అపరకుబేరుడు ఎలోన్ మస్క్ కోర్టు మెట్లెక్కారు. 2015 చాట్‌జీపీటీ తయారీలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించారంటూ చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ సామ్ ఆల్ట్‌మాన్‌తో పాటు పలువురిపై శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు.
దావాలో సామ్ ఆల్ట్‌మాన్, ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్‌తో కలిసి మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా లాభపేక్షలేకుండా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అభివృద్ధి చేసేలా మస్క్‌ను కలిశారు. అప్పటికే వ్యాపార రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మస్క్‌ను వ్యాపారం, ఆర్ధికంగా మద్దతు కావాలని కోరారు.
మస్క్‌తో కలిసి ఉమ్మడిగా ఓపెన్‌ఏఐ సంస్థను ఏర్పాటు చేశారు. చాట్ జీపీటీపై పనిచేశారు. అయితే ఆ సమయంలో మస్క్-ఆల్ట్‌మన్‌లు ఓ బిజినెస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు దానిని ఆల్ట్‌మన్ అతిక్రమించారంటూ కోర్టులో వేసిన దావాలో మస్క్ తరుపు న్యాయ వాదులు పేర్కొన్నారు.
అయితే, తనతో ఆల్ట్‌మన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లగా కాకుండా కంపెనీ ఇప్పుడు లాభపేక్షతో వ్యాపారం చేస్తూ ఆ అగ్రిమెంట్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఎలోన్ మస్క్ తరపు న్యాయవాదులు వ్యాజ్యంలో హైలెట్ చేశారు. ఈ దావాపై ఓపెన్ ఏఐ, ఆ కంపెనీకి మద్దతిస్తున్న మైక్రోసాఫ్ట్, ఇటు ఎలోన్ మస్క్‌లు స్పందించాల్సి ఉంది.
చదవండి👉 ఇంతకీ ఈ రామేశ్వరం కేఫ్ ఎవరిది?
Comments
Please login to add a commentAdd a comment