స్టార్ హీరో సినిమాలో విలన్‌గా సునీల్! | Tollywood actor Sunil is the antagonist of Kiccha Sudeep's film Max | Sakshi
Sakshi News home page

Sunil: శాండల్‌వుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న సునీల్.. ఆ స్టార్ హీరోతోనే!

Published Sat, Nov 4 2023 9:01 AM | Last Updated on Sat, Nov 4 2023 9:33 AM

Tollywood Actor Sunil is the antagonist of Kiccha Sudeep Film Max - Sakshi

టాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్నాడు. పుష్ప సినిమాలో శీనప్పగా మెప్పించిన సునీల్.. వరుస ఆఫర్లు వస్తున్నాయి. రజినీకాంత్ జైలర్‌లోనూ కీలక పాత్ర పోషించారు. తాజాగా శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. పుష్ప తరహాలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. 

(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!)

ఇప్పటికే పుష్ప సినిమాతో సునీల్ రేంజ్ మారిపోయింది. కమెడియన్ నుంచి పూర్తిస్థాయిలో విలన్‌ పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నారు. అదే క్రేజ్‌తో శాండల్‌వుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు. కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహాబలిపురంలో జరుగుతోంది. ఇటీవలే సునీల్ ఈ మూవీలో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ప్రకటించారు.

 ఈ చిత్రాన్ని విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సునీల్ శాండల్‌వుడ్‌ ఎంట్రీపై ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం బిగ్ ‍బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుదీప్ ఆ తర్వాత కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టితో మరో సినిమా చేయనున్నారు.  అంతకుముందే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లోనూ ఆయన పాల్గొననున్నారు. 

 మిశ్రమ స్పందన

అయితే సునీల్ ను మ్యాక్స్ లోకి తీసుకోవడంపై కన్నడ సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సినిమాకు సునీల్ అదనపు బలం అవుతాడని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం స్థానికంగా ఉన్న నటులను కాదని.. పక్క ఇండస్ట్రీలో నుంచి నటీనటులను తీసుకొని రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

(ఇది చదవండి: ఎలిమినేట్ చేయండ‌న్న గౌత‌మ్‌, చెప్పుతో కొట్టుకుంటాన‌న్న అమ‌ర్‌దీప్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement