
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన చూపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI) మీద పడింది. ఈ కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.
2024లో రెండుసార్లు OpenAIపై దావా వేసిన మస్క్ ఇప్పుడు.. సంస్థనే కొనుకోలు చేయడానికి సిద్ధమయ్యాయి. 97.4 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తామంటూ.. మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఆఫర్ ఇచ్చింది. దీనిని ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' (Sam Altman) తిరస్కరించారు.
మీ ఆఫర్‌కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై మస్క్ స్పందిస్తూ.. 'మోసగాడు' అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
no thank you but we will buy twitter for $9.74 billion if you want
— Sam Altman (@sama) February 10, 2025
ఓపెన్ఏఐ
నవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్‌మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.
ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది.
Scam Altman
pic.twitter.com/j9EXIqBZ8u— Elon Musk (@elonmusk) February 10, 2025