max
-
ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జీ5 వేదికగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కాగా.. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
కిచ్చా సుదీప్ ‘మాక్స్’ మూవీ రివ్యూ
టైటిల్ : మాక్స్ నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులునిర్మాత: కలైపులి ఎస్. థానుదర్శకత్వం: విజయ్ కార్తికేయసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్రఎడిటింగ్ : ఎస్ఆర్ గణేష్ బాబువిడుదల తేది: డిసెంబర్ 27, 2024కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో తెలుగులోనూ మాక్స్‌పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. అలాంటి కాన్సెప్ట్‌తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారు. కేజీయఫ్ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కారణం.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కానీ...ఆ సినిమాలో ఉన్నదే మళ్లీ తెరపై చూపించలేదు.మాక్స్ కూడా కార్తి సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ మూవీ కథంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలా అని సినిమా బోర్ కొట్టదు. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక చిన్న పాయింట్ చుట్టు దర్శకుడు అల్లుకున్న కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను కాపాడింది.సీఐగా బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలు దేరడం..అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్ చేయడం.. ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఎలివేషన్ మాదిరి తెరపై ఒక్క సీన్ కూడా లేకపోవడం మైనస్. విలన్లు చేసిన క్రూరమైన పని ఒక్కటి కూడా తెరపై చూపించపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. పోలీసు స్టేషన్..దాని చుట్టు రౌడీలు తిరగడం..వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం.. ఫస్టాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది. ఒకటి రెండు యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయే తప్పా ఫస్టాఫ్ యావరేజ్‌గానే సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం కథనం పరుగులు పెడుతుంది. టైమ్ కౌంట్ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. అయితే కథకు కీలకమైన 15 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపు కూడా హడావుడిగా ఉన్నట్లు అనిస్తుంది. అయితే ఇతర చిత్రాలతో పోల్చడం పక్కకు పెట్టి..మాస్, యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం నచ్చుతుంది. సుదీప్ ఫ్యాన్స్‌కు అయితే దర్శకుడు ఫుల్ మీల్స్ పెట్టాడు. ఎవరెలా చేశారంటే.. కన్నడలో సుదీప్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్, మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. నెగెటిష్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సీఐ అర్జున్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్రకు ఇచ్చిన ఎలివేషన్.. తెరపై చూపించిన తీరుకు చాలా తేడా ఉంది. రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. విలన్ గనిగా సునీల్ రొటీన్ పాత్రలో కనిపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. క్లైమాక్స్ ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోతుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
క్రిస్మస్ బరిలో పాన్ ఇండియా చిత్రం.. రాబిన్‌హుడ్‌కు పోటీ తప్పదా?
రాజమౌళి ఈగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోణ తర్వాత సుదీప్ చేస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేశారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. డిసెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుదీప్ తన ట్వీట్లో రాస్తూ..' నిరీక్షణ ఇంకా ఉంది. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మీ ప్రోత్సాహానికి, సహనానికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. అయితే అదే రోజున టాలీవుడ్ మూవీ రాబిన్‌హుడ్ కూడా రిలీజవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్‌తో పోటీ పడనున్నాడు కిచ్చా సుదీప్.కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు.It's been quite a wait. Finally happy to announce the release date.Thanks for the unlimited patience shown by all you friends out there and the consistent encouragement.🤗❤️#MaxTheMovie hits the theaters this Dec 25th.https://t.co/car6H2hmEb— Kichcha Sudeepa (@KicchaSudeep) November 27, 2024 -
Hyderabad: మ్యాక్స్ మాన్యా ప్రారంభం..
నగర ఫ్యాషన్ ఔత్సాహికులను అలరించేందుకు మ్యాక్స్ ఫ్యాషన్ ఆధ్వర్యంలో ‘మాన్యా సెల్’ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అధునాతన ఫ్యాషన్‌కు వేదికైన నగరంతో పాటు దేశవ్యాప్తంగా మ్యాక్స్ ఫ్యాషన్ ప్రియులకు నేటి నుంచి ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ష్యాషన్ రంగంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా రూ.399 లోపే స్పెషల్ మాన్యా సెల్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. -
సీనియర్ సిటిజన్ల ఆరోగ్య సంరక్షణ అలక్ష్యం
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్–19 సమయంలో భారత్‌లోని దాదాపు 70 శాతం మంది సీనియర్ సిటిజన్లకు సరైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేవని మ్యాక్స్ గ్రూప్ సంస్థ.. అంటారా సర్వే వెల్లడించింది. దాదాపు 57 శాతం మంది ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు కూడా సర్వే తెలిపింది. సర్వే ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 60 సంవత్సరాలు పైబడిన 2,100 మంది వృద్ధుల అభిప్రాయాలతో సర్వే వెలువడింది. ► సర్వే ప్రకారం, మహమ్మారి వృద్ధుల జీవన విధానాలను, ప్రాధాన్యతలను మార్చింది. అలాగే సాంకేతికత వినియోగంలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. ► వ్యాధి సోకుతుందనే భయం 65 శాతాన్ని వెంటాడింది. 58 శాతం మంది సీనియర్ సిటిజన్లు కఠినమైన మార్గదర్శకాల ఫలితంగా సామాజిక ఒంటరితనంపై ఆందోళన చెందారు. ► తీవ్ర అనారోగ్య సమస్యల బారి పడకుండా ఎలా తప్పించుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనే అంశాలపై వృద్ధులు దృష్టి పెట్టారు. దాదాపు 72 శాతం మంది వృద్ధులు స్వీయ పర్యవేక్షణ, సమతుల్య ఆహారాన్ని ఎంచుకున్నారు. 55 శాతం మంది బయటి వైద్య సహాయం కోరే బదులు ఇంటి ఆరోగ్య సంరక్షణా విధానాలపై మొగ్గు చూపారు. ► వృద్ధాప్య జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి, మెరుగైన ఆయుర్దాయం వంటి అంశాలు భారతదేశంలో అనుబంధ ఆరోగ్య సంరక్షణ సేవలకు డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నట్లు అంటారా పేర్కొంది. -
బతికుండగానే విగ్రహం! ఎందుకంటే..
ఏదో గొప్ప పనులు చేయడమో.. లేదంటే జనాలకు బాగా దగ్గర అయినవాళ్లు విగ్రహాలను రోడ్ల మీద చూస్తుంటాం. అలాంటిది ఓ కుక్కకు.. అదీ బతికుండగానే కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు వాయవ్య ఇంగ్లండ్‌లో. ఎందుకంటారా?.. లండన్: పదమూడేళ్ల మ్యాక్స్.. ఒక థెరపీ డాగ్. కుంబ్రియాలోని కెస్విక్లో అది జనాల ఆదరణ చురగొంటోంది. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా అది పదివేల మందికి ప్రశాంతతను అందించింది. ఇందుకుగానూ ఈ ఫిబ్రవరిలో దానికి మెరిట్ సర్టిఫికెట్ కూడా అందించారు. ఇక ఇప్పుడు ఏకంగా విగ్రహం పెట్టించారు. ది మిరకిల్ డాగ్ అనే బిరుదును దీనికి ఇచ్చారు. ఆ ట్యాగ్ లైన్‌కు తగ్గట్లే మ్యాక్స్ అద్భుతాలు చేస్తుంది. పుట్టినరోజులకు గ్రీటింగ్స్ అందజేయడం, ఛారిటీ వాక్స్‌లో పాల్గొనడం, స్కూల్ పిల్లలతో సరదాగా ఆడుకోవడం, ఒంటరితనం భరించలేనివాళ్లతో కాసేపు గడపడం.. ఇలా అందరిలో ఆనందాన్ని నింపుతోంది. అంతేకాదు ఛారిటీల ద్వారా అది ఏకంగా మూడు లక్షల పౌండ్లు వసూలు చేయడం విశేషం. ఇక హోప్ పార్క్ బయట దాని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బహుశా బతికుండగానే ఈ గౌరవం అందుకున్న మొదటి మూగ జీవి ఇదేనేమోనని అక్కడి అధికారులు చెప్తున్నారు. రోడ్డు మీద నుంచి.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో దానిని ఎవరో రోడ్డు మీద వదిలేశారు. 2008లో కెర్రీ ఇర్వింగ్ దానిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. 2016 నుంచి దానికి థెరపీ డాగ్ ట్రైనింగ్ ఇప్పించాడు కెర్రీ. కాగా, మ్యాక్స్ విగ్రహాన క్రిస్టీ అనే కళాకారుడు తయారు చేయగా.. సోఫి అనే పన్నెండేళ్ల చిన్నారి చేత మ్యాక్స్గాడి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. చదవండి: ఎక్కడ చూసినా వేడి.. ఉక్కపోత! ఎందుకో తెలుసా? -
రూపాయి... రెండు వారాల గరిష్టం @ 71.50
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం రెండు వారాల గరిష్టం 71.50 స్థాయికి చేరింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 24 పైసలు బలపడింది. అక్టోబర్ 17 తరువాత రూపాయి ఒకేరోజు 24 పైసలు బలపడ్డం ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ట్రేడింగ్‌లో 71.49–71.68 శ్రేణిలో తిరిగింది. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు బలపడింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ ముందుకు వెళ్లలేకపోయింది. చమురు ధర పెరుగుదల భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. -
మ్యాక్స్ హెల్త్‌కేర్... రేడియంట్ లైఫ్ కేర్ చేతికి
న్యూఢిల్లీ: హాస్పిటల్ చెయిన్ మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను ఆస్పత్రుల నిర్వహణ సంస్థ రేడియంట్ లైఫ్‌కేర్ కొనుగోలు చేయనుంది. ఈ రెండింటి విలీనం ద్వారా ఏర్పడే సంస్థ విలువ సుమారు రూ.7,242 కోట్లుగా ఉండనుంది. పలు లావాదేవీలతో ఈ డీల్ జరగనుంది. ప్రస్తుతం రేడియంట్ లైఫ్ కేర్‌కు దన్నుగా ఉంటున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్... ఇకపై విలీన సంస్థలో మెజారిటీ వాటాదారుగా మారుతుంది. రేడియంట్ లైఫ్ కేర్ ప్రమోటరు అభయ్ సోయ్... విలీన సంస్థకు చైర్మన్‌గా ఉంటారు. మ్యాక్స్ హెల్త్‌కేర్ ప్రమోటర్లయిన అనల్జిత్ సింగ్ తదితరులు వైదొలుగుతారు. ‘రేడియంట్, మ్యాక్స్ హెల్త్‌కేర్ కలయికతో ఉత్తర భారతంలో అతి పెద్ద ఆస్పత్రుల నెట్వర్క్ ఏర్పాటవుతుంది. ఆదాయపరంగా దేశంలోని టాప్ 3 ఆస్పత్రుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా, బెడ్స్ పరంగా నాలుగో స్థానంలోనూ ఉంటుంది‘ అని రేడియంట్ తెలియజేసింది. విలీన సంస్థకు దేశ వ్యాప్తంగా 16 ఆస్పత్రుల్లో 3,200 పైచిలుకు బెడ్స్ (పడకలు) ఉం టాయి. వేల్యుయేషన్ నివేదిక ప్రకారం షేర్ల మార్పిడి నిష్పత్తిని పరిశీలిస్తే... విలీన సంస్థలో కేకేఆర్‌కు 51.9%, అభయ్ సోయ్‌కి 23.2%, మ్యాక్స్ ప్రమోటర్లకు 7% వాటాలుంటాయి. మిగతావి పబ్లిక్, ఇతర షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. విలీన సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్ బ్రాండ్‌తోనే.. లోగోలో స్వల్ప మార్పులతో కొనసాగుతుందని రేడియంట్ పేర్కొంది. ఒప్పందం ఇలా.. డీల్ కింద మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన లైఫ్ హెల్త్‌కేర్‌కు ఉన్న 49.7 శాతం వాటాలను నగదు లావాదేవీ ద్వారా రేడియంట్ కొనుగోలు చేస్తుంది. అలాగే, మ్యాక్స్ ఇండియా తమ నాన్–హెల్త్‌కేర్ వ్యాపార విభాగాన్ని (మ్యాక్స్ బూపా, అంతర సీనియర్ లివింగ్) విడగొట్టి ప్రత్యేక కంపెనీగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తుంది. ప్రస్తుత మ్యాక్స్ ఇండియా షేర్ హోల్డర్లకు కొత్త కంపెనీ షేర్లు కూడా దక్కుతాయి. రూ. 2 ముఖ విలువ గల ప్రతి 5 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖ విలువ ఉండే కొత్త కంపెనీ షేరు ఒకటి కేటాయిస్తారు. మరోవైపు, డీమెర్జర్ అనంతరం రేడియంట్కి చెందిన హెల్త్‌కేర్ అసెట్స్‌ను మ్యాక్స్ హెల్త్‌కేర్‌కు బదలాయిస్తారు. అటుపైన దీన్ని మళ్లీ మ్యాక్స్ ఇండియాలో విలీనం చేసి (రివర్స్ మెర్జర్) కొత్త సంస్థను మ్యాక్స్ హెల్త్‌కేర్‌గా కొనసాగిస్తారు. రివర్స్ మెర్జర్ కారణంగా రూ. 2 ముఖవిలువ గల ప్రతి 100 మ్యాక్స్ ఇండియా షేర్లకు గాను.. రూ. 10 ముఖవిలువ గల విలీన సంస్థ షేర్లు 99 కేటాయిస్తారు. కొనుగోలు వార్తలతో సోమవారం మ్యాక్స్ ఇండియా షేర్లు బీఎస్ఈలో 4.32 శాతం క్షీణించి రూ.80.80 వద్ద క్లోజయ్యాయి. -
మోడల్ హంట్
-
జోష్: తీపి కబురు చెప్పిన జుకర్ బర్గ్
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వారికి త్వరలో మరో బిడ్డ జన్మించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా జూకర్ బర్గ్ తన అధికారిక పేజీలో పేర్కొన్నారు. అయితే, తమకు మరో కూతురు పుట్టబోతోందని బర్గ్ ప్రకటించడం విశేషం. ఇప్పటికే వారికే మ్యాక్స్ అనే ఓ పాప ఉంది. ఇప్పుడా పాపకు 15 నెలలు. ఆ సంతోషంలో నుంచే ఇప్పటి వరకు బయటపడని ఆ దంపతులు మరో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ‘మాకు మరో ఆడబిడ్డ పుట్టుబోతోందనే విషయం మీతో పంచుకోవడంపట్ల నేను, ప్రిస్కిల్లా చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా నవ శిశువుకు స్వాగతం చెప్పేందుకు మేం ఇక ఎంతమాత్రము ఎదురుచూడలేము. మరో శక్తిమంతమైన మహిళగా ఆమెను పెంచేందుకు మేం శాయాశక్తులా ప్రయత్నిస్తాం’ అంటూ జూకర్ తన పేజీలో చెప్పారు. తొలుత అసలు తమకు పిల్లలే పుట్టరని అనుకున్నామని, తన భార్యకు అంతకుముందు మూడు సార్లు గర్భస్రావం అయిందని, ఆ తర్వాతే మ్యాక్స్ జన్మించిందని, ఇప్పుడు మరో బేబీ రాబోతుందంటూ ఆయన సంతోషం పంచుకున్నారు. తమకు జన్మించబోయే రెండో కూతురు చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. -
సొసైటీ భూములపై నిఘాకు కొత్త చట్టం
• రెవెన్యూశాఖ జోక్యం చేసుకునేలా సహకార చట్టం–2016కి రూపకల్పన • సహకార భూముల్లో అక్రమాలు జరిగితే వెనక్కి లాగేసుకునే వీలు సాక్షి, హైదరాబాద్: మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీస్ (మ్యాక్స్) చట్టాన్ని కొత్త సహకార చట్టంలో కలిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు న్యాయ శాఖ అనుమతి తీసుకుంది. దీనిపై సహకార శాఖ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపారు. వివిధ సొసైటీలు ఇళ్లు ఇతరత్రా అవసరాల కోసం తీసు కున్న భూముల్లో అక్రమాలు నెలకొంటే వాటిని కట్టడి చేయడానికి... ఆ భూములను తిరిగి వెనక్కు తీసుకోవడానికి రెవెన్యూ శాఖకు అవకాశం కల్పించాలని ప్రతిపాదిం చారు. భారీ మార్పులు చేర్పులతో నూతన సహకార చట్టం–2016 రానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముసాయిదా బిల్లును రూపొందిస్తారు. అవసరమైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేకుంటే వచ్చే సమావేశాల్లో సహకార చట్టం–2016 ఉనికిలోకి రానుంది. మ్యాక్స్‌తో అక్రమాల వెల్లువ... సహకార చట్టం, మ్యాక్స్‌లు వేర్వేరుగా ఉన్నాయి. మ్యాక్స్ ద్వారా అనేక డెయిరీ, హౌసింగ్ తదితర సొసైటీలు పనిచేస్తు న్నాయి. వీటిల్లో అనేక సొసైటీలు అక్రమాలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. సొసైటీ లు అనేకం ప్రభుత్వ భూములను తీసుకొని అక్రమాలు చేస్తున్నాయన్న ఆరోపణలు న్నాయి. వాటిపై నియంత్రణే లేదు. కొన్ని హౌసింగ్ సొసైటీలు భూములు తీసుకొని అక్రమంగా అర్హత లేనివాళ్లకు కట్టబెడుతున్న ట్లు బయటకు పొక్కాయి. ఇలా సొసైటీల్లో జరిగే అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సహకారశాఖకు అవకాశం లేకుండా పోయింది. మ్యాక్స్‌లో సవరణలు చేసే బదులు దాన్నే సహకార చట్టంలో కలిపే యాలనేది సహకారశాఖ ఉద్దేశం. ఆ ప్రకారం నూతన చట్టాన్ని తీసుకురావాలనేది సర్కారు యోచన. కట్టుదిట్టంగా మార్పులు చేర్పులతో నూతన చట్టాన్ని తీసుకొస్తే కొన్ని సొసైటీల అక్రమాలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని చెబుతున్నారు. -
మాక్స్‌లో కొత్త కలెక్షన్లు
సోమాజిగూడ: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాక్స్ ఫ్యాషన్స్ సోమాజిగూడలోని స్టోర్‌లో బుధవారం కొత్త కలెక్షన్లను ఆవిష్కరించింది. ఇందులో మోడల్స్ విభిన్న వస్త్రాలను ధరించి తళుక్కుమన్నారు. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో సరికొత్త వస్త్ర శ్రేణి అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆ బేబీ ఫస్ట్ స్విమ్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తండ్రిగా ప్రమోషన్ పొందినప్పటి నుంచి తన చిట్టి పాపకు సంబంధించిన వార్తలతో ప్రపంచం చూపును తమ వైపుకు తిప్పుకుంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా పాపాయిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నాడు. తాజాగా మాక్స్ ఫస్ట్ స్విమ్ అంటూ ఒక ఫోటోను జుకర్ బర్గ్ షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ బుజ్జి మాక్స్ ఫోటో చక్కర్లు కొడుతోంది. మొదటి ఫోటో, తొలి టీకా ఇలా ఇలా రకరకాల ఫోటోలతో ఇపుడా చిన్నారి కూడా పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. మాక్స్ జననంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన జుకర్ బర్గ్ బిడ్డ ఆలపానాలనే తన ప్రపంచంగా మార్చుకున్నాడు. తండ్రిగా తన అనుభూతులను ఫేస్బుక్ పోస్టులు, ట్విట్ల ద్వారా షేర్ చేస్తున్నాడు. నీటి మీద తేలియాడుతున్న బుజ్జి పాపాయిని పదిలంగా పట్టుకొని మురిసిపోతూ.. ఇది మాక్స్ ఫస్ట్ స్విమ్....షి లవ్స్ ఇట్ అని ట్విట్ చేశాడు. దీంతో కామెంట్లు, షేర్లు, లైక్ లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్, కుమార్తె మాక్స్ పేరుతో భారీ మొత్తంలో స్వచ్ఛంద సేవ కోసం దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. మాక్స్ రావడంతో తమ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభం అయ్యాయని...తల్లిదండ్రులుగా తాము సంతోషంగా ఉన్నామని జుకర్ బర్గ్ - ప్రిస్కిల్లా దంపతులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జుకర్‌బర్గ్ ఇంట్లో 'స్టార్‌వార్స్' దండు!
త్వరలోనే విడుదలకానున్న 'స్టార్ వార్స్' సిరీస్‌లోని ఏడో ఛాప్టర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫేస్బుక్ స్థాపకుడు జుకర్‌బర్గ్ కూడా 'స్టార్ వార్స్' అభిమానే. అందుకే తన అభిమానాన్ని వినూత్నరీతిలో ఆవిష్కరిస్తూ ఆయన తన ఇంట్లోనే 'సార్వార్స్' దళాన్ని ఆవిష్కరించారు. తన ముద్దుల కూతురు 'మాక్స్'ను 'స్టార్‌వార్స్' యోధురాలి దుస్తుల్లో అలంకరించారు జుక్. ఆ చిన్నారి వద్ద ఓ చిన్ని గ్రీన్‌లైట్ ఖడ్గాన్ని, స్టార్‌వార్స్ చిహ్నాలైన డార్త్ వాడర్ మాస్క్, చ్యుబాకా మస్క్ ఉంచారు. దీంతో చిన్నపాటి యుద్ధయోధురాలిగా తయారైన 'మాక్స్'.. తండ్రి ఫొటోలు తీస్తుండగా గంభీరంగా పోజు ఇచ్చింది. 'మాక్స్' యే కాదు తన బుజ్జికుక్క 'బీస్ట్'ను కూడా స్టార్‌వార్స్ యోధుడిగా మార్చారు ఆయన. దానికి ఓ రెడ్‌లైట్ ఖడ్గాన్ని ఇచ్చారు. దీంతో 'బీస్ట్' కూడా ఓ సూపర్ పోజు ఇచ్చింది. అన్నట్టు 'బీస్ట్'కు రెండు చికెన్ లెగ్‌పీసులు విందుగా ఇస్తేనే ఇందుకు ఒప్పుకున్నదట. మొత్తానికి జుకర్‌బర్గ్ ఇంట్లో రెడీ అయిన ఈ 'స్టార్‌వార్స్' దండు ఫేస్బుక్ వాసులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. -
కూతురికి జుకర్‌బర్గ్ లెటర్
డియర్ మాక్స్! ►నీ జననం మాకు (తల్లిదండ్రులిద్దరు) భవిష్యత్తుపై కొత్త ఆశలు పెంచింది. ►మా ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావటం లేదు. నీ కొత్త జీవితం చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ►అందరు తల్లిదండ్రుల్లాగానే.. మాకంటే మంచి ప్రపంచంలో నువ్వు బతకాలనేది మా ఆశ. ►మేం అనుకున్నట్లుగా జరిగేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. ►నిన్ను అమితంగా ప్రేమిస్తున్నందుకు మాత్రమే కాదు.. వచ్చేతరం పిల్లల గురించి ఆలోచించటం కూడా మా నైతిక బాధ్యత. ►వందేళ్లలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎన్నో మందులను తయారుచేశాం. ►ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు మందులు కూడా కనుగొన్నాం. మిగిలిన వాటి విషయంలో కీలక పురోగతి సాధించాం. ►వచ్చే వందేళ్లలో వ్యాధులను నియంత్రించటం, నయం చేయటంపైనా పైచేయి సాధిస్తాం. ►వ్యక్తిగత సామర్థ్యం పెంపు వల్ల సరిహద్దులు చెరిపేసే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ►అందరూ సమానమనే భావనతో పుట్టిన ప్రాంతం, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచంలో అందరికీ అవకాశాలను అందించే వీలుంటుంది. ►అందుకే ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాం. ►ప్రతి రంగంలో తమదైన ఆలోచనలతో పనిచేస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలబడాలనుకుంటున్నాం. ►మీ తరం బాగుండాలంటే.. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ►ఈ దిశగా మా పాత్ర కూడా ఉండాలని నేను, మీ అమ్మ నిర్ణయించుకున్నాం. ►ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫేస్‌బుక్‌లోని 99శాతం షేర్లను ఇవ్వాలని నిర్ణయించాం. ►ప్రస్తుతం దీని విలువ 45 బిలియన్ ►డాలర్లు (దాదాపు రూ. 3 లక్షల కోట్లు). ఇది చాలా చిన్న మొత్తమే అని మాకు తెలుసు. ►మాతృత్వ, పితృత్వ సెలవులు పూర్తయి కొత్త జీవితంలో సెటిల్ అయ్యాక.. తదుపరి వివరాలను వెల్లడిస్తాం. ►తల్లిదండ్రులుగా మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో.. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ►ఫేస్‌బుక్‌లోని ప్రతి వ్యక్తి ఈ యజ్ఞంలో భాగస్వామే. ►మాక్స్! నిన్నెంతగానో ప్రేమిస్తున్నాం. అందుకే.. నీతోపాటు నీ తరంలో ఇతర పిల్లలను కూడా మంచి వాతావరణంలో ఉంచటాన్ని ఓ బాధ్యతగా తీసుకుంటున్నాము. ► నీ జీవితంలో కూడా ఇదే ప్రేమ, ఆశ, ఆనందం ఉండాలని ఆశిస్తున్నాం. నిన్ను ఈ ప్రపంచానికి చూపించేందుకు ఇక ఆలస్యం చేయం. ప్రేమతో, మీ అమ్మ, నాన్న -
మిస్ హైదరాబాద్ టైటిల్‌కు పోటీపడుతున్న భామలు