
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ స్థాయి అధికారుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా సంస్థ గ్లోబల్ హెడ్ (ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్, సర్వీసెస్ విభాగం) సుదీప్ సింగ్ రాజీనామా చేశారు. సింగ్ సారథ్యంలో ఈ విభాగం ఆదాయం 100 మిలియన్ డాలర్ల నుంచి 750 మిలియన్ డాలర్లకు చేరింది.
సుదీప్ రాజీనామాపై స్పందించేందుకు ఇన్ఫీ నిరాకరించింది. కన్సల్టింగ్ విభాగం గ్లోబల్ హెడ్ కెన్ టూంబ్స్ గతేడాది అక్టోబర్‌లో వైదొలిగారు. అంతకు ముందు ఆగస్టులో మరో కీలకమైన అధికారి ఎం.డీ.రంగనాథ్ కూడా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment