
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మారి చిరంజీవి బ్రిటీష్ వాళ్లపై సమర శంఖారావం పూరిస్తున్న విషయం తెలిసిందే. అంతమంది తెల్లవాళ్లను తరిమి కొట్టాలంటే అనుచరుల అవసరం కచ్చితంగా ఉంటుంది. ఆ అనుచరుల్లో ముఖ్యమైనవాడు, నమ్మినబంటు, తన కుడి భుజం ‘ఓబయ్య’ అంటాడు నరసింహారెడ్డి. ఈ ఓబయ్య పాత్రను తమిళ నటుడు విజయ్ సేతుపతి పోషించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కథలో ఇది చాలా కీలకమైన పాత్ర అట.
అమితాబ్‌బచ్చన్, నయనతార, ‘సుదీప్’ వంటి భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ కోసం లండన్ నుంచి చాలామంది జూనియర్ ఆర్టిస్ట్‌లను పిలిపించారు. ‘‘ఫస్ట్ షెడ్యూల్‌లో చిరంజీవిపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీశాం. చాలా బాగా వచ్చాయి’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో మరో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు .
Comments
Please login to add a commentAdd a comment