
భారత్ ఫోర్జ్ లిమిటెడ్, దేశీయంగా అభివృద్ధి చేసిన 184 అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ (ATAGS) సరఫరా కోసం రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 4,140 కోట్ల విలువైన ఈ ఒప్పందం.. 155mm/52 క్యాలిబర్ ఆర్టిలరీ సిస్టమ్ కోసం మొత్తం రూ. 6,900 కోట్ల సేకరణ కార్యక్రమంలో 60 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది.
భారత్ ఫోర్జ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'బాబా కళ్యాణి', రక్షణ తయారీలో ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు నిదర్శనంగా ఈ ఒప్పందం జరిగిందని అన్నారు. ఈ ఒప్పందం రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాబా కళ్యాణి మాట్లాడుతూ, ఇది కంపెనీకి గర్వకారణమైన క్షణం అని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అనే దార్శనికతకు ఇది నిదర్శనం. రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం, డీఆర్‌డీఓ, ఏఆర్‌డీఈ, భారత్ ఫోర్జ్‌లోని మా బృందం వారి అమూల్యమైన ప్రయత్నాలు.. సహకారాన్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని అన్నారు.
#MoD has signed contracts with #BharatForge Limited and #Tata Advanced System Limited for the procurement of 155mm/52 Calibre Advanced Towed Artillery Gun Systems (#ATAGS) and High Mobility Vehicle 6x6 Gun Towing Vehicles respectively at a total cost of about Rs 6,900 crore.… pic.twitter.com/3keBkqh2e8
— Defence Production India (@DefProdnIndia) March 26, 2025