లోదుస్తుల్లో ఆర్మీ పరీక్షపై పరీకర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆర్మీ ఉద్యోగాల కోసం వచ్చిన యువతను లోదుస్తులపై కూర్చోబెట్టి పరీక్ష రాయించటంపై రక్షణమంత్రి మనోహర్ పరీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆర్మీ చీఫ్ దల్బీర్ సుహాగ్‌ను ఆదేశించారు. మరోవపు పట్నా హైకోర్టు కూడా ఈ విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖను వివరణ కోరింది.
ఆర్మీలో వెయ్యికి పైగా క్లరికల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు కేవలం లోదుస్తులపైనే పరీక్ష రాయించారు. గతంలో దుస్తుల్లో ఆధునిక పరికరాలు అమర్చుకుని మాస్ కాపయింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి మరీ ఇలా పరీక్షలు రాయించారు.