Ministry of Defence
-
నైపుణ్యమే ‘అగ్ని’కి ఆజ్యం!
అగ్నిపథ్ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. పైగా అగ్నివీర్లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. నిజానికి గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ లేదా నిర్వహణను కొత్తగా చేరినవారికి అప్పగించాలంటే వారి అనుభవం చాలదు. అలాగని మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించ డానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్ పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు.కార్గిల్ జిల్లాలోని హిల్ స్టేషన్ అయిన ద్రాస్‌లో గత శుక్రవారం జరిగిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కాస్త తీవ్రంగానే స్పందించి ఉండవచ్చు. అగ్నిపథ్ అంశాన్ని ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపణ. సైన్యాన్ని నిత్య యవ్వనంతో ఉంచడం, అలాగే దానిని నిరంతరం యుద్ధానికి సన్నద్ధం చేయటం ఈ పథకం లక్ష్యం. ‘‘దురదృష్టవశాత్తు కొంత మంది వ్యక్తులు జాతీయ భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన విషయాన్ని రాజకీయ అంశంగా మార్చారు’’ అని ఆయన అన్నారు.మోదీ మరింత శక్తిమంతంగా చెప్పడానికి మరిన్ని పదాలు వాడి ఉండవచ్చు కానీ ఈ సందర్భం వాటికి తగినదా అనేది ఒక ప్రశ్న. నిజానికి ఒక ఆదర్శవంతమైన, హూందా అయిన సంప్రదాయానికి నాంది పలుకుతూ ప్రతిపక్షం, ప్రధానమంత్రి ఈ వేదికను ఉమ్మడిగా పంచుకుని ఉండవలసింది. కానీ బహుశా అది మరీ ఎక్కువగా ఆశించటమే అవుతుంది. గడచిన 10 ఏళ్లలో సైన్యాన్ని సంస్కరించడం కోసం చాలా ఎక్కువగానే కృషి జరిగిందనటంలో సందేహం లేదు. ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ నియామకం, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్’ ఏర్పాటు, ‘డిఫెన్స్ అక్విజిషన్ పాలసీ’ సంస్కరణ, రక్షణ పరిశ్రమ నిర్బంధ స్వదేశీకరణ, అలాగే రక్షణ పరిశ్రమలో ప్రైవేట్ రంగానికి తలుపులు తెరవడం, ఆ రంగానికి డిఫెన్స్ ‘ఆర్ అండ్ డి’ నిధుల నుండి 25 శాతం అందించడం... వీటిలో కొన్ని. కానీ అగ్నిపథ్ దానికై అదిగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ పథకం కింద, ఒక అగ్నివీర్ సైనికుడిని 17–21 సంవత్సరాల వయస్సులో నియమిస్తారు. అతను/ఆమె నాలుగు సంవత్సరాలు సైన్యానికి సేవలందిస్తారు. ఆ తర్వాత సైన్యం నుంచి వేరుపడి తగిన ప్యాకేజీతో నిష్క్రమిస్తారు. ఇలా రిటైరైన వారిలో 25 శాతం మందికి మరో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు తిరిగి సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది. బహుశా వీరు పెన్షన్ కు అర్హులు అవుతారు. ఇక అగ్నివీర్లలో ఎక్కువ మంది విషయానికొస్తే, వారిలో 75 శాతం మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో చేరే అవకాశం కలిగి ఉంటారు. అక్కడ వారు ప్రాధాన్యతా ప్రాతిపదికన రిక్రూట్మెంట్కు అర్హులు అవుతారు. 2023 చివరలో, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే తన అముద్రిత జ్ఞాపకాల రచనలో ఈ పథకం నౌకాదళానికి, వాయుసేనకు పిడుగుపాటు వంటిది అని వ్యాఖ్యానించారు. ఆ రెండింటికీ కాకుండా దీనిని తాను కేవలం సైన్యం (ఇండియన్ ఆర్మీ) కోసం మాత్రమే, అది కూడా 75 శాతం సిబ్బందిని ఉంచుకొని 25 శాతం సిబ్బందిని వదిలించుకోవాలనీ ప్రతిపాదించానని వ్యాఖ్యానించారు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని కాస్తా మార్చేసి, 75 శాతం అగ్నివీర్లను పంపించి, 25 శాతం మందిని మాత్రమే ఉంచుకోవటం జరుగుతోందని అనడంతో వివాదం తలెత్తింది. అగ్నిపథ్ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. సైన్యం కోసం ఒక అగ్నివీర్ ఏమి చేయగలడు లేదా ఏమి చేయాలి?అన్నదే ఆ ప్రశ్న. ఆర్మీ సగటు వయస్సును అగ్నిపథ్ తగ్గించేస్తుంది అనేది ప్రాథమిక వాదన. ఒక ప్రభుత్వ అఫిడవిట్... ప్రపంచవ్యాప్తంగా కనిష్ఠస్థాయి ర్యాంక్ సిబ్బంది సగటు వయస్సు 26 సంవత్సరాలు కాగా, ఇండియాలోనే ఆ సగటు వయస్సు 32 ఏళ్లు అని పేర్కొంది. కానీ మన సైన్యంలో నియామక వయస్సు దశాబ్దాలుగా 16.5–21 ఏళ్ల వయస్సులోనే ఉంటోంది. ఇప్పుడు అగ్నిపథ్‌లో భాగంగా 75 శాతం అగ్నివీర్లను బయటికి పంపించటం ద్వారా, ప్రతి వలయంలో కొత్త సిబ్బందిని చేర్చడం ద్వారా, ఈ పథకం సైనిక వయస్సును తగ్గించాలని ఆశిస్తోంది. అయితే దాని వల్ల ప్రతిఫలంగా ఏం పొందుతుంది?భారతీయ నియామకాలలో గ్రహించవలసిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. యువకులు లేదా యువతులు మొదట సైనికులుగా నియ మితులు అయినప్పుడు వారు తరచుగా తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో ఉండి, విభిన్న నేపథ్యాల నుండి వచ్చినవారై ఉన్నారు. తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ కేవలం శరీరాకృతి, క్రమశిక్షణ పరంగా వారిని ఒక కొలిక్కి తెస్తుంది. ఆ తర్వాత ట్యాంకులు, ఫిరంగిదళాలు, వాయు రక్షణ వ్యవస్థల నిర్వాహకులుగా మరింత సాంకేతిక ఉద్యోగాలు చేయగలిగిన పదాతిదళానికి తగిన ట్లుగా వీరికి వృత్తిపరమైన శిక్షణ అవసరం. ఇది కేవలం నైపుణ్యం కోసం. ఇది కాక మరొక సంవత్సరం వరకు ఎక్కడైనా వీరికి శిక్షణ అవసరం కావచ్చు.ఇప్పుడు, అగ్నివీర్లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయ టకు వచ్చే అవకాశం లేదు. మెరుగైన దేశాల్లో, ఒక రిక్రూట్ అయిన సైనికుడు ముందే డ్రైవింగ్ వంటి నైపుణ్యంతో వస్తాడు, కానీ భారత దేశంలో దానికి మాత్రమే మూడు నెలలు పట్టవచ్చు.కాగా, మాజీ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ ఒక సందర్భంలో మాట్లా డుతూ... పదాతి దళ సిబ్బందికి, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అవసరం లేని సైన్యానికి అగ్నిపథ్ ఉపయోగపడుతుందనీ, అయితే వైమానిక దళానికి, నౌకాదళానికి ఇది పెద్ద సమస్యగా మారుతుందనీ పేర్కొన్నారు. ‘‘ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ లేదా నిర్వహణను అప్పగించ డానికి ముందు తగినంత అనుభవాన్ని పొందడానికి కనీసం అయి దారేళ్ల సమయం అవసరం అవుతుంది’’ అంటారాయన. అగ్నిపథ్ పథకంలో యువతీయువకుల ప్రొఫైల్ మిలటరీ అవసరాలకు కాకుండా మరి దేనికోసమో ఉద్దేశించినట్లు అనిపిస్తోందన్న ఆరోపణలు ఉండగా ప్రభుత్వం వాటిని ఖండించింది. వాస్తవానికి ప్రభుత్వం పునరాలోచన తర్వాతనైనా ఈ పథకం దేశానికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే అంశాలతో ప్రేరేపితమైందనే వాస్తవాన్ని ముందుగా తెలియజేయాల్సింది. అయితే ఈ పరిపుష్టి ఒక దశాబ్దం తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. తాజా బడ్జెట్ ప్రకారం రూ. 1.41 లక్షల కోట్లు లేదా రక్షణ బడ్జెట్లో 22.7 శాతాన్ని వినియో గిస్తున్న పెన్షన్ బిల్లు సైన్యానికి గుదిబండ అయింది. యువశక్తి కోసం గతంలో వచ్చిన పిలుపుల దృష్ట్యా, మనం మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించడానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్ పదవీ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు, ఇది కొంతకాలంగా ఉన్న ఆలోచన. ఇది శిక్షణ కోసం తగినంత సమయాన్ని నిర్ధారిస్తుంది. అలాగే సేవకు సమర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది. అగ్నివీర్లు సైన్యం నుంచి బయటికి వచ్చినప్పుడు వారి వయస్సు 24–28 సంవత్సరాల మధ్య ఉంటుంది, ఇది వారికి కొంత ఆలస్యంగా తెరచుకునే అనేక అవకాశాలకు అనువుగా ఉంటుంది.1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన 550 మంది సైనికులు అగ్నివీరులు కాదని, శిక్షణ పొందిన, దృఢమైన, అంకితభావం కలిగిన సైనికులు అనే విషయం గుర్తుంచుకోండి. ఆ రకమైన సామర్థ్య పరీక్ష ఇప్పటికీ అగ్నివీర్ పథకం కోసం వేచి ఉంది.మనోజ్ జోషీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లోడిస్టింగ్విష్డ్ ఫెలో ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
రక్షణకు రూ.6.21లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులను గత ఏడాది కంటే స్వల్పంగా పెంచింది. 2023–24 బడ్జెట్లో రూ.5.94 లక్షల కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.6.21 లక్షల కోట్లు కేటాయించారు. మిలిటరీ కేపిటల్ వ్యయం కింద పెద్ద ఎత్తున కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధ ఓడల కొనుగోలు కోసం రక్షణ శాఖకు రూ. 1.72 లక్షల కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు గత ఏడాది 1.62 లక్షల కోట్లుగా ఉంది. మిలిటరీ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికను సమకూర్చుకునేందుకు ‘ఆత్మ నిర్భరత’ను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.4,39,300 కోట్లు కాగా, ఇందులో రక్షణ శాఖ పింఛన్లకు 1,41,205 కోట్లు, రక్షణ సర్విసులకు 2,82,772 కోట్లు, రక్షణ మంత్రిత్వ శాఖ (సివిల్)కు రూ.15,322 కోట్లు కేటాయించారు. విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ. 40,777 కోట్లు, ఇతర పరికరాల కోసం 62,343 కోట్లను కేటాయించారు. నేవీ వాహనాల కోసం రూ.23,800 కోట్లు, డాక్‌యార్డ్ ప్రాజెక్టుల కోసం రూ.6,830 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం కోసం ఆర్మికి రూ.1,92,680 కోట్లు, నేవీకి రూ.32,778 కోట్లు, భారత వాయుసేనకు రూ. 46,223 కోట్లు కేటాయించారు. మొత్తమ్మీద రక్షణ శాఖకు ఈసారి కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయని, ఇది మిలిటరీపై ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుందని జాతీయ భద్రత అధ్యయన కేంద్రంలోని అసోసియేట్ ప్రొఫెసర్డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహెరా చెప్పారు.కేపిటల్ వ్యయం కోసం రూ.10వేలకోట్లను పెంచడాన్ని ఆరోగ్యకరసంకేతంగానే భావించాలన్నారు. హోంశాఖ 2 లక్షల కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖకు 2024–25 మధ్యంతర బడ్జెట్లో అంతర్గత, సరిహద్దు భద్రతకు ప్రాధాన్యమిస్తూ రూ. 2,02,868.70 కోట్లు కేటాయించారు. అమిత్‌షా నేతృత్వంలోని ఈ శాఖకు 2023–24లో రూ.1,96,034.91 కోట్లను కేటాయించారు. ఈసారి బడ్జెట్లో అత్యధిక నిధులను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్కు ఇచ్చారు. పారామిలిటరీ బలగాల కిందకు వచ్చే పోలీసులకు రూ. 1,32,345.47 కోట్లను, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు 37,277.74 కోట్లను కేటాయించారు. లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు, అండమాన్ నికోబార్ దీవులకు రూ. 5,866.37 కోట్లు, చండీగఢ్‌కు రూ. 5,862.62 కోట్లు, పుదుచ్చేరికి 3269 కోట్లు, దాద్రా నగర్ హవేలి–డామన్ డయ్యూకు 2,648.97 కోట్లు, లక్షదీ్వప్కు 1,490.10 కోట్లు, ఢిల్లీకి 1,168.01 కోట్లు కేటాయించారు. మంత్రిమండలి, కేబినెట్ సెక్రటేరియట్, పీఎంఓ ఖర్చుల కోసం 1,248.91 కోట్లు ఇచ్చారు. 2023–24 బడ్జెట్లో పారామిలిటరీ బలగాలైన సీఆర్పీఎఫ్కు 32,809.65 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల మేరకు 31,389.04 కోట్లు ఇచ్చారు.ఇంటెలిజెన్స్ బ్యూరోకు రూ.3,195.09 కోట్లు (2023–24లో 3,268.94 కోట్లు), వామపక్ష ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద 3,199.62 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల కోసం 335 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్టుల కోసం 214.44 కోట్లు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.330 కోట్లు కేటాయించారు. రైల్వే కారిడార్లకు గ్రీన్ లైట్ 2.52లక్షల కోట్ల రూపాయలతో రైలు బడ్జెట్ కూత ♦ 3 మల్టీ మోడల్ ఆర్థిక కారిడార్లతో కొత్తగా 40,000 కి.మీ.ట్రాక్‌ల నిర్మాణం ♦ దూసుకెళ్లనున్న సరుకు రవాణా ♦ తీరనున్న టికెట్ వెయిటింగ్ కష్టాలు.. ♦ ప్రయాణికులకు ఊరట వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా 40 వేల సాధారణ బోగీల మార్పు న్యూఢిల్లీ: సరుకు రవాణాను సులభతరం చేస్తూ బడ్జెట్లో ప్రకటించిన మూడు మల్టీ మోడల్ ఆర్థిక కారిడార్ల నిర్మాణంతో రైలు ప్రయాణికుల టికెట్ వెయిటింగ్ లిస్ట్ కష్టాలు తీరనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వేల సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచి జీడీపీ వృద్ధి రేటును పరుగులు తీయించేందుకు ప్రత్యేకంగా మూడు ఆర్థిక కారిడార్లను నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, అధిక రద్దీ సాంద్రత కారిడార్లు ఇందులో ఉంటాయి. ఈ ఏడాది బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులపై రైల్వే మంత్రి అశ్వని కుమార్ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక కారిడార్లలో భాగంగా కొత్తగా 40,000 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇది నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు 2030–31 నాటికి ప్రయాణికులకు టికెట్ వెయిటింగ్ ఇబ్బందులను తొలగిస్తుందన్నారు. మూడు కారిడార్లపై బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇవి కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే కాకుండా మల్టీ మోడల్ కారిడార్ల మాదిరిగా పని చేస్తాయన్నారు. ప్రత్యేక కారిడార్లలో భాగంగా 434 ప్రాజెక్టులను సుమారు రూ.11 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. 40 వేల బోగీలు ఇక ‘వందే భారత్’ దేశంలో 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుల భద్రత, సదుపాయాలు, సౌకర్యాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతం కావడం ఇతర బోగీలను సైతం ఆధునీకరించాల్సిన అవసరాన్ని వెల్లడించిందని రైల్వే మంత్రి అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. ‘మన వద్ద దాదాపు 40,000 సంప్రదాయ బోగీలున్నాయి. వీటిని ఆధునీకరించవచ్చు. రైల్వేల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతేడాది రైల్వేలు 5,200 కి.మీ. మేర నూతన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇది మొత్తం స్విట్జర్లాండ్ నెట్వర్క్ పరిమాణంతో సమానం. ఈ ఏడాది మరో 5,500 కి.మీ. నిర్మాణం జరుగుతుంది. 2014లో రోజుకు కేవలం నాలుగు కి.మీ. నుంచి ఇప్పుడు 15 కి.మీ. మేర కొత్త ట్రాక్‌లను నిర్మిస్తున్నాం. నెట్వర్క్ ఏర్పాటులో ఇది గణనీయమైన పురోభివృద్ధి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి మూలధన వ్యయంలో రైల్వేలు 82 శాతం ఆర్జించాయి’ అని అశ్వనీ కుమార్ తెలిపారు. అమృత చతుర్భుజం.. ‘ప్రధానంగా ఇంధనం, లోహాలు, సిమెంట్ కారిడార్లు రహదారులపై కాలుష్యాన్ని తగ్గిస్తాయి. సరుకు రవాణా చౌకగా జరుగుతుంది. ఓడ రేవులతో రైలు మార్గం అనుసంధానం కూడా అవుతుంది’ అని రైల్వే మంత్రి చెప్పారు. మూడో కారిడార్‌ను అమృత చతుర్భుజంగా అభివర్ణించారు. ‘రైల్వే ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే రూట్లలో అమృత చతుర్భుజం ఏర్పాటవుతుంది. రానున్న 6 నుంచి 8 సంవత్సరాలలో మూడు కారిడార్ల ద్వారా మొత్తంగా దాదాపు 40 వేల కి.మీ. మేర కొత్తగా రైల్వే ట్రాక్‌లను నిర్మిస్తాం. దీనిద్వారా రైల్వేల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. మన ఆర్థిక వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుంది. అంతేకాకుండా ఇది 90 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. రైల్వేలు అత్యంత కాలుష్య రహిత రవాణా మార్గాలు. ఇతర మార్గాలతో పోలిస్తే రైలు రవాణా 40 – 50 శాతం చౌక’ అని అశ్వనీ కుమార్ తెలిపారు. విదేశాంగ శాఖకురూ. 22,154 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్లో విదేశాంగ శాఖకు రూ. 22,154 కోట్లు కేటాయించారు. గతేడాది 18,050 కోట్లు ఇవ్వగా.. 2024–25 బడ్జెట్లో రూ. 4,104 కోట్లు పెంచి ఇచ్చారు. ఇక పొరుగుకు మొదట (నైబర్‌హుడ్ ఫస్ట్) పాలసీకింద ఎక్కువ సాయాన్ని భూటాన్ అందుకోనుంది. ఈ దేశానికి ఈ బడ్జెట్లో రూ. 2,068 కోట్లు సాయాన్ని ప్రతిపాదించారు. గతేడాది బడ్జెట్లో ఈ హిమాలయ దేశానికి రూ. 2,400 కోట్లు ఇచ్చారు. ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించడానికి గాను ఆ దేశంలోని చబహర్ పోర్టుకు రూ. 100 కోట్లు కేటాయించారు. ఇక మాల్దీవులకు అభివృద్ధి సాయంలో గతేడాది కంటే రూ. 170 కోట్లు తగ్గించి ఈ బడ్జెట్లో రూ. 600 కోట్లు కేటాయించారు. అఫ్గానిస్తాన్‌కు రూ. 200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ. 120 కోట్లు, నేపాల్‌కు రూ. 700 కోట్లు, శ్రీలంకకు రూ. 75 కోట్లు, మారిషస్‌కు రూ. 370 కోట్లు, మయన్మార్‌కు రూ. 250 కోట్లు అభివృద్ధి సాయం ప్రతిపాదించారు. ఆఫ్రికా దేశాల కోసం ప్రత్యేకంగా రూ. 200 కోట్లు ప్రకటించారు. లాటిన్ అమెరికా, యురేసియా ప్రాంతాల్లోని దేశాలకు అభివృద్ధి సాయంగా రూ. 4,883 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఐఎంఈసీ ఓ గేమ్ చేంజర్ బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వ్యూహాత్మంగా, ఆర్థిక పరంగా భారత్ ఇతర దేశాలకు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) ఓ గేమ్ చేంజర్ అని చెప్పారు. ప్రపంచ వాణిజ్యానికి ఈ కారిడార్ వందల ఏళ్ల పాటు ఆధారభూతంగా ఉంటుందని అన్నారు. భారత నేలపై నుంచి ఈ కారిడార్ ప్రారంభమైందనే విషయం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. జనగణన, ఎన్పీఆర్కు రూ. 1,277 కోట్లు న్యూఢిల్లీ: 2024–25 మధ్యంతర బడ్జెట్లో జనాభా గణన, ఎన్పీఆర్ కోసం రూ.1,277.80 కోట్లు కేటాయించారు. దీంతో ఈ ఏడాది కూడా జనాభా లెక్కించే అవకాశం లేదని సంకేతాన్నిచ్చినట్లైంది. జనాభా లెక్కలు, ఎన్పీఆర్ల కోసం ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 24, 2019న జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం రూ.8,754.23 కోట్ల వ్యయంతో జనాభా గణన–2021, రూ.3,941.35 కోట్ల వ్యయంతో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రతిపాదనను ఆమోదించింది. 2020, ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2020 వరకు దేశవ్యాప్తంగా జనాభా గణన, ఎన్పీఆర్ను అప్డేట్ చేయడానికి సంబంధించిన హౌస్ లిస్టింగ్ దశ షెడ్యూల్ చేసింది. అయితే కోవిడ్–19 వ్యాప్తి కారణంగా దీన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల జరిగే నేపథ్యంలో 2024లో జనాభా గణన చేపట్టే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఎన్యుమరేటర్ల ద్వారా కాకుండా సొంతంగా జనాభా గణన ఫారమ్‌ను పూరించే హక్కును వినియోగించుకోవాలనుకునే పౌరులకు ఎన్పీఆర్ను తప్పనిసరి చేశారు. ఇందుకు సెన్సస్ అథారిటీ స్వీయ గణన పోర్టల్‌ను రూపొందించగా.. అది ఇంకా ప్రారంభం కాలేదు. స్వీయ–గణన సమయంలో, ఆధార్ లేదా మొబైల్ నంబర్ తప్పనిసరిగా సేకరిస్తారు. తెలంగాణకురూ. 5,071 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేల అభివృద్ధి నిమిత్తం తాజా బడ్జెట్లో తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయిచినట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. 2009–14 కాలంతో పోలిస్తే 2023–24 నాటికి పదేళ్లలో కేటాయింపులు పది రెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో రైల్వేల్లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2009–14 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ.889 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేసిన కేంద్రమంత్రి.. పనులు సాగుతున్నాయన్నారు. గురువారం పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రైల్ భవన్లో అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. నూతన ట్రాక్ నిర్మాణం 2009–14 మధ్య సగటున ఏడాదికి 17 కి.మీ. మేర జరిగితే, 2014–24 మధ్య 69 కి.మీ. మేర జరిగిందన్నారు. 2024–25లో 142 కి.మీ. ట్రాక్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2009–14 కాలంలో సగటున ఏడాదికి 41 కి.మీ. మేర విద్యుదీకరణ జరిగితే 2014–24 మధ్య 116 కి.మీ. చేసినట్లు తెలిపారు. 2023–24లో 100% విద్యుదీకరణ పూర్తయిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. రూ.31,221 కోట్ల విలువతో 2,338 కి.మీ. మేర 14 ప్రాజెక్టుల (నూతన ట్రాక్)కు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం 40 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 53 లిఫ్టులు, 27 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 40 స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు. సీబీఐకి రూ.928.46 కోట్లు న్యూఢిల్లీ: 2024–25 కేంద్ర మధ్యంతర బడ్జెట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి రూ.928.46 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది గతేడాది కంటే రూ.40.4 కోట్లు తక్కువ. సీబీఐ శిక్షణా కేంద్రాల ఆధునీకరణ, టెక్నికల్, ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్ల ఏర్పాటు, సమగ్ర ఆధునీకరణ, భూమి కొనుగోలు, ఏజెన్సీకి కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణం వంటి పలు ప్రాజెక్టులకు కేటాయింపులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. బ్యాంకురుణ మోసాలు, విదేశాల్లోని కోర్టులలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి కేసులతో పాటు కృత్రిమ మేధస్సు, క్రిప్టోకరెన్సీ, డార్క్నెట్ల ఆధిపత్యంతో అభివృద్ధిచెందుతున్న నేరాలను పరిష్కరిస్తుంది.ఇది పలు రాష్ట్రాలు, హైకోర్టులు,సుప్రీంకోర్టు అప్పగించిన క్రిమినల్ కేసులను కూడా డీల్ చేస్తుంది. ‘ఈ–కోర్టు’కు 825 కోట్లు న్యూఢిల్లీ: దిగువ న్యాయవ్యవస్థలోమౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు, కేసుల వివరాలను కంప్యూటర్లో డిజిటల్ రూపంలో పొందుపరిచేందుకు రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక ఈ–కోర్ట్ ప్రాజెక్ట్ 3వ దశకోసం బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం రూ. 825 కోట్లు కేటాయించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,500 కోట్లు పెంచాలని ప్రతిపాదించారు. గత ఏడాది సెపె్టంబర్లో ఈ ప్రాజెక్టు రూ.7,210 కోట్ల ఆర్థిక వ్యయంతో కేబినెట్ ఆమోదం పొందిన విషయంతెలిసిందే. 2024–25 బడ్జెట్లో ఈప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కేటాయించాలని కూడా తాజా అంచనాలురూపొందించారు. 4 సంవత్సరాలలోపూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టులో కోర్టు రికార్డులు, వారసత్వ కేసులు,పెండింగ్ కేసులు అన్నింటినీ డిజిటల్ రూపంలో చేస్తారు. 3,108 కోట్లపత్రాలను డిజిటలైజ్ చేసేందుకు రూ. 2,038.40 కోట్లు అవుతుందని అంచనా. 25 పెటా బైట్ల స్టోరేజీతో క్లౌడ్ టెక్నాలజీ సాంకేతికతను ఈ వ్యవస్థకోసం ఉపయోగించడం గొప్ప అడుగుగా ప్రభుత్వం అభివర్ణించింది. దీనికి సంబంధించిన హార్డ్ వేర్‌ను రాష్ట్రాలకు కేంద్రమే అందిస్తుంది. కేంద్రం, రాష్ట్రాలు, 25 రాష్ట్రాల హైకోర్టులతో ఒక త్రైపాక్షిక ఒప్పందంజరుగుతుంది. -
దేశీయ ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్-ఎన్జీ( న్యూ జెనరేషన్) క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు భారత్ రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) ప్రకటించింది. ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)లో శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు తక్కువ ఎత్తులో ఉన్న మానవరహిత వేగవంతమైన లక్ష్యాన్ని చేధించే ఆకాశ్-ఎన్జీ మిసైల్ పరీక్ష విజయవంతం అయిందని పేర్కొంది. ఇకపై ఈ క్షిపణిని భారత సైన్యం, వాయుసేన ఉపయోగించుకోనుందని తెలిపింది. ఆకాశ్-ఎన్జీ క్షిపణ వ్యవస్థ అత్యాధునిక, హైస్పీడ్‌తో వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షిపణి పరిధి దాదాపు 80 కిలో మీటర్లు. ఆకాశ్ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్డీఓ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది. Next Generation Akash missile successfully flight tested from ITR , Chandipur off the coast of Odisha today at 10:30hrs against a high speed unmanned aerial target at very low altitude. @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/ShRNi4dfAj — DRDO (@DRDO_India) January 12, 2024 పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థ విజయవంతమైన పనితీరును భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ క్షిపణ దేశియంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడిన క్షిపణి అని రక్షణ శాఖ పేర్కొంది. చదవండి: Ram Mandir: ‘నా సోదరులు కన్న కల నిజమైంది!’ -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్‌ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్‌లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
భారత వాయుసేనలోకి తేజస్
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్ఏఎల్ కృషిని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. -
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ, ఆర్మీ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వస్తుండటం మంచి పరిణామమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలపాలన్నది ఆ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న కల అని, ఇప్పుడు అది నెరవేరే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సూచన మేరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సాయన్న నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, వివిధ హోదాల్లో పనిచేశారు. ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వుతో, అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి. ఏదైనా ప్రయత్నం చేసి కంటోన్మెంట్‌ను హైదరాబాద్‌లో కలిపితే బాగుంటుందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆర్మీ నిబంధనలు కఠినంగా ఉండటంతో బలహీన వర్గాలకు కాలనీ కట్టాలన్నా ఇబ్బందిగా ఉందనేవారు. ఆయన విజ్ఞప్తి మేరకు పలుమార్లు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్లను నగర పాలకవర్గాల్లో కలపాలని నిర్ణయానికి వస్తున్నట్టు శుభవార్త అందింది.ఈ రకంగా సాయన్న కోరిక నెరవేరుతోంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. సంతాపం తీర్మానంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు మాట్లాడారు. తర్వాత ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మృతి పట్ల కూడా సభ సంతాపం ప్రకటించింది. తర్వాత సమావేశాలను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తంగా తొలిరోజున 27 నిమిషాల పాటు అసెంబ్లీ కొనసాగింది. -
Russia Wagner Group : తిరుగుబాటు టీ కప్పులో తుపానా?
రష్యాలో వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు ఎక్కువసేపు కొనసాగలేదు కానీ, ఉన్నతాధికార వర్గాల్లో ఒకింత అలజడినైతే సృష్టించింది. యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించడమే ఈ తిరుగుబాటుకు కారణమని అంచనా. ఉక్రెయిన్‌లో వాగ్నర్ గ్రూపు సభ్యులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఉండొచ్చు. నెపం రక్షణ మంత్రిత్వ శాఖపై నెట్టడం మంచి వ్యూహం. అయితే ఈ తిరుగుబాటు వల్ల ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత నిశితంగా పరిశీలించాల్సిన పరిస్థితి రష్యాకు ఏర్పడింది. వాగ్నర్ గ్రూపు లాంటి కిరాయి దళాలు రష్యా సాధించిన విజయాల్లో కొన్నింటికి కారణమైతే కావొచ్చు కానీ, అంతిమంగా ఇవి అధికార వ్యవస్థను బలహీన పరిచేవే! వాగ్నర్ తిరుగుబాటు ఉక్రెయిన్‌పై పోరు విషయంలో రష్యా తన పరిస్థితిని పునఃసమీ క్షించుకునేందుకు పురిగొల్పవచ్చు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖపై వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు ఎక్కువసేపు కొనసాగలేదు కానీ, రష్యా ఉన్నతాధికార వర్గాల్లో ఒకింత అలజడినైతే సృష్టించింది. తిరుగుబాటుకు మాత్రమే కాకుండా... అంతే వేగంగా అది సమసిపోయేందుకు కారణాలేమిటన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. కొన్ని తప్పుడు అంచ నాల వల్ల జరిగిందా? లేదా పనిగట్టుకుని కుట్రపూరితంగా వెలుగు లోకి వచ్చిన విప్లవమా? వాగ్నర్ కమాండర్ యెవ్గెనీ ప్రిగోజిన్ , రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికీ దోస్తులేనా? ఉక్రెయిన్ పై యుద్ధంలో పైచేయి సాధించలేకపోవడంతో ఆఫ్రికా కార్యకలాపాల్లో నిమగ్నమైన వాగ్నర్ మూకలను రష్యా రప్పించాల్సి వచ్చింది. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా, బాగా డబ్బున్న కిరాయి సైనికుడైన ప్రిగోజిన్ సారథ్యంలో నడుస్తున్న వాగ్నర్ గ్రూపు 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను లాక్కోవడంలో రష్యాకు బాగా ఉపయోగపడింది. ప్రపంచానికి దీని గురించి తెలిసింది కూడా అప్పుడే. ఆ వెంటనే అమెరికా వాగ్నర్ గ్రూపు, ప్రిగోజిన్ లపై ఆంక్షలు ప్రకటించింది. a statement strongly condemning the actions against the central authority of #Russia. After reviewing the report and the video footage, #Putin said that it was not worth demonstrating to the Russian elites and the people the dissent and apostasy in the army.4/6 pic.twitter.com/I8sH9nMeSF— generalsvr_en (@generalsvr_en) June 29, 2023 ఆ తర్వాత వాగ్నర్ గ్రూపు దాదాపు ఇరవై దేశాల్లో రష్యా ప్రయో జనాలను కాపుకాస్తూ వచ్చింది. అయితే, మొజాంబిక్‌లోని కాబో డెలగాడోలో చొరబాటుదారులను అణచడంలో విఫలమైంది. చివరకు అక్కడ రువాండా దళాలు శాంతి భద్రతలను పునఃస్థాపించాయి. లిబియా, సూడాన్ , మాలి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇలా పలు దేశాల్లో వాగ్నర్ గ్రూపు చురుకుగా పని చేసింది. అప్పటికే అక్కడున్న ఫ్రెంచి దళాలను తరిమేయడం లేదా అంతర్గత కుమ్ములాటల్లో ఒక పక్షం వహించడం వాగ్నర్ గ్రూపు చేసిన పనులు. ప్రధాన లక్ష్యం మాత్రం రష్యా మద్దతిచ్చిన సంస్థలకు దన్నుగా నిలవడం. ఈ పను లకు ప్రతిఫలంగా వాగ్నర్ గ్రూపునకు రష్యా ఆయుధాల సరఫరా జరుగుతుంది. బంగారం ఇతర సహజ వనరుల వెలికితీతకు సంబంధించిన వాటిల్లో మినహాయింపులు లభిస్తాయి. ఈ నేపథ్యంలోనే వాగ్నర్ గ్రూపును ఉక్రెయిన్ పై యుద్ధానికి దింపింది రష్యా. ఫలితంగా ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రూపు కార్యకలాపాలు ఆగిపోయాయి. ఉక్రెయిన్ బక్ముట్ నగరంలో వాగ్నర్ గ్రూపు యుద్ధ సామర్థ్యానికి పుతిన్ ప్రశంసలు కూడా లభించాయి. తిరుగుబాటుకు కారణాలేమిటి? బక్ముట్ ప్రాంతంలో యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను ఇచ్చేందుకు రష్యా నిరాకరించడమే ప్రిగోజిన్ తిరుగుబాటుకు కారణ మని కొంతమంది విశ్లేషకుల అంచనా. బక్ముట్లో వాగ్నర్ గ్రూపు సభ్యులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కాస్తా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి ఉండవచ్చు. నెపం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖపై నెట్టేందుకు ప్రయత్నించడం మంచి వ్యూహం. రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగూ, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వాలెరీ గెరాసిమో వ్లపై కూడా ప్రిగోజిన్ అసంతృప్తితో ఉన్నారు. రష్యా దళాల్లో వాగ్నర్ గ్రూపును ఏకం చేయడంలో వీరు కీలకపాత్ర పోషించారు. వాగ్నర్ గ్రూపు సైనికులు రక్షణ మంత్రిత్వ శాఖతో కాంట్రాక్టులు కుదుర్చు కోవాలని పట్టుపట్టింది కూడా ఈ ఇద్దరే. ఈ కాంట్రాక్టులే కుదిరితే వాగ్నర్ గ్రూపు కేవలం ఆఫ్రికా కార్యకలాపాలకు పరిమితం కావాల్సి వచ్చేది. అయితే ప్రిగోజిన్ మిలిటరీ స్థావరమైన రొస్తోవ్‌ను చేజిక్కించుకునే విషయంలో దాదాపు విజయం సాధించాడు. ఆ వెంటనే తన తిరుగుబాటును బహిరంగం చేసేశాడు. అంటే, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా పరిస్థితిలో ఏదో తేడా ఉందన్నమాట. ఇందుకు తగ్గట్టుగానే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో సమూల ప్రక్షాళన జరగా లని కోరుతున్న వారూ కొందరు ఉండటం గమనార్హం. రష్యా భద్రతా సంస్థ ‘ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్’ (ఎఫ్ఎస్బీ అంటారు. కేజీబీ వారసత్వం) ప్రిగోజిన్ వైపు కొంత మొగ్గు చూపు తున్నట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత వర్గాల్లో మార్పులను ఎఫ్ఎస్బీ కూడా కాంక్షిస్తూండ వచ్చు. తద్వారా అటు మంత్రిత్వ శాఖ, ఇటు ఎఫ్ఎస్బీ రెండూ సమన్వయంతో పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. యుద్ధం... ఇకపై ఎలా? వాగ్నర్ గ్రూపు నాయకత్వం ప్రధానంగా సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రష్యాను నియంత్రించేంత సత్తా అనుమానమే. కాకపోతే కొన్ని అంశాల్లో కీలకమైన ప్రభావం చూప గలదు. ఇందుకు తగ్గట్టుగానే తిరుగుబాటు సందర్భంగా వాగ్నర్ ప్రకటనలు వారి సత్తాకు మించి ఉన్నట్లు స్పష్టమైంది. పైగా ఈ తిరుగు బాటు వారి శక్తిని కాకుండా నిస్పృహను ప్రదర్శించినట్లు అయ్యింది. ఈ దశ నుంచి ఉక్రెయిన్ పై యుద్ధం ఎలా సాగబోతోందనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ప్రిగోజిన్ రక్షణ మంత్రిత్వ శాఖను బహిరంగంగానే విమర్శిస్తే ఇతరులు నిశ్శబ్దంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కి ఉంటారు. యుద్ధం సాఫీగా కొనసాగితే భవిష్యత్తులో ఇలా బహిరంగ కీచులాటలైతే ఉండవు. వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపుగానే ఉక్రెయిన్ పై పైచేయి సాధించడం పుతిన్‌కు చాలా అవసరం. ఇప్పటికే యుద్ధంలో పదహారు మంది జనరళ్లు మరణించారు లేదా పదవుల నుంచి తప్పించబడ్డారు. జనరళ్ల స్థాయిలో ఈ స్థాయి వేట్లు ఒక రికార్డనే చెప్పాలి. తాజాగా రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్లపై వేటు వేస్తారా? అదే జరిగితే తిరుగుబాటు దారుల లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత నిశితంగా పరిశీలించా ల్సిన పరిస్థితి రష్యాకు ఏర్పడింది. వాగ్నర్ ఉదంతం నుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఇలాంటి ప్రత్యేక దళాలు రష్యా సాధించిన విజయాల్లో కొన్నింటికి కారణమైతే కావచ్చు కానీ, అంతిమంగా ఇవి అధికార వ్యవస్థను బలహీన పరిచేవే. కాబట్టి వీటిపై మరింత కఠినమైన నియంత్రణ అవసరమవుతుంది. రానున్న కొన్ని నెలల్లో రష్యా సైనిక దళం పుతిన్ రాజకీయ ఆకాంక్షలకు తగ్గట్టుగా మెరుగైన ప్రదర్శన కనపరచగలదా అన్నది కూడా ఒక ప్రశ్న. ఉన్నతస్థాయిలో మార్పులు చేస్తే వ్యూహాలు, పద్ధతులకు మార్పులు, చేర్పులు అనివార్యమవుతాయి. ఎఫ్ఎస్బీ, రక్షణ మంత్రిత్వ శాఖలు సమన్వ యంతో పని చేయడం ఇప్పుడు పుతిన్‌కు అవసరం. వాగ్నర్ గ్రూపు సైనికుల్లో అధికులు ఇప్పటికీ రక్షణ శాఖతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశ ముంది. ఎంతైనా ఇవి ఠంచనుగా డబ్బులు తీసుకుంటూ పనిచేసే కిరాయి సైన్యాలే కదా? కానీ వీరు సాధారణ సైనికుల మాదిరిగా క్రమశిక్షణతో వ్యవహరించగలరా? ఆఫ్రికా దేశాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడే ప్రాజెక్టులతో అటు రక్షణ శాఖకూ, ఇటు వాగ్నర్ గ్రూపునకూ ఆర్థిక దన్ను ఇచ్చే సామర్థ్యం ప్రిగోజిన్ కు ఉంది. అయితే రక్షణ శాఖ ఈ నిధులను దుర్వినియోగం చేస్తోందన్నది ప్రిగోజిన్ ఆరోపణ. ఇప్పుడు ప్రిగోజిన్ బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. వాగ్నర్ గ్రూపు మానవ నష్టాన్ని చవి చూసింది. మిగిలిన వాళ్లు సమర్థంగా పని చేయాలంటే ఏం చేయాల న్నది ఆసక్తికరంగా మారింది. ఏమైనప్పటికీ రానున్న ఎనిమిది నెలల్లో వాగ్నర్ గ్రూపు తన వారిని, రష్యా సైనికుల కార్యచరణకు అనుగుణంగా పనిచేసేలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉక్రె యిన్ కూడా తన ప్రతిదాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా దీటు గానే తట్టుకుంటోంది కూడా. కానీ ప్రిగోజిన్ సృష్టించిన ప్రకంపనలు కాస్తా రష్యా వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపినట్లు అయ్యింది. గుర్జీత్ సింగ్ వ్యాసకర్త మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్‌ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. రక్షణ శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. కంటోన్మెంట్ బోర్డుకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా, రక్షణ శాఖ స్పందించి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే.. మరోవైపు కంటోన్మెంట్ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు చేపట్టిన ప్రాసెస్కొనసాగుతుండగా, బోర్డు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెట్వికాస్మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై 23న విచారణ జరగనుంది. -
ఇరాన్లో మాజీ అధికారికి ఉరి
దుబాయ్: బ్రిటన్ రహస్య నిఘా సంస్థ ‘ఎం16’కు సమాచారం చేర వేస్తున్నాడనే అనుమానంతో రక్షణ శాఖ మాజీ అధికారి అలీ రెజా అక్బారీని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్–ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న అక్బారీ ఇరాన్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ షంఖానీకి సన్నిహితుడిగా పేరుంది. ఇరాన్ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే అక్బారీకి మరణ శిక్ష విధించి, తాజాగా ఆ విషయం బయటపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అర్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. తాము వద్దంటున్న అక్బారీకి ఇరాన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించడంపై బ్రిటన్, అమెరికా మండిపడుతున్నాయి. -
గులాబీ రంగు అమ్మాయిలకే కాదు బ్రిటిష్ ఆర్మీకీ ఇష్టమే!.. పింక్ పాంథర్స్ విశేషాలు తెలుసా!
అమ్మాయిలకు గులాబీలన్నా.. గులాబీ రంగన్నా ఇష్టం అంటారు. నిజానికి గులాబీ రంగు బ్రిటిష్ ఆర్మీకి ఇష్టమట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎడారి ప్రాంతాల్లోని సైనిక దళాలకు సహాయం చేసిన వాహనాల రంగు ఈ గులాబీనే. వీటికి ‘పింక్ పాంథర్స్’ లేదా ‘పింకీస్’అని పేరు. సాధారణంగా అడవులు, కొండల్లో కాపలాకాసే సైనికులను, శత్రువులు త్వరగా గుర్తించకుండా ఉండటానికి ఆర్మీ ఎక్కువగా ఆకుపచ్చ, గోధుమరంగులను ఉపయోగిస్తుంది. కానీ, ఈ రంగులు ఎడారి ప్రాంతాల్లో ఉపయోగపడవు. ఇందుకోసం 1968– 1984 బ్రిటిష్ ఎస్ఏఎస్ ఈ పింక్ పాంథర్ జీప్లను ఉపయోగించింది. ఈ ఉపాయం బాగా పనిచేసింది. దగ్గరగా చూస్తే కాని కనిపించని ఈ వాహనాలు ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడాయి. తర్వాత ఇదే ఉపాయాన్ని ఇంకొన్ని దేశాలు కూడా ఉపయోగించాయి. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వినియోగం ఆగిపోయింది. అప్పట్లో మిగిలిపోయిన వాటిలో ఇరవై వాహనాలను ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2019లో నిర్వహించిన ఓ వేలంలో 1968 ల్యాండ్‌రోవర్ 2ఏ పింక్ పాంథర్ రూ. 64 లక్షలకు అమ్ముడుపోయింది. మిగిలినవి మ్యూజియంలో ప్రదర్శనల్లో ఉపయోగిస్తున్నారు. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
పెగసస్‌పై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పెగసెస్ స్పైవేర్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పెగసస్ స్పైవేర్ నిఘా నివేదికలపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టు బట్టాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి విపక్షాలు పెగసస్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం విపక్షాల డిమాండ్లపై కేంద్రం స్పందించింది. పెగసస్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. పెగాసస్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ విక్రేత అయిన ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోమవారం రాజ్యసభలో రక్షణ మంత్రిత్వ శాఖ సమాధానంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఏవైనా లావాదేవీలు జరిపిందా లేదా అన్న ప్రశ్నకు రక్షణ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. "ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ఎలాంటి లావాదేవీలు జరపలేదు" అని జూనియర్ రక్షణ మంత్రి అజయ్ భట్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పెగసస్‌తో తాము ఎవరిపైనా అక్రమ నిఘా నిర్వహించలేదని ప్రభుత్వం ఇప్పటివవరకు చెప్తూ వచ్చింది. కానీ ఈ సమాధానం విపక్షాలను సంతృప్తిపరిచేదిగా లేదు. ఈ క్రమంలో విపక్షాలు కేంద్రం ముందు ఒకే ప్రశ్నను ఉంచాయి. అదేంటంటే.. కేంద్రానికి ఎన్ఎస్ఓతో ఏదైనా సంబంధం ఉందా.. అలానే దేశ పౌరులపై కేంద్రం నిఘా ఉంచిందా లేదా అనే దానికి సూటిగా జవాబు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖలు లక్ష్యంగా చేసుకుని వారిపై నిఘా పెట్టారని గ్లోబల్ మీడియా కన్సార్టియం నివేదించినప్పటి నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతున్నాయి. ఇక ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. -
దాచేస్తే దాగదు ‘రఫేల్’
రఫేల్ ఒప్పందంపై తాజా సంచలనాత్మక వివరాల నేపధ్యంలో స్పష్టమవుతున్నది ఒక్కటే. అహంకారంతో, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటుంది. రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై తాజాగా ద హిందూ పత్రికలో ఎన్ రామ్ వెల్లడించిన విషయాలు, వాటికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచిన సమర్థనలు ఈ అంశంపై జరుగుతున్న చర్చను ముందుకు తీసుకుపోవడంలో మరింతగా సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో రఫేల్ ఒప్పందం గురించి స్పష్టమవుతున్నది ఒక్కటే. ఇది అహంకారం, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. రఫేల్ స్పష్టపరుస్తున్న తాజా వివరాలను ఒకటొకటిగా చూద్దాం. 1. మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ శాఖ ఉన్నతాధికారులు రఫేల్ చర్చలు పట్టాలెక్కిన తీరుపై చాలా అసౌకర్యంగా లేక అభద్రతను ఫీలయ్యారు. ఈ ఒప్పందం పట్ల తమ అభ్యంతరాన్ని వారు రికార్డు చేశారు కూడా. 2. కానీ వారి అభ్యంతరాలను మరీ అతిగా స్పందించారని పేర్కొంటూ రక్షణ మంత్రి తోసిపుచ్చారు. పైగా ప్రధానమంత్రి పీఎస్ (బహుశా ప్రిన్సిపల్ కార్యదర్శి)తో సంప్రదింపులు జరపాల్సిం దిగా శాఖాధికారులను ఆదేశించారు. 3. దీనర్థం ఏమిటి? అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకత్వం ఉన్నతాధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిందనే కదా. ఈ ఒప్పందాన్ని సత్వరంగా కుదుర్చుకోవాలని నాయకత్వం కోరుకుంది. 4. సూత్రబద్ధంగా చూస్తే ఇది సరైందే. ఎందుకంటే సందేహాలను లేవనెత్తడం ఉన్నతాధికార వర్గం సహజ స్వభావం. నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజకీయ నేత అలాంటి అభ్యంతరాలను తోసిపుచ్చి తన నిర్ణయానికి బాధ్యత తీసుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడినుంచి మనం సమస్యను కొనితెచ్చుకుంటాం. పై నాలుగు అంశాలు నిజానికి ఏం చెబుతున్నాయి? అంటే.. ఒక ఒప్పందం కుదరాల్సి ఉంది. సాధారణంగానే ఉన్నతాధికారులు తమ స్వచర్మరక్షణను చూసుకుంటారు, కానీ దృఢమైన, జాతీయవాదంతో కూడిన నిజాయితీ కలిగిన ప్రభుత్వం తమముందు ఉన్న అవరోధాలను తొలగించుకుని ఒప్పందాన్ని ఖాయపరుస్తుంది. అలాంట ప్పుడు సాహస ప్రవృత్తి కలిగిన అదే ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా ప్రకటించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నట్లు? అలా వాస్తవాలను ప్రకటించడానికి భిన్నంగా తన చర్యపై వరుస సమర్థనల వెనుక ఎందుకు దాక్కుంటున్నట్లో? కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రక్షణ శాఖ కుంభకోణంగా తలెత్తే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. అప్పుడు ఆ సత్యం ఇలా ఉండేది: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 ప్రారంభంలో 125 యుద్ధవిమానాల కొనుగోళ్లకు గాను తక్కువ బిడ్ దాఖలు చేసిన రఫేల్‌ని ఎంచుకున్నారు. కానీ, 14 మంది సభ్యులతో కూడిన ధరల సంప్రదింపు కమిటీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరిచింది. నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పర్చి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ముగ్గురు బాహ్య పర్యవేక్షకుల బృందాన్ని నియమించారు. తర్వాత ఈ అభ్యంతరాలను 14 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి కమిటీ తోసిపుచ్చింది. ఒక కమిటీపై మరో కమిటీ, ఆ కమిటీ మరొక కమిటీ చర్చల ప్రక్రియ కొనసాగాక 126 యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం ఖరారైంది. ఆపై ఏం జరిగింది? యధావిధిగానే నాటి రక్షణ మంత్రి ఆంటోనీ సందేహిస్తూనే ఈ కమిటీ తుది నిర్ణయంతో విభేదించి మళ్లీ బిడ్లను ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వాస్తవానికి ఈ ఒప్పందం 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆంటోనీ దీనిపై నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వానికి వదిలిపెట్టడానికే మొగ్గు చూపారు. తన హయాంలో ఏ రక్షణ కొనుగోలు కుంభకోణం చోటు చేసుకోకుండా ముగించాలన్నది ఆయన వైఖరి. ఒప్పందంలో ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. పెద్దగా కొనుగోలు చేసిందీ లేదు. కానీ ఆయన సైతం చివరకి అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంతో పదవిని ముగించాల్సి వచ్చింది. మరి మన నిర్ణయాత్మకమైన, రాజీలేని మోదీ ప్రభుత్వం ఏం చేసింది? అది చాలా మొరటుగా వ్యవహరించింది. భారత వాయుసేన తన అవసరాలకు శాశ్వతంగా ఎదురు చూడలేదు. కాబట్టి కొన్ని విధివిధానాలను పాటించకుంటే ఏం కొంప మునుగుతుంది? పైగా ఆ విధానాలు కార్యనిర్వాహక నిబంధనలే తప్ప రాజ్యాం గబద్ధమైన ఆదేశాలు కావు. కాబట్టి ప్రధాని విశాల జాతి ప్రయోజనాల రీత్యా ఈ విధానాలను పక్కకు తోసేయగలడు. ఇదంతా బాగుంది. కానీ మోదీ ప్రభుత్వం ఈ ఒప్పంద వివరాలను పూర్తిగా ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇంతకుముందే దాన్ని బహిర్గతపర్చి ఉంటే గత ఆరునెలలుగా రఫేల్ ఒప్పందంపై వస్తున్న పతాక శీర్షికలు పూర్తి అసందర్భంగా వెలిసిపోయి ఉండేవి. పైగా మీడియా కెమెరాల ముందు, పార్లమెంటులో ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రెచ్చిపోతూ మాట్లాడాల్సిన అవసరం అసలు ఉండేది కాదు. పైగా నచ్చబలికే వాస్తవాలు, ప్రస్తావనలతో ఆమె మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉండి ఉంటే, రాహుల్ పదేపదే ఈ ఒప్పందంపై సంధిస్తున్న ప్రశ్నలకు ఆమె ఎందుకు సమాధానాలు ఇవ్వడం లేదు? రఫేల్ ఒప్పం దంపై రక్షణ శాఖ అభ్యంతరాలు లేవనెత్తిందా లేదా? ఈ ప్రశ్నకు ఆమె నిజాయితీగా అవునని సమాధానం చెప్పి ఉంటే, ఒప్పందంపై వచ్చే అన్ని ప్రశ్నలను ప్రభుత్వం తన విజ్ఞతతో తోసిపుచ్చి ఉండేది. ప్రభుత్వాలు తమను తాను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి సాధారణ అంశాలను కూడా పాటించకపోవడానికి సాధారణంగా రెండు కారణాలు ఉంటుంటాయి. మరిన్ని విషయాలను తాను దాచి ఉంచి, వాటిని విమర్శకులు కనుగొనలేరని ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా ప్రభుత్వ వివేకం స్పష్టం కానప్పుడు ఇలా జరుగుతుంటుంది. రెండోది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడూ కూడా ఇలా జరుగుతుంటుంది. నన్ను ప్రశ్నించడానికి కూడా నీకెంత ధైర్యం? నీకు లాగ నేను కూడా అవినీతిలో కూరుకుపోయానని అనుకుంటున్నావా? రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. ఒక విశ్లేషకుడిగా, సంపాదకుడిగా ఈ రెండు నిర్ధారణల్లో మొదటిదాన్ని ప్రకటించడానికి నాకు మరింత సాక్ష్యాధారం కావాలి. అదేమిటంటే ప్రభుత్వం విషయాన్ని దాచి ఉంచడానికి ఏవైనా ముడుపులు తీసుకున్నటువంటి తప్పు మార్గంలో నడిచిందా? అదే జరిగివుంటే ప్రతిపక్షం సహనంగా ఉండటానికి కారణమే లేదు. ఇక రెండో నిర్ధారణ నిస్సందేహంగా ఇప్పుడు స్పష్టమైంది. గత మూడు దశాబ్దాల్లో ఈ డ్రామాను రెండు సార్లు విభిన్నమైన ఫలితాలతో చూశాం. మొదటిది బోఫోర్స్. రాజీవ్ గాంధీ స్పష్టంగా విజ్ఞతను ప్రదర్శించి ఉంటే ఆరోపణ వచ్చిన తొలిరోజే విచారణకు ఆదేశించి, నేరస్థులను శిక్షిస్తానని హామీ ఇవ్వడం ద్వారా బోఫోర్స్ కుంభకోణం నుంచి బయట పడేవారు. కానీ రాజీవ్ తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్లిపోయారు. స్విస్ అకౌంట్ వివరాలు వెలికి రాకముందే రాజీవ్ ఈ అంశంలో నిజాయితీతో లేరని, తప్పు చేశారని అనుమానం వచ్చేలా వ్యవహరించారు. దీని పర్యవసానమేమిటో స్పష్టమే. సరే, మీరు పరిశుద్ధులే. కానీ, ఎవరో చేసినప్పటికీ దేశం కోసం సరైన, నిజ మైన, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అందుకే 32 ఏళ్లు గడిచినా బోఫోర్స్ ముడుపులకు సంబం ధించి ఎవరినీ పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ వ్యాఖ్యానించగలిగింది. కనీసం ఒక్క క్రోనా(స్వీడిష్ కరెన్సీ) స్వాధీనం కాలేదు. అదేసమయంలో కోల్పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట కూడా తిరిగి రాలేదు. ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసిందనే విషయం పక్కనబెడితే, బోఫోర్స్ మచ్చ మిగిలే ఉంది. ఇక రెండోది, సుఖోయ్–30 కొనుగోళ్లు కూడా పెద్ద కుంభకోణ మేనని మార్మోగింది. 1996లో ఎన్నికలు ప్రకటించినప్పటికీ పి.వి.నర సింహారావు ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఈ విషయంలో ఏ నిబంధనలూ సక్రమంగా పాటించలేదు. ఇప్పటి ప్రమాణాలను బట్టి చూస్తే దాన్ని దేశద్రోహంగానే పిలవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష బీజేపీ నాయకులపై నమ్మకంతోనే ఆయన అలా వ్యవహరించారు. తరువాత ప్రధాని అయిన దేవెగౌడ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న ములా యం సింగ్ యాదవ్ అన్ని ఫైళ్లను తెరిచి ప్రతిపక్షంలోని పెద్దలందరినీ వదిలిపెట్టేశారు. తెలివిగా సాగిన రాజకీయ నేతల కుమ్మక్కు వ్యవహా రంపై మనం గతంలో ఓ కథనంలో పేర్కొన్నాం. 23 ఏళ్లు గడిచిపోయినా ఇంతవరకూ ఎవరూ సుఖోయ్ గురించి ప్రశ్నించలేదు. భారత వైమానిక దళానికి ఇప్పటికీ సుఖోయ్ విమానాలే ప్రధాన ఆధారం, బలం కూడా. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఎక్కడిదో మీరు గమ నించే ఉంటారు. తాను పరిశుద్ధుడనని, తనను నిష్కారణంగా అనుమా నిస్తున్నారని, తాను బాధితుడనని చెప్పుకుని తనకున్న పేరు ప్రఖ్యాతుల ద్వారా మోదీ బయటపడిపోతారనుకుంటే పొరపాటు. రహస్యాలను కాపాడుకోవడంలో ఈ సర్కారుకు అమోఘమైన ప్రావీణ్యం ఉన్నదన్న అభిప్రాయానికి భిన్నంగా రఫేల్æ పత్రాలు ప్రముఖులంతా కొలువుదీరే ఢిల్లీలోని లూటెన్స్‌లో సులభంగా లభ్యమవుతున్నాయి. కనీసం ఈ దశ లోనైనా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బావుంటుంది. విమ ర్శకులు, జర్నలిస్టులపై దాడి చేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమా ధానాలివ్వాలి. అలా చేయకపోతే, ఈ వ్యవహారం చాలా సులువుగా వారిని ముంచెత్తకమానదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
భారత్‌కు షాక్: మూడు ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు హ్యాకర్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. భారత ప్రభుత్వ రంగ వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు భారత రక్షణ శాఖ వెబ్‌సైట్‌తో పాటు హోం శాఖ, న్యాయ శాఖ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. రక్షణ శాఖ వెబ్సైట్ హోం పేజీపై చైనీష్ గుర్తు కనిపిస్తోంది. దీనిని ట్విటర్ ట్రాన్సిలేట్ సహాయంతో తర్జుమా చేయగా 'ధ్యానం' అనే అర్థం వచ్చే విధంగా ఉందని జాతీయ వార్తా సంస్థ దిక్వింట్ ప్రచురించింది. ఈ విషయంపై రక్షణ శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు. వెబ్సైట్ పునరుద్ధరణకు భారత్ బృందం రంగంలోకి దిగిందని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ వార్తలపై నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ స్పందించింది. వెబ్సైట్లు హ్యాక్ అవలేదని, సాంకేతిక కారణాలతో డౌన్ అయ్యిందంటూ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ అవడం కొత్తేంకాదు. 2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకూ సుమారు 144 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యకింగ్‌కు గురయ్యాయి. ఈవిషయాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వమే ప్రకటించింది. గత ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వెబ్‌సైట్‌ను హ్యక్ చేశారు. కాశ్మీరలను ప్రధాని మోదీ, పోలీసులు వేధిస్తున్నారంటూ ఫ్రీ కాశ్మీర్ అని వచ్చేలా హ్యాక్ చేశారు. అంతే కాకుండా హోంశాఖ వెబ్‌సైట్‌ను సైతం ఇదే విధంగా హ్యాక్ చేశారు. Action is initiated after the hacking of MoD website ( https://t.co/7aEc779N2b ). The website shall be restored shortly. Needless to say, every possible step required to prevent any such eventuality in the future will be taken. @DefenceMinIndia @PIB_India @PIBHindi — Nirmala Sitharaman (@nsitharaman) April 6, 2018 -
ఎంఎంటీఎస్ రెండో దశకు అడ్డంకులు తొలగించాలి
- నిలిచిన సనత్‌నగర్-మౌలాలి రైల్వే లైను డబ్లింగ్ పనులు - పెండింగ్ ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) రెండో దశ అమలులో జాప్యంపై రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2012-13 లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ క్రియాశీలకం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నివేదిక సమర్పించింది. 2012-13లో రూ.272 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించగా గత మార్చి నెలాఖరు వరకూ రూ. 58.30 కోట్ల మేరకు వ్యయం చేశారు. అయితే ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉన్న సనత్‌నగర్-మౌలాలి మధ్య 21.5 కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్ పనులు నవంబర్ 2014 నుంచి నిలిచిపోయాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ఒకప్పటి రైఫిల్ రేంజ్లో ఉన్న 4 కిలోమీటర్ల మేరకు పనులను రక్షణ శాఖ అధికారులు నిలిపివేశారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు అనువుగా ప్రత్యామ్నాయంగా రైఫిల్ రేంజ్ ఏర్పాటు కోసం రూ.1.18 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 1979 లోనే రైల్వే మంత్రిత్వ శాఖ అందించింది. అయితే 1990 లో 37 ఎకరాల 32 కుంటల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారని, అందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అంగీకరించ లేదని.. అంతేకాకుండా గత 35 సంవత్సరాలుగా రైఫిల్ రేంజ్ వాడుకలో లేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. ఈ సమస్యపై గత జూలై 15 వ తేదీన రక్షణ శాఖ మంత్రితో రైల్వే శాఖ మంత్రి చర్చించారని, నిలిచిపోయిన పనులను ప్రారంభించడానికి అనుమతించాలని ఒక లేఖ కూడా రాశారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ ఎప్పటికల్లా పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు అందించిన సమాచారం వల్ల అర్థమవుతోందని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి చర్చలు జరిగాయని, అందువల్ల ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగం చొరవ తీసుకొని ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రతిబంధకాలు తొలగించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. -
పోటాపోటీ హక్కుల తీర్మానాలు
ఆజాద్‌పై స్వామి.. రక్షణ మంత్రిత్వశాఖపై కాంగ్రెస్ ♦ పెయిడ్ న్యూస్‌పై చర్చించాలన్న స్వామి ♦ రాజ్యసభలో తన వ్యాఖ్యలు తొలగింపుపై సవాల్ ♦ అగస్టా టెండరు రూల్సు ఎందుకు మార్చారు? సోనియాకు షా ప్రశ్న న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌లాండ్ వివాదంలో అధికార, విపక్షాల మధ్య వివాదం రోజురోజకూ ముదురుతోంది. శుక్రవారం ఇరు పార్టీలు రాజ్యసభలో ఒకరిపై ఒకరు సభా హక్కుల తీర్మానాలు ఇచ్చుకున్నాయి. అగస్టా వెస్ట్‌లాండ్ మాతృసంస్థ అయిన ఫిన్మెకానికా సంస్థను యూపీఏ హయాంలోనే బ్లాక్‌లిస్టులో పెట్టామని తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్‌పై సుబ్రమణ్యస్వామి హక్కుల తీర్మానం ఇచ్చారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా రక్షణ మంత్రిత్వ శాఖపై హక్కుల తీర్మానం ఇచ్చింది. పార్లమెంటు సెషన్ జరుగుతుండగా అగస్టా వెస్ట్లాండ్పై ప్రకటన విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధమని ఈ తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు శాంతారామ్ నాయక్, హుస్సేన్ దల్వాయ్ పేర్కొన్నారు. ‘చెల్లింపు’ వార్తలపై చర్చకు డిమాండ్ అగస్టా డీల్ విషయంలో భారత మీడియాలో అనుకూలమైన వార్తలు (పెయిడ్ న్యూస్) వచ్చేలా కొందరు మధ్యవర్తులు ప్రయత్నించారంటూ వచ్చిన వార్తలపై చర్చకు స్వామి రాజ్యసభలో పట్టుబట్టారు. మన ప్రజాస్వామ్యంలో పెయిడ్ న్యూస్ కేన్సర్‌లా మారిందన్నారు. గురువారం కూడా లోక్‌సభలో ఈకేసులో మీడియాను అనుకూలంగా మార్చుకునేందుకు రూ.50 కోట్ల ఒప్పందం కుదిరిందనే విషయంపై దుమారం రేగింది. కాగా, మైనారిటీ సంస్థపై చర్చ విషయంలో తనవ్యాఖలను తొలగించటంపై సుబ్రమణ్య స్వామి రాజ్యసభలో సవాల్ చేశారు. ఈ చర్య నిరంకుశం, అకారణమని సభానియమాలకు విరుద్ధమన్నారు. సోనియాపై మళ్లీ బీజేపీ చీఫ్ విమర్శలు బీజేపీ చీఫ్ అమిత్ షా మరోసారి సోనియా గాంధీపై మండిపడ్డారు. అగస్టా కంపెనీ విషయంలో ఎవరి ప్రోద్బలంతో నిబంధనలు మార్చారని ప్రశ్నించారు. ‘అసలైన తయారీదారులు మాత్రమే టెండరు వేయాలి. కానీ అసలు తయారీ దారైన ఫిమెక్కానికా కాకుండా ఈ డీల్‌కు మధ్యవర్తై అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీ టెండరు వేసేలా నిబంధలను ఎవరు ఉల్లంఘించారు? దీనికి అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ చైర్పర్సన్ సోనియానే వెల్లడించాలి’ అని షా అన్నారు. బీజేపీ ఆరోపణలపై పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. కేంద్రంపై విపక్షాల ‘దళిత’ బాణం దళితుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ విపక్షాలు లోక్‌సభలో ధ్వజమెత్తాయి. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యే ఇందుకు ఉదాహరణని ముకుమ్మడిగా విమర్శించాయి. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశాయి. హిజ్రాల కోసం బిల్లు హిజ్రాల హక్కుల పరిరక్షణ కోసం త్వరలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ బిల్లుకు సంబంధించి కేబినేట్ నోట్‌ను సామాజిక న్యాయ శాఖ సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. ‘ఆహార భద్రత’పై కేంద్రానికి కాగ్ అక్షింతలు జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాగ్ తీవ్రంగా మండిపడింది. శుక్రవారం పార్లమెంటుకు వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్లమెంటు ఆమోదం లేకుండానే 3సార్లు ఈ పథకాన్ని ప్రారంభించటంపై అక్షింతలు వేసింది. రైల్వేల్లో ప్రయాణికుల సేవల విభాగంలో నష్టాలను పూడ్చుకోవాల కాగ్ సూచించింది. దీంతోపాటు 2012-15 మధ్యలో జారీచేసిన 27 లక్షల పాస్‌పోర్టులకు సంబంధించిన వివరాలు కేంద్ర విదేశాంగ శాఖ వద్ద లేవని కాగ్ మండిపడింది. కాగా, కాగ్ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలని, ఇందుకు కాలం చెల్లిన చట్టాల్ని మార్చాలని పీఏసీ ఉప సంఘం సూచించింది. -
లోదుస్తుల్లో ఆర్మీ పరీక్షపై పరీకర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆర్మీ ఉద్యోగాల కోసం వచ్చిన యువతను లోదుస్తులపై కూర్చోబెట్టి పరీక్ష రాయించటంపై రక్షణమంత్రి మనోహర్ పరీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆర్మీ చీఫ్ దల్బీర్ సుహాగ్‌ను ఆదేశించారు. మరోవపు పట్నా హైకోర్టు కూడా ఈ విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. ఆర్మీలో వెయ్యికి పైగా క్లరికల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు కేవలం లోదుస్తులపైనే పరీక్ష రాయించారు. గతంలో దుస్తుల్లో ఆధునిక పరికరాలు అమర్చుకుని మాస్ కాపయింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి మరీ ఇలా పరీక్షలు రాయించారు. -
గణతంత్ర వేడుకల్లో సమ్మక్క, సారలమ్మ శకటం
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మ ఉత్సవానికి జాతీయస్థాయి గుర్తింపు రానుంది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నాడు దేశ రాజధానిలో జరిగే పరేడ్‌లో తెలంగాణ తరఫున సమ్మక్క - సారలమ్మ శకటం ప్రదర్శించనున్నారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర సమాచార- పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ వి.సుభాష్, ఆర్టిస్టు రమణారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సమ్మక్క- సారలమ్మ జాతర వరంగల్ జిల్లా లో జరుగుతుందని, ఆ ఉత్సవాల ఔన్నత్యం తెలిపే శకటం ప్రదర్శనలో ఉంచితే బాగుంటుందని ఈ సమావేశంలో వీరు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులకు విన్నవించినట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. -
ఓర్వకల్లులో యుద్ధ సామగ్రి ఉత్పత్తి కేంద్రం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఏర్పాటు కాబోతుంది. కేంద్రం నవ్యాంధ్రప్రదేశ్‌కు ఈ పరిశ్రమను మంజూరు చేయగా ఇప్పటికైనా వివిధ జిల్లాల్లో భూములను పరిశీలించిన ప్రత్యేక బృందం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే డీఆర్డీఓ దేశంలోనే కీలకమవుతుంది. యుద్ధ సామాగ్రికి అవసరమైన క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, గన్స్ వంటివి ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. డీఆర్డీఓ నెలకొల్పేందుకు 2500 ఎకరాల భూములు అవసరమవుతాయని కేంద్రం అంచనా వేసింది. శనివారం ఓర్వకల్లు ప్రాంతంలో డీఆర్డీఓ ఉన్నతాధికారి కల్నల్ రాజు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పర్యటించి భూములను పరిశీలించింది. అనంతరం జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయ్మోహన్తో క్యాంపు కార్యాలయంలో సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. డిఫెన్స్, రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఏర్పాటు కోసం రక్షణ శాఖ ఐదు దశల్లో రూ.5 వేల కోట్లు వ్యయం చేయనుందని వెల్లడించారు. డీఆర్డీఓను జిల్లాలో నెలకొల్పేందుకు ఉన్నతాధికారుల బృందం సానుకూలత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఇందులో జిల్లా వాసులకు 4 వేల నుంచి 5 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు పాల్గొన్నారు. -
అమిత్ షాకు రక్షణ శాఖ!
-
15 తర్వాత కేబినెట్ విస్తరణ!
* మరో 20-30 మందికి చాన్స్ * అమిత్ షాకు రక్షణ శాఖ! న్యూఢిల్లీ: ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పర్చేందుకు, పార్టీలోని అసంతృప్తులను చల్లబర్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన కేబినెట్‌ను మరింత విస్తరణకు కసరత్తు చేస్తున్నారు. ఈ విస్తరణలో 20 నుంచి 30 మంది వరకూ అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. దీనిలో ఎక్కువ మందికి సహాయ మంత్రులుగానే అవకాశం దక్కవచ్చు. అయితే ఈ విస్తరణ జూన్ 15 తర్వాత చేపట్టవచ్చని సమాచారం. ప్రస్తుతం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద నున్న రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రిని మోడీ నియమించే అవకాశం ఉంది. మోడీ అనుచరుడు అమిత్‌షాకు కేబినెట్లో చోటు కల్పించి రక్షణ శాఖ అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోడీ ఖాళీ చేసిన వడోదర లోక్‌సభ స్థానం నుంచి అమిత్‌షాను బరిలోకి దింపి ఆ శాఖ కట్టబెడతారని సమాచారం. ఇక మహారాష్ట్రలో 18 సీట్లు గెలిచి ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీగా అవతరించిన శివసేన పార్టీ.. తొలి కోటాలో తనకు దక్కిన ఒకే ఒక్క బెర్త్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రధానితో చర్చలు జరిపారు. దీంతో ఇపుడు రెండో కోటాలో ఆ పార్టీ మరిన్ని పదవులు పొందే అవకాశం ఉంది. ఆ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా మంత్రి వర్గంలో మరిన్ని బెర్త్‌లు దక్కే చాన్సుంది. రాజస్థాన్‌లోని అన్నిస్థానాలూ బీజేపీ చేజిక్కించుకున్నా ఆ రాష్ట్రానికి కేబినెట్లో ఒకే ఒక్క బెర్త్ దక్కింది. దీనిపై ఆ రాష్ట్ర వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమ రాష్ట్రానికి కనీసం మూడు కేబినెట్ బెర్త్‌లు దక్కుతాయని ఆశిస్తున్నాయి. లోక్‌సభ సమావేశాలు జూన్ 4న ప్రారంభమై 12న పూర్తవుతాయి. ఆ తర్వాతే విస్తరణ ఉండవచ్చు. -
కొత్త ఆర్మీ చీఫ్ నియామకానికి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: ఆర్మీ కొత్త చీఫ్ నియామకం విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ పదవికి వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి రక్షణ శాఖ సిఫారసు చేసింది. లెఫ్టినెంట్ జనరళ్లలో ఈయనే సీనియర్. ప్రధాని అధ్యక్షతన గల ఏసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో ఆర్మీ కొత్త చీఫ్ నియామకం చేపట్టడంపై బీజేపీ తీవ్రంగా తప్పుపట్టడంతో దీనిపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయాలని బీజేపీ డిమాండ్ చేయడంతోపాటు దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకే..
సాక్షి ముంబై: యుద్ధనౌక ‘విక్రాంత్’ భద్రతా బాధ్యతలు చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని, అంతేకాక ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గత 15 సంవత్సరాల్లో సేకరించి ఇవ్వలేకపోయిందని, అందుకే తుక్కు కింద అమ్మాలని నిర్ణయించినట్లు బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరాలిలా ఉన్నాయి... ‘భారత నౌకాదళం 1997 నుంచి విక్రాంత్ సేవలను నిలిపివేసింది. దీంతో ఆ నౌకను తుక్కు కింద విక్రయించడం లేదా మ్యూజియంగా మార్చడం వంటి రెండు ప్రతిపాదనలను రూపొందించింది. 1998లో విక్రాంత్‌ను మ్యూజియంగా మారుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం విక్రాంత్‌ను నిలిపేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, మరమ్మతులు పూర్తికాగానే దాని భద్రత బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం షరతులు విధించింది. ఈ షరతుల్లో ఏ ఒక్కదాన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. దీంతో రోజురోజుకూ ‘విక్రాంత్’ నిర్వహణ వ్యయం పెరిగిపోతూనే ఉంది. గడిచిన 15 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం దాదాపు రూ.22 కోట్లు ఖర్చుచేసింది. కే ంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో రెండు సార్లు ఈ నౌకను ప్రజల సందర్శనార్థం తెరిచింది. ప్రస్తుతం విక్రాంత్ నౌక వయస్సు 70 సంవత్సరాలు. భద్రత దృష్ట్యా ఈ నౌక ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను, ఇతర ప్రత్యామ్నాయ అంశాలను కేంద్రం పరిశీలించింది. అయినప్పటికీ వాటివల్ల ప్రయోజనమేమీ లేదనే అభిప్రాయంతోనే విక్రాంత్‌ను తుక్కు సామాగ్రి కింద అమ్మాలని నిర్ణయం తీసుకున్నామ’ని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఇదిలాఉండగా ఈ నౌకను తుక్కు సామగ్రి కింద అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రకటించింది. ఈ నిర్ణయంపై అనేక రంగాల నుంచి విమర్శలు వచ్చాయి. విక్రాంత్‌ను కాపాడుకునేందుకు ఇటీవల సామాజిక సంస్థలు, విద్యార్థులు విరాళాలు సేకరించారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా.. ఎందుకు తుక్కు కింద అమ్మాలని నిర్ణయించుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేంద్ర కోర్టుకు ఈ అఫిడవిట్ సమర్పించింది. -
హెచ్అండ్ఎం పెట్టుబడి ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన దుస్తుల సంస్థ హెనెస్ అండ్ మారిట్జ్ (హెచ్అండ్ఎం)తో పాటు స్విట్జర్లాండ్ నిర్మాణ సామగ్రి దిగ్గజం హోల్సిమ్ పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన సమావేశంలో మొత్తం 23 ప్రతిపాదనలు పరిశీలనకు రాగా 14 ప్రతిపాదనలను ఆమోదించింది. తాజా నిర్ణయంతో హెచ్అండ్ఎం భారత్‌లో సుమారు రూ. 720 కోట్లతో సింగిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. అలాగే హోల్సిమ్.. భారత్‌లోని అనుబంధ సంస్థలను కన్సాలిడేట్ చేసుకునేందుకు సాధ్యపడుతుంది.