మడోనా సెబాస్టియన్
.. అంటూ మడోనాను వెల్కమ్ చేస్తోంది కన్నడ ఇండస్ట్రీ. మనకు ‘ఈగ’ విలన్‌గా ఎప్పటికీ గుర్తుండిపోయే సుదీప్ కన్నడంలో పెద్ద స్టార్ హీరో. ఆయన లేటెస్ట్ మూవీ ‘కోటిగొబ్బ’ని ఇటీవలే అనౌన్స్ చేశారు. అప్పటినుంచి సుదీప్ పక్కన హీరోయిన్‌గా ఎవరు యాక్ట్ చేస్తారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా బంపర్ ఆఫర్ మలయాళ నటి మడోనా సెబాస్టియన్‌కు లభించింది.
డెబ్యూ డైరెక్టర్ శివ కార్తీక్ డైరెక్ట్ చేçస్తున్న ఈ సినిమాను సూరప్ప బాబు నిర్మిస్తున్నారు. మలయాళ ‘ప్రేమమ్’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మడోనా తమిళంలో విజయ్ సేతుపతి, తెలుగు ‘ప్రేమమ్’లోనూ కనిపించారు. ఇప్పుడు కన్నడంలోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌లోనే సౌత్‌లో నాలుగు భాషల్లో యాక్ట్ చేసిన క్రెడిట్ కొట్టేశారీ కేరళ బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment