జుకర్‌బర్గ్‌ ఇంట్లో 'స్టార్‌వార్స్‌' దండు! | Facebook founder dresses his baby and dog in 'Star Wars' merchendise | Sakshi
Sakshi News home page

జుకర్‌బర్గ్‌ ఇంట్లో 'స్టార్‌వార్స్‌' దండు!

Published Sun, Dec 20 2015 2:56 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

జుకర్‌బర్గ్‌ ఇంట్లో 'స్టార్‌వార్స్‌' దండు! - Sakshi

జుకర్‌బర్గ్‌ ఇంట్లో 'స్టార్‌వార్స్‌' దండు!

త్వరలోనే విడుదలకానున్న 'స్టార్‌ వార్స్‌' సిరీస్‌లోని ఏడో ఛాప్టర్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫేస్‌బుక్‌ స్థాపకుడు జుకర్‌బర్గ్‌ కూడా 'స్టార్‌ వార్స్' అభిమానే. అందుకే తన అభిమానాన్ని వినూత్నరీతిలో ఆవిష్కరిస్తూ ఆయన తన ఇంట్లోనే 'సార్‌వార్స్' దళాన్ని ఆవిష్కరించారు.

తన ముద్దుల కూతురు 'మాక్స్‌'ను 'స్టార్‌వార్స్‌' యోధురాలి దుస్తుల్లో అలంకరించారు జుక్‌. ఆ చిన్నారి వద్ద ఓ చిన్ని గ్రీన్‌లైట్‌ ఖడ్గాన్ని, స్టార్‌వార్స్ చిహ్నాలైన డార్త్‌ వాడర్ మాస్క్, చ్యుబాకా మస్క్‌ ఉంచారు. దీంతో చిన్నపాటి యుద్ధయోధురాలిగా తయారైన 'మాక్స్‌'.. తండ్రి ఫొటోలు తీస్తుండగా గంభీరంగా పోజు ఇచ్చింది. 'మాక్స్‌' యే కాదు తన బుజ్జికుక్క 'బీస్ట్‌'ను కూడా స్టార్‌వార్స్‌ యోధుడిగా మార్చారు ఆయన. దానికి ఓ రెడ్‌లైట్‌ ఖడ్గాన్ని ఇచ్చారు. దీంతో 'బీస్ట్‌' కూడా ఓ సూపర్‌ పోజు ఇచ్చింది. అన్నట్టు 'బీస్ట్‌'కు రెండు చికెన్‌ లెగ్‌పీసులు విందుగా ఇస్తేనే ఇందుకు ఒప్పుకున్నదట. మొత్తానికి జుకర్‌బర్గ్‌ ఇంట్లో రెడీ అయిన ఈ 'స్టార్‌వార్స్' దండు ఫేస్‌బుక్‌ వాసులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement