క్రిస్‌మస్‌ బరిలో పాన్ ఇండియా చిత్రం.. రాబిన్‌హుడ్‌కు పోటీ తప్పదా? | Kichcha Sudeep Pan India Movie MAX Release Date Announed | Sakshi
Sakshi News home page

Kichcha Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ.. రాబిన్‌హుడ్‌తో పోటీకి రెడీ!

Published Wed, Nov 27 2024 6:26 PM | Last Updated on Wed, Nov 27 2024 6:38 PM

Kichcha Sudeep Pan India Movie MAX Release Date Announed

రాజమౌళి ఈగ మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్‌ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్‌ రోణ తర్వాత సుదీప్‌ చేస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్‌మెంట్‌ వీడియోను షేర్ చేశారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. డిసెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుదీప్ తన ట్వీట్‌లో రాస్తూ..' నిరీక్షణ ఇంకా ఉంది. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మీ ప్రోత్సాహానికి, సహనానికి నా ధన్యవాదాలు'  అంటూ పోస్ట్ చేశారు. అయితే అదే రోజున టాలీవుడ్‌ మూవీ రాబిన్‌హుడ్‌ కూడా రిలీజవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్‌తో పోటీ పడనున్నాడు కిచ్చా సుదీప్.

కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్‌ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement