సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం | Coronavirus Positive Cases Near Hero Sudeep And Darshan Houses | Sakshi
Sakshi News home page

సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం

Published Fri, Jun 26 2020 9:09 AM | Last Updated on Fri, Jun 26 2020 9:14 AM

Coronavirus Positive Cases Near Hero Sudeep And Darshan Houses - Sakshi

బెంగళూరులో కరోనా కేసులు రావడంతో ఓ ప్రాంతంలో సీల్‌డౌన్‌ చేసిన దృశ్యం

యశవంతపుర: లాక్‌డౌన్‌ను సడలించటంతో కరోనా రోజురోజుకు బెంగళూరు నగరంలో పెరిగిపోతోంది. ప్రముఖ హీరో సుదీప్‌ నివాసం ఉంటున్న హొసకెరెహళ్లిలోని రోడ్డు మార్గంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని సీల్‌డౌన్‌ చేశారు. ఇప్పుడు దర్శన్‌ భార్య విజయలక్ష్మీ, మరో నటుడు రవిశంకర్‌గౌడ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని రవిశంకర్‌గౌడ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. తన పిల్లలను దేవుడే కాపాడాలని ఆయన వేడుకొన్నారు. ఇక ఇంటి వాకిళ్లను 14 రోజుల పాటు తెరవటానికి సాధ్యం కాదని పోస్టులో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సుదీప్, గణప, సైజన్‌లు పిల్లలను తీసుకొని తమ ఇంటికి రావాలని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. హొసకెరెహళ్లిలో ఒక అపార్ట్‌మెంట్‌లో వీరు నివాసం ఉండగా, వీరితో పాటు దర్శన్, పూజా గాంధీలు అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మికి కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వదంతులను ఆమె కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

బెంగళూరులో కరోనా కేసులు రావడంతో ఓ ప్రాంతంలో సీల్‌డౌన్‌ చేసిన దృశ్యం
మంత్రి బావమరిదికి పాజిటివ్‌
రాష్ట్ర వైద్యా విద్యాశాఖ మంత్రి సుధాకర్‌ ఇంట్లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  ఆయన బావమరిదికి గురువారం పాజిటివ్‌గా వెల్లడైంది. ఇప్పటికే ఆయన ఇంట్లో వంట మనిషి, తండ్రి, భార్య, కూతురు కరోనాతో చికిత్స పొందుతుండడం తెలిసిందే. బావమరిదిని కలిసిన ఒక స్నేహితునికి సైతం కరోనా సోకింది. దీనితో ఆరోగ్యశాఖ అధికారులు వీరితో కలిసిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement