంది. కిచ్చా సుదీప్ కూడా ఆ సినిమాపై ఆసక్తి కనపరుస్తున్నారు. కానీ ఇదే మదకరి నాయకుడి జీవిత చరిత్రపై మరో బడా హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా కన్ను వేశాడు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మాణంలో రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో మదికర నాయక సినిమాను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ‘గండుగలి వీర మదకరి నాయక’ పేరుతో దర్శన్‌తో సినిమాను నిర్మించనున్నట్లు ఇటీవలే నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ప్రకటించారు. దీంతో కిచ్చా సుదీప్ తీయాలనుకుంటున్న సినిమాను దర్శన్ హీరోగా నిర్మించనున్నడంపై సుదీప్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ హీరో మదకరి నాయక సినిమాలో నటిస్తారనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో శనివారం హీరో దర్శన్ చిత్రదుర్గలో ప్రారంభమైన శరణ సంస్కృతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి మదకరి నాయక చిత్రం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే పదేపదే సినిమా గురించి అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం సినిమా గురించి ఎలాంటి గందరగోళం చేయొద్దని సూచించారు. ప్రస్తుతం చిత్రదుర్గ శరణ సంస్కృతి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చానని, సినిమా గురించి మాట్లాడేందుకు ఇది సందర్భం కాదని అభిమానులను నివారించే ప్రయత్నం చేశారు. ఇదే ఉత్సవంలో పాల్గొన్న రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ... దసరా పండుగ జరుపుకునేందుకు వచ్చామని, ఇక్కడి సినిమా గురించి మాట్లాడడం వద్దని అభిమానులకు సూచించారు. మదకరి నాయక గురించి తర్వాత మాట్లాడుతామని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబులు పాల్గొన్నారు. ఎవరీ మదకరి? ఇంతంటి వివాదానికి కారకుడైన ఒంటిసలగా మదకరి నాయక అలియాస్ మదకరి నాయక చిత్రదుర్గకు చెందిన ఒక గొప్ప రాజు. కర్ణాటక చిత్రదుర్గకు చెందిన మదకరి సామాజిక వర్గానికి చెందిన మహారాజు. 1758లో జన్మించిన రాజా వీర మదకరి నాయక 1789లో శ్రీరంగపట్టణలో తుదిశ్వాస విడిచాడు.