దేశీయ క్షిపణుల ఎగుమతి
బెంగళూరులో హెచ్‌టీటీని పరీక్షించిన మంత్రి పరీకర్
సాక్షి, బెంగళూరు: అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి.. దేశీయంగా తయారయ్యే క్షిపణుల్లో 10 శాతం మిత్రదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వెల్లడించారు. ఇందుకోసం ఉత్పత్తి సంస్థలకు అనుమతిచ్చినట్లు ఆయన తెలిపారు. పెలైట్లకు ప్రాథమిక స్థాయి శిక్షణ అవసరాల కోసం హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘హిందుస్థాన్ టర్బోప్రోప్ ట్రైనర్ (హెచ్‌టీటీ-40)’ సామర్థ్యాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు.
దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా క్షిపణుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై రెండున్నర నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశీయ నిఘా వ్యవస్థను బలోపేతం చేయటం వల్ల చొరబాట్లు తగ్గటంతోపాటు ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారన్న దానిపై స్పష్టమైన సమాచారం అందుతోందన్నారు. అందువల్లే ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.