![Sam Altman Says About Elon Musk Insecure Not Happy Person](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/sam-altman.jpg.webp?itok=mQBAX9TZ)
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI)ను కొనుగోలు చేస్తా అన్న తరువాత.. ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్.. మస్క్‌ను తీవ్రంగా విమర్శించారు.
పారిస్ ఏఐ సమ్మిట్ సందర్భంగా.. బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ ఆల్ట్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ''బహుశా అతని జీవితమంతా అభద్రతా దృక్పథం నుంచి వచ్చింది, ఆ వ్యక్తి పట్ల నాకు సానుభూతి ఉంది. అతను సంతోషంగా ఉన్న వ్యక్తి అని నేను అనుకోను'' అని మస్క్‌ను విమర్శించారు.
మస్క్, ఆయన పెట్టుబడిదారుల బృందం ఓపెన్ఏఐ కొనుగోలుకు ఆఫర్ ఇచ్చిన తర్వాత.."కంపెనీ అమ్మకానికి లేదు. మమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నించడం.. అతని వ్యూహాలలో మరొకటి" అని ఆల్ట్‌మన్ చెప్పాడు. మా వేగాన్ని తగ్గించడానికి మస్క్ ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యానించారు.
ఓపెన్ ఏఐ కొనుగోలుకు మస్క్ ఆఫర్
మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఓపెన్‌ఏఐను కొనుగోలు చేయడానికి.. 97.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) ఆఫర్ ఇచ్చింది. దీనికి రిప్లై ఇస్తూ.. మీ ఆఫర్‌కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్‌మన్ అన్నారు.
ఓపెన్ఏఐ
నవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్‌మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.
ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?
2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment