
కూతురికి జుకర్‌బర్గ్ లెటర్
డియర్ మాక్స్!
►నీ జననం మాకు (తల్లిదండ్రులిద్దరు) భవిష్యత్తుపై కొత్త ఆశలు పెంచింది.
►మా ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావటం లేదు. నీ కొత్త జీవితం చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.
►అందరు తల్లిదండ్రుల్లాగానే.. మాకంటే మంచి ప్రపంచంలో నువ్వు బతకాలనేది మా ఆశ.
►మేం అనుకున్నట్లుగా జరిగేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం.
►నిన్ను అమితంగా ప్రేమిస్తున్నందుకు మాత్రమే కాదు.. వచ్చేతరం పిల్లల గురించి ఆలోచించటం కూడా మా నైతిక బాధ్యత.
►వందేళ్లలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎన్నో మందులను తయారుచేశాం.
►ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు మందులు కూడా కనుగొన్నాం. మిగిలిన వాటి విషయంలో కీలక పురోగతి సాధించాం.
►వచ్చే వందేళ్లలో వ్యాధులను నియంత్రించటం, నయం చేయటంపైనా పైచేయి సాధిస్తాం.
►వ్యక్తిగత సామర్థ్యం పెంపు వల్ల సరిహద్దులు చెరిపేసే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.
►అందరూ సమానమనే భావనతో పుట్టిన ప్రాంతం, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచంలో అందరికీ అవకాశాలను అందించే వీలుంటుంది.
►అందుకే ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాం.
►ప్రతి రంగంలో తమదైన ఆలోచనలతో పనిచేస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలబడాలనుకుంటున్నాం.
►మీ తరం బాగుండాలంటే.. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.
►ఈ దిశగా మా పాత్ర కూడా ఉండాలని నేను, మీ అమ్మ నిర్ణయించుకున్నాం.
►ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫేస్‌బుక్‌లోని 99శాతం షేర్లను ఇవ్వాలని నిర్ణయించాం.
►ప్రస్తుతం దీని విలువ 45 బిలియన్
►డాలర్లు (దాదాపు రూ. 3 లక్షల కోట్లు). ఇది చాలా చిన్న మొత్తమే అని మాకు తెలుసు.
►మాతృత్వ, పితృత్వ సెలవులు పూర్తయి కొత్త జీవితంలో సెటిల్ అయ్యాక.. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.
►తల్లిదండ్రులుగా మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో.. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో
సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
►ఫేస్‌బుక్‌లోని ప్రతి వ్యక్తి ఈ యజ్ఞంలో భాగస్వామే.
►మాక్స్! నిన్నెంతగానో ప్రేమిస్తున్నాం. అందుకే.. నీతోపాటు నీ తరంలో ఇతర పిల్లలను కూడా మంచి వాతావరణంలో ఉంచటాన్ని ఓ బాధ్యతగా తీసుకుంటున్నాము.
► నీ జీవితంలో కూడా ఇదే ప్రేమ, ఆశ, ఆనందం ఉండాలని ఆశిస్తున్నాం. నిన్ను ఈ ప్రపంచానికి చూపించేందుకు ఇక ఆలస్యం చేయం.
ప్రేమతో, మీ అమ్మ, నాన్న