Defence Minister Manohar parikar
-
దేశానికే తలమానికం
‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్’ యూనిట్‌పై రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆదిబట్లలో వైమానిక విడిభాగాల తయారీ సంస్థకు శంకుస్థాపన రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వ విధానాలు బాగున్నాయని ప్రశంస ‘ఏరోస్పేస్’ యూనిట్‌తో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ వైమానిక రంగానికి ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ తలమానికంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ పేర్కొన్నారు. దేశ రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రవేశపెడుతున్నామని.. ఏరోస్పేస్ యూనిట్‌తో దానికి తొలి అడుగు పడుతోందని చెప్పారు. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.200 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌ను మూడు నెలల్లో పూర్తిచేసి విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించేలా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ చర్యలు చేపడుతోందన్నారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ యూనిట్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల ప్రధాన భాగాలను తయారు చేయడానికి బోయింగ్, టీఎఎస్ఎల్ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పరీకర్ చెప్పారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దశల వారీగా ప్రవేశపెడుతున్నామని... టాటా బోయింగ్ యూనిట్‌తో ఈ ప్రక్రియకు తొలి అడుగు పడినట్లయిందని పేర్కొన్నారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా అపాచీ హెలికాప్టర్లకు విడిభాగాలను అందించే 15 దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుందని వెల్లడించారు. విదేశీ పెట్టుబడుల విషయంలో కేంద్రం సరళీకృత విధానాలను అవలంబిస్తోం దని..ఆ విధానాలకు న్యాయశాఖ ఆమోదం లభించిందని చెప్పారు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులపై సహజంగానే ఏదో ఒక చర్చ జరుగుతుందని.. భారత మీడియాకు సృజనాత్మకత (క్రియేటివిటీ) ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరుగుతోందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ఫలితాలు త్వరలోనే చూడబోతున్నామని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్, ఐటీ పాలసీ భేష్.. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్, ఐటీ పాలసీలు బాగున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పరీకర్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆలోచనలకు అనుగుణంగా ఆకర్షణీయ పాలసీలను ప్రకటి స్తుంటాయని, అవన్నీ ఆచరణలో విజయవంతం కావని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రకటించిన విధానాలు పెట్టుబడులను ఆకర్షించేవిగా ఉన్నాయని.. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు చూస్తే అవి విజయవంతమైనట్లు స్పష్టమవుతోందని అభినందించారు. పెట్టుబడుల విషయంలో స్పష్టమైన విధానాలు అవసరమని, ఆ దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని కితాబిచ్చారు. టీ-హబ్‌పై ప్రశంసల జల్లు సార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ-హబ్‌పై పరీకర్ ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం టీ-హబ్‌ను సంద ర్శించిన కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. టీ-హబ్‌లోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనుద్దేశించి పరీకర్ మాట్లాడారు. కేటీఆర్ టీ-హబ్‌కు రూపకల్పన చేయడం ఆయన నాయకత్వ ప్రతిభకు అద్దం పడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారని, ఆ కలలను నిజం చేసుకునేందుకు పనిచేసేవారు తక్కువగా ఉంటారని... కేటీఆర్ బృం దంలో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని అభినందించారు. టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని, ఆ మేరకు టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో క్లీన్టెక్, శానిటేషన్ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని, ఆ దిశగా కృషి చేయాలని స్టార్టప్‌లకు పరీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ సీఈవో క్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి: కేటీఆర్ టాటా-బోయింగ్ వైమానిక విడిభాగాల ఉత్పత్తి సంస్థ రాష్ట్రానికి రావడం సంతోషకరమని... దీనితో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని మం త్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యంగా మారినందునే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు వస్తున్నాయన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, గత 10నెలల్లో 2,130 పరిశ్రమలకు అనుమతులివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.రమదొరై, సీఈవో సుకరాన్సింగ్, ఏరోస్ట్రక్చర్స్ హెడ్ మసూద్ హుస్సేనీ, బోయింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్, బోయింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవ్ కూపర్స్మిత్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
దేశీయ క్షిపణుల ఎగుమతి
బెంగళూరులో హెచ్టీటీని పరీక్షించిన మంత్రి పరీకర్ సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి.. దేశీయంగా తయారయ్యే క్షిపణుల్లో 10 శాతం మిత్రదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వెల్లడించారు. ఇందుకోసం ఉత్పత్తి సంస్థలకు అనుమతిచ్చినట్లు ఆయన తెలిపారు. పెలైట్లకు ప్రాథమిక స్థాయి శిక్షణ అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘హిందుస్థాన్ టర్బోప్రోప్ ట్రైనర్ (హెచ్‌టీటీ-40)’ సామర్థ్యాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా క్షిపణుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై రెండున్నర నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశీయ నిఘా వ్యవస్థను బలోపేతం చేయటం వల్ల చొరబాట్లు తగ్గటంతోపాటు ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారన్న దానిపై స్పష్టమైన సమాచారం అందుతోందన్నారు. అందువల్లే ఉగ్రవాదుల ఎన్కౌంటర్లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. -
ఏరో స్పేస్‌కు రేపు శంకుస్థాపన
► ఆదిబట్ల సెజ్‌లో ‘టాటా- బోయింగ్’ ► వైమానిక విడి భాగాల తయారీ పరిశ్రమ ► 13 ఎకరాల్లో తొలి విడతలో రూ.400 కోట్లతో కార్యకలాపాలు సాక్షి, హైదరాబాద్: వైమానిక దిగ్గజాలు బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్)ల సంయుక్త భాగస్వామ్య సంస్థ ‘టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్’ కార్యకలాపాలు హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్‌లో భాగస్వామ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న వైమానిక విడిభాగాల తయారీ పరిశ్రమకు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు బోయింగ్, టాటా సంస్థల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదిబట్లలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సంస్థ తొలి విడతలో రూ.400 కోట్ల మేర పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభమవుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. అమెరికాతో పాటు ఇతర దేశాల రక్షణ దళాలు ఉపయోగిస్తున్న అత్యాధునిక అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్ కేబిన్‌తో పాటు విడిభాగాలను తొలి దశలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ తయారు చేస్తుంది. క్రమంగా వైమానిక రంగంలో అత్యాధునిక వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. బోయింగ్‌కు చెందిన వాణిజ్య, రక్షణ ఆర్డర్లను పొందడం ద్వారా కార్యకలాపాలను విస్తరించాలని కూడా సంస్థ యోచిస్తోంది. ఏరో స్పేస్, రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ భాగస్వామ్య సంస్థ ఏర్పాటు మరింత ఊతమివ్వనుందని పారిశ్రామికవర్గాలు భావిస్తున్నాయి. ఏరో స్పేస్‌లో పెట్టుబడులు లక్ష్యంగా రక్షణ, విమాన , అంతరిక్ష రంగ పరిశ్రమల పరంగా జాతీయ స్థాయిలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో వుంది. రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన హైదరాబాద్ ఇప్పటికే డీఆర్డీఎల్, బీడీఎల్, డీఎంఆర్ఎల్, మిధానీ, ఎన్ఎఫ్సీ, ఎన్ఆర్ఎస్ఏ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఓడిఎఫ్, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ వంటి పలు రక్షణ, అంతరిక్ష, వైమానిక రంగ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. వైమానిక విడిభాగాలు ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న నేపథ్యంలో ఏరో స్పేస్ పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైనదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆదిబట్లలో ఇప్పటికే రూ.3,000 కోట్లతో ప్రత్యేక ఏరో స్పేస్ సెజ్ ఏర్పాటు కాగా వెలిమినేడుతో పాటు మరో రెండు చోట్ల ఏరో స్పేస్ డిఫెన్స్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీఎంఆర్, అస్ట్రా, జెన్, రాప్స్ వంటి పదికి పైగా ప్రైవేటు సంస్థలు కూడా ప్రైవేట్ ఏరో స్పేస్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఫ్రెంచ్ భాగస్వామ్య సంస్థ ప్రాట్-విట్నీతో కలిసి ఏరో స్పేస్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు దీనికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్‌లో ప్రత్యేక టీ-హబ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. నేడు రాష్ట్రానికి రక్షణ మంత్రి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం బొల్లారంలో ఆర్మీ ఆస్పత్రిని ఆయన ప్రారంభించనున్నారు. అదే సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కటోన్మెంట్లో స్థానికంగా రహదారులకు సంబంధించిన సమస్యలను రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రెండో రోజు శనివారం దుండిగల్‌లోని ఏయిర్‌ఫోర్స్ అకాడమిలో అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొనున్నారు. -
4న ‘అగస్టా’ నిజాలు పార్లమెంటులో పెడతా
పణజీ: వివాదాస్పద అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ఈనెల 4న పార్లమెంటు ముందు ఉంచుతానని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు. యూపీఏ హయాంలో ఆ కంపెనీకి ఆర్డర్ ఇచ్చేందుకు వీలుగా అవసరమైన నిబంధనలను సవరించారన్నారు. మామూళ్లు తీసుకున్న వారు ప్రాసిక్యూషన్‌కు దొరకకుండా ఉండేందుకు ఆధారాలు లేకుండా చేశారని, అయితే దాన్ని తాము నిరూపిస్తామని ఆదివారమిక్కడ విలేకరులతో చెప్పారు. -
లోదుస్తుల్లో ఆర్మీ పరీక్షపై పరీకర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆర్మీ ఉద్యోగాల కోసం వచ్చిన యువతను లోదుస్తులపై కూర్చోబెట్టి పరీక్ష రాయించటంపై రక్షణమంత్రి మనోహర్ పరీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆర్మీ చీఫ్ దల్బీర్ సుహాగ్‌ను ఆదేశించారు. మరోవపు పట్నా హైకోర్టు కూడా ఈ విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. ఆర్మీలో వెయ్యికి పైగా క్లరికల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. ఈ ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు కేవలం లోదుస్తులపైనే పరీక్ష రాయించారు. గతంలో దుస్తుల్లో ఆధునిక పరికరాలు అమర్చుకుని మాస్ కాపయింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి మరీ ఇలా పరీక్షలు రాయించారు. -
‘అనంత’లో సెంట్రల్ వర్సిటీ
పుట్టపర్తిలో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటు చేస్తాం: సీఎం నీతి ఆయోగ్ నివేదిక తర్వాత హోదాపై నిర్ణయం: వెంకయ్య సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురంలో అతిపెద్ద ‘బెల్’ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే సెంట్రల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తాం. పుట్టపర్తిలో ఎలక్ట్రానిక్ పార్కు, ఎన్పీ కుంటలో సోలార్ పార్కును నెలకొల్పుతాం. అనంతపురాన్ని కరువురహిత జిల్లాగా మారుస్తాం’’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఆధ్వర్యంలో పెనుకొండ నియోకవర్గంలోని పాలసముద్రంలో నిర్మించబోయే ‘డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్’కు బుధవారం రక్షణ శాఖ మనోహర్ పారికర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి తదితరులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంతోపాటు అంతకుముందు కొత్తచెరువులో ‘రైతు కోసం చంద్రన్న’ ముగింపు యాత్రలో ప్రసంగించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపి నదుల అనుసంధానానికి నాంది పలికిన ఘనత తమదేనన్నారు. అమృత్ నగరాల జాబితాలో అమరావతి నీతి ఆయోగ్ నివేదిక వచ్చాకే ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. అమరావతిని అమృత్ నగ రాల జాబితాలో చేరుస్తున్నాం. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు, వెంకయ్య ఇద్దరూ ‘నాయుడు’లనే అంటున్నారు.కుల రాజకీయాలతో వ్యవస్థను చీల్చా రు. ఇప్పటికైనా మానుకోండి’’ అని పేర్కొన్నారు. రక్షణ సాంకేతికతను అందించడమే లక్ష్యం సాక్షిప్రతినిధి, అనంతపురం: భారత రక్షణశాఖకు, మిలిటరీకి సాంకేతికతను అందించడమే తమ తొలి ప్రాధాన్యత ని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్’కు బుధవారం శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన బెల్ప్రతినిధులతో మాట్లాడారు. తర్వాత సోమందేపల్లి బహిరంగసభలో ప్రసంగించారు. లక్ష మందికి ఏర్పాట్లు చేయండి సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపన కార్యక్రమం(అక్టోబర్ 22న)లో లక్ష మంది పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో శంకుస్థాపనపై సమీక్షించారు.ఆ రోజు సభలో ‘రైతు వందనం’ పేరుతో భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. -
కర్ర పట్టండి కానీ.. కరుకుగా మాట్లాడకండి!!
అవలోకనం ఉగ్రవాదులపై యుద్ధంలో ఉగ్రవాదులను కూడా ఉపయోగించుకుంటామని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఇటీవల సియాచిన్‌లో చేసిన ప్రకటన రాజ్యాంగబద్ధమైన అన్ని హద్దులనూ అతిక్రమించింది. వెంటనే, తమ దేశానికి వ్యతిరేకంగా భారత్ ప్రతిచోటా హింసాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపించింది. దేశ రక్షణ విషయంలో మంత్రి మృదువుగా మాట్లాడుతూనే బడిత కర్ర పట్టుకుంటే మంచిది. రక్షణమంత్రి బడిత కర్రను చేతిలో పట్టుకోవాలి కానీ మృదువుగా మాట్లాడాల్సి ఉంటుంది. కులీన ఐఐటీలో చదివిన మన మనోహర్ పారికర్‌లో దీనికి వ్యతిరేక కోణం కనబడుతోంది. చిన్న కర్ర, చాలా పెద్ద నోరు పెట్టుకున్న వ్యక్తిని భారత్ తనలో చూస్తోంది. రాజ్యవిధానంలో భాగంగా ఉగ్రవాదులను ఉపయోగించుకోవటం గురించి ఆయన మే నెల 21న మాట్లాడారు. ఆయన అన్న మాట లివి. ‘నేనిక్కడ స్పష్టంగా చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి’ అని అంటూనే వాటిపై చర్చకు దిగారు. ‘ఏ దేశమైనా (పాకిస్తానే ఎందుకు) నా దేశానికి వ్యతిరేకంగా పథకాలు రచిస్తున్నట్లయితే, మనం తప్పకుండా కొన్ని చురు కైన చర్యలు చేపడతాం.’ హిందీ సామెతను ఉటంకిస్తూ ఆయన ఇలా అన్నారు. ‘కాంటేసే కాంటా నికాల్నా. మనం ఉగ్రవాదులను ఉగ్రవాదులతోటే తటస్థం చేయాలి. మనం అలా ఎందుకు చేయకూడదు? మన సైనికుడే ఆ పని ఎందుకు చేయాలి?’ భారత్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఉపయోగించే వైఖరిని అమలు చేసి విఫలమైంది. జమాత్ ఇ ఇస్లామి, ఇతర ఇస్లామిస్ట్ గ్రూపుల వ్యతిరేకులను ఉప యోగించుకోవాలని 1990లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణ యించుకుంది కానీ కశ్మీర్లో ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఈ ప్రయోగం త్వరలోనే ముగిసిపోయింది కూడా. భారత్ ప్రయోజనాలకోసం పనిచేసిన కుకా ప్యారీ నేతను అప్పటికి ఇంకా ప్రాబల్యంలో ఉన్న మిలిటెంట్లు కాల్చి చంపారు. మధ్యభారత్‌లో కూడా ఈ ప్రయోగం విఫలమైంది. ఇక్కడ ప్రభుత్వం మావోయిస్టులపై సాయుధ మిలిటెంట్లను మోహరించింది. ఈ మిలిటెంట్లు అప్పటి నుంచి నిస్సహా యులైన ప్రజలపై పడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునయినా పారికర్ వంటి మంత్రి తాను చెప్పబోయే మాటల గురించి ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవలసి ఉంది. పారికర్ ప్రకటనతో ప్రతిపక్షం నివ్వెరపోయింది. ‘రక్షణమంత్రి ఒక ఘోరమైన ప్రకటన చేశారు. తన మాట లు ఎంత దూరం వెళ్లాయో ఆయన గుర్తిస్తారనీ, వాటిని వెనక్కు తీసుకోవడానికి తగిన మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను’ అని పి. చిదంబరం ప్రకటించారు. పైగా, ‘పదేళ్ల యూపీయే ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులను లేదా నేరస్థ శక్తులను భారత్ ఎన్నడూ మోహరించలేదు. ఇప్పుడు ఎన్డీయే ప్రభు త్వం కూడా అలా చేయలేదని, ఇకపై చేయబోదని నా నమ్మ కం’ అనేశారు చిదంబరం. ‘రక్షణమంత్రి ప్రకటన అన్ని హద్దులనూ అతిక్రమించిందనీ దాన్ని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాల’ని డిమాండ్ చేశారు. అయితే, వాస్తవం చెప్పాలంటే, పారికర్ తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. మే 26న చేసిన మరో ప్రకట నలో, ‘భారత్‌ను కాపాడేందుకు ఎంతవరకైనా తాను తెగిస్తా ననీ, దేశంపై దాడి చేసేవాళ్ల పని పడతాననీ’ ఆయన దుస్సాహసిక ప్రకటన చేశారు. భారత రక్షణమంత్రి ప్రకటనను పాకిస్తాన్ అంది పుచ్చుకుంది. బలూచిస్తాన్ ఘర్షణల్లో భారత్ జోక్యం చేసు కుంటోందని, తమ దేశానికి వ్యతిరేకంగా ప్రతిచోటా హిం సాత్మక చర్యలకు మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ వెంటనే ఆరోపణకు దిగింది. పారికర్ చేసిన ఈ తరహా ప్రకటన వల్ల కాస్సేపు చప్పట్లు వినిపిస్తాయి కానీ దీర్ఘకాలంలో ఇది మన దేశానికి నష్టం కలిగిస్తుందని బీజేపీ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టమయ్యే ఉంటుంది. పాకిస్తానీ బోటును కూల్చి వేశామంటూ గతంలో భారతీయ నావికాధికారి ప్రకటించి ఇదే తప్పు చేశారు. ఇది సమస్యాత్మకంగా మారటం కూడా మనం కొన్ని నెలల క్రితం చూశాం. నా అభిప్రాయం ప్రకారం, మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన రెండు ప్రతిజ్ఞలను పారికర్ అతిక్రమించారు. ‘రాజ్యాంగబద్ధంగా, శాసనానికి అను గుణంగా పనిచేస్తాన’ని చేసిన ప్రమాణాన్ని, ఉగ్రవాదులను ఉపయోగించుకుంటామంటూ మంత్రి చేసిన ప్రకటన ఉల్లంఘించింది. మంత్రి చేసిన మరొక ప్రతిజ్ఞ గోప్యతకు సంబంధించింది. అంతర్జాతీయ చట్టం అస్పష్టంగా, అనిశ్చి తంగా ఉంటుంది కనుక అన్ని ప్రభుత్వాలూ గోప్యత విష యంలో జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తాయి కానీ కొంత మంది మంత్రులు దాన్ని అతిశయించి చెబుతుంటారు. ‘నా విధులను నెరవేరుస్తున్నప్పుడు అవసరమైతే తప్ప నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను’ అంటూ పారికర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధమైన గోప్యతకు కట్టుబడ్డారు. కానీ, ‘ఉగ్రవా దులను ఉపయోగించుకుంటాం’ అంటూ ఇప్పుడాయన చేసిన ప్రకటన ద్వారా నిజంగానే ప్రభుత్వ విధానాన్ని బహి ర్గతం చేయాలనుకున్నట్లయితే, అది తన విధులను నేర వేర్చడంలో భాగంగా ప్రకటించినట్లు కాదు. భారత్ తక్కువ వనరులు ఉన్న పేదదేశమని పారికర్ అంగీకరిస్తున్నారు. తమకు కూడా సమానంగా పింఛన్లను ఇవ్వాలని రిటైరైన సైనికులు డిమాండ్ చేసినప్పుడు అలా చేయడం ద్వారా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు తెలీవు అంటూ పారికర్ పేర్కొన్నారు. రక్షణమంత్రి పర్యవేక్షణలో భారతీయ వాయుసేన ముందుగా ప్రతిపాదించినటు,్ల 126 రాఫెల్ యుద్ధ విమా నాలను కాకుండా 36 విమానాలను మాత్రమే కొత్తగా కొన బోతోంది. ఈ తగ్గింపుకు అనేక కారణాలుండవచ్చు కానీ వాటిలో బడ్జెట్ అతి కీలకమైనది. ప్రభుత్వం ఏర్పాటు చేయ దలిచిన పర్వత యుద్ధతంత్ర విభాగాన్ని 80 వేలమందితో కాకుండా 35 వేల బలగాలకే కుదించాలని మంత్రి నిర్ణయించారు. ఇంతటి భారీ పథకాల అమలుకోసం డబ్బు ఎక్కడినుంచి వస్తుంది అంటూ మంత్రి ప్రశ్నించారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది కూడా. ఉగ్రవా దులను ఉపయోగించుకోవడంపై బడాయి పోయినట్లుగా కాకుండా మంత్రి ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడటాన్ని మర్చిపోకుండానే బడిత కర్రను పట్టుకోవడంపైనే తన సమ యాన్ని, శక్తినీ వెచ్చించడంపై దృష్టి పెడితే బాగుంటుంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) ఆకార్ పటేల్