ఆ బేబీ ఫస్ట్ స్విమ్ | Mark Zuckerberg takes Max for her first swim! | Sakshi
Sakshi News home page

ఆ బేబీ ఫస్ట్ స్విమ్

Published Mon, Jan 25 2016 11:54 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

ఆ బేబీ ఫస్ట్ స్విమ్

ఆ బేబీ ఫస్ట్ స్విమ్

న్యూఢిల్లీ:  ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తండ్రిగా ప్రమోషన్ పొందినప్పటి నుంచి తన చిట్టి పాపకు సంబంధించిన వార్తలతో  ప్రపంచం చూపును తమ వైపుకు తిప్పుకుంటున్నాడు.  సోషల్ మీడియా వేదికగా  పాపాయిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నాడు.   తాజాగా  మాక్స్ ఫస్ట్ స్విమ్ అంటూ ఒక ఫోటోను జుకర్ బర్గ్ షేర్ చేశాడు.  దీంతో ప్రస్తుతం ఈ బుజ్జి మాక్స్  ఫోటో  చక్కర్లు కొడుతోంది.  మొదటి  ఫోటో,  తొలి టీకా ఇలా ఇలా రకరకాల ఫోటోలతో  ఇపుడా  చిన్నారి కూడా  పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది.


మాక్స్ జననంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన జుకర్ బర్గ్ బిడ్డ ఆలపానాలనే తన  ప్రపంచంగా మార్చుకున్నాడు. తండ్రిగా తన అనుభూతులను  ఫేస్బుక్ పోస్టులు, ట్విట్ల ద్వారా  షేర్ చేస్తున్నాడు.   నీటి మీద తేలియాడుతున్న బుజ్జి పాపాయిని  పదిలంగా పట్టుకొని మురిసిపోతూ.. ఇది మాక్స్ ఫస్ట్  స్విమ్....షి లవ్స్ ఇట్ అని ట్విట్ చేశాడు.  దీంతో  కామెంట్లు, షేర్లు, లైక్ లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

కాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్,  కుమార్తె మాక్స్ పేరుతో భారీ మొత్తంలో  స్వచ్ఛంద సేవ కోసం దానం చేసి  ఆదర్శంగా నిలిచాడు. మాక్స్‌ రావడంతో తమ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభం అయ్యాయని...తల్లిదండ్రులుగా తాము  సంతోషంగా ఉన్నామని జుకర్ బర్గ్ - ప్రిస్కిల్లా దంపతులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement