
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ఏఐ కొత్త వర్షన్ 'గ్రోక్ 3'(Grok 3)ని లాంచ్ చేసిన తరువాత.. ఎక్స్ (ట్విటర్) ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి.
ఇండియాలో ఇప్పటివరకు.. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ. 1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ. 3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ. 18,300 నుంచి రూ. 34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ. 244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ. 650గా ఉన్నాయి.
గ్రోక్ 3
టెస్లా అధినేత మస్క్.. ఎక్స్‌లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్‌లో కొత్త జనరేటివ్ ఏఐ మోడల్ 'గ్రోక్ 3'ను ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని పేర్కొన్నారు. గణితం, సైన్స్, కోడింగ్ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్‌లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్‌కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!
Comments
Please login to add a commentAdd a comment